
సాక్షి, విశాఖపట్నం: కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని.. మిగతా ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ జిల్లాలో లాక్ డౌన్ మినహాయింపులపై ఆయన అధ్యక్షతన జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
(ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత)
చిన్నషాపులు, దినసరి కూలీలు, కార్మికుల ఉపాధికి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తూనే కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా భవన, నిర్మాణ రంగ కార్మికులకి.. ఇతర కార్మికులకి పనులు కల్పించేలా నిర్ణయించారు. వారికి అవసరమైన కార్యకలాపాలు, పనులు నిర్వహించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు లాక్ డౌన్ సడలింపులు, మినహాయింపులపైనా సమావేశంలో చర్చించారు.
(ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు..)