Seemandhra Employees
-
‘సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతాం’
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థకు మరోమారు అన్యాయం జరగకుండా మా ఉద్యోగాలు మేము కాపాడుకుంటామని, ఇక్కడినుంచి రిలీవ్ అయినా ఇక్కడే ఉండేందుకు చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల కుట్రలను తిప్పికొడతామని టీఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ తెలిపింది. శుక్రవారం మింట్ కంపౌండ్‌లోని టీఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కార్యాలయంలో సామూహిక నిరాహారదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల కుట్రలు తెలంగాణ విద్యుత్ సంస్థ పురోగతికి అడ్డంగా మారుతున్నాయన్నారు. ఏపీకి వెళ్తామని ధర్నాలు చేస్తూనే మరోవైపు ఏపీ మేనేజ్మెంట్తో కలసి మాపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులను ఏపీకి పంపేందుకు చేస్తున్న ఈ పోరా టంలో తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీడీసీఎల్ సీఎండీకి, ఎస్పీడీసీఎల్ హెచ్ఆర్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
మరో ఉద్యమం చేపడుతాం..
హన్మకొండ : సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పరిధి కన్వీనర్ బి.సామ్యానాయక్ హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దని, వారిని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి పంపాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో సామ్యానాయక్ మాట్లాడుతూ సీమాధ్ర ఉద్యోగులు ఇక్కడ విధుల్లో చేరితే ఎలా అడ్డుకోవాలో తెలుసునన్నారు. ధర్నాలో ఎన్పీడీసీఎల్ సీఈలు సదర్లాల్, వేణుగోపాలచారి, మోహన్‌రావు, రామకృష్ణ, అశోక్‌కుమార్, ఎస్ఈలు మధుసూదన్, రాజేష్‌చౌహాన్, నారాయణ, ఇంజనీర్ల జేఏసీ నా యకులు సుభ్రమణ్యేశ్వర్‌రావు, తిరుమల్‌రావు, మల్లయ్య, రణధీర్‌రెడ్డి, బి. కిశోర్, సురేష్, ప్రభావతి, జమున, రాంబాబు, కిరణ్ పాల్గొన్నారు. -
ఇక ప్రగతి పథమే
- ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా వెనక్కి పోనివ్వం - సీమాంధ్ర ఉద్యోగులు బుద్ధి మార్చు కోవాలి - డీఆర్సీ ఇక రెండు రోజులు - వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు : ‘‘జిల్లాలో, రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి. ఇక మిగి లింది అభివృద్ధి ఒక్కటే. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన బెట్టి ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేద్దామని వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శని వారం కొత్తగా కొలువుదీరిన జడ్పీ పాలక వర్గం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చిన దఫేదార్ రాజును జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేసింది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. ఇందుకు సీఎంకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. స్వాతంత్య్రం రావడానికి గాంధీజీ ఎలాంటి శాంతి ఉద్యమం చేశారో కేసీఆర్ కూడా అలాంటి ఉద్యమమే చేసి తెలంగాణను సాధించారన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా వెనక్కిపోనివ్వమన్నారు. జడ్పీ పాలకవర్గం ప్రజా సమస్యలపై జిల్లా అభివృద్ధిపై సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించకుండా పూర్తి కోరంతో హాజరు కావాలని సూచించారు. డీఆర్సీ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం కాకుండా సంక్షేమ రంగం ఒకరోజు, అభివృద్ధిపై ఒకరోజు మొత్తం రెండు రోజులు సమీక్ష నిర్వహిస్తామని, ఇదే మాదిరిగా జడ్పీ సమావేశం కూడా నిర్వహిస్తామని సమావేశంలో తీర్మానం చేశారు. డీఆర్సీ సమావేశం ఈనెల 18,19 తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లాకు చెందిన సీమాంధ్ర ప్రిన్సిపాల్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రకటనలు ఇస్తూ భయపెడుతున్నాడని ఆయన బుద్ధిమార్చుకోకుంటే తామే మా ర్చుతామని హెచ్చరించారు. జిల్లాలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు ఇకనైన బుద్ధి మార్చుకోవాలన్నా రు. జిల్లాలో 13వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలి సిందని, ఇందులో ఒక్కపైసా కూడా దుబారాకావడానికి వీలులేదన్నారు. ఈ విషయంపై మండల అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు. మహిళలకు