ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌

Published Mon, May 6 2024 10:25 AM

-

కడప సెవెన్‌రోడ్స్‌: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటరుగా నమోదై ఉన్న సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. కడప నగరంలోని గాంధీనగర్‌ హైస్కూలులో పోలింగ్‌ సిబ్బందికి బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న ఉద్యోగులకు జయనగర్‌ కాలనీ జెడ్పీ బాలికల హైస్కూలులో ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఓటర్లు ఫెసిలిటేషన్‌ సెంటర్లకు వెళ్లేందుకు, ఓటు వినియోగం తర్వాత వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌ హైస్కూలులో 3222 మంది తమ ఓటును సజావుగా వినియోగించుకోవడం కోసం 12 ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement