
వేగాన్ని తగ్గించి వాహనం నడపాలి
వేగాన్ని తగ్గించి వాహనం నడపడం అందరి క్షేమదాయకం. ప్రమాదం జరిగిన క్షణాలు అమూల్యమైనవి. క్షతగాత్రుడి తక్షణమే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలను నిలిపే అవకాశం ఉంది. ఎప్పుడైన వాహనాలను కండీషన్‌లో ఉంచుకోవాలి. టైర్లలో గాలిని సరైన పరిమాణంలో నింపుకోవాలి. గుంతలు, స్పీడ్ బ్రేకర్లను గమనిస్తూ గంటలకు 40 కిలోమీటర్ల వేగానికి మించి స్పీడ్‌గా వెళ్లకపోవడం మంచిది. నడుం వెన్నునొప్పితో బాధపడేవారు బెల్ట్‌పెట్టుకోవాలి.
– బందెలశెట్టి మోహన్‌రావు,
ఎంజీఎం రిటైర్డ్ ఆర్‌ఎంఓ, వరంగల్
నిబంధనలు పాటించాలి
వాహనదారులు ఆర్టీఏ నిబంధనలు పాటించాలి. వేగాన్ని తగ్గించి ద్విచక్రవాహనాన్ని సక్రమంగా నడపాలి. నిర్లక్ష్యంగా నడిపితే శరీర భాగాలపై ప్రభావం పడుతుంది. రోడ్డు ప్రమాదాలకు గురికావడంతోపాటు వివిధ రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. వాహనం నడపడంలో యువత, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే గమ్యానికి క్షేమంగా చేరుకోవచ్చు.
– జి.సురేశ్‌రెడ్డి, డీటీసీ,
హనుమకొండ, వరంగల్
●

వేగాన్ని తగ్గించి వాహనం నడపాలి