
మద్యానికి డబ్బులు లేవన్నందుకు దాడి
వ్యక్తికి గాయాలు
సత్తెనపల్లి: వుద్యానికి డబ్బులు లేవన్నందుకు బావ తలను బావమరిది పగలగొట్టిన సంఘటన పట్టణంలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాప్ వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న పెదాల నరసింహారావు మద్యం తాగేందుకు రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వైన్ షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ మద్యం తాగుతుండగా.. కొద్దిసేపటికి వరుసకు బావమరిది అయ్యే చెరుకూరి మణి వచ్చి మద్యం ఇప్పించమని అడిగాడు. తన వద్ద క్వార్టర్‌కే నగదు ఉన్నాయని, అయినా తాగే ఉన్నావుగా.. ఇంకెందుకంటూ దూషించి, మందలించాడు. మద్యం ఇప్పించకపోగా తననే దూషిస్తావా అంటూ మణి మద్యం సీసా తీసుకొని నరసింహారావు తలపై కొట్టాడు. దీంతో నరసింహారావు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పట్టణ ఎస్‌ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెహ్రూనగర్: బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభ ఈనెల 19న గుంటూరులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు జి.శివ పూర్ణయ్య తెలిపారు. ఆదివారం గుంటూరు తాలుకా పెన్షనర్స్ హోంలో మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎంప్లాయీస్ సమస్యలు, ఉద్యోగులకు రిజర్వేషన్లు, ప్రమోషన్స్‌లో మెరిట్ కమ్ రోస్టర్ విధానం అమలుచేయడానికి తీసుకోవాల్సిన చర్యలు మీద చర్చించినట్లు తెలిపారు. ద్వితీయ మహాసభలో ప్రవేశపెట్టే తీర్మానాలు, సమావేశం విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలోని బీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు.సమావేశంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం వి. ప్రసాద్, గౌరవాధ్యక్షులు పి.వి.రమణయ్య, గుంటూరు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె. శ్రీనివాసులు పాల్గొన్నారు.

మద్యానికి డబ్బులు లేవన్నందుకు దాడి