CM Vijay
-
భారతీరాజాకు ఘన నివాళులు.. సీఎం విజయ్, స్టాలిన్, సూర్య
-
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. -
మహిళల రక్షణ కోసం ‘సింగప్పెన్’
సాక్షి, చెన్నై: మహిళలపై జరిగే నేరాలను అడ్డుకునేందుకు తమిళనాడు ప్రత్యేకంగా సింగప్పెన్ అనే ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఎం విజయ్ మంగళవారం ఈ యూనిట్‌ను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలపై నేరాల కట్టడికి డ్రోన్ పెట్రోలింగ్ విధానాన్ని తీసుకువస్తామన్నారు. మహిళల భద్రతకు కొత్త విభాగం మరింత సహాయకారిగా ఉంటుందని సీఎం విజయ్ తెలిపారు. ఈ విభాగం కోసం ప్రత్యేకంగా కాకీ ప్యాంటు, బ్లూ షర్ట్‌తో యూనిఫాంను రూపొందించారు. ఈ విభాగం లోగోను సీఎం విడుదల చేశారు. సింగప్పెన్ అంటే తమిళంలో ఆడసింహం వంటి ధైర్యశాలి అయిన మహిళ అని అర్థం. సింగప్పెన్ కోసం రూ.354 కోట్లు కేటాయిస్తామని, కొత్తగా 2,500 మందిని నియమిస్తామని ప్రకటించారు. -
సీఎం విజయ్ రాకతో నెరవేరిన 56 ఏళ్ల కల
తమిళనాడు: బస్సు లేక 56 ఏళ్లుగా అవస్థలు పడుతున్న కొండ గ్రామ ప్రజల కలలో తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. వివరాలు.. తేని జిల్లాలోని మారుమూల కోటగుడి కొండ గ్రామం ప్రాంతం చాలా మంది సినిమాటోగ్రాఫర్లను ఆకర్షించింది. ఈ ప్రాంతంలోని కోటగుడి కొండ గ్రామంలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నీలగిరి పరిధిలో ఉంటుంది.ఈ గ్రామానికి చెందిన 25 మందికి పైగా పిల్లలు పోడి నాయక్కనూరులోని ప్రభుత్వ , ప్రభుత్వ – సహాయక పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కోటగుడి నుండి బస్సు సౌకర్యాలు లేకపోవడంతో, ఇక్కడి నుండి పాఠశాలకు వెళ్లే పిల్లలు రోజూ 2 నుండి 3 కిలోమీటర్లు నడిచి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లడానికి కోటగుడి డివిజన్ సమీపంలోని కురంగానికి బస్సు ఎక్కవలసి వచ్చేది. దీంతో కోటగుడి కొండ గ్రామానికి బస్సు, మినీబస్సు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు చాలాసార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా సీఎం ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తక్షణ చర్యలు తీసుకున్నారు. కోట గుడి కొండకు ప్రభుత్వ బస్సు సర్వీసును ప్రారంభించే విషయంపై అధ్యయనం చేయాలని తేని జిల్లా కలెక్టర్ వైద్యనాథన్ రాష్ట్ర రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం, కోట గుడి రోడ్డుపై బోడి నుండి కురంగణి వరకు ఉదయం 3.30 నుండి సాయంత్రం 5.30 వరకు బస్సును నడపాలని నిర్ణయించారు. మొదటిసారిగా బస్సు గ్రామంలోకి ప్రవేశించడాన్ని చూసి మలై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. -
విజయ్ ఫొటో కోసం.. కుర్చీ ఖాళీ!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజాదరణ ఇప్పుడు కేవలం రాజకీయ సభలకే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల్లోనూ ఆయన ఫొటోలు ప్రధాన చర్చగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ చిత్రపటాన్ని అన్ని కార్యాలయాల్లో ఉంచి తీరాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే.. తిరునెల్వేలిలో చివరకు మేయర్ ‘కుర్చీ’నే ఖాళీ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు అక్కడ జరిగిందంటే.. తిరునెల్వేలి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మేయర్ జి. రామకృష్ణన్ కార్యాలయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ ఫొటో ఏర్పాటు చేశారు. అయితే దానిని గదిలో మధ్యభాగంలో, మేయర్ కుర్చీకి నేరుగా పైన ఉంచాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కార్యకర్తలు కోరినట్లు సమాచారం. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రామకృష్ణన్.. తన నిరసనను మరోలా వ్యక్తం చేశారు. ఆయన తన కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని కార్యాలయ పనులు నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని.. నిరసన తెలిపేందుకే తాను ఇలా చేస్తున్నానని అన్నారాయన. రెండు వారాల క్రితం కార్పొరేషన్ కార్యాలయంలోని అన్ని గదుల్లో విజయ్ ఫొటోలను ఏర్పాటు చేయాలని కోరగా అంగీకరించామని, ఇప్పుడు తన కుర్చీ పైనే ఫొటో ఉండాలని పట్టుబడటం అనవసర వివాదాలకు దారితీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజా సేవలకు ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.అసలు వివాదం రెండు వారాల క్రితమే మొదలైంది. అప్పట్లో కూడా మేయర్ రామకృష్ణన్ నిరసనగా తన టేబుల్‌పై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఫొటోను ఉంచి సమావేశాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఇదే తరహా వివాదం కోయంబత్తూరులోనూ చోటుచేసుకుంది. అక్కడ మేయర్ ఆర్. రంగనాయకి తొలుత తనకు కేటాయించిన గదిలో విజయ్ ఫొటో పెట్టడాన్ని వ్యతిరేకించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో చివరకు అంగీకరించారు. అయినప్పటికీ స్టాలిన్ ఫొటోను తొలగించేందుకు మాత్రం నిరాకరించారు.కరూర్‌లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. విజయ్ ఫొటో పక్కనే స్టాలిన్ ఫొటోను కూడా ఉంచాలని డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. దీనికి అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ నేతల ఫొటోలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సమావేశం రాజకీయ వాగ్వాదాలకు వేదికగా మారింది.కూనూర్‌లో అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విజయ్ ఫొటోతో పాటు స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి చిత్రాలను ఉంచగా, టీవీకే కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆ ఫొటోలను తొలగించడంతో వివాదం చెలరేగింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఫొటోల వివాదం మాత్రమే కాదు. స్థానిక సంస్థల్లో టీవీకే ఎమ్మెల్యేలు, డీఎంకే లేదంటే ఇతర పార్టీల కౌన్సిలర్ల మధ్య సమన్వయ లోపానికి ఇది ప్రతిబింబంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రాజకీయ పోరులో ప్రజా సమస్యలు పక్కన పడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. View this post on Instagram A post shared by Polimer News (@polimernews) VIDEO Credits: polimernews -
ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల నజరానా
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మక నార్వే ఓపెన్ చెస్ టోర్నిలో టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన తమిళనాడు గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహకం లభించింది. విజేత హోదాలో చెన్నై వచ్చిన ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో సోమవారం సచివాలయంలో సీఎం విజయ్ను కలిశాడు. ఈ సందర్భంగా ప్రజ్ఞానందను విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల నగదు ప్రోత్సాహానికి గాను చెక్‌ను అందజేశారు. అనంతరం ప్రజ్ఞానందతో చెస్ బోర్డు తెచ్చావా? అని అడిగి మరీ విజయ్ 15 నిమిషాలపాటు స్నేహపూర్వక గేమ్ ఆడారు. వీరిద్దరి మధ్య గేమ్‌ను ఛాంబర్లో ఉన్న క్రీడా మంత్రి ఆధవ్ అర్జునతో పాటుగా అ«ధికారులు ఆసక్తితో తిలకించారు. గేమ్‌లో తనను ఓడించిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రజ్ఞానంద తో చెస్ ఆడిన CM విజయ్
-
సీఎం విజయ్‌తో చెస్ సంచలనం ప్రజ్ఞానంద
భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద నార్వే చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారత ఆటగాడిగా ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌ని ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రజ్ఞానందను అభినందించడమే గాక అతడితో సరదాగా చెస్ ఆడాడు. అతడి ప్రదర్శనతో తమిళనాడు గర్విస్తోందని పేర్కొన్న విజయ్ ప్రజ్ఞానందకు రూ. 50 లక్షల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ఓస్లో వేదికగా జరిగిన టోర్నీలో ప్రజ్ఞానంద ఫైనల్లో జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కీమర్‌ను మట్టికరిపించి చాంపియన్‌షిప్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో తడబడిన ప్రజ్ఞానంద చివరి దశలో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. పదో రౌండ్ ప్రారంభానికి ముందు 15 పాయింట్లతో ప్రజ్ఞానంద ముందు వరుసలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో విన్సెంట్ కీమర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేతగా నిలిచిన ప్రజ్ఞానందకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు అభినందించారు.#WATCH | Chennai | Tamil Nadu CM Vijay meets Indian Grandmaster R Praggnanandhaa and awards him Rs 50 lakh on behalf of the Sports Development Authority of Tamil Nadu after the chess player won the Norway Chess 2026 title.(Source: TNDIPR) pic.twitter.com/Lf4dNgYrEX— ANI (@ANI) June 8, 2026చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియన్స్! -
సీఎం విజయ్‌కి ‘ఇండియా’ కూటమి షాక్!
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్‌కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ సమావేశానికి విజయ్ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.అయితే లోపల సఖ్యతగా కనిపిస్తున్న ఈ కూటమిలో విజయ్ అంశం తీవ్ర కలకలానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల అనంతరం దశాబ్దాల మిత్రపక్షమైన డీఎంకేను పక్కనబెట్టి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో, అటు డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించడం, ఇటు సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కకపోవడంతో కూటమిలో సరికొత్త రాజకీయ సమీకరణలు చర్చనీయాంశంగా మారాయి.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు! -
‘తమ్ముడూ విజయ్.. ప్రాణం ఒక్కసారే పోతుంది!’
సాక్షి, చైన్నై: తమిళనాడు సీఎం విజయ్‌పై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి. ఉదయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కూటమి కోసం ఎంతగానో మొత్తుకున్నారని, అప్పుడు ఒక చిన్న లెటర్ ప్యాడ్ పార్టీ గానీ, తమర్ని నమ్మి రాలేదరన్నారు. అయితే, ఇప్పుడు ఏదో మాయాజాలం జరిగి అధికారం దక్కేసరికి.. ఆ పవర్‌ను చూసి అందరూ తమరి వెనుక పరిగెత్తుకుంటూ వస్తున్నారని విజయ్ను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు. మదురై తెప్పకుళం మరియమ్మన్ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఉదయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వీడుతున్న అన్నాడీఎంకే నేతలపై, సీఎం విజయ్ రాజకీయ వ్యూహాలపై ఘాటుగా స్పందించారు. అన్నాడీఎంకే చావలేదు.. మళ్లీ పుంజుకుంటుందిపారీ్టలో కొన్ని విభేదాల వల్ల నేతలు శత్రువుల వైపు వెళ్తున్నారని, గతంలో ఎంజీఆర్, జయలలిత హయాంలోనూ నెడుంచెజియన్, ఎస్టీఎస్ వంటి పెద్ద నేతలు పార్టీని వీడి మళ్లీ తిరిగి వచ్చారని ఉదయకుమార్ గుర్తుచేశారు. సొంత పార్టీ విలువ తెలియక కొందరు ప్రేమ, ఆదరణ ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుండటం బాధాకరమన్నారు. కొందరు చిల్లర గాళ్లు తమను చూసి నవ్వుతున్నారని, తాము కేవలం ఎన్నికల్లో ఓడిపోయామే కానీ, చచ్చిపోలేదన్నారు. అన్నాడీఎంకే ఎన్నో శోధనలు, వేదనలను తట్టుకుని నిలబడిన పార్టీ అని, కోట్ల మంది కార్యకర్తలే ఈ పార్టీకి బలమైన పునాదిగా పేర్కొన్నారు. విజయ్‌లు ఎంతమంది వచ్చినా తాము చూస్తాం్ఙ అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ఏదేని జరిగిన పక్షంలో అందుకు అన్నాడీఎంకేమాత్రం బాథ్యులు కాదన్నారు. విజయ్ తమ్ముడూ.. నీకు హెచ్చరిక ముఖ్యమంత్రి విజయ్ను ‘తమ్ముడు’ అని సంబోధిస్తూ ఉదయకుమార్ కీలక హెచ్చరికలు చేశారు ‘విజయ్ తమ్ముడూ.. ప్రాణం ఒక్కసారే పోతుంది. నీకు హెచ్చరికగా, ప్రేమతో చెబుతున్నాను. జీవితం అనేది ఒకవృత్తం, పైన ఉన్నది కిందకు రావడం ప్రకృతి నియమం. కష్టపడి నమ్ముకున్న వాళ్లతో పార్టీ నడిపితే ఫలితం ఉంటుంది కానీ, దొరికిన వాళ్లనల్లా చేర్చుకుని పార్టీ నడిపితే లాభం లేదు. భవిష్యత్తులో నీకు ఏమైనా జరిగితే దానికి అన్నాడీఎంకే బాధ్యత వహించదు’ అని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఎందుకు? ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి నిర్మల్ కుమార్ గతంలో ఏఎంఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే.. ఇప్పుడు టీవీకేలో చేరారని గుర్తుచేస్తూ, రేపు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్లీ ఆయన జంప్ జిలానీ తథ్యమన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలను విజయ్ కలిసి శాలువాలు కప్పడం.. ఆయన తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు విజయ్ వద్దు అని ఓటేశారని ,ఈ విషయం అర్థమైతే ఆయన ఇలా ఆపరేషన్ ఆకర్ష్ పనులు చేయరని ఎద్దేవా చేశారు. లెక్కలు తెలియక కొందరు చేతికూలీలను పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఆ మంత్రికి పిచ్చి పట్టింది తమ పారీ్టలో 50 శాతం మందిని లాగేసుకున్నామని టీవీకే మంత్రి ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలపై ఉదయకుమార్ మండిపడ్డారు. ఆధవ్ అర్జున అనే ఆ పిచ్చి మంత్రికి నిజంగానే మైండ్ పాడైందా అనిపిస్తుందన్నారు. ఇలాంటి సగం తెలివితేటల ముఖాలను తీసుకెళ్లి కేబినెట్లో కూర్చోబెట్టారని, ఇలాంటి వాళ్లను చూడాల్సి రావడం మన దురదృష్టం అంటూæ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీజేపీని ఎదుర్కొనే ధైర్యం విజయ్‌కు లేదా?
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్‌కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది. డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్‌పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.If you go to Rajya Sabha you’ll have to take a stand on every issue. More importantly you have to oppose BJP directly. That’s the only reason no member from TVK was sent to Rajya Sabha. Let’s not forget that Mr. Vijay did not even meet the Congress leaders, Mrs. Sonia Gandhi,… pic.twitter.com/qZZnS7jGAM— Saravanan Annadurai (@saravofcl) June 3, 2026ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
టీవీకే పార్టీలోకి మరో హీరో? పోస్టుతో క్లారిటీ
తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. రీసెంట్ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలవగా, హీరో విజయ్ ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ప్రస్తుతం ఆయన తనదైన పాలనతో బిజీగా ఉన్నారు. మరోవైపు టీవీకే పార్టీలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో లారెన్స్ రాబోతున్నారనే ప్రచారం రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. ఈ రూమర్స్‌కి ఎండ్ కార్డ్ వేసిన ఇతడు.. పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)ఈ మధ్యే జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్.. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాజ్యంగం ప్రకారం ఒకచోట రాజీనామా చేయాలి. దీంతో తిరుచ్చి సీటుకు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ త్రిషని నిలబెడతారనే కొన్నిరోజుల క్రితం రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే అలాంటిదేం లేదని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడా స్థానంలోనే లారెన్స్.. టీవీకే తరఫున పోటీ చేయనున్నారని వార్తలొస్తున్నాయి.తాజాగా ఈ పుకార్లపై స్పందించిన లారెన్స్.. అందరికి నమస్కారం. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికల్లో నేను పోటీ చేస్తానని పలు మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వార్తలొస్తున్నాయి. తెలిసిన మీడియా మిత్రులు కూడా నాకు ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాలని అడిగారు. పుకార్లు ఎక్కువవుతుండటం వల్ల నేను స్పష్టం చేయాలనుకుని ఈ నోట్ షేర్ చేస్తున్నాను. ప్రస్తుతం 'బెంజ్' షూటింగ్లో బిజీగా ఉన్నాను. ఈనెల 10వ తేదీకి షెడ్యూల్ పూర్తవుతుంది. 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటాను అని రాసుకొచ్చాడు.అమ్మ ఆశీర్వాదంతో చెబుతానని లారెన్స్ అంటున్నాడంటే తిరుచ్చి ఉపఎన్నికల్లో టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజమే అనే సందేహాలు కలుగుతున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చాన్నాళ్లుగా లారెన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ గతంలో చేసిన సినిమాలోని పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. బహుశా ఆ బాండింగ్ వల్లే విజయ్, తను ఖాళీ చేసిన స్థానంలో లారెన్స్‌కి అవకాశం ఇవ్వబోతున్నాడా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 30 ఏళ్ల నాటి కేసు.. నటి సుకన్యకు రూ.10 లక్షల నష్టపరిహారం) View this post on Instagram A post shared by Ragava Lawrence (@actorlawrence) -
సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు
'బాహుబలి' కట్టప్ప కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న నటుడు సత్యరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. స్టాలిన్ ఓటమి తట్టుకోలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీఎం విజయ్ తీరుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదంలో మరో మలుపు.. జాన్వీ కపూర్ చాట్ లీక్?)స్టాలిన్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. మాజీ సీఎం అనే గౌరవం లేకుండా స్టాలిన్‌ని విజయ్ విమర్శించడం సరికాదు. మీకు బూతులు వస్తాయంటే నాకు మీకన్నా బాగా వస్తాయి. టీవీకే సోషల్ మీడియా నన్ను టార్గెట్ చేసినా నేను ఎవరికీ భయపడను అని సత్యరాజ్ అన్నాడు.సీఎం విజయ్ పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడిన సత్యరాజ్.. పేర్లు మార్చితే సరిపోదు. ద్రావిడ మోడల్ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చింది. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు. మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవసరముంది. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలి. సోదరుడు విజయ్.. అంబేడ్కర్, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారు. ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇకపోతే సత్యరాజ్.. డీఎంకే పార్టీకి సపోర్ట్ చేస్తుండగా ఈయన కొడుకు శిబి సత్యరాజ్ మాత్రం విజయ్ టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: అదే నిజమైన ఆనందం: మృణాల్ ఠాకుర్) -
'జన నాయగణ్'.. డబ్బులు తిరిగిచ్చేస్తున్న నిర్మాత
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన చివరి సినిమాకు మోక్షం కలగట్లేదు. 'జన నాయగణ్' ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నెల 19న థియేటర్లలో విడుదల పక్కా అని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)తెలుగు సినిమా 'భగవంత్ కేసరి'కి రీమేక్ అయిన 'జన నాయగణ్'.. లెక్క ప్రకారం ఈ ఏడాది జనవరి 9నే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ సమస్యల కారణంగా అప్పటినుంచి అలా ఉండిపోయింది. మధ్యలో నిర్మాతలు కోర్టుకెళ్లారు. తమిళనాడు ఎన్నికలు జరిగాయి. మూవీ కూడా లీక్ అయింది. విజయ్ ముఖ్యమంత్రి కావడంతోనే ఇక సినిమా సాఫీగా రిలీజ్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ సమస్యలు తప్పట్లేదు.ఇప్పటికే నాన్ థియేట్రికల్ డీల్స్ రద్దవగా.. తాజాగా థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా రద్దు చేసుకుని.. డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్స్ తిరిగిచ్చేయమని నిర్మాతకు హీరో విజయ్ సూచించారట. రిలీజ్ డేట్ ఖరారైన తర్వాత సొంతంగా రిలీజ్ చేసుకోమని నిర్మాతకు సలహా ఇచ్చారట. ఇప్పుడీ విషయం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త) -
త్రిషతో వివాదం.. సీఎం విజయ్‌కి పార్తీబన్ కానుక!
తమిళనాడు ఎన్నికల సమయంలో నటుడు పార్తీబన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని ఆమెను బయటకు రానివ్వకూడదు, కొన్నాళ్లు త్రిష ఇంట్లో ఉంటేనే మంచిది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి.అయితే ఇప్పుడు అదే పార్తీబన్ నేరుగా తమిళనాడు సీఎం విజయ్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది. విజయ్-త్రిష మధ్య సంబంధాలపై ఊహాగానాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వీరిద్దరి భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత భేటీలో అసలు వీరిద్దరూ త్రిష గురించి మాట్లాడుకున్నారా లేదా..?, పార్తీబన్ తను అప్పట్లో త్రిషపై చేసిన వ్యాఖ్యల గురించి ఏదైనా వివరణ ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటకు రాలేదు.ఇక సీఎం విజయ్ను కలిసిన సందర్భంగా పార్తీబన్ ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. విజయ్ను చక్రవర్తిగా పోలుస్తూ రూపొందించిన ఓ పెయింటింగ్‌ను విజయ్‌కు అందజేశారు. దాంతో ఈ బహుమతి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు
సినీ నటి ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి త్వరలో జరగనుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని అతడి స్వగృహంలోనే కలిసి పెళ్లి కార్డ్ అందజేశారు. ఈ క్రమంలోనే ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)'ఇది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను ఆయన నివాసంలోనే కలిసి శ్రీ శ్రవణ్ శ్రీనివాసన్‌తో జరగనున్న నా కుమార్తె పెళ్లికి ఆహ్వానించాం. విజయ్ను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నా కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. ఆయనతో గడిపిన క్షణాలను ఆస్వాదించారు. తన బిజీ షెడ్యూల్లోనూ విజయ్ ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే తన చిరునవ్వుతో మమ్మల్ని ఆత్మీయంగా పలకరించారు. విజయ్ అందించిన ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఆరంభం’ అనే చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
విజయ్‌కు గట్టి పోటీ! అతడి ఎంట్రీతో సంచలనం తప్పదా?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. బీజేపీకి అన్నామలై గుడ్‌బై చెప్పారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉండగా, డీఎంకే–అన్నాడీఎంకే వంటి సంప్రదాయ పార్టీలు ప్రతిపక్ష పాత్రలో కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.డీఎంకే–అన్నాడీఎంకే మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విముఖ రాజకీయ పోరాటానికి ఇప్పుడు కొత్త శక్తులు సవాల్‌గా నిలుస్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇందులో ముఖ్యంగా సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీఎం విజయ్ నాయకత్వం ఒకవైపు చర్చనీయాంశంగా ఉండగా, మరోవైపు బీజేపీలో తనదైన ముద్ర వేసుకున్న అన్నామలై పేరు మరింత బలంగా వినిపిస్తోంది.అన్నామలై బీజేపీని వీడుతున్నారన్న వార్తలను కేవలం సంస్థాగత మార్పుగా మాత్రమే చూడలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు ఉన్న దూకుడు రాజకీయ శైలి, యువతలో ఉన్న క్రేజ్, ప్రత్యక్ష విమర్శల ధోరణి ఆయనను తమిళ రాజకీయాల్లో ఒక ప్రత్యేక ముఖంగా నిలబెట్టాయి. ఎన్నికల్లో పెద్ద విజయాలు సాధించకపోయినా, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆకర్షణను పూర్తిగా తక్కువ అంచనా వేయలేమన్న చర్చ సాగుతోంది. అందుకే బీజేపీ ఆయన్ని నిలువరించే ప్రయత్నాలు చేస్తోంది.ఇక సీఎం విజయ్ విషయానికి వస్తే.. కొత్త ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని విశ్లేషణలు ఉన్నాయి. పార్టీ నిర్మాణ బలం, అనుభవం వంటి అంశాల్లో ఇంకా ఎదగాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లోటును ప్రత్యర్థులు ఎలా ఉపయోగించుకుంటారన్నదే భవిష్యత్ రాజకీయ సమీకరణాన్ని నిర్ణయించనుంది.ఈ నేపథ్యంలో అన్నామలై పాత్రపై చర్చ మరింత కీలకంగా మారింది. ఆయన బీజేపీలోనే కొనసాగి పార్టీని బలోపేతం చేస్తారా? లేక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగి సీఎం విజయ్ టీవీకేకు, డీఎంకే–అన్నాడీఎంకే కూటములకు ప్రత్యక్ష సవాల్‌గా మారతారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల విజయాలకంటే కూడా ఆయనకు ఉన్న ఇమేజ్, యువతలో ప్రభావం ఆయనను ఒక “పొలిటికల్ ఫోర్స్”గా చూస్తున్న వాదన బలపడుతోంది.ప్రస్తుత పరిస్థితుల్లో “సీఎం విజయ్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ సవాలుగా ఎవరు ఎదుగుతారు?” అనే ప్రశ్నే తమిళనాట కీలకంగా మారింది. ఈ కోణంలో చూస్తే అన్నామలై ప్రవేశం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి తమిళ రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. ఒకవైపు సీఎం విజయ్ కొత్త ప్రభుత్వం, మరోవైపు డీఎంకే–అన్నాడీఎంకే సంప్రదాయ ప్రతిపక్ష బలాలు, మధ్యలో అన్నామలై వంటి కొత్త ముఖం రాజకీయ సమీకరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చుతోంది. రాబోయే రోజుల్లో తమిళనాట అసలైన ప్రతిపక్ష శక్తి ఎవరు అన్నదానికి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సీఎం విజయ్‌తో విజయ్ ఆంటోనీ, ఆర్జే బాలాజీ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సినీ హీరో విజయ్ ఆంటోనీ, ఇటీవల హీరో సూర్యతో ‘కరుప్పు’ చిత్రం చేసి హిట్‌కొట్టిన దర్శకుడు ఆర్జే బాలాజీ మంగళవారం వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తమ సీఎంతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. సీఎం విజయ్‌తో గడిపిన సమయం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించింది. ఆయన పాజిటివిటీ, ఎనర్జీ ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తూ సమాజంలో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి కావాల్సిన శక్తి ఆయనకు లభించాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. విజయ్ను ముఖ్యమంత్రిగా కలవడం నమ్మశక్యం కాని అనుభూతి. ఆయన చూపే ప్రేమలో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉన్నారని అన్నారు. ‘కరుప్పు’ కథను మొదట విజయ్‌కే చెప్పినట్టు బాలాజీ గతంలో వెల్లడించారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమా ఆలస్యమవుతుందన్న భావనతో సూర్యతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాట ఆ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడులో ఈ చిత్రాన్ని జనం ఎగబడి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రూ.300 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. చాన్నాళ్ల తర్వాత ఈ మూవీతో సూర్యకు హిట్ దక్కింది. -
నేడు తిరుచ్చిలో.. సీఎం విజయ్ రోడ్ షో!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రభజంనం సృష్టించిన సీఎం విజయ్ ప్రపథమంగా ప్రజల్లోకి రానున్నారు. తనకు ఓట్లు వేసి గెలిపిచిన తిరుచ్చి తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన కృతజ్ఙతల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సోమవారం జరిగే ఈ సభ కోసం తిరుచ్చిలో టీవీకే వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎన్నికల అనంతరం ప్రత్యక్షంగా ప్రజలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయని విజయ్ తాజా సభలో ఏదేని ప్రకటన చేయవచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి.సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి, సంకీర్ణ పారీ్టల మద్దతుతో ము ఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ సోమవారం తిరు చ్చిలో పర్యటించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అందులో ఒకటైన తిరుచ్చి ఈస్ట్ (తూర్పు) నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. తమ పారీ్టకి చారిత్రాత్మక విజయాన్ని అందించి, 108 స్థానాలు గెలవడానికి కారణమైన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం విజయ్ సోమవారం సాయంత్రం 4 గంటలకు రోడ్ షోతో పాటుగా బ హిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి ప్రైవేట్ విమానంలో బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకుటారు.13 కిలోమీటర్ల భారీ రోడ్ షో ఎయిర్పోర్ట్ నుండి సీఎం విజయ్ తన ప్రత్యేక ప్రచార వాహనం (ఓపెన్ వ్యాన్) ద్వారా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. టీవీఎస్ టోల్గేట్ డెయిరీ, సంజీవి నగర్, చతిరం బస్ స్టాండ్ మీదుగా తిరుచ్చి జోసెఫ్ కాలేజ్ గ్రౌండ్ వరకు సుమారు 13 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్ షో జరగనుంది. పాలక్కరై, పోస్టాఫీసు, ఉడ్ యార్డ్ ప్రాంతాల మీదుగా సాగే ఈ పర్యటన కోసం రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు, కాలేజీ ప్రవేశ ద్వారం వద్ద విజయ్ చిత్రంతో కూడిన భారీ తోరణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమ విజయవంతం కోసం మంత్రులు బుస్సీ ఆనంద్, సెంగోట్టయ్యన్, రమేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రత నిమిత్తం సుమారు 1,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. 3వ స్థానంలో సీఎం విజయ్.. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన అత్యంత ధనవంతులైన సీఎంల జాబితాలో 3వ స్థానంలో తమిళనాడు సీఎం విజయ్ నిలిచారు. జోసెఫ్ విజయ్ రూ. 648 కోట్ల నికర ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఇందులో చెన్నై, కొడైకనాల్‌లోని నివాసాలతో పాటు సుమారు రూ. 404 కోట్ల చరాస్తులు, రూ. 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్ మార్టిన్ తమిళనాడు లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలిచారు. లీమా రోజ్ మార్టిన్ రూ. 5,863 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనవంతురాలైన ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. -
'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు
'జన నాయగణ్'.. ఐదారు నెలల క్రితమే రావాల్సిన సినిమా కానీ ఇప్పటికీ రిలీజ్ కావట్లేదు. అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడి దీని విషయంలో అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్.. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. దీంతో మూవీ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అంతా అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసలేం జరుగుతుంది అని అంతా మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: రూ.300 కోట్ల కలెక్షన్.. కార్లు గిఫ్ట్ ఇస్తున్న సూర్య)'జన నాయగణ్' సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించాడు. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి'కి ఇది రీమేక్. శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వినోద్‌కి మూవీ రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ.. సినిమా రిలీజ్ నా చేతుల్లో లేదు. ఈ మూవీకి సంబంధించిన నిజాలు మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా దానిని ప్రసారం చేసే ధైర్యం మీకు లేదు' అని అన్నాడు. ఈ మాటలు విని అంతా షాకవుతున్నారు.ఎందుకంటే స్వయంగా డైరెక్టరే.. 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదని మాట్లాడటం కొత్త కొత్త సందేహాలు రేకెత్తిస్తోంది. ఏంటా నిజాలు? అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. ఈనెల 19నే మూవీ రిలీజ్ ఉండొచ్చని టాక్ అయితే ఉంది గానీ ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. విజయ్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్ర చేసింది. బాబీ డియోల్ విలన్. (ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)Dir #HVinoth Recent- The release of #JanaNayagan is not in my hands, I don’t have the courage to reveal the reality about JanaNayagan’s release and if I do say it, you won’t have the courage to upload it on YouTube.#CMJosephVijaypic.twitter.com/OoI4nWJcbJ— Movie Tamil (@_MovieTamil) May 30, 2026 -
అజిత్ కు పరామర్శ.. ఒకే వాహనంలో సీఎం విజయ్, త్రిష
-
అజిత్ ఇంటికి సీఎం విజయ్, త్రిష.. వీడియో వైరల్..!
కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ వార్తలో అజిత్ అభిమానులు, కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దుబాయ్‌లో ఉన్న అజిత్ వెంటనే చెన్నై చేరుకున్నారు. ఆమె కడచూపు కోసం అభిమానులు పెద్దఎత్తున అజిత్ ఇంటికి వచ్చారు.తమిళనాడు సీఎం విజయ్ కూడా అజిత్ తల్లి మోహిని పార్ధివదేహానికి నివాళులర్పించారు. దండ చేతిలో పట్టుకుని నేరుగా అజిత్ ఇంటికి వెళ్లిన విజయ్.. అక్కడే ఉన్న అజిత్‌ను ఓదార్చారు. సీఎంతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించారు. సీఎం విజయ్‌తో పాటే త్రిష కూడా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. AK receives CM Vijay & Trisha! pic.twitter.com/AM9UExLtCe— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2026 -
విజయ్ సతీమణి బీజేపీలోకి?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ జోరందుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితం ఆ చర్చల కేంద్రంగా మారింది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగంకు బీజేపీ ఆహ్వానం పలికిందని.. అతిత్వరలో ఆమె ఆ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారమే అందుకు కారణం. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై గుసగుసలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి.ఎన్నికలకు ముందు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ అనేక ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. తన భర్తకు ఓ ప్రముఖ నటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సంగీత ఆరోపించడం.. అదే సమయంలో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం సంచలన చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. మరోవైపు, విజయ్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రచారాన్ని కొందరు నడిపించారన్న వాదనలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.ఆ తర్వాత సంగీత విజయ్ను భారీగా భరణం కోరారని.. మనస్పర్థల నేపథ్యంలోనే పిల్లలతో భర్తకు దూరంగా ఉంటున్నారనే కథనాలు తమిళ మీడియాలో తరచూ కనిపించాయి. అభిమానుల తలనొప్పి లేకుండా చెన్నైలో కాకుండా విదేశాల్లోనే గడుపుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ విభేదాల ప్రభావం ఎన్నికలపై పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వ్యక్తిగత వివాదాల కంటే రాజకీయ మార్పుకే ప్రజలు ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ సంగీత, పిల్లలు కనిపించకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.ఇప్పుడు అదే కుటుంబ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సంగీత బీజేపీలో చేరే అవకాశాలపై చెన్నై రాజకీయ వర్గాల్లో గుసగుసలు(Gossips) వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఓ ప్రముఖ సినీ నటి, జాతీయ స్థాయి నాయకురాలు ఈ చేరిక కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ రాజకీయంగా బలపడుతున్న తరుణంలో ఆయన కుటుంబానికి చెందిన ఎవరైనా ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరితే అది సహజంగానే చర్చనీయాంశం అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు, విజయ్ వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీయడం లేదంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం ఉండొచ్చని కూడా కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, సంగీత సోర్నలింగం శ్రీలంక తమిళ వ్యాపార కుటుంబ నేపథ్యం కలిగిన వ్యక్తి. అనంతరం ఆమె కుటుంబం బ్రిటన్‌కు వలస వెళ్లి లండన్‌లో స్థిరపడ్డారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సోర్నలింగం కుమార్తె అయిన సంగీత.. లండన్‌లోనే చదువుకున్నారు. విజయ్‌కు అభిమానిగా మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారి, 1999లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు.అయితే గత కొన్నేళ్లుగా సంగీత–విజయ్‌ల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం తమిళనాట తరచూ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎన్నికల సమయంలో విడాకుల పిటిషన్, ఆరోపణల వార్తలు వెలుగులోకి రావడం అభిమానులకు సైతం మింగుడు పడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ చేరిక ప్రచారం కూడా అదే కోవకి చెందింది అయ్యి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. విజయ్ను బద్నాం చేసే కుట్రలో ఇదో భాగమని.. అందుకే సంగీత బీజేపీలో చేరతారని రాజకీయ ఊహాగానాలు తెరపైకి వచ్చాయని చెన్నై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సీఎంలు అందరూ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ వచ్చారు. విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి బ్లాక్ కలర్ సూట్‌లోనే కనిపిస్తున్నారు. అంతలా అలానే దర్శనమిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చి పట్టుపంచెలో దర్శనమిచ్చారు.(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)సీఎం దగ్గర జగదీష్ పళనిసామి చాలా ఏళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడు చెన్నైలో ఓ ఇంటిని కట్టుకున్నాడు. దీని గృహప్రవేశం శుక్రవారం ఉదయం జరగ్గా.. ఈ శుభకార్యానికి సీఎం విజయ్ హాజరయ్యారు. గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో విజయ్ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)#CMJosephVijay at #Jagadish's New Home Function ✨️#ThalapathyVijaypic.twitter.com/14gsYE41FA— Movie Verse (@_MovieVerse) May 29, 2026 -
సర్ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు
తమిళనాడు ముఖ్యమంత్రిగా సీఎం విజయ్ కొన్నిరోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. అప్పటినుంచి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితంలోని విడాకుల వ్యవహారంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విజయ్ భార్య సంగీత ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే తన కూతురు, కొడుకుని తీసుకుని లండన్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె చెన్నైలో లేరు.(ఇదీ చదవండి: అక్కగా సీఎం విజయ్‌ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్)మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్.. తండ్రిలా హీరో అవుతాడనుకుంటే ఊహించని విధంగా దర్శకుడిగా మారిపోయాడు. 'సిగ్మా' పేరుతో ఓ మూవీ తీస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ హీరో కాగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడో సర్ప్రైజ్ వచ్చేసింది. జూలై 31వ తేదీన థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.తండ్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్' రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇంతలోనే కొడుకు జేసన్ సంజయ్ తీసిన 'సిగ్మా' మాత్రం విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. మరి తండ్రి నుంచి దూరంగా ఉంటున్న జేసన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికి విజయ్ అభిమానులు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో చూడాలి? అయిత 'జన నాయగణ్' కూడా వచ్చే నెలలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నెల గ్యాప్‌లో తండ్రీకొడుకుల సినిమాలు వచ్చినట్లు అవుతుంది.(ఇదీ చదవండి: ఖుష్బూ ఓ కూతురు హీరోయిన్.. మరో కూతురు నిర్మాత)A high-stakes heist begins. 💵 #SIGMA storms into theatres on July 31st. 🗓️ Gear up for the ultimate quest. 🔥@LycaProductions #Subaskaran @gkmtamilkumaran @jsjmedia01 @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu @yogjapee… pic.twitter.com/BWMFY3sBwN— Jason Sanjay Official (@official_jsj) May 29, 2026 -
రీల్స్‌తో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కొత్త తరం మంత్రులు
సాక్షి, చెన్నై: తమిళనాడు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన ఎంచుకున్న సరికొత్త డిజిటల్ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, త్వరితగతిన లభించే అనుమతులపై ఆమె ఇన్‌స్ట్రాగామ్ ’రీల్స్’ రూపంలో ఒక వీడియోను విడుదల చేశారు. దీనిపై నెటిజన్ల నుండి ఒకవైపు భారీగా ప్రశంసలు దక్కుతుండగా, మరోవైపు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజల్ని రీల్స్ , డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల వేదికగా ఆకర్షించిందన్నది జగమెరిగిన సత్యం. తాజాగా అధికారంలోకి వచ్చినానంతరం కూడా రీల్స్ హోరెతుత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో మంత్రి మంత్రి కీర్తన తన రీల్స్ వీడియోలో ‘తమిళనాడు భవిష్యత్తు కోసం ఎదురుచూడటం లేదు.. ఆ భవిష్యత్తును మనమే స్వయంగా నిర్మిస్తున్నాం. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఫైళ్లు , అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండే పాత పద్ధతులను ఎవరూ ఇష్టపడరు. ఆ లోపాన్ని సరిదిద్ది, వ్యవస్థను వేగవంతం చేయడానికే సీఎం విజయ్ తనను ఈ స్థానంలో నియమించారు’ అని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కేవలం 21 రోజుల్లోనే అత్యంత వేగంగా సింగిల్ విండో ద్వారా అన్ని రకాల పారిశ్రామిక అనుమతులను ఇచ్చేందుకు కట్టుబడి ఉందని ప్రకటలించారు. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ తమిళనాడులో పెట్టు బడులు పెట్టండి‘ అని ఆమె ఆ వీడియోలో పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలోనే ’రీల్స్’ , చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రజలను ఆకట్టుకుని గుర్తింపు తెచ్చుకున్న కీర్తన, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి అదే సోషల్ మీడియా వ్యూహాన్ని అమలు చేయడం గమనార్హం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా యువతను, ఆధునిక పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో మంత్రి రీల్స్ చేయడం అభినందనీయమని, ఇది పారదర్శకతను పెంచుతుందని ఒక వర్గం మద్దతు తెలుపుతోంది. అదే సమయంలో అంతర్జాతీయ , దేశీయ దిగ్గజ సంస్థల నుండి కోట్లాది రూపాయల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక సమావేశాలు కాకుండా, ఇలా ’రీల్స్’ ద్వారా పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వ సీరియస్‌నెస్‌ను తగ్గిస్తుందంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, ఒక మంత్రి పారిశ్రామిక విధానాలను వివరించడానికి రీల్స్ రూపంలో ముందుకు రావడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపినట్లైంది. View this post on Instagram A post shared by Virudhai Magal Keerthana (@virudhai_magal_keerthana) -
చివరకు మిగిలింది రూ.140 మాత్రమే!
