ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయన్ని తెలియజేసేందుకు ఢిల్లీ వెళ్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నెల 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపడుతున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో పోరాడుతామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై ఎంపీ మేకపాటి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి చంద్రబాబు చాలా అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి తమకు అర్థం కావడం లేదన్నారు.