జాతీయ పోటీలకు రోషన్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలకు రోషన్‌ ఎంపిక

Oct 6 2025 2:20 AM | Updated on Oct 6 2025 9:23 AM

జాతీయ

జాతీయ పోటీలకు రోషన్‌ ఎంపిక

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఒరిస్సాలోని భువనేశ్వర్‌ లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 41 జాతీయ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియానికి చెందిన ఎస్‌కే రోషన్‌ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటాడని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జి.వి.ఎస్‌. ప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రోషన్‌ 110 మీటర్ల హర్డిల్స్‌ ఈవెంట్లో బంగారు పతకాలు సాధించి ఉత్తమ క్రీడాకారుడు అవార్డును కూడా గెలుపొందాడని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోషన్‌ను ఏపీ రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారని తెలిపారు. రోషన్‌కి సహాయ, సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రసాద్‌ తెలియజేశారు.

ప్రజల భాగస్వామ్యంతోనే ఉత్తమ సేవలు

డీఆర్‌ఎం సుథేష్ట సేన్‌

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): విక్షిత్‌ భారత్‌– 2047 భాగంగా సమష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, భారత ప్రభుత్వ వివిధ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయాణికులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్‌ఎం సుథేష్ట సేన్‌ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం అమృత్‌ సంవాద్‌ కార్యక్రమంలో భాగంగా విక్షిత్‌ భారత్‌– 2047 కార్యక్రమంలో ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం సామాజిక, ఆర్థికవృద్ధిని సాధించడంలో భారతీయ రైల్వేల పాత్ర గురించి తెలిపారు. పరిశుభ్ర త, భద్రత, సమర్థ సేవలను అందించడంలో ప్రజల భాగస్వామ్యం, ప్రాము ఖ్యత గురించి వివరించారు. ప్రయాణికులకుసంతృప్తిని అందించడంతోపాటు జాతీయ అభివృద్ధికి దోహదపడటం కోసం రైల్వే సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆమె సూచించారు. అనంతరం ప్రయాణికులతో సంభాషించి వారి సూ చనలు, సలహాలను తీసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ డీఓఎం జె.శ్రీనాథ్‌, సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌కుమార్‌, డీసీఎం కమలాకర్‌, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ పోటీలకు రోషన్‌ ఎంపిక  1
1/1

జాతీయ పోటీలకు రోషన్‌ ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement