
అంతులేని కష్టం.. అపార నష్టం
పంట మొత్తం కుళ్లిపోయింది
ఒంటరిగా వ్యవసాయం చేస్తున్నా. కొద్దిపాటి పొలంలో చేపట్టిన వరి పైరును వరద ముంచెత్తడంతో మొ త్తం కుళ్లిపోయింది. తిరిగి పంటవేసే ఓపిక లేదు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – కురసం కాంతమ్మ,
ఏజీకొడేరు, చింతూరు మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
ఇప్పటికే వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేపట్టిన వరి పైరు వరద పాలైంది. ఇకపై పెట్టుబడి పెట్టే స్థోమతలేదు. ఈ ఏడాది తిండిగింజలు కూడా కరువయ్యే పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వం ఆదుకుంటేనే గట్టెక్కుతాం.
– అగరం రామయ్య,
ఏజీకొడేరు, చింతూరు మండలం
ఈ ఏడాది వరుస వరదలు విలీన మండలాల రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశాయి. జూన్‌లో ప్రారంభమైన వరదలు అక్టోబరు వచ్చిన ఇంకా కొనసాగుతుండడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంటలన్నీ ముంపు
బారిన పడటంతో తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన చెందుతున్నారు.
చింతూరు: గోదావరి, శబరి నదులకు ఈ ఏడాది ఇప్పటివరకు ఎనిమిది సార్లు వచ్చిన వరదలు చింతూరు డివిజన్ పరిధిలోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో పత్తి పంట ముంపునకు గురైనట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎటపాక మండలంలో సుమారు 200 ఎకరాల్లో మిర్చి, వీఆర్‌పురం మండలంలో పొగాకు నారుమళ్లు కూడా నీటమునిగినట్టు గుర్తించారు.
● సెప్టెంబరు మూడో తేదీన వరద వచ్చి తగ్గడంతో ఇకపై వరద రాదని భావించిన నాలుగు మండలాల రైతులు వరి, పత్తి, మిరప పంటను వేశారు. చాలామంది రైతులు ఈ ఏడాది 1001, 1010, సాంబమసూరి వరి వంగడాలతో నారుమళ్లు చేపట్టారు. సెప్టెంబరు చివరికి వచ్చేసింది ఇక వరదలు రావని, మరోవైపు అదును కూడా దాటిపోతోందనే ఉద్దేశంతో చివరకు గత 20 రోజులుగా పంటలు వేశారు. ఈ తరుణంలో మహారాష్ట్ర, తెలంగాణలో కురిసిన భారీవర్షాలకు గోదావరికి భారీగా వరద రావడంతో ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో, శబరినది ఎగపోటు గురైంది. చింతూరు మండలంలో పంటలు నీటమునిగాయి. వరదవచ్చి ఆరు రోజులపాటు పొలాల్లోనే ఉండిపోవడంతో పంటంతా కుళ్లిపోయి, పెట్టుబడంతా వరద పాలైందని రైతులు వాపోతున్నారు. మిరప, పత్తి సాగుకు ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రతి ఒక్కరు రెండెకరాల నుంచి పదెకరాల వరకు పంట వేసినట్లు రైతులు తెలిపారు. కాగా వరిపంటలకు సైతం ఇప్పటివరకు ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు.
● చింతూరు డివిజన్లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం అనుమానంగానే కనిపిస్తోంది. సాగు చేపట్టి 15 నుంచి 20 రోజులు మాత్రమే కావస్తోంది. పంటలకు నష్టపరిహారం ఇవ్వాలంటే కనీసం 30 నుంచి 45 రోజులు పంటకాలం ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుత వరదలకు చిన్న, సన్నకారు, గిరిజన రైతులే అధికంగా నష్టపోయారు.
ఈ ఏడాది గోదావరి, శబరికి
ఎనిమిది సార్లు వరదలు
పంటలను ముంచెత్తడంతో
కోలుకోలేని దెబ్బ
ముంపులో 2 వేల ఎకరాల వరి పైరు
పెట్టుబడులు కోల్పోయిన పత్తి, పొగాకు, మిర్చి రైతులు
ప్రభుత్వం నష్టపరిహారం అందించి
ఆదుకోవాలని వినతి
పునరావాస ప్రాంతంలోభూమి ఇవ్వాలి
రూ. వేలల్లో పెట్టుబడి పెట్టి పంటలు వేసినా వరదల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. మాకు పోలవరం పునరావాస ప్రాంతంలో ప్రభుత్వం సాగు భూమి కేటాయించాలి. అక్కడికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటాం.
– మడివి బాలరాజు,
చింతరేగుపల్లి, వీఆర్‌పురం మండలం
పదెకరాలు మునిగిపోయింది
ఎన్నో ఆశలతో ఈ ఏడాది పదెకరాల్లో మిరప పంట వేశా. ఇప్పటికే దుక్కులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాను. వరదవచ్చి పంటంతా ముంచేసింది. కుళ్లిపోయి లక్షల్లో నష్టం వాటిల్లింది.
– చల్లకోటి రాంబాబు, మిర్చి రైతు,
మురుమూరు, ఎటపాక మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి. దీంతోపాటు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా రాయితీపై రుణాలు అందించాలి.
– ధర్ముల రాజయ్య,
ఏజీకొడేరు, చింతూరు మండలం
వ్యవసాయం చేయలేని పరిస్థితి
ఏటా సంభవిస్తున్న వస్తున్న వరదల కారణంగా వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. బ్యాక్‌వాటర్ ప్రభావంతో చిన్నపాటి వర్షాలకే మాకు వరద పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటలను ముంచేస్తోంది.
– సోడె రామారావు,
గుండగూడెం, వీఆర్‌పురం మండలం
వేద్దామంటే నారు లేదు
ఇకపై వరద రాదనుకుని ఏడెకరాల్లో మిరప సాగు చేపట్టా. అనుకోకుండా వరదవచ్చి పంటను ముంచేసింది. పంటంతా కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. తిరిగి పంట వేద్దామంటే నారు దొరకని పరిస్థితి నెలకొంది.
– చిలకాల రమేష్,
నందిగామ, ఎటపాక మండలం
ప్రాథమిక నివేదిక సిద్ధం
వరదల కారణంగా పంటనష్టం వివరాలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. చింతూరులో 299, కూనవరంలో 269, ఎటపాకలో 52 హెక్టార్లలో వరి, 12 హెక్టార్లలో పత్తిపంటలు దెబ్బతిన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదించి, తదుపరి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం.
– రామ్మోహనరావు,
ఏడీఏ, రంపచోడవరం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం

అంతులేని కష్టం.. అపార నష్టం