అవకాశం మహిళకు అవకా శం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వైస్ చైర్‌పర్సన్‌గా ధర్పల్లి జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డిని ఎన్నుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. మిగితా జడ్పీటీసీ సభ్యులు నిరాశకు లోనుకావద్దన్నారు. చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్ కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మినీ అసెంబ్లీలాగా జడ్పీ సర్వసమావేశంలో ప్రతి అంశం చర్చకు తీసుకురావాలన్నారు. వర్షాలు లేక రైతు ల్లో, ప్రజల్లో భయం, ఆందోళన నెలకొందని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దని వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన పరిశ్రమలను జిల్లా లో స్థాపించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజ ల కోసం పార్టీలకతీతం గా పనిచేసేందుకు ప్రజాప్రతినిధులందరు కలిసి రావాలని కోరా రు. అభివృద్ధిపై దృష్టిపెట్టండి స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై ప్రజాప్రతిని ధులు దృష్టిపెట్టాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. అభివృ ద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన పాలకవర్గం సమస్యలపై దృష్టిపెట్టాలన్నారు. జుక్కల్‌ను అభివృద్ధిలో ముందుంచాలి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం వెనుకబడి ఉందని ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అన్నారు. అందుకే అక్కడి నుంచి జడ్పీ చైర్మన్‌గా దఫేదార్రాజును ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కవితను అగ్గిపుల్లగా వర్ణించారు. నిజాంసాగర్ జిల్లాకు గుండెకాయ జుక్కల్ ప్రాంతం నుంచి జడ్పీ చైర్మన్‌గా రాజు ఎన్నిక కావడం చాల సం తోషంగా ఉందని ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్నారు. జిల్లాకు గుండెకాయ అయిన నిజాంసాగర్ ప్రాజెక్టును మరింత అధునీకరించాలన్నారు. జిల్లాలో అగ్నిగుండంలా ఉద్యమం నిజామాబాద్ జిల్లాలో ఉద్యమం రాజుకుంటే అగ్నిగుండంలా మారుతుందని కేసీఆర్ ఎప్పుడూ అంటుండేవారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆ ఉద్యమమే నేడు జడ్పీపై పార్టీ జెండా ఎగురవేసిందన్నారు. మాడల్ జిల్లాగా తీర్చిదిద్దుదాం రానున్న కాలంలో జిల్లాను మరింత అభివృద్ధి చేద్దామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. రెండు రోజులు నిర్వహిద్దాం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఇక ముందు రెండు రోజుల పాటు నిర్వహిద్దామని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో కులకషంగా ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరిద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను, 24 మంది జడ్పీటీసీలను టీఆర్ఎస్ నుంచి గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయవద్దని అన్నారు. కొత్త దనం రావాలి.... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తదనం ఉండాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం వాటి అమలుకు ప్రజాప్రతినిధులు , అధికారులపై బాధ్యత పెట్టిందన్నారు. గౌరవమైన జిల్లా పరిషత్ వేదిక ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. మొక్కుబడి సమావేశాలు వద్దు.. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించకూడదని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సభ్యులందరు పూర్తిగా హాజరై ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కరించాలన్నారు. జడ్పీకి ఇద్దరు యువసారథులు వచ్చారని వారి హయంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించలన్నారు. అభివృద్ధి జుక్కల్తోనే ప్రారంభం అవ్వాలి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ను ఎంపిక చేసుకొని ఇక్కడినుంచే అభివృద్ధి పనులు ప్రారంభించనుందని హన్మం త్ సింధే తెలిపారు. ఈ ఒక ప్రాంతంమే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్దికి కూడా కృషి చేస్తామని తెలిపారు. అందరి సహకారంతో అభివృద్ధికి పాటుపడుతాం జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, వైస్‌చైర్మన్ సుమనరెడ్డి అన్నారు. మంత్రి, ఎంపీలతో పాటు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా వెల్లడించారు. -
సర్వీస్ రికార్డులను దిద్దారు...
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక పక్క ఉద్యోగుల విభజన జరుగుతుండగా ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేని ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి సర్వీస్ రికార్డుల్లో జన్మస్థలం ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లుయిడ్తో దిద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సర్వీస్ రికార్డుల ప్రకారం వారి స్వసస్థలాలకు పంపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లడం ఇష్టం లేని ఎన్నెస్పీలోని సీమాంధ్ర ఉద్యోగులు కొందరు వారి సర్వీస్ రిజిస్టర్లో జన్మస్థలం అని ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లూయిడ్‌తో దిద్దారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడిని కలిసి వివరించినట్లు తెలిసింది. సీమాంధ్ర జిల్లాలకు చెందిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు ( లష్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు) గత అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదలాయింపుల్లో భాగంగా వర్క్ చార్జ్డ్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపాలనే నిబంధన ఉంది. కానీ కొందరు తమ సర్వీస్ రికార్డులో జన్మస్థలం దగ్గర సీమాంధ్ర జిల్లాల వివరాలు ఉంటే దాన్ని వైట్ ప్లూయిడ్‌తో దిద్ది దానిపై ఖమ్మం జిల్లాలో జన్మించినట్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగం మొత్తం కొంత మంది ఈ శాఖ ఉద్యోగుల ఆమోదంతోనే జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సుమారు 15 మంది వరకు ఇలా దిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్ఈ ఆరోపణలు వచ్చిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తెప్పించుకుని చూసి కొంత మందిని పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్ఈ అప్పలనాయుడిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇద్దరు, ముగ్గురికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం అసోసియేషన్ నాయకులు చెప్పారని, వారికి సంబంధించిన అన్ని రకాలు రికార్డులు తీసుకుని రావాలని చెప్పానన్నారు. ఆ రికార్డులను పరిశీలించి అసలు ఎలా ఉంటే అలాగే పంపుతామని అన్నారు. ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగుల బదలాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, చాలా వరకు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వాటిపై సమగ్రమైన పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. -
టీ. అసెంబ్లీలో సీమాంధ్ర సిబ్బంది వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణ శాసనసభకు కేటాయించిన సిబ్బందిలో సీమాంధ్ర ఉద్యోగులున్న విషయాన్ని ఆధారాలతోసహా శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు సమర్పించామన్నారు. మరికొంత సమయమిస్తే మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణ శాసనసభకు 185 మంది అధికారులు, 210 మంది నాలుగో తరగతి సిబ్బందిని కేటాయించగా, వారిలో 80 మందికిపైగా సీమాంధ్రులున్నారని చెప్పారు. -
లోకల్ లొల్లి
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర సచివాలయంలో రేగిన ‘స్థానికత చిచ్చు’ జిల్లాకు పాకింది. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేందుకు వీలులేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలో ఎంతమంది స్థానికేతర ఉద్యోగులున్నారన్న అంశంపై ఉద్యోగ సంఘాలు ఆరా తీస్తున్నాయి. జిల్లాలోని 68 ప్రభుత్వ శాఖలున్నాయి. విద్యా శాఖ మినహాయిస్తే మిగిలిన శాఖల్లో మొత్తం 36,818 మంది ఉద్యోగులు గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 స్థాయిల్లో పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 8 శాతం మంది స్థానికేతర ఉద్యోగులేనని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే గుర్తించాయి. టీఎన్జీవో జిల్లా విభాగం శాఖల వారీగా స్థానికేతర ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసింది. ఈ జాబితాలకు తుది మెరుగులు ఇచ్చే పనిలో ఉద్యోగ నేతలు నిమగ్నమై ఉన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాఖల వారీగా స్థానికేతర ఉద్యోగుల జాబితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈపరిణామాలు ఉద్యోగ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కలెక్టరేట్ భవన సముదాయంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 62 మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో జిల్లాస్థాయి అధికారులతో