
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక
చీరాల రూరల్/వేటపాలెం: జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (పౌరహక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అత్యాచార నివారణ చట్టం) సభ్యులుగా చీరాలకు చెందిన మేలుకొలుపు వినియోగదారుల రక్షణ సంస్థ కార్యదర్శి దాసరి ఇమ్మానుయేలు, హెచ్‌ఐవీ బాధితుల క్షేమం కోసం షాడో సంస్థ ద్వారా సేవలందిస్తున్న న్యాయవాది ఆల్ఫ్రెడ్ రాజా సాల్మన్ ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ వి. వినోద్‌కుమార్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్ నుంచి నియామక పత్రాలు అందుకున్నట్లు వారు తెలిపారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై దళిత, గిరిజనుల అట్రాసిటీ కేసుల పరిష్కారం గురించి, పౌర హక్కుల రక్షణపైనా చర్చిస్తుందని చెప్పారు.
రావూరిపేటకు చెందిన కొమరిగిరి వెంకట ప్రసాద్‌ను కూడా సభ్యునిగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. కొమరిగిరి వెంకట ప్రసాద్‌ను ఆదివారం యానాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏందేటి వెంకట సుబ్బయ్య, జిల్లా కమిటీ అధ్యక్షులు చౌటూరి రమేష్, ప్రధాన కార్యదర్శి గందళ్ల నరేష్ తదితరులు అభినందించారు.

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపిక