
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
మహబూబాబాద్/కురవి/తొర్రూరు/నెహ్రూసెంటర్: జిల్లాలో బతుకమ్మ వేడుకలు కొనసాగుతున్నాయి. ఐదురోజు గురువారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ, విద్యుత్‌శాఖ, మెప్మా ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా అధికారులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆట ఆడారు. అలాగే తొర్రూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మలు పేర్చిన సిబ్బందికి డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, డీసీహెచ్‌ఎస్ చింత రమేశ్, ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్ సుగుణాకర్‌రాజు బహుమతులు అందించారు. కురవి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, బీఆర్‌ఎస్ నాయకురాలు హరిత పాల్గొన్నారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..