
పింఛన్ పంపిణీలో అవకతవకలు.. వీఏఏ సస్పెన్షన్
క్రోసూరు: మండలంలోని దొడ్లేరు గ్రామంలోని సచివాలయం –1 విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ (వీఏఏ) ఎస్.మనోజ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్ శనివారం తెలిపారు. పింఛన్ నగదులో అవకతవకలకు పాల్పడినందుకు, రైతులకు యూరియా ఇస్తానని నగదు వసూలు చేసిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు సస్పెండ్ చేసినట్లు ఏవో వివరించారు. ఇది ఇలా ఉండగా రాత్రికి రాత్రి లబ్ధిదారులకు చెల్లించాల్సిన పింఛన్‌ను ఎంపీడీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవో జి.శ్రీనివాసరావులు దొడ్లేరు గ్రామానికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీవో స్వయంగా తెలిపారు. వీఏఏ గ్రామంలో మొత్తం 58 మందికిగాను 20 మందికి రూ.82,000 బకాయి పడినట్లు తెలిసింది. దానిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీవో సర్దుబాటు చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో రాత్రికి రాత్రే
ఎంపీడీవో పింఛను పంపిణీ