1,165 హోం, పోస్టల్‌ ఓట్లు పోల్‌ | Sakshi
Sakshi News home page

1,165 హోం, పోస్టల్‌ ఓట్లు పోల్‌

Published Mon, May 6 2024 8:10 AM

1,165

జనగామ: జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో వరంగల్‌, భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధి లో 1,165 పోస్టల్‌, హోం ఓటింగ్‌ ద్వారా ఓట్లు పో లైనట్లు కలెక్టరేట్‌ ఏఓ రవీందర్‌ తెలిపారు. ఆదివా రం ఆయన మాట్లాడుతూ పోస్టల్‌ ఓట్లు 595, హోం ఓటింగ్‌ (85 ప్లస్‌, దివ్యాంగులు) ద్వారా 846 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్‌, హోం ఓటింగ్‌ ప్రక్రియ జరుగనుంది. ఇతర జిల్లాకు చెందిన పోస్టల్‌ ఓట్లు పోలవగా వాటిని ఆయా జిల్లాలకు పంపిస్తామని రవీందర్‌ తెలిపారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీఓ

స్టేషన్‌ఘన్‌పూర్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు అర్జున్‌, రవీందర్‌ తదితరులు డివిజన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల విధులు పడిన స్థానికేతర ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోవాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందన్నారు.

1,165 హోం, పోస్టల్‌ ఓట్లు పోల్‌
1/2

1,165 హోం, పోస్టల్‌ ఓట్లు పోల్‌

1,165 హోం, పోస్టల్‌ ఓట్లు పోల్‌
2/2

1,165 హోం, పోస్టల్‌ ఓట్లు పోల్‌

Advertisement
 
Advertisement