అగ్రీగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్: అగ్రీగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అగ్రీగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి గతంలో హైకోర్టు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కమిటీ నిర్ణయించిన కమీషన్ మేరకు ఆస్తులను వేలం వేయడం కుదరదని, 0.5 శాతం కమీషన్ చెల్లించాలని సీ-1 ఏజన్సీ కోర్టుకు తెలిపింది. అయితే అగ్రీగోల్డ్ సొమ్ము మొత్తం పేదలకు సంబంధించింది కావున మానవతా దృక్పధంతో ఆలోచించాలని హై కోర్టు అభిప్రాయపడింది. కమిటీ నిర్ణయించిన కమీషన్ మేరకు ఆస్తుల వేలానికి ఎమ్ఎస్టీసీ ముందుకు రావడంతో.. సోమవారం కోర్టుకు హాజరుకావాలని ఎమ్ఎస్టీసీ ప్రతినిధులను కోర్టు ఆదేశించింది.