పాటు ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) స్థాయి వరకు పనిచేస్తున్న వారున్నారు. విద్య, వైద్య శాఖలపై ప్రత్యేక దృష్టి జిల్లా విద్యా, వైద్య శాఖల్లో పనిచేస్తున్న స్థానికేతర ఉద్యోగులపై ఉద్యోగ సంఘాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇతర శాఖలతో పోలిస్తే ఈ రెండు శాఖలో స్థానికేతర ఉద్యోగుల ప్రాతినిధ్యం అధిక సంఖ్యలో ఉన్నట్లు టీఎన్జీవోలు పేర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖలో 13,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 20 శాతానికి పైగా స్థానికేతరులున్నట్లు ఉద్యోగ సంఘాలు లెక్కలేశాయి. ఇక వైద్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఎంపీహెచ్డబ్ల్యూఓల్లో సైతం గణనీయ సంఖ్యలో నాన్ లోకల్స్ ఉన్నారని భావిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ సమయంలో 20 శాతం ఓపెన్ కేటగిరీ కోటాకు మించి స్థానికేతర అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల ప్రాంతీయతను గుర్తించేందుకు వారి ‘పుట్టు’ పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం జరిపిన ప్రాంతాల సమాచారాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కూపీ లాగుతున్నారు. రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, పోచారం ప్రాంతాల్లో నివాసముంటున్న ఉద్యోగుల్లో కొందరు నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించారని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. కొందరు ఉద్యోగులు దిక్కుమొక్కు లేని పాఠశాలల్లో చదివినట్లు నకిలీ బోనఫైడ్ పత్రాలు సృష్టించారని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఆ పాఠశాలలన్నీ బోగస్ అని నిర్ధారించడానికి .. జిల్లాలో గుర్తింపు కలిగిన పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని జిల్లా విద్యాశాఖకు ఉద్యోగ సంఘాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. హెచ్ఎంఆర్ డేటా ఆధారంగా ఉద్యోగుల స్థానికతను నిర్ధారించాలని టీఎన్జీవో నేతలు జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిసింది. -
'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
-
'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, తమకు అండగా నిలబడాలని చంద్రబాబును కలిసినట్టు ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్‌బాబు, మురళీకృష్ణ తెలిపాయి. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారని చెప్పారు. రాష్ట్రపతి జీవో ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి సీమాంధ్ర ఉద్యోగులకు బాబు న్యాయం చేస్తామన్నారని తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడటం మంచిది కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తెలంగాణ ఉద్యోగులు రాద్ధాంతం చేస్తున్న 193 మంది తెలంగాణలో పుట్టి పెరిగినవాళ్లేనని వెల్లడించారు. గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలన్నారు. -
ఉద్యోగుల ‘స్థానిక’ యుద్ధం!
- తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారని తెలంగాణ సంఘాల ఆరోపణ - నిరూపించాలని సీమాంధ్ర ఉద్యోగుల సవాల్ సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ అంశం తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల్లో 1,059 మందిని సీమాంధ్ర, 806 మందిని తెలంగాణ ఉద్యోగులుగా నిర్ధారిస్తూ మంగళవారం ప్రభుత్వం జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యోగులుగా పేర్కొంటున్న 806లో 181 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి తెలంగాణ స్థానికతను చూపించుకున్నారని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వివరాలను అధ్యక్షుడు నరేందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ప్రభుత్వానికి నివేదించింది.మరోవైపు... పలువురు ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సరికాదని, దాన్ని నిరూపించాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ సవాల్ చేశారు. సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే వాదనలో వాస్తవం లేదని వెల్లడవడంతో.. తప్పుడు ధ్రువపత్రాల వాదనను తెలంగాణ నేతలు తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కాగా... 12 మంది ఆంధ్రా ఉద్యోగులు తమను పొరపాటుగా తెలంగాణలో చూపించారని, ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు తమను ఆంధ్రా జాబితాలో సూచించారని జీఏడీ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలనకు 10 బృందాలు... ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో... ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను పరిశీలించి స్థానికతను నిర్ధారించడానికి ఇద్దరేసి సభ్యులున్న 10 బృందాలను సాధారణ పరిపాలన శాఖ ఏర్పాటుచేసింది. ఈ బృందాలు గురువారం నుంచి పనిచేయడం ప్రారంభించి.. రెండు రోజుల్లో నివేదికలు అందజేస్తాయి. వాటి ఆధారంగా స్థానికతలో జరిగిన పొరపాట్లను గుర్తించి సరిచేస్తారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల జాబితా వెల్లడి ఆర్థిక శాఖలో పనిచేస్తున్న 278 మంది స్థానికతను నిర్ధారిస్తూ జాబితాను ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. అందులో 114 మంది ఆంధ్రా, 164 మంది తెలంగాణ ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది. అయితే క్లాస్-3, 4 ఉద్యోగులను కూడా ఈ జాబితాలో చేర్చడంతో.. తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా క్లాస్-3, 4 కేటగిరీ ఉద్యోగుల్లో 95 శాతం మంది తెలంగాణ వారే ఉంటారు. పీఆర్, ఆర్డీ శాఖల్లో విభజన పూర్తి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(పీఆర్, ఆర్డీ) శాఖల్లో విభజన ప్రక్రియ పూర్తయింది. ఈ రెండు శాఖల్లో కార్యదర్శుల నుంచి దిగువస్థాయిలో ఉండే ఉద్యోగుల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సిబ్బంది సంఖ్యను ఖరారు చేశారు. దీనికి అపెక్స్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను విలీనం చేయాలని నిర్ణయించింది. పీఆర్, ఆర్డీ కమిషనరేట్లను విలీనం చేసి ‘పీఆర్ అండ్ ఆర్డీ’గా చేయాలని నిర్ణయించారు. ఇద్దరు కమిషనర్లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. సెర్ప్‌ను కూడా రెండుగా విభజించాలని నిర్ణయించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను ఇరు రాష్ట్రాలకు ఒక్కొక్కరిగా పంపిణీ చేస్తారు. ఈ రెండు శాఖలకు సంబంధించి మొత్తం 40 కేటగిరీల్లో 209 మంది ఉద్యోగులు ఉంటే.. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు 119 మందిని, తెలంగాణకు 90 మంది ఉద్యోగులను కేటాయించారు. -
సీమాంధ్ర ఉద్యోగుల రెండో సమ్మె కాలం క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 రోజుల పాటు చేసిన సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు రెండోసారి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఆర్జిత సెలవును సమ్మె కాలానికి సర్దుబాటు చేయనున్నారు. ఆర్జిత సెలవు లేని ఉద్యోగులకు భవిష్యత్‌లో సంపాదించనున్న ఆర్జిత సెలవును సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించారు. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఆర్జిత సెలవులు లేని పక్షంలో ఇతర సెలవును సర్దుబాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోధనేతర సిబ్బంది సమ్మెకాలం కూడా: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోధనేతర సిబ్బంది చేసిన సమ్మె కాలాన్ని కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. బోధనేతర సిబ్బంది 2013 ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 17 వరకు.. 66 రోజులు సమ్మె చేశారు. బోధన సిబ్బంది 2013 ఆగస్టు 22 నుంచి అక్టోబర్ 10 వరకు 49 రోజుల పాటు సమ్మెలో ఉన్నారు. బోధనేతర సిబ్బంది 17 రోజులు ఎక్కువ సమ్మెలో ఉన్నారు. ఆ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
'సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రలోనే పని చేయాలి'
దళిత సీఎం అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే.కేశవరావు (కేకే) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రయోజనాలను ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని సీఎం చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా తమ పార్టీ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులంతా ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేయాలని కేకే అభిప్రాయపడ్డారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే దళిత కులానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తానని కేసీఆర్ వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆ అంశాన్ని కేసీఆర్ విస్మరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు మాట తప్పారంటూ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఇవ్వమని.... తృతీయ ప్రంట్‌ను మద్దతు ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. -
లక్ష మంది ఉద్యోగులు సీమాంధ్రకే
