బతుకమ్మ సంబురం | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ సంబురం

Oct 1 2025 11:31 AM | Updated on Oct 1 2025 11:31 AM

బతుకమ్మ సంబురం

బతుకమ్మ సంబురం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కలెక్టరేట్‌ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో పాటు జిల్లా యంత్రాంగం రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒకచోట చేర్చి గౌరీమాతను స్తుతిస్తూ ప్రదక్షిణలు చేస్తూ మహిళలు ఆలపించిన పాటలు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. అధికారులు, సిబ్బంది తేడా లేకుండా మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని వేడుకకు వన్నెలద్దారు. గౌరీమాతకు కలెక్టర్‌ ప్రత్యేక పూజలు చేశారు. దాండియా, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో సందడి వాతావరణం కనిపించింది. వేడుకలను విజయవంతం చేసిన మహిళలకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

– నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement