
రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ స్థాయి సమావేశం
నరసరావుపేట: పట్టణంలోని ఏ1 ఫంక్షన్‌హాలులో 7వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్సార్‌సీపీ నాయకులతో పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి హాజరవుతారన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

రేపు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ స్థాయి సమావేశం