ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 29న విడుదలయ్యే అవకాశముంది.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు ఈ నెల 29న విడుదలయ్యే అవకాశముంది. తొలి ఏడాది ఫలితాల్ని 25న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీ ఇంటర్ తొలి ఏడాది ఫలితాలను 24 లేదా 25 తేదీల్లో, ద్వితీయ సంవత్సర ఫలితాల్ని 28 లేదా 29 తేదీల్లో విడుదల షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన ఒకట్రెండు రోజుల తర్వాతే ఏపీ ఇంటర్‌ఫలితాల్ని విడుదలచేయాలని భావిస్తున్నారు. ఒక వేళ తెలంగాణ ఫలితాల తేదీల్లో మార్పులు జరిగితే వాటినిబట్టి ఇవీ మారతాయి. కాగా ప్రైవేటు వర్సిటీల బిల్లుపై ఈనెల 22న సీఎం వీసీలతో సమీక్షించనున్నారు.