Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu And Yellow Media1
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?

‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్‌ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్‌ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్య​​​ం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్‌ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్‌ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్‌, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్‌సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్‌ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్‌ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Kevin Pietersen Backs KL Rahul T20I Comeback For India To Bat At 42
ఆట అదుర్స్‌.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 364 పరుగులు సాధించాడు. 60.66 సగటుతో 146.18 స్ట్రైక్‌రేటుతో మూడు అర్ధ శతకాల సాయంతో రాహుల్‌ ఈ మేర పరుగులు రాబట్టాడు.ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మెంటార్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ (Kevin Pietersen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడని.. అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా ఐపీఎల్‌-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడింది.ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్‌ అయిన రాహుల్‌.. 39 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ కాస్త మెరుగ్గా ఆడి.. ఢిల్లీ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.బెంగళూరు జట్టు ఈ టార్గెట్‌ను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన పీటర్సన్‌.. రాహుల్‌ ఆట తీరు పట్ల మాత్రం సంతృప్తి వ్యక్తం చేశాడు.అతడే నా మొదటి ఎంపిక‘‘టీమిండియా తరఫున టీ20 క్రికెట్‌లో కేఎల్‌ రాహుల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి. భారత జట్టులో చాలా మంది ఓపెనింగ్‌ బ్యాటర్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌.. ఇలా ఎవరైనా టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయగలరు.అయితే, కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం ఆడుతున్న విధానం అమోఘం. నాలుగో స్థానంలో చక్కగా బ్యాటింగ్‌ చేయడం సహా.. వికెట్‌ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించగలడు. కాబట్టి టీమిండియా నంబర్‌ ఫోర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గా అతడే మొదటి ఎంపిక’’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు.గతేడాది కాలంగా కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నాడని.. ముఖ్యంగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అదరగొట్టాడని పీటర్సన్‌ ప్రశంసించాడు. వేర్వేరు ఫార్మాట్లలో రాణించగల సత్తా అతడికి ఉందని.. సానుకూల దృక్పథమే రాహుల్‌కు బలంగా మారిందని పేర్కొన్నాడు. ఆట పట్ల అంకితభావం, నెట్స్‌లో శ్రమించే తీరు.. జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే విధానం రాహుల్‌లో తనకు నచ్చాయని తెలిపాడు.చివరగా 2022లో టీమిండియా తరఫునకాగా 2016లో అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన కేఎల్‌ రాహుల్‌.. చివరగా 2022లో టీమిండియా తరఫున పొట్టి మ్యాచ్‌ ఆడాడు. టీ20 ప్రపంచకప్‌-2022 సందర్భంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్‌ సందర్భంగా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఇక ఆ తర్వాత మళ్లీ భారత టీ20 జట్టుకు రాహుల్‌ ఎంపిక కాలేదు. అయితే, టెస్టుల్లో, వన్డేల్లో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా టెస్టు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (వన్డే) గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గతేడాది వరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 14 కోట్లకు అతడిని కొనుగోలు చేయగా.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ పైసా వసూల్‌ ప్రదర్శన ఇస్తున్నాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్‌

Peddapalli Agriculture Market Incident Viral Details3
భార్య కళ్లెదుటే ప్రియుడ్ని?.. పట్టపగలే పెద్దపల్లిలో దారుణం

సాక్షి, క్రైమ్‌: పట్టపగలే.. అదీ అంతా చూస్తుండగానే పెద్దపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్‌లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన పొలం కుమార్ అనే యువకుడు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన రైలుకుల సంతోష్(సతీష్‌) అనే వ్యక్తి కుమార్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే.. ఆ మహిళ సంతోష్‌ భార్యగా నిర్ధారణ అయ్యింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని.. అందుకే భార్య కళ్ల ముందే ప్రియుడ్ని హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. అయితే కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. హత్యకు గల పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది.

IPL 2025 Captains And Their Most Expensive Cars4
ఐపీఎల్ 2025 కెప్టెన్స్ ఖరీదైన కార్లు.. ఇవే

ఐపీఎల్ 2025 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సమయంలో కేవలం క్రికెట్ ఆటగాళ్లు, టీమ్ ఓనర్స్ గురించి మాత్రమే కాకుండా.. కెప్టెన్స్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారనే విషయాలను తెలుసుకోవడానికి కూడా కొందరు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో 2025 ఐపీఎల్ కెప్టెన్లు ఉపయోగించే ఖరీదైన కార్లు ఏవో చూసేద్దాం..➤హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్): రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9.50 కోట్లు)➤శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్): లంబోర్గిని హురాకాన్ ఈవీఓ స్పైడర్ (రూ. 3.73 కోట్లు)➤పాట్ కమ్మిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): ఫెరారీ 488 జీటీబీ (రూ. 3.68 కోట్లు)➤మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్): ఫెరారీ 599 జీటీఓ (రూ. 3.57 కోట్లు)➤అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్): మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 (రూ. 2.96 కోట్లు)➤రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్): ఆడి ఏ8 (రూ. 1.3 కోట్లు)➤సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్) రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 1.6 కోట్లు)➤అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్): మెర్సిడెస్ సీ క్లాస్ (రూ. 1 కోటి)➤శుభ్‌మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): మెర్సిడెస్ బెంజ్ ఈ350 (రూ. 75 లక్షల నుంచి రూ. 90 లక్షలు)➤రజత్ పాటిదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు): హ్యుందాయ్ ఐ20 (రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు)ఐపీఎల్ 2025 టీమ్ కెప్టెన్లలో ఖరీదైన కారును కలిగి ఉన్న వ్యక్తి 'హార్దిక్ పాండ్యా' అని స్పష్టమవుతోంది. ఈయన వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 9.50 కోట్లు. ఆ తరువాత జాబితాలో శ్రేయాస్ అయ్యర్, పాట్ కమ్మిన్స్, ఎంఎస్ ధోని మొదలైనవారు ఉన్నారు. ధోని గ్యారేజిలో లెక్కకు మించిన కార్లు, బైకులు ఉన్నాయి. వీటిలో ఖరీదైన కారు ఫెరారీ 599 జీటీఓ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక

Minister Komatireddy Venkat Reddy On BRS Sabha5
‘కేసీఆర్‌.. మేం అనుకుంటే మీ కంటే డబుల్ మీటింగ్ పెడతాం’

నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి. నల్లగొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అంటున్నాడు. సోనియా గాంధీ కాలు మొక్కాడు కేసీఆర్. కేసీఆర్ నీది నోరా.. మోరీనా?, తెలంగాణను మొత్తం దోచుకుతిన్నారు. దళితుడిని సీఎం చేస్తానని , మూడెకరాలు ఇస్తానని మోసం చేయలేదా ?, కేసీఆర్.. మేం అనుకుంటే నల్గగొండలో నీకంటే డబుల్ మీటింగ్ పెడతాం. ధరణితో ఏం మోసాలు చేశారో అన్నీ బయటపడతాయి’ అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.తెలంగాణ.. బీఆర్‌ఎస్‌ సొంతం కాదుఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ సొంతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. ‘వందల కోట్ల అవినీతి సొమ్ముతో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి సీఎం స్థాయి నాయకులు. ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు. నిన్ను ఫాంహౌస్ కు ఎందుకు పరిమితం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. దమ్ముంటే రా.మీరు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఎలా దోచుకున్నారో లెక్కలు చెప్తున్నాం. వెయ్యి జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పదేళ్లలో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలో రైతులకు మేలు జరగలేదు. బీఆర్ఎస్ ఆగం చేసిన తెలంగాణను కాంగ్రెస్ గాడిలో పెడుతోంది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మంచి జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కాదు. తెలంగాణ కోసం కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు. నిన్నా మొన్న రాజకీయాల్లోకి వచ్చినోళ్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.

PM Modi Meeting With Rajnath Singh About Security Preparedness6
మోదీతో రాజ్‌నాథ్‌ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!

సాక్షి, ఢిల్లీ: పహల్గాం దాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక.. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌ కూడా పాల్గొన్నారు. మరోవైపు.. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ కూడా సోమవారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్‌ జాతీయులను వారి దేశానికి పంపించింది.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/lCINxlD82x— ANI (@ANI) April 28, 2025మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే పాక్‌.. కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఆన్‌లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి, తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్‌లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమవైపు ఆకర్షిస్తోందని చెప్పాయి.కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీర్‌ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్‌కు ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఉగ్రసంస్థల్లో చేరి, సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారు. అనంతరం జమ్ముకశ్మీర్‌లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడినవారిలో 15 మంది ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన తొమ్మిది మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్‌లో ఉండి, మరికొందరు కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు.పాక్‌కు సైనిక విమానాలు..పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్‌ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టర్కీకి చెందిన పలు సీ-130 హెర్క్యులస్‌ విమానాలు పాక్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్‌ కూడా అలర్ట్‌ అయ్యింది.

Actress Sreeleela Adopted Another Kid7
మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?

శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14)

Pakistanis Leaving India After Pahalgam Punished For Someone Else sin8
అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్‌లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్‌లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్‌ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!

Case Against Singer Neha Singh Rathore over pahalgam incident9
పహల్గాం ఉగ్రదాడిపై అనుచిత వ్యాఖ్యలు.. ప్రముఖ ఫోక్‌ సింగర్‌పై పదుల సంఖ్యలో కేసులు

లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై రెచ్చగొట్టేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన ఫోక్‌ సింగర్‌పై కేసు నమోదైంది. ఆమెపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.లక్నో పోలీసుల వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన ఫోక్‌ సింగర్‌ నేహా సింగ్ రాథోడ్ ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అందులో జాతీయ సమగ్రతపై ప్రతీకూలం ప్రభావం చూపేలా అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు. మతం ఆధారంగా సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ట్వీట్‌ చేసిందంటూ అభయ్ ప్రతాప్ సింగ్ లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేహాసింగ్‌ రాథోడ్‌ చేసిన ట్వీట్లను పరిశీలించారు. ఆ ట్వీట్ల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రోత్సహించడం, ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు ప్రమాదం కలిగించారనే సెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు ఆమెపై సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.In UP's Lucknow, FIR registered against folks singer Neha Singh Rathore (@nehafolksinger) for her alleged inflammatory tweet post the Pahalgam terror attack. Multiple sections of BNS and IT Act slapped in the FIR registered based on the complaint of Abhay Kumar Singh at… pic.twitter.com/CfHsHkQ1pS— Piyush Rai (@Benarasiyaa) April 28, 2025 కాగా, పహల్గామ్‌ విషాదంపై కేంద్రం సోషల్‌ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం దాడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లపై కేసులు నమోదు చేసింది. తాజాగా, ఫోక్‌ సింగర్‌ నేహా సింగ్ రాథోడ్‌పై చర్యలకు సిద్దమైంది.

Indian Govt Banned Pakistan YouTube Channels10
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.. వాటిపై నిషేధం

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్‌ యూట్యూబ్‌ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్‌ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్‌ ట్విట్టర్‌, సినిమాలపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement