ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Published Mon, May 6 2024 10:25 AM

ప్రశా

రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, జిల్లా ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌, ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. ఆదివారం రాయచోటి డైట్‌ కళాశాల, పీలేరు జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటింగ్‌ సరళిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పీలేరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిమిత్తం చేసిన ఏర్పాట్లు, పోలింగ్‌ ప్రక్రియ జరుగుతున్న తీరును కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారికి వివరించారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్‌ సిబ్బంది, అత్యవసర సేవలు అందించేవారు ఈనెల 6వ తేదీ సోమవారం నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

● జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14,388 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో 10,230 మంది ఓటును వినియోగించుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 71.10 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 3188 మందికి గాను 1445 మంది మాత్రమే ఓటు వేయడంతో 45.33 శాతంగా నమోదైంది. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రాయచోటిలో ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్‌ 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొంత మంది ఓట్లు కనిపించలేదని కలవర పడినా తర్వాత ప్రశాంతంగా పోలింగ్‌ నడిచింది.

నియోజకవర్గం మొత్తం ఓటు పోలింగ్‌

ఓటర్లు వేసినవారు శాతం

14389 మందికి 10230 మంది ఓటుహక్కు వినియోగం

జిల్లాలో 71.10 శాతం పోలింగ్‌

పోలింగ్‌ సరళిని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌

రాజంపేట 547 1386 89.59

రైల్వేకోడూరు 1114 899 80.70

రాయచోటి 2250 1894 84.18

తంబళ్లపల్లె 1504 998 66.36

పీలేరు 2434 1702 69.93

మదనపల్లి 2352 1906 81.04

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌
1/1

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Advertisement
Advertisement