కాంగ్రెస్‌ బకాయి కార్డు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ బకాయి కార్డు ఉద్యమం

Sep 29 2025 9:45 AM | Updated on Sep 29 2025 9:45 AM

కాంగ్

కాంగ్రెస్‌ బకాయి కార్డు ఉద్యమం

కాంగ్రెస్‌ బకాయి కార్డు ఉద్యమం

● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్‌ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్‌ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు మనోహర్‌, శ్రీకాంత్‌భీమ, నర్సింహగౌడ్‌, రమేష్‌రావు పాల్గొన్నారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య క్రమంలో విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 8 మెడికల్‌ కళాశాలలు, 74 ట్రామా, 102 డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని.., క్యాన్సర్‌ నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కోసం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 65 సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర యువతకు నైపుణ్యమైన విద్యనందించి ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో ఏటీసీ సెంటర్‌కు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంపై మమకారంతో అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.

● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కొండారెడ్డిపల్లిలో రూ.2.50 కోట్లతో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడం వల్ల రోజుకు 30వేల లీటర్ల పాలను నిల్వ చేయవచ్చని తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని ఆలయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వ్యవసాయ కమిషన్‌ సభ్యులు కేవీఎన్‌ రెడ్డి, బాలాజీసింగ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్‌ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్‌ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్‌ చెల్లించకుండా రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్‌– బీజేపీ జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్‌రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్‌ సర్కార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో

యువతకు ఉద్యోగావకాశాలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే

క్యాన్సర్‌ నివారణకు ప్రత్యేక చర్యలు

ప్రతి జిల్లాకు పాలశీతలీకరణ

కేంద్రాలు మంజూరు

రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి వెల్లడి

కాంగ్రెస్‌ బకాయి కార్డు ఉద్యమం 1
1/1

కాంగ్రెస్‌ బకాయి కార్డు ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement