పండ్లు అమ్ముతూ ఎమ్మెల్యేల ప్రచారం | Sakshi
Sakshi News home page

పండ్లు అమ్ముతూ ఎమ్మెల్యేల ప్రచారం

Published Mon, May 6 2024 7:15 AM

పండ్ల

బెల్లంపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఆదివారం బెల్లంపల్లి, చెన్నూర్‌ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్‌, వివేక్‌ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంటా చౌరస్తా వద్ద పండ్ల వ్యాపారి వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ద్రాక్ష పండ్లను తూకం వేసి అమ్ముతూ ప్రచారం నిర్వహించారు. తోపుడు బండ్ల వద్దకు వెళ్లి పండ్లను విక్రయిస్తూ ప్రచారం చేశారు.

ఓటు కోసం వాగు దాటి..

వేమనపల్లి: చామనపల్లి గ్రామ పంచాయతీ బద్దంపల్లి పోలింగ్‌ స్టేషన్‌ 204 పరిధిలోని చామన్‌పల్లిలో ఒకే ఒక్క దివ్యాంగురాలు లచ్చక్క ఓటు వేయాల్సి ఉంది. ఆమె చేత ఓటు వేయించేందుకు పీవో వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం బద్దంపల్లి పోలింగ్‌స్టేషన్‌కు వెళ్లారు. చామనపల్లికి వెళ్లేందుకు మార్గమధ్యలో పెద్దవాగు ఉండడంతో టాటా ఏసీ వాహనం వాగులో దాటలేని పరిస్థితి. పంచాయతీ కార్యదర్శి ట్రాక్టర్‌ ఏర్పాటు చేయగా దానికి తాడుకట్టి టాటాఏసీని ఇసుకలోంచి లాక్కుంటూ అవతలి వైపునకు దాటించారు. ఆతర్వాత ఎన్నికల వాహనంలో చామనపల్లికి వెళ్లి దివ్యాంగురాలితో ఓటు వేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కుమారస్వామి, ఓపీఓ మొగిళి, ఎంఓ ప్రశాంత్‌, కిరణ్‌, ఏఎస్సై మజీరోద్దీన్‌, వీడియోగ్రాఫర్‌ రమణ, బీఎల్‌ఓ మానపల్లి పద్మ పాల్గొన్నారు.

పండ్లు అమ్ముతూ  ఎమ్మెల్యేల ప్రచారం
1/2

పండ్లు అమ్ముతూ ఎమ్మెల్యేల ప్రచారం

పండ్లు అమ్ముతూ  ఎమ్మెల్యేల ప్రచారం
2/2

పండ్లు అమ్ముతూ ఎమ్మెల్యేల ప్రచారం

Advertisement
 
Advertisement