రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ప్రారంభించిన సమ్మెను విరమించాలని సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు.
రేపటి నుంచి విధుల్లోకి ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ప్రారంభించిన సమ్మెను విరమించాలని సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బుధవారం అర్ధరాత్రి సమ్మె విరమించి గురువారం నుంచి ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.