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అంతరంగం తెలంగాణలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపాల్సిందే. అలాగే మొత్తంగా 75వేల మంది పెన్షనర్లను సీమాంధ్రకు బదిలీ చేయాలి. తెలంగాణ సెక్రటేరియేట్‌లో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి... నవ తెలంగాణ తెలంగాణ నవనిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. గత ప్రభుత్వాల్లో ఉద్యోగానికి... రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగానికి తేడా ఉంటుది. 15 ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు మమేకం అయ్యారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో వారి మధ్య విభజన రేఖ చెరిగి పోయింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు, ప్రజలు కలిసికట్టుగా తెలంగాణ నవనిర్మాణం కోసం కృషిచేయాలి. ప్రభుత్వం చేపట్టబోయే పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులదే. కాబట్టి ఉద్యోగులు పని సంస్కృతిని అలవర్చుకోవాలి. ఆదర్శవంతమైన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలి. పని సంస్కృతి పెరగాలి పని సంస్కృతిని పెంచేందుకు రాబోయే ఏడాది వరకు టీఎన్జీవో ప్రత్యేకంగా ప్రచారం చేయాలని యోచి స్తోంది. ఐదేళ్లపాటు ఉద్యో గులు అదనంగా పని చేసేందుకు సిద్ధంగా ఉండా లని విన్నవిస్తున్నాం. ప్ర భుత్వ పథకాలు లబ్దిదా రులకు చేర్చడంలో ఉద్యోగులు వాచ్‌డాగ్‌లా (కాపలా కుక్క లా) ఉండాలన్నదే మా ఉద్దేశం. ప్రభుత్వ కార్యాల యాలకు వచ్చే ప్రజలకు సేవలందించడంలో ఉద్యోగులు మార్గదర్శకంగా ఉండాలి. అందుకోసం ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను మార్పు చేస్తాం. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయాలి... ప్రభుత్వ పాలన బయటి వ్యక్తుల చేతుల్లో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వ రహస్యాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్‌పోర్టు తదితర ముఖ్య రంగాల్లో బయటి వ్యక్తుల ప్రమేయం తగదు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రస్తుత కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి. డీఎస్సీలను పునరుద్ధరించాలి.. ఉద్యోగ భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. అందుకోసం జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ)లను పునరుద్ధరించాలి. తెలంగాణలో ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత జనాభా ప్రకారం ఉద్యోగాల సంఖ్యను పెంచాలి. నిరుద్యోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. తెలంగాణలో నూతన ఆర్థిక విధానాల అమలును నిలిపివేయాలి. ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాలి. అప్పుడే తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరతాయి. విజన్ ఉన్న నాయకత్వం రావాలి తెలంగాణలో 3.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 84 వేల మంది హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అందులో 60 వేల మంది సీమాంధ్రకు చెందినవారే. హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో మరో 50 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాల్లో పనిచేసే వారంతా డీఎస్సీల్లో 20 శాతం ఓపెన్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించి నాన్‌లోకల్ కోటా కింద కన్వర్ట్ అయ్యారు. మొత్తంగా తెలంగాణలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపాల్సిందే. వాళ్లు వెళ్లకుంటే ఇక తెలంగాణ వచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది? అలాగే 2.36 లక్షల మంది పెన్షనర్లు తెలంగాణలో ఉన్నారు. వారిలో 90 వేల మంది హైదరాబాద్‌లో ఉన్నారు. అందులో 60 వేల మంది సీమాంధ్రకు చెందినవారు. ఇక జిల్లాల్లో 15 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 75 వేల మంది పెన్షనర్లను సీమాంధ్రకు బదిలీ చేయాలి. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాలి. తెలంగాణ సెక్రటేరియట్లో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే విజన్ నాయకత్వం ప్రభుత్వ పాలనలోకి రావాలి. అప్పుడే నవ తెలంగాణ కల సాకారం అవుతుంది. tngonews@gmail.com -
