breaking news
Fatima Sana
-
World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్ వుమెన్‌ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్ జట్టు.. తాజాగా పాకిస్తాన్ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆసీస్.. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు కెప్టెన్ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్ (10).. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్ సెంచరీఆ తర్వాత కూడా పాక్ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్ ప్లేయర్ అనాబెల్ సదర్లాండ్ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్నర్ (1), తహీలా మెగ్రాత్ (5), జార్జియా వారేహామ్ (0), కిమ్ గార్త్ (11) పెవిలియన్‌కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్‌ను బెత్ మూనీ (Beth Mooney), అలనా కింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఓపెనర్ సదాఫ్ షమాస్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్ షట్ వెనక్కి పంపింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సిద్రా ఆమిన్ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెను అవుట్ చేసింది.ఇక నాలుగో నంబర్ బ్యాటర్ సిద్రా నవాజ్ (5) వికెట్‌ను కిమ్ గార్త్ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్ (1)ను మేగన్ పెవిలియన్‌కు పంపింది. ఇక కెప్టెన్ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా.. డయానా బేగ్ (7)ను జార్జియా వారేహామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్ షమీమ్ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్‌లో నష్రా తొమ్మిదో వికెట్‌గా.. సదర్లాండ్ బౌలింగ్‌లో షమీమ్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్.. ఆసీస్ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్ పడకుండానే ఆ మ్యాచ్ రద్దైపోయింది.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
పాక్ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్ బ్యాటర్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- పాకిస్తాన్ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్‌కు బుధవారం షెడ్యూల్ ఖరారైంది. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బౌలర్ల విజృంభణకెప్టెన్ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్ ఆది నుంచే చెలరేగి ఆసీస్ ఓపెనింగ్ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్‌ఫీల్డ్ 10, కెప్టెన్ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది.పాక్ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లే గార్డ్నర్ (1), తాహిలా మెగ్రాత్ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్ (0), కిమ్ గార్త్ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ బెత్ మూనీ.. ఆల్‌రౌండర్ అలనా కింగ్‌తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్ఆసీస్ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్ మూనీ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్‌లో సదాఫ్ షమాస్కు క్యాచ్ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్ సంబరాలపై నీళ్లుమరో ఎండ్‌లో అలనా కింగ్ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్ షమీమ్, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్, సదియా ఇక్బాల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌పై బ్యాట్‌తో విజృంభించిన బెత్ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025 -
IND vs PAK: పాకిస్తాన్ క్రికెటర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్‌ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.భారత్ 247 పరుగులకు ఆలౌట్ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌలర్ల విజృంభణఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీఐదో నంబర్లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్‌కు తెరపడింది.అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్‌ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.అందుకే సిద్రాకు పనిష్మెంట్ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.ఆధిపత్యం చాటుకున్న భారత్‌కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది. పాక్‌తో తాజా మ్యాచ్‌లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.స్ప్రే ప్రయోగిస్తూఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్‌గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ -
World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను (Spray) ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు.వివరాల్లో వెళితే.. కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్నచిన్న పురుగులు మైదానమంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. ఈ పరుగుల కారణంగా మ్యాచ్‌కు పలు మార్లు అంతరాయం కలిగింది.ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీని వల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజ్‌లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. పురుగుల వల్ల తాను బంతిపై దృష్టి సారించలేకపోతున్నానని తెలిపింది.దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అంపైర్ పురుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రే తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకు ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోంచి పురుగులను తరిమికొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్‌కు కొనసాగించారు.శ్రీలంకలోని క్రికెట్ మైదానాల్లో ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తుంటాయి. పురుగులు, జంతువులు, పాములు పిలవని పేరంటాలకు వచ్చి పోతుంటాయి. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 44 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (31), స్మృతి మంధన (23), హర్లీన్ డియోల్ (46), హర్మన్‌ప్రీత్ (19), జెమీమా రోడ్రిగెజ్ (32) ఔట్ కాగా.. దీప్తి శర్మ (24), స్నేహ్ రాణా (16) క్రీజ్‌లో ఉన్నారు.చదవండి: భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్ -
భారత జట్టుతో అనుబంధం.. హర్మన్ గొప్ప ప్లేయర్: పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.పాక్‌పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతంఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.అయితే, ఈ మ్యాచ్‌ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్‌తో పాటు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్‌తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.ఈసారి కూడా నో షేక్హ్యాండ్ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్‌సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్‌ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రశంసించింది.అంతా ఒకే కుటుంబం అదే విధంగా.. ‘‘2022 వరల్డ్‌కప్‌లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్‌కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.ఈసారి ఏకపక్ష విజయమేఅయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం