మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌! | Suryakumar-Un-followed Mumbai Indians Page-Rumours-Exit-MI | Sakshi
Sakshi News home page

సూర్యకు అవమానం; మొన్న బీసీసీఐ.. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌!

Jun 8 2026 12:21 PM | Updated on Jun 8 2026 12:59 PM

Suryakumar-Un-followed Mumbai Indians Page-Rumours-Exit-MI

టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్య‌కుమార్ యాద‌వ్ ముంబై ఇండియ‌న్స్‌కు కూడా గుడ్‌బై చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి బ‌లం చేకూరుస్తూ ఆదివారం రాత్రి ముంబై ఇండియ‌న్స్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సూర్య‌కుమార్‌ను అన్‌ఫాలో చేసింది. టిట్ ఫ‌ర్ టాట్ అన్న త‌ర‌హాలో సూర్య‌కుమార్ కూడా త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో ముంబై ఇండియ‌న్స్ పేజీని అన్‌ఫాలో చేయ‌డ‌మే గాక పేజీ నుంచి ముంబై ఇండియ‌న్స్‌కు సంబంధించిన అన్ని ఫొటోలు, వీడియోల‌ను తొల‌గించాడు. 

ప్ర‌స్తుతం సూర్య ఇన‌ అకౌంట్‌లో దీంతో ముంబై ఇండియ‌న్స్‌తో సూర్య‌కుమార్‌కు బంధం ముగిసిన‌ట్లేన‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం అభిమానులు నిద్ర‌లేచేస‌రికే ఇదంతా జ‌రిగిపోవ‌డంతో సూర్య‌కుమార్‌కు బ్యాడ్‌టైం న‌డుస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది. మొన్న కెప్టెన్సీతో పాటు జ‌ట్టులో చోటు లేకుండా చేసి బీసీసీఐ అవ‌మానిస్తే.. ఇవాళ  ముంబై ఇండియ‌న్స్ సూర్య‌కుమార్‌ను అన్‌ఫాలో చేసి అవ‌మానించింద‌ని అభిమానులు తెగ బాధ‌ప‌డిపోతున్నారు.

సూర్య‌కుమార్ బ‌యోను అభిమానులు ప‌రిశీలించి చూడ‌గా.. అత‌డి బ‌యోలో ముంబై ఇండియ‌న్స్‌తో పాటు ముంబై అనే ప‌దాన్ని కూడా తొల‌గించాడు. ప్ర‌స్తుతం సూర్య‌కుమార్ ఇన్‌స్టా అకౌంట్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు సంబంధించి కేవ‌లం ఒక్క ఫొటో మాత్ర‌మే ఉంది. అది కూడా ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌తో క‌లిసి దిగిన ఫొటో ఉంది. సూర్య కంటే ముందే ముంబై ఇండియన్స్‌ను వీడుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన ఆ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా సూర్య‌కుమార్ అన్‌ఫాలో చేయ‌డం గ‌మ‌నార్హం. 

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సూర్య‌కుమార్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 14 మ్యాచ్‌లాడిన సూర్య‌కుమార్ 270 ప‌రుగులు మాత్ర‌మే చేసి విఫ‌ల‌మ‌య్యాడు. అత‌డి ఖాతాలో రెండు అర్థ‌సెంచ‌రీలు మాత్ర‌మే ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. 2018లో కేకేఆర్ నుంచి ముంబై ఇండియ‌న్స్‌కు వ‌చ్చిన సూర్య‌కుమార్ అప్ప‌టి నుంచి ఎనిమిదేళ్లుగా ముంబైకే ఆడుతూ వ‌చ్చాడు. 

ఇందులో ముంబై రెండుసార్లు (2019, 2020) ఐపీఎల్ చాంపియ‌న్‌గా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో టీమిండియాను మూడోసారి టీ20 చాంపియ‌న్స్‌గా నిలిపిన సూర్య‌కుమార్ యాద‌వ్ ఫామ్ కోల్పోయి తంటాలు ప‌డుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్యూర్ తాజాగా అత‌డి టీ20 కెప్టెన్సీతో పాటు జ‌ట్టు నుంచి దూర‌మ‌య్యేలా చేసింది. 

శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కెప్టెన్‌ను చేయ‌డంతో ఇక టీమిండియాలో సూర్య‌కుమార్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడిన‌ట్లేనని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు అటు సూర్య‌కుమార్ కానీ.. ఇటు ముంబై ఇండియ‌న్స్ కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సూర్య‌కుమార్ ముంబైని వీడుతాడా లేదా ఇవ‌న్నీ ఊహాగానాల‌కే ప‌రిమిత‌మా అన్న‌ది రాబోయే రోజుల్లో తేల‌నుంది.

Advertisement
 
Advertisement
Advertisement