కేసీఆర్ పప్పులుడకవ్: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. సీమాంధ్రకు నీళ్లు వదలబోమని, సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందేనన్న కేసీఆర్ ప్రకటనలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో చట్టం, నిబంధనలు ఉంటాయని, వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి తప్ప కేసీఆర్ చెప్పినట్లు కాదని చెప్పారు. కేసీఆర్ ఎన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఆ పప్పులేమీ ఉడకవన్నారు. ఇందిరాభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ కేసీఆర్‌ది సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆరాటం తప్ప తెలంగాణను బాగుచేసుకోవాలన్న దృష్టి లేదు. కేసీఆర్ మాట తప్పిన విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులే కాకుండా ఎవరికీ ఇబ్బందులు లేకుండా రక్షక కవచంగా ఉంటానని చెప్పి ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడం విచారకరం. -
పోలవరం ప్రాజెక్టు కట్టనిచ్చేది లేదు: కేసీఆర్
-
పోలవరం ప్రాజెక్టు కట్టనిచ్చేది లేదు: కేసీఆర్
రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాకముందే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విషం చిమ్మారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని విభేదాలను రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టనిచ్చేది లేదని, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులలో నీళ్లు నిండిన తర్వాత మాత్రమే సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు వదులుతామని ఆయన అన్నారు. ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, వాళ్లు వెళ్లి ఆంధ్రా ప్రాంతంలోనే పనిచేయాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టేవారు కావాలా.. టీఆర్ఎస్ కావాలా అన్న విషయాన్ని ప్రజలు తేల్చాలని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు రావని, టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణలోని ఆటో రిక్షాలకు పన్ను మినహాయింపు ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. -
తెలంగాణలో పనిచేసేందుకు.. ఆప్షన్స్‌కు ఒప్పుకోం
తెలంగాణ సమాచార ఉద్యోగుల సంఘం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన ఉద్యోగులకు తెలంగాణలో పనిచేసేందుకు ఆప్షన్స్ ఇస్తే ఒప్పుకోమని సమాచార పౌరసంబంధాల శాఖ ఉద్యోగులు అన్నారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ప్రధాన కార్యాలయంలో తెలంగాణ సమాచార ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు సీతారామిరెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఆరుసూత్రాల పథకం అమల్లో ఉన్నందున జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ తరహాలోనే ఆప్షన్స్ ఇచ్చి ఉద్యోగులను విభజిస్తామని కమల్ నాథన్ కమిటీ చెప్పడం కుదరదని ఆయన అన్నారు. అలా ఆప్షన్స్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఫలితం ఉండదని అన్నారు. స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా మాత్రమే విడదీయాలని, సర్వీస్ ఆధారంగా చేయకూడదని అన్నారు. ఆప్షన్స్ కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు మాత్రమే ఉన్నాయని, మిగతా వారికి లేవని, ఒకవేళ అలా ఆప్షన్స్ ఇస్తే తిరిగి ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. సమావేశానికి తెలంగాణ జిల్లాల నుంచి పలువురు సమాచార పౌరసంబంధాల శాఖ ఉద్యోగులు వచ్చారు. -
'అండగా ఉంటామనటం ఫ్యాషన్ అయిపోయింది'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల హక్కుల గురించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు మండిపడ్డారు. సీమాంధ్రకు కనీస న్యాయం చేయకుండా కాంగ్రెస్, బేజేపీలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని వారు ధ్వజమెత్తారు. తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీమాంధ్రులకు అండగా ఉంటామంటూ తెలంగాణ నేతలు మాట్లాడటం ఒక ఫ్యాషన్‌గా మారిందని జేఏసీ నేతలు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. -
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ
రేపటి నుంచి విధుల్లోకి ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ప్రారంభించిన సమ్మెను విరమించాలని సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బుధవారం అర్ధరాత్రి సమ్మె విరమించి గురువారం నుంచి ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పరిపాలనకు ‘సమైక్య’ బ్రేక్
సాక్షి, కాకినాడ :రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా ఏపీఎన్జీఓల సంఘం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు జిల్లాలో ప్రభుత్వోద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. దీంతో కలెక్టరేట్ సహా దాదాపు ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూత పడ్డాయి. కీలకమైన రెవెన్యూ సహా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో జిల్లాలో గురువారం నుంచి పరిపాలన స్తంభించిపోయింది. ఆర్డీఓ, తహశీల్దార్, వీఆర్వో కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. మండల పరిషత్ కార్యాలయాలు తెరుచుకోలేదు. పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, కమర్షియల్, రవాణా, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, జెడ్పీ, దేవాదాయ, పశు సంవర్ధక, విద్య, వైద్య-ఆరోగ్య, గ్రంథాలయ, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. ఎక్సైజ్ మినిస్టీరియల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కలెక్టరేట్ విభాగం అధ్యక్షుడు సుబ్బారావు కలెక్టరేట్ గేట్లకు తాళాలు వేసి, సిబ్బందితో కలిసి ఆ ప్రాంగణంలో ర్యాలీ చేశారు. పౌర సరఫరాలు, డ్వామా, బీసీ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఈ ర్యాలీలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినదించారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా కన్వీనర్ మల్లు సత్యనారాయణ మూర్తి, కో కన్వీనర్ కె.రామకృష్ణారావు ఆధ్వర్యంలో మినిస్టీరియల్ సిబ్బంది పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏపీఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులు ప్రదర్శన చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక దీక్షా శిబిరంలో చెవులు, కళ్లు, నోరు మూసుకొని యూపీఏ తీరుపై నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ఎదుట మానవహారం, ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బూరిగా ఆశీర్వాదం, త్రినాథ్‌లు మాట్లాడుతూ రాష్ర్ట విభజన బిల్లును అసెంబ్లీలో మాదిరిగానే పార్లమెంటులో కూడా తిరస్కరించేలా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కృషి చేయాలన్నారు. విభజన బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించని ఎంపీలు, మంత్రులను నియోజకవర్గాల్లో తిరగనివ్వబోమని, వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని అన్నారు. విభజన బిల్లును తిరస్కరించడం ద్వారా ఈ నెల 21న కాకినాడలో అశోక్‌బాబు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించుకుందామని చెప్పారు. రాజమండ్రిలో ఏపీఎన్జీఓ కార్యాలయం నుంచి ఉద్యోగులంతా బైక్ ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అమలాపురంలో ఏపీఎన్జీఓలు ప్రదర్శన చేశారు. ఈ నెల 10న జరగనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసేందుకు ఎన్జీఓ నేతలు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇంకా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రదర్శనలు, మానవ హారాలు నిర్వహించారు. -
సమ్మెలోకి సీమాంధ్ర ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ఏపీఎన్జీవోల నేతృత్వంలో దాదాపు 70 సంఘాలు సమ్మెకు సమాయత్తమవుతున్నాయి. రెవెన్యూ, ఎక్సైజ్, ట్రెజరీ, సహకార, వాణిజ్య పన్నులు, మెడికల్, విద్యుత్, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఫలితంగా సీమాంధ్రలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి తహశీల్దారు వరకు.. రెవెన్యూ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉన్నందువల్ల గ్రామస్థాయిలోనూ సమ్మె ప్రభావం కనిపించనుంది. ఉపాధ్యాయులూ సమ్మెలో వెళ్లనున్న నేపథ్యంలో పాఠశాలలు మూతపడనున్నాయి. విశ్వవిద్యాలయ, కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది కూడా సమ్మె లో చేరనున్నారు. దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. సమ్మెలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో లేనందువల్ల బస్సుల రాకపోకలు యథావిధిగా ఉంటాయి. సీఎం కిరణ్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు తాము సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు ఎన్జీవోలసంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లును దొడ్డిదారిన రాజ్యసభకు పంపుతుండడం కేంద్రం దిగ జారుడుతనానికి నిదర్శనమన్నారు. సమైక్యవాదులను హైదరాబాద్ నుంచి పంపిస్తామంటున్న విభజన వాదులకు ఆ మాటను తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వద్ద చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఈనెల 9న జరగనున్న టెట్ పరీక్షకు, ఇంటర్ పరీక్షలకు రెవెన్యూ ఉద్యోగులెవరూ హాజరు కావద్దని కోరామని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 10 నుంచి ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విభజన బిల్లును అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రుల్లో కొరవడిