సీఎం విజయ్‌తో చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద | Grandmaster R Praggnanandhaa Meet Tamil Nadu CM Joseph Vijay | Sakshi
Sakshi News home page

మాస్టర్‌తో చెస్‌ ఆడిన గ్రాండ్‌మాస్టర్‌.. సీఎం విజయ్‌తో చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద

Jun 8 2026 12:47 PM | Updated on Jun 8 2026 1:31 PM

Grandmaster R Praggnanandhaa Meet Tamil Nadu CM Joseph Vijay

భార‌త చెస్ గ్రాండ్‌మాస్ట‌ర్ ర‌మేశ్‌బాబు ప్ర‌జ్ఞానంద‌ నార్వే చెస్ చాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. నార్వే చెస్ టైటిల్ గెలిచిన‌ తొలి భార‌త ఆట‌గాడిగా ఆర్ ప్ర‌జ్ఞానంద చ‌రిత్ర సృష్టించాడు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్‌ని ప్రజ్ఞానంద త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశాడు. 

ఈ సంద‌ర్భంగా సీఎం విజ‌య్ ప్ర‌జ్ఞానంద‌ను అభినందించ‌డ‌మే గాక అత‌డితో స‌ర‌దాగా చెస్ ఆడాడు. అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌తో త‌మిళనాడు గ‌ర్విస్తోంద‌ని పేర్కొన్న విజయ్ ప్ర‌జ్ఞానంద‌కు రూ. 50 ల‌క్ష‌ల చెక్కును రివార్డుగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

నార్వే చెస్ టోర్నీలో ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్, డిఫెండింగ్ చాంపియ‌న్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను రెండుసార్లు ఓడించిన తొలి భార‌తీయుడిగా ప్రజ్ఞానంద చ‌రిత్ర సృష్టించాడు. ఓస్లో వేదిక‌గా జ‌రిగిన టోర్నీలో ప్ర‌జ్ఞానంద ఫైన‌ల్లో జ‌ర్మనీ గ్రాండ్‌మాస్ట‌ర్ విన్సెంట్ కీమ‌ర్‌ను మ‌ట్టిక‌రిపించి చాంపియ‌న్‌షిప్ కిరీటాన్ని కైవ‌సం చేసుకున్నాడు. టోర్నీ ఆరంభంలో త‌డ‌బ‌డిన ప్ర‌జ్ఞానంద చివ‌రి ద‌శ‌లో అనూహ్యంగా ఫుంజుకున్నాడు. 

ప‌దో రౌండ్  ప్రారంభానికి ముందు 15 పాయింట్ల‌తో ప్ర‌జ్ఞానంద ముందు వ‌రుస‌లో నిలిచాడు. ఆఖ‌రి రౌండ్‌లో విన్సెంట్ కీమ‌ర్‌ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకున్నాడు. ఇక నార్వే చెస్ టోర్నీ విజేత‌గా నిలిచిన‌ ప్ర‌జ్ఞానంద‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సహా ప‌లువురు అభినందించారు.

చదవండి: మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement