
నేడు స్వచ్ఛ పురస్కారాల ప్రదానం
బాపట్ల: స్వచ్ఛ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని కమ్మ కల్యాణ మండపంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందిస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను అక్టోబర్ 2న ప్రభుత్వం ప్రకటించినట్లు గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఒక అవార్డు వచ్చిందన్నారు. జిల్లా స్థాయిలో పలు విభాగాలలో 49 అవార్డులు వచ్చినట్లు వివరించారు. జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉంటుందని తెలిపారు.