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం.. ఎన్నికల్లో ఘన విజయం.. ఆయన చుట్టూ ప్రజాదరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మళ్లీ కదిలిస్తోంది. యువతలో కనిపిస్తున్న మద్దతు, మార్పు కోరుకునే వాతావరణం నేపథ్యంలో ఒక పాత చరిత్ర మళ్లీ చర్చలోకి వచ్చింది. అదే కామరాజ్ ఓటమి. ఒకప్పుడు అపార ప్రజాదరణ కలిగిన మహానేత కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సందర్భమది.. కామరాజ్ జీవితం భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. చిన్న వయసులోనే విద్యను వదిలేసినా, ఆయన ప్రజల మధ్యే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. గ్రామాలు, ప్రజల అవసరాలు, సమస్యలు.. ఇవే ఆయన పాలనకు మార్గదర్శకాలు అయ్యాయి. మాటల కంటే పనితోనే రాజకీయాన్ని నడిపిన నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలా ఆయనకు “తమిళనాడులోని ప్రతీ గ్రామాన్ని రెండుసార్లు సందర్శించిన నేత” అనే ముద్ర కూడా ఉంది. 1953–64 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన తమిళనాడులో విద్యా విప్లవానికి బాటలు వేశారు. వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం, పేదలకు ఉచిత విద్యను విస్తరించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం వంటి నిర్ణయాలు రాష్ట్ర సామాజిక రూపురేఖలను మార్చేశాయి. గ్రామీణ విద్యుతీకరణ, సాగునీటి ప్రాజెక్టులు, రవాణా అభివృద్ధి.. ఇవన్నీ ఆయన పాలనలో వేగంగా విస్తరించాయి. రాజకీయంగా కాకుండా పాలనాపరంగా ఆయనను “బిల్డర్ ఆఫ్ తమిళనాడు”గా చూస్తారు.అయితే ఇదే ప్రజాదరణ ఆయనకు రాజకీయ రక్షణ ఇవ్వలేదు. ద్రావిడ రాజకీయాల ఉధృతి, ఐడెంటిటీ పాలిటిక్స్, సినిమా ప్రభావం వంటి అంశాలను ఆయన తక్కువ అంచనా వేశారని విశ్లేషకులు చెబుతారు. డీఎంకే ఎదుగుదలతో పాటు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చివరికి 1967లో తన సొంత ప్రాంతంలోనే ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన నేతే ప్రజల తీర్పుతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీని ప్రధానిగా నిలబెట్టడంలో ఆయన పాత్ర కీలకమైంది. కానీ కాలక్రమేణా కాంగ్రెస్‌లోనే అంతర్గత మార్పులు, ఇందిరాగాంధీ కొత్త రాజకీయ శైలి, జనాకర్షణ రాజకీయాలు ఆయన ప్రభావాన్ని తగ్గించాయి. చివరికి ఆయన రాజకీయ ప్రయాణం ఒక “మౌన ముగింపు”కు చేరింది.అయితే ఆయన మరణానంతరం ఆయన జీవితం మరో కోణంలో వెలుగులోకి వచ్చింది. అత్యంత సరళ జీవితం గడిపిన ఆయన వద్ద కేవలం రూ.140 మాత్రమే మిగిలాయి. అదీ ఆయన పడుకునే దిండులో దొరికాయి. ఖాదీ దుస్తులు, కొన్ని పుస్తకాలు, రెండు జతల చెప్పులు.. ఆయన చివరి గుర్తులుగా మిగిలాయి. కానీ ఆయన నిర్మించిన విద్యా వ్యవస్థ, పాలనా మౌలిక వసతులు మాత్రం ఇప్పటికీ తమిళనాడును నడిపిస్తున్నాయి.ఇప్పుడీ చరిత్ర మళ్లీ ఎందుకు గుర్తొస్తోంది అంటే.. తమిళనాడులో విజయ్ చుట్టూ పెరుగుతున్న రాజకీయ చర్చలే కారణం. సినిమా ప్రభావం, యువత ఆకర్షణ, మార్పు.. ఇవి కొత్త రాజకీయ శక్తిగా మారుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డబ్బు ప్రభావం తగ్గి, భావోద్వేగ ఓటింగ్ పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివకుమార్ (సూర్య, కార్తి తండ్రి) చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు మరింత వేడి తెచ్చాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన భావన ఒకటే.. ప్రజల తీర్పును ఎవరూ శాశ్వతంగా అంచనా వేయలేరు. “కామరాజ్ లాంటి మహానేతనే ప్రజలు ఒకప్పుడు ఓడించారు. ఇది ప్రజాస్వామ్య స్వభావాన్ని చూపించే ఉదాహరణ. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. విజయ్ విజయం నాకు వ్యక్తిగతంగా ఆనందం కలిగిస్తోంది. కానీ చివరికి నిర్ణయం తీసుకునేది ప్రజలే” అని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా, తమిళనాడు రాజకీయాల్లో తరచుగా కనిపించే “నాయకత్వ మార్పుల చక్రాన్ని” మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు కామరాజ్ లాంటి ప్రజా సేవా ప్రతీకలు ఓటమిని ఎదుర్కొన్న చరిత్ర, మరోవైపు కొత్త తరంలో సినీ ప్రభావంతో ఎదుగుతున్న రాజకీయ ఆకర్షణ.. ఈ రెండు విరుద్ధ ధోరణులు ఇప్పుడు ఒకే చర్చలో కలుస్తున్నాయి. ఇక అసలు ప్రశ్న ఏంటంటే.. ప్రజల తీర్పు నిజంగా స్థిరమైన విలువలపై ఆధారపడుతుందా? లేదంటే ప్రతి తరం తన అవసరాలు, భావోద్వేగాలు, ఆశల ప్రకారం కొత్త నాయకులను ఎంచుకుంటుందా? అని. -
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్‌కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్‌లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్‌కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్‌ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్‌పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
అక్కగా సీఎం విజయ్‌ని చూసి గర్వపడుతున్నా : నటి ఎమోషనల్
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ప్రముఖ సినీ నటి, బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలు కుష్బూ అభిప్రాయపడ్డారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కుష్బూ నేతృత్వంలోని బుల్లితెర నిర్మాతల సంఘం ప్రతినిధులు కలిసి ఒక కోరికల వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యల పరిష్కారానికి సీఎం హామీముఖ్యమంత్రితో సమావేశం అనంతరం కుష్బూ మీడియాతో మాట్లాడారు. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచామన్నారు. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కుష్బూ తెలిపారు.విజయ్ నా తమ్ముడు.. ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కుష్బూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. సీఎం విజయ్ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాననని పేర్కొన్నారు.. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు నిండిపోయిందంటూ చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం నాకు కలిగిందన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యమేనా?, విజయ్ పగ్గాలు చేపట్టిన కేవలం 10 రోజుల్లోనే ఎలా మార్చగలరు? ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది అని వ్యాఖ్యలుచేశారు. -
తమిళనాడులో నేరగాళ్లకు ఫ్రీ పాస్
తమిళనాడు విజయ్ ప్రభుత్వానికి హనీమూన్ ముగిసినట్లే కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే రాష్ట్రంలో వరుసగా నేరాలు ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత అన్నామలై సంచలన ఆరోపణలకు దిగారు. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా మైనర్లపై జరిగిన అఘాయిత్యాలు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టాయి. మదురైలో మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చిన విజయ్… ఇప్పుడు వరుస ఘటనలపై ఎందుకు కఠినంగా స్పందించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనలపై బీజేపీ నేత కే అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తమిళనాడులో డ్రగ్ దందాదారులు, లైంగిక నేరస్తులు, హంతకులకు ఫ్రీ పాస్ దొరికినట్టుంది. గతం నుంచి రాష్ట్ర పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. కొత్త టీవీకే ప్రభుత్వం ఇంకా సంబరాల మూడ్‌లోనే ఉన్నట్లుంది. ఇప్పుడైనా బయటకు వచ్చి వాస్తవాలను ఎదుర్కొవాలి” అంటూ ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా “ఇది తమిళనాడా? లేక ఉత్తరప్రదేశ్నా?” అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మార్పు తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టవ్యవస్థను అదుపులో పెట్టలేకపోతోందని విమర్శించారు. అన్నాడీఎంకే నేత పళనిస్వామి కూడా మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. “మహిళల రక్షణ ఎక్కడుంది?” అంటూ విజయ్ను నిలదీశారు. ఇక కోయంబత్తూరు ఘటనపై పరిశ్రమల మంత్రి స్పందించిన తీరు కూడా వివాదానికి దారితీసింది. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో బీజేపీ తీవ్రంగా విమర్శించింది. అనంతరం పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చిరునవ్వులు చిందించిన వీడియోలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. దీంతో చట్టవ్యవస్థ అంశం ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి తొలి పెద్ద రాజకీయ పరీక్షగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శల మధ్య సీఎం విజయ్ మాత్రం ఒక పోక్సో కేసు తీర్పును ఉదాహరణగా చూపిస్తూ.. ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తూత్తుకుడి జిల్లాలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మూడు నెలల్లోనే డబుల్ డెత్ పెనాల్టీ విధించడాన్ని ప్రస్తావిస్తూ… మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు.అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పుడు విజయ్‌కు అసలైన సవాలు మొదలైందని భావిస్తున్నారు. ఎన్నికల హామీలు ఇవ్వడం ఒకటైతే… చట్టవ్యవస్థను సమర్థంగా నడిపించడం మరో విషయం అని చెబుతున్నారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తుందన్నదే తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. -
ఈ ఎన్నికల్లో అవేం గెలవలేదు.. సీఎం విజయ్‌పై సముద్రఖని కామెంట్స్
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నిరోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హీరో విజయ్.. తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆయన గెలుపు గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటికీ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నటుడు, దర్శకుడు సముద్రఖని కూడా తనదైన శైలిలో సీఎం విజయ్ గురించి మాట్లాడారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు)ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన సముద్రఖని.. విజయ్ రాజకీయ అనుభవంపై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 'తమిళనాడు ప్రజలు సినీ ఇండస్ట్రీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి అందించారు. దీనిపై నాకు చాలా ఆనందంగా ఉంది. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు(విజయ్) ఏం అర్హత ఉందని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకొనే వాళ్లు ప్రజల కోసం ఏం చేశారు? రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాళ్లు మరింత జాగ్రత్తగా, ప్రజల కోసం మంచి చేస్తారనే నమ్మకం నాకు ఉంది' అని అన్నారు.తమిళనాడు ఎన్నికల ఫలితాలని సునామీతో పోల్చిన ఈయన..'ఈ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, అహంకారం ఏమీ గెలవలేదు. ప్రజలు అజ్ఞానులు అని కొందరు భావించారు. కానీ వాళ్లే ఎంతో తెలివిగా వ్యవహరించారు. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని చివరకు డబ్బు ఇవ్వని పార్టీకి ఓటేశారు. అయితే ఈ ఫలితాల్లో స్టాలిన్ సర్, పళనివేళ్ త్యాగరాజ్ అన్న, సీమన్ అన్న ఓడిపోవడం నాకు బాధ కలిగించింది. తిరుమావళన్ అన్నకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అప్పుడు గెలిచేవారు. అన్నామలై ఇంకొంత కాలం ప్రజల్లో తిరుగుంటే బాగుండేది. ఈ సునామీ కొన్ని మంచి విషయాల్ని కూడా తీసుకెళ్లిపోయింది' అని సముద్రఖని చెప్పుకొచ్చారు.తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా వరస సినిమాలు చేస్తున్న సముద్రఖని ప్రస్తుతం వెట్రిమారన్ 'అరసన్' మూవీలో నటిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం 'కార్మేని సెల్వం' మూవీతో వచ్చారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)“பெரிய சுனாமி வந்தது மாதிரி...பணம், ஜாதி, மதம், அகங்காரம் உடைக்கப்பட்டது..”- தேர்தல் முடிவு குறித்து இயக்குநர் சமுத்திரக்கனி#Samuthirakani | #TVK | #Vijay | #CMVijay pic.twitter.com/bh2Q5p4cZt— PttvOnlinenews (@PttvNewsX) May 26, 2026 -
సైలెంట్‌గా స్కెచ్.. పెద్ద రిస్క్ చేస్తున్న విజయ్
వాడిపోతున్న చెట్టు నుంచి ఒక్కో ఆకు రాలినట్టు.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యే కదలికే అధికార సమీకరణాలను మార్చేస్తోంది. మొన్నటిదాకా కూటముల చుట్టూ తిరిగిన అక్కడి రాజకీయం.. ఇప్పుడు “ఎవరి వద్ద ఎంత సంఖ్యాబలం?” అనే లెక్క దిశగా పయనిస్తోంది. రాజకీయ వర్గాలు దానికి ముద్దుగా పెట్టిన పేరు “ఆపరేషన్ L”. ఎల్ అంటే లాటరీ? లీవ్? ఏదైనా రాజకీయ సెటైర్‌నా?.. ఏ అర్థం తీసుకున్నా… ఈ ఆపరేషన్ మధ్యలో నిలిచింది మాత్రం విజయ్ రాజకీయ దూకుడే! అదెలా సాగుతుందంటే.. తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కగళం పార్టీ ఇప్పుడు సాధారణ పార్టీ విస్తరణ దశను దాటి, స్వతంత్ర మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేస్తోందన్న చర్చ బలపడుతోంది. మొదట్లో ఇది కూటమి నిర్వహణలా కనిపించినా… ఇప్పుడు మాత్రం “సోలో పవర్” కోసం సాగుతున్న రాజకీయ ఆపరేషన్లా మారిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఈ పరిణామాలకు తెరలేపింది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలే. పెరందురై ఎమ్మెల్యే ఎస్ జయకుమార్, మధురాంతకం ఎమ్మెల్యే కె. మరగతం కుమరవేల్, ధారాపురం ఎమ్మెల్యే పి. సత్యభామ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి.. ఆ తర్వాత టీవీకే నాయకత్వాన్ని(ఆధవ్ అర్జునను) కలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇవాళ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అధికారికంగా వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినా.. రాజకీయంగా మాత్రం విజయ్ “విజిల్” గుర్తుపై మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.“ఆపరేషన్ L” అలా మొదలైందా?అన్నాడీఎంకే వర్గాల్లో ఈ పేరుకు అనేక అర్థాలు వినిపిస్తున్నాయి. కొందరు “Lottery” అంటుంటే… మరికొందరు “Leave” అంటున్నారు. కానీ పార్టీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్న సెటైర్ మాత్రం వేరే — అన్నాడీఎంకే రెండాకులలో(Two Leaves గుర్తు) ఒక్కో “ఆకు” ఇప్పుడు ఊడిపోతోందన్న వ్యాఖ్య.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీవీకే లెక్క కూటమి నుంచి మెజారిటీకి షిఫ్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీవీకేకి సుమారు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వం స్థిరంగానే ఉన్నా… ఒకే నాయకుడి చుట్టూ నిర్మితమైన పార్టీ శాశ్వతంగా మిత్రపక్షాలపై ఆధారపడకూడదన్న భావన టీవీకేలో బలపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.. 234 స్థానాల అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే.. “కూటమి ప్రభుత్వం” క్రమంగా “ఒకే పార్టీ ప్రభుత్వం”గా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అంటే.. తాజాగా మూడు స్థానాలు, ఫస్ల్ 1.. మొత్తంగా నాలుగన్నమాట. పోను పోను ఆ సంఖ్యా పెరగవచ్చనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. అయితే ఈ రాజకీయ లెక్క అంత సులభం కాదు. ఎందుకంటే..మిత్రపక్షాలు ఊరుకుంటాయా?అధికారంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, విడుదలై చిరుత్తైగల్ కట్చి వంటి పార్టీలు ఇప్పుడు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మొదట అన్నాడీఎంకే రెబెల్స్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చలపై వామపక్షాలు, వీసీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది తెలిసిందే. అదే ఒత్తిడితో విజయ్ చివరి నిమిషంలో వ్యూహం మార్చి… “కేబినెట్లో చోటు కాదు, కానీ పార్టీ తలుపులు తెరిచి ఉంచడం” అనే మార్గాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్… టీవీకే పూర్తి మెజారిటీ దిశగా సాగితే భవిష్యత్తులో తన రాజకీయ ప్రాధాన్యం తగ్గిపోతుందా? అనే ఆందోళనలో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం స్థిరంగా ఉండాలంటే టీవీకేని బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు లేదు. దీంతో మిత్రపక్షాలు ఇప్పుడు “మద్దతు ఇస్తూనే దూరం పాటించే” రాజకీయ ధోరణిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక అన్నాడీఎంకే పరిస్థితి చూస్తే… అది ఇప్పుడు రెండు సమాంతర యుద్ధాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండగా… మరోవైపు ఎడప్పాడి పళనిస్వామి వర్గం తిరుగుబాటు నేతలను మళ్లీ కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీని కాపాడేందుకు ఇప్పుడు యాంటీ-డిఫెక్షన్ చట్టమే చివరి రక్షణగా మారిందన్న చర్చ జరుగుతోంది.చట్టపరమైన చిక్కుల్లేకుండా..అయితే టీవీకే మాత్రం ఆ అడ్డంకిని కూడా రాజకీయంగా చాకచక్యంగా దాటే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరుగా పార్టీ మార్పు కాకుండా… ముందుగా రాజీనామా.. తర్వాత ఉపఎన్నికలో మళ్లీ పోటీ అనే మోడల్‌ను అనుసరించడం ద్వారా చట్టపరమైన చిక్కులను తగ్గించాలనే వ్యూహం అమలవుతోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం సామాజిక సమీకరణాలు.టీవీకే టార్గెట్ చేస్తున్న వారిలో రాజకీయంగా బలహీనంగా ఉన్నవారు, పార్టీ లోపల ఒంటరితనంలో ఉన్నవారు, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం రాజకీయ ఆపరేషన్ మాత్రమే కాదు… సామాజిక లెక్కతో కూడిన వ్యూహమన్న మాట.అసలు సమస్య అదే..అయితే ఈ వ్యూహంలో మరో కీలక కోణం కూడా ఉంది. ఉపఎన్నికల రాజకీయ, ఆర్థిక భారం. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల బరిలోకి దిగితే… అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, భారీ ఖర్చుతో కూడిన ప్రక్రియ కూడా. ఒక్కో ఉపఎన్నిక నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం, భద్రత, ఎన్నికల సిబ్బంది, ప్రచార వ్యయాలు కలిపి కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఒకేసారి పలుచోట్ల ఉపఎన్నికలు వస్తే ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మలచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. “రాజకీయ లాభాల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు” అన్న విమర్శలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఉపఎన్నిక అనేది గెలుపు గ్యారెంటీ ఉన్న రాజకీయ గేమ్ కాదు. అధికార ప్రభావం, విజయ్ ఇమేజ్ బలంగా కనిపిస్తున్నా… రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మళ్లీ ప్రజల తీర్పు కోరాల్సిందే. స్థానిక అసంతృప్తి, కుల సమీకరణాలు, తిరుగుబాటు నేతల ప్రభావం వంటి అంశాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశమూ ఉంది.అందుకే ఈ వ్యూహాన్ని రాజకీయ వర్గాలు “హై రిస్క్ – హై రివార్డ్” ఆపరేషన్‌గా విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ ఈ లెక్క సక్సెస్ అయితే… టీవీకే కూటమి రాజకీయాల నుంచి బయటపడి స్వతంత్ర మెజారిటీ దిశగా అడుగులు వేయొచ్చు. కానీ విఫలమైతే మాత్రం అదే వ్యూహం రాజకీయంగా తిరుగుదెబ్బ అయ్యే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ఒకప్పుడు ద్రావిడ పార్టీల బలం అనుకున్న కూటములే, ఇప్పుడు అస్థిరతకు సంకేతాలుగా మారుతున్నాయి. విజయ్ నిజంగానే ముందుగానే ఈ వ్యూహాన్ని రచించారా? లేక పరిస్థితులే ఆయనకు అనుకూలంగా మారాయా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో రాజకీయ మార్పులు ఒక్కసారిగా రావడం లేదు. నియోజకవర్గం నుంచి నియోజకవర్గానికి, ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకు సమీకరణాలు నెమ్మదిగా మారిపోతున్నాయి. -
అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్
హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని సినీ ప్రముఖులు అంతా భావించారు. ఎవరికి వాళ్లే పలు సూచనలతో విజయ్‌ని ఇదివరకే వెళ్లి కలిశారు కూడా. ఇప్పడు సినీ పరిశ్రమకు మొత్తానికి కలిసొచ్చేలా విజయ్ శుభవార్త చెప్పేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్.. ఇండస్ట్రీ గురించి ప్రకటన చేశారు. ఇకపై ఏ తమిళ సినిమా అయినా థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని పేర్కొన్నారు. 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చు. స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి లభించింది.గత కొన్నేళ్లలో తమిళనాడులో ఏ కొత్త సినిమా అయినా సరే మార్నింగ్ షోతోనే మొదలయ్యేది. బెన్ఫిట్ షోలు లాంటివి ఉండేవి కావు. ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం వల్ల స్టార్ హీరోల చిత్రాలకు కలెక్షన్స్ పరంగా కలిసొచ్చే అవకాశముంటుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో ముందురోజు రాత్రి వేసే ప్రీమియర్ల ట్రెండ్ కూడా త్వరలో తమిళనాడులో మొదలైన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.ఇకపోతే విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగణ్' రిలీజ్ ఎప్పుడనేది ఇంకా తేలట్లేదు. కొన్నిరోజుల క్రితం తమిళనాడులోని ఓ ఆలయాన్ని దర్శించుకున్న ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఇంకా సెన్సార్ కాలేదని చెప్పారు. మరోవైపు జూన్ 19న మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే రోజుకు ఐదు షోల నిర్ణయం.. 'జన నాయగణ్'కి ఎక్కువగా లాభించే అవకాశముంటుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' హీరోపై బాలీవుడ్లో నిషేధం) -
10 ఏళ్ల బాలిక కిడ్నాప్, హత్య.. సీఎం విజయ్ ఏం చేశారంటే..?
చెన్నై: కోయంబత్తూరులో ఒక 10 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ విషాదంగా ముగిసింది. తాజాగా తీవ్ర గాయాలతో కూడిన ఆ బాలిక మృతదేహం సూలురులోని కన్నంపాల్యం లేక్ వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇటువంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించరాదని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. 21వ తేదీ గత గురువారం రోజు సాయంత్రం సూలూరులో ప్రాంతంలో 10 ఏళ్ల బాలిక సరుకులు కొనడానికి బయటకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మోహాన్ రాజ్, కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను అపహరించారు. అనంతరం ఆ బాలిక మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తాము మార్పు కోసం సీఎం విజయ్‌కు ఓటేశామని ఇప్పుడు ఈ ఘటనపై ఆయన కనీసం స్పందించడం లేదని ముఖ్యమంత్రి స్పందించేవరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు.దీంతో ఈ నిరసనల నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం విజయ్ స్పందించారు."నిన్న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికకు జరిగిన దారుణ ఘటన తీవ్ర దుఃఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి అమానుషమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని" అని Xలో పోస్ట్ చేశారు.అయితే ఈ ఘటనపై తమిళనాడు డీజీపీ సీరీయస్‌గా ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఆయన సందర్శించారు. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా బాధితురాలి తల్లిదండ్రులను ఆ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే సుకుమార్ కలిశారు. నిందితులను ఎట్టిపరిస్థితుల్లో శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై అక్కడి ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే, లైంగిక హింస, గంజాయి స్మగ్లింగ్, రౌడీయిజం, అధికార పార్టీ సభ్యుల దురుసు ప్రవర్తన, అరాచకాలు విపరీతంగా పెరిగి పోయాయాని ఇప్పుడు ఏకంగా బాలిక అపహరణ, అనంతరం హత్య జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల స్థితిని తెలియజేస్తుందన్నారు. కేవలం 12 రోజుల్లోనే 30కి పైగా ప్రధాన ఘటనలు వార్తల్లోకి వచ్చాయని రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
స్టాలిన్-పళనిది కలేనా?
ఆరు దశాబ్దాల తమిళనాడు రాజకీయ చరిత్రలో.. తొలిసారిగా ఏర్పడిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఎంతకాలం నిలుస్తుంది?. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కొలువుదీరి రెండు వారాలు గడవక ముందే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకేలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అంటూ ప్రకటలు చేస్తున్నాయి. వీటిపై టీవీకే స్పందించింది. “మాకు అధికార అనుభవం తక్కువ కావొచ్చు.. కానీ సిద్ధాంతాల విషయంలో మా నిబద్ధత చాలా బలంగా ఉంది” అంటూ ఘాటు బదులే ఇస్తోంది. ఇంతకాలం డీఎంకే, అన్నాడీఎంకేలు ద్రవిడ సిద్ధాంతం పేరు చెప్పుకుని ప్రజలను మభ్యపెట్టాయని.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని టీవీకే నేత, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి అరుణ్‌రాజ్ ఆరోపించారు. అయితే.. విజయ్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం “సామాజిక న్యాయం, లౌకికవాదం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ” అనే ఉమ్మడి సిద్ధాంతాలపై ఏర్పడిందని, కాబట్టి ఆ ఆలోచనలే ఉండబోవని చెప్పారాయన. చెన్నైలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణమైనా కుప్పకూలుతుందన్న ప్రతిపక్షాలకు కౌంటర్ కూడా ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు వ్యవస్థను ఎలా ఉపయోగించుకోవాలో, అవినీతికి ఎలా వాడుకోవాలో బాగా నేర్చుకున్నాయి. అందుకే మాకు ప్రజలు ఓటేసి గెలిపించారు. మా కూటమి సాధారణ రాజకీయ పొత్తు కాదని, సిద్ధాంతాల కలయిక అని స్పష్టం చేశారు. టీవీకే, ఐయూఎంఎల్, వీసీకే కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం బయట నుంచి వామపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల అసెంబ్లీలో ఈ కూటమికి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే బయట మద్దతు భవిష్యత్తులో సమస్య అవుతుందన్న వాదనను అరుణ్‌రాజ్ ఖండించారు. “ప్రజలకు మంచి పాలన అందిస్తే.. ప్రజాదరణ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కాబట్టి ప్రతిపక్షాలది కలే అని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇంతకాలం కూటములతో అధికారంలోకి వచ్చినా.. భాగస్వామ్య పార్టీలకు పాలనలో వాటా ఇవ్వలేదు. కానీ మా(టీవీకే పార్టీ) అధినేత విజయ్ మాత్రం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారాన్ని పంచుకున్నారని చెప్పారు. దీనిని ఆయన “ప్రజాస్వామ్యానికి నిజమైన గౌరవం”గా అభివర్ణించారు. ఈ కారణాల వల్లే మా అధినేత కూడా అదే ధీమాతో ఉన్నారని అరుణ్ చెప్పుకొచ్చారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా టీవీకే ప్రభుత్వం వెనక్కి తగ్గదని అరుణ్‌రాజ్ స్పష్టం చేశారు. విద్యా నిధుల విడుదల, వన్‌నేషన్-వన్ ఎలక్షన్, సీఏఏ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. అయితే ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికీ సిద్ధమేనన్నారు.ఆరోగ్యశాఖ మంత్రిగా తన తొలి లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తీసుకురావడమేనని చెప్పారు. “డబ్బు లేక అప్పులు చేసినా ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమ్మకం తగ్గింది. దాన్ని మళ్లీ పెంచాలి” అని అన్నారు.ఇదిలా ఉంటే.. విజయ్ తన కేబినెట్ విస్తరణను కూడా పూర్తి చేశారు. వీసీకే నుంచి ఓ దళిత నేత, ఐయూఎంఎల్ నుంచి మరో నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ‘రెయిన్బో క్యాబినెట్’ను విజయ్ రూపొందించారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
స్టాలిన్ కక్ష కడితే.. విజయ్ విముక్తినిచ్చాడు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు హాట్ చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ యూట్యూబర్ ‘సావుక్కు’ శంకర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. శంకర్‌పై గూండా యాక్ట్‌ను ఎత్తేయాలని పోలీస్‌శాఖను ఆదేశించారు. దీంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సావుక్కు శంకర్(Savukku Shankar) అనే పేరు తమిళనాడులో రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య చర్చల్లోనూ తరచూ వినిపిస్తుంటుంది. సావుక్కు అంటే కొరడా అని అర్థం. విజిల్‌బ్లోయర్‌గా, సిస్టమ్‌కి బలైన వ్యక్తిగా ఆయన అక్కడి జనాలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన నోటి దురుసును విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డు చెప్పాలంటే.. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా తొమ్మిదిసార్లు అరెస్ట్ అయ్యారు ఆయన. ఎవరీ సావుక్కు శంకర్.. ఆచిముత్తు శంకర్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగంలో క్లర్క్‌గా పని చేశారు. అయితే 2008లో తమిళనాట సంచలనం సృష్టించిన ఆడియో లీక్ కేసులో సస్పెండ్ అయ్యి.. దర్యాప్తు తదనంతరం ఉద్యోగం పొగొట్టుకున్నారు. ఆ స్కాంలో ఓ మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఆపై సావుక్కు అనే వెబ్సైట్, యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. అవినీతి, అధికార దుర్వినియోగం బయటపెట్టిన వ్యక్తిగా ఆయనకంటూ తమిళనాట ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాలక్రమంలో ఆయన నోటి నుంచి నిజాలే వస్తాయని జనం భావించేంతగా పరిస్థితి చేరుకుంది. దీంతో వ్యవస్థ నుంచి ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలపై ఆయన చేసిన విమర్శలు, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో ఒక వర్గానికి ఆయనను ధైర్యవంతుడిగా చూపించాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాడే యువత, ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవారు ఈయనకు మద్దతుగా నిలిచేవారు. అదే సమయంలో.. మహిళలపై నోరు పారేసుకోవడం, వ్యక్తిగత దాడులు ఆయనపై కాస్త నెగెటివిటీని క్రియేట్ చేశాయి. డీఎంకే హయాంలో..2021లో స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌పై వరుసగా కేసులు నమోదయ్యాయి. గూండాస్ యాక్ట్ కింద పలుమార్లు అరెస్టు కావడం, ఎన్డీపీఎస్ కేసులు ఎదుర్కొన్నప్పటికీ, కోర్టులు మాత్రం ఆయన్ని నిర్దోషిగా తీర్పునిస్తూ డీఎంకే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేవి. అంతెందుకు 2024లో, మద్రాస్ హైకోర్టు ఆయనపై ఉన్న ఓ సంబంధించి నిర్బంధాల్ని రద్దు చేసింది. దీంతో.. డీఎంకే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఆయన్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని తమిళ ప్రజలు భావించేవారు. ‘‘తప్పుడు కేసులతో స్టాలిన్ ప్రభుత్వం నా నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది’’ అంటూ స్వయంగా ఆయన కూడా ఆరోపించేవారు. ఈ ఏడాది పరువు నష్టం కేసులోనూ మద్రాస్ హైకోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగానే..2026 ఏప్రిల్‌లో చెన్నై పోలీసులు గూండాస్ చట్టం కింద నిర్బంధం విధించారు. ఏపీలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చే సమయంలో పోలీసులపై రాళ్లు విసిరారని కేసు పెట్టారు. అయితే ఈ కేసులో ఆయన నిర్దోషి అని విజయ్ ప్రభుత్వం గుర్తించింది. అడ్వైజరీ బోర్డు పరిశీలనలో ఆయన నిర్బంధానికి తగిన కారణం లేదని తేలడంతో విడుదల చేయాలని ఆదేశించింది. ఆయనపై ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వాటిలో చిక్కులను పరిశీలించాక ఆయన్ని విడుదల చేయాలని పోలీసు శాఖకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడో విషయం ఏంటంటే.. సావుక్కు శంకర్ విజయ్‌నూ వదల్లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే అధినేత తీరును ఏకిపారేస్తూ వీడియో సిరీస్ తీశాడు. వాటికి విపరీతంగా ఆదరణ దక్కింది. -
సీఎం విజయ్ ఆర్మీ ప్రమాణస్వీకారం
-
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్‌తో మొదలు పెడదాం. అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్లను చూపించి ప్రచారం చేశారు. విశ్వసనీయతను దెబ్బతీసేలా.. విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా? ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్‌ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్‌లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్‌కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు. -
లంచంపై ఫిర్యాదు చేస్తే లక్ష బహుమతి!
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారా?. అవినీతి రహిత పాలన కోసం కఠిన చర్యలు అవలంభిచబోతున్నారా?. ఇందు కోసం తొలి అడుగు.. అవినీతి నిరోధక శాఖ ప్రక్షాళనతోనే ప్రారంభించబోతున్నారా?. లంచం అడిగినా అధికారులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నజరానా ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం విజయ్ సర్కార్ ప్రొత్సాహక పథకం తేబోతున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందులో భాగంగా.. అధికారులు ఎవరైనా వెయ్యి లంచం అడిగినా పిర్యాదు చేస్తే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు ఆ వార్త సారాంశం. అవినీతి ఫిర్యాదుల కోసం 24 గంటలు పని చేసేలా 1800 425 1555 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారని.. అలాగే ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తారన్నది ఆ కథనం సారాంశం. అంతేకాదు.. ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వమని ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందట. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలించేందుకు అడుగులు వేశారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చర్చ నడుస్తోంది. ఇందుకుగానూ అన్ని శాఖలకు మూడు నెలల గడువు విధించారని.. పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు.. టెండర్లు, కాంట్రాక్టులు పారదర్శకత కోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఆ కథనాలు ఊటంకించాయి. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు అవినీతి రహిత సమాజంలో ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయమంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. -
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్‌గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్ కమ్ లీడర్‌తో కంపేరిజన్ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్లే. అదే సమయంలో.. విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్‌తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్‌ను తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్ వీడియో రీల్‌గా బయటకు రావడం.. దుమారం రేపింది.A Person is taking a selfie video while CM Joseph Vijay is conducting a meeting! Best of Luck to Tamil Nadu for this comedy show for next 5 Years pic.twitter.com/ntG5gRndRM— Amitabh Chaudhary (@MithilaWaaala) May 19, 2026పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. విజయ్ సినీ స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్, రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.కొత్త కాదు కదా!రీల్ కల్చర్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్ కంటెంట్‌గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్ విషయంలోనే ఎందుకీ చర్చ?. తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్ బ్యాక్‌గ్రౌండ్ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్ ఇమేజ్ బిల్డింగ్‌గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్‌తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్‌గా విజయ్ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. -
పూటకో మాట మాట్లాడితే ఎలా పవన్?
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులను చూస్తే జాలేస్తుంది. జనసైనికుల ప్రతినిధిగా సీఎం అవుతాడనుకున్న పవన్... కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులను అవమానించేలా మాట్లాడుతున్నా చప్పట్లు కొట్టారంటే ఆశ్చర్యం వేస్తుంది. సినిమా హీరోలపై కొందరిలో వెర్రి అభిమానం ఉంటుందని అంటారు. హేతుబద్దత, మంచి, చెడు విశ్లేషణ కొరవడతాయని అంటారు. మంగళగిరిలో జనసేన సమావేశంలో జరిగిన ఈ సన్నివేశం చూసిన తర్వాత అది నిజమేనేమో అనిపిస్తుంది. తమిళనాడులో పార్టీని స్థాపించి రెండేళ్లలోనే ముఖ్యమంత్రైన విజయ్‌తో తనను పోల్చడంపై పవన్ కళ్యాణ్‌కు అసహనంగా ఉండవచ్చు. దానిపై నేరుగా వివరణ ఇచ్చి ఉండవచ్చు. అలా కాకుండా ‘‘ఊళ్లో పెళ్లికి..’’ అన్న సామెత కాస్త మార్చి ఊళ్లో పెళ్లవుతుంటే పిల్లలు అటూ, ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తుంటారని సర్దుకున్నారు. అయినా ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో విస్తారంగా కథనాలు వచ్చేశాయి. అభిమానులను కుక్కలతో ఎలా పోల్చుతారంటూ ప్రశ్నలు సంధించారు. నిజానికి ఈ సామెతను ప్రస్తావించినప్పుడు జన సైనికులంతా అవమాన భారంతో కుంగిపోయి ఉండాలి. కాని పలువురు చప్పట్లు కొట్టారు. అంటే వారికి ఆయన ఉద్దేశం అర్థం కాలేదన్నమాట. ఇంత అమాయకులు కనుకే పవన్ కళ్యాణ్ ఇన్నేళ్లుగా వారిని మభ్యపెట్టగలుగుతున్నారా?2008 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ 2014లో సొంత పార్టీ పెట్టినప్పటి తరువాత కూడా... ఆయన ఎన్ని మాటలు మార్చాడో అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పడం, మాటమార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రికార్డులు కూడా ఈయన బద్ధలు కొట్టి ఉంటారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అభిమానులు, కాపు సామాజిక వర్గం గట్టిగా కోరుకుంది. గత ఎన్నికల సమయంలో పవన్ రెండేళ్లపాటు సీఎం పదవి, కనీసం యాభై సీట్ల డిమాండ్‌ను చంద్రబాబు ముందు పెట్టి ఉండాల్సిందని చాలామంది అప్పట్లో సూచించారు కూడా. కానీ ఆయన వీటిని పట్టించుకోలేదు. ఈవీఎంల మాయో, లేక జనం ఓట్లు వేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. తనకు మద్దతిస్తే కాపుల నుంచి సీఎం అయి చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ టీడీపీకి పదిహేనేళ్లపాటు మోస్తానని చెబుతుండడం ఆ వర్గాలను నిరాశ పరుస్తోంది. టీడీపీని మోయడానికి జనసేన పేరుతో పార్టీ పెట్టడం దేనికి అని అభిమానులే ప్రశ్నిస్తున్నారు.తమిళనాడులో విజయ్ సొంత సిద్ధాంతం, వైఖరితో ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించారు. కానీ పవన్‌లో ఈ చిత్తశుద్ది ఎన్నడూ వ్యక్తం కాలేదు. 2014లో పార్టీ పెట్టినప్పుడే పోటీ చేయకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అది ఎలాంటి వ్యూహం అవుతుంది? తొలుత చెగువేరా వెంట ఆ తరువాత తర్వాత మోడీ అంటే... కమ్యూనిజం నుంచి సనాతనానికి మారిన చరిత్ర పవన్‌ది. అవసరమైతే సీఎం పదవినైనా అయినా వదలుకుంటాను తప్ప కుల, మత రాజకీయాలు చేయను అని స్పష్టంగా చెప్పిన చరిత్ర విజయ్‌ది. పవన్ కళ్యాణ్ నిత్యం తెలుగుదేశం తరపున అనేక అసత్యాలను ప్రచారం చేయడానికి కృషి చేస్తున్నారని కొందరు విమర్శిస్తుంటారు. తనకు కుల భావన లేదని ఒకసారి, కాపులైనా తనకు ఓటు వేయరా అని మరోసారి, అమరావతి కుల రాజధాని అవుతోందని ఇంకోసారి, తాను ఎప్పుడూ అమరావతికి మద్దతు ఇచ్చామని వేరొకసారి ఇలా అనేక అంశాలలో మాటలు మార్చి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ చెప్పిన పచ్చి అబద్దం గురించి ఈనాటికి వివరణ ఇవ్వలేకపోయారు. ఇలా అనేక సార్లు మాట మార్చడానికి వెనుకాడలేదు. వేరే పార్టీవారి కోసం విజయ్ పనిచేయాల్సిన పని లేదు. అబద్దాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2019లో ఒంటరిగా పోటీ చేశానని పవన్ చెప్పడం అసత్యమా?కాదా? అన్నది ఆలోచించుకోవాలి. రెండు చోట్ల ఓడిపోయింది నిజమే కావచ్చు.కాని దానిపై ఆత్మపరిశీలన చేసుకున్నారా? అప్పట్లో లక్నో వరకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఎన్నికల పొత్తు కోరిన సంగతి ఆయన మర్చిపోయారేమో! ఆ పార్టీతోపాటు సీపీఐ, సీపీఎంలతో జట్టు కట్టిన విషయం ఆయనకు జ్ఞప్తికి లేదనుకోవాలా? ఓటమి తర్వాత వెంటనే బీజేపీతో పొత్తు కోసం డిల్లీ వెళ్లారా? లేదా? ఇదంతా డబుల్ గేమ్ కాదా? పొత్తు పెట్టుకోవడం తప్పుకాదు.కాని తనకేదో సిద్దాంతం ఉన్నట్లు నమ్మబలకడమే బాగోలేదు. బీజేపీతో కలిసి పోటీచేయడం ఉపయుక్తమని ఈయన ఇచ్చిన సలహాను విజయ్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఏకంగా సీఎం అవడం పవన్‌కు బాగా చికాకుగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా రాజకీయం చేసి ఉంటే ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉండేదని ఆయనకు మద్దతు ఇచ్చే వర్గాలు భావిస్తున్నాయి.అదే విషయం ఆయనకు చెవిలో చెబితే కోపం వచ్చినట్లు ఉంది.తాను సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదని చెప్పడం తనను తాను మోసం చేసుకోవడం కాదా? పలుమార్లు తాను సీఎం అయి చూపిస్తానని అన్నారా? లేదా? సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని పవన్ ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎవరైనా నమ్ముతారా? పోనీ ఏమిటి అయన తీసుకువచ్చిన మార్పు. సమాజం సంగతి అటు ఉంచి, ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలి! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్ ల గురించి ఎన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమని పొగుడుతున్నారు? దానిపై వివరణ ఇచ్చారా? మహిళలపై కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలపై ఎన్నడైనా నోరు తెరిచారా?ఎవరిదాకానో ఎందుకు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక యువతి చేసిన ఆరోపణల గురించి స్పందించారా? శ్రీకాళహస్తిలో సొంత పార్టీ మహిళా నేత టీడీపీ ఎమ్మెల్యేపై చెప్పిన సంగతులేమిటి? దానిపై ఎక్కడైనా మాట్లాడారా? వైసీపీపై రాజకీయ విమర్శలు చేయవచ్చు. కాని అలాకాకుండా టీడీపీ నేతల మాదిరి అసత్యమైన వ్యక్తిగత దూషణలకు దిగడం సమర్థనీయం కాదు. చిత్రం ఏమిటంటే వంగవీటి రంగాను ఎందుకు కాపాడుకోలేకపోయారని ఆయన మద్దతుదారులను పవన్ ప్రశ్నించడం చూసి విస్తుపోయారు. రంగాను హత్య చేసిన వారితో, ముద్రగడ కుటుంబాన్ని వేధించిన వారితో, అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారితో అంటకాగుతూ రంగా హత్యపై కాపులనే ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ను పలువురు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గందరగోళంగా మాట్లాడుతున్నారని చాలామంది అంటుంటారు.కాని అది నిజం కాకపోవచ్చని, టీడీపీ కుతంత్రాల రాజకీయం బాగా వంట పట్టించుకుని అదే దారిలో సాగితేనే ప్రజలను మభ్య పెట్టవచ్చన్న ఉద్దేశంతో పవన్ ఉన్నారేమో అన్న అనుమానాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తుంటారు. ఏదో రకంగా తంటాలు పడి రాజకీయాలలో పదవులు పొందవచ్చేమో కాని, ప్రజలలో విశ్వసనీయత, గౌరవ స్థానం పొందడానికి చిత్తశుద్ది,లక్ష్య శుద్ది ఉండాలి. అవమానించినా చప్పట్లు కొట్టే అభిమానులు ఉండడం చూస్తే పవన్ కళ్యాణ్ అంతవరకు అదృష్టవంతుడే అని చెప్పాలేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


