యూకే పార్లమెంట్‌ బరిలో తెలుగు బిడ్డ | Uday Nagaraju From Telangana Picked As Uk Labour Party Parliamentary Candidate | Sakshi
Sakshi News home page

యూకే పార్లమెంట్‌ బరిలో తెలుగు బిడ్డ

Published Thu, May 16 2024 7:46 AM | Last Updated on Thu, May 16 2024 7:47 AM

Uday Nagaraju From Telangana Picked As Uk Labour Party Parliamentary Candidate

లేబర్‌ పార్టీ అభ్యర్థిగా ఉదయ్‌ నాగరాజు 

సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌ నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ లేబర్‌ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్‌ జన్మించారు.

 తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్‌ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్‌ అనే థింక్‌ ట్యాంక్‌ని నెలకొల్పారు. 

మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్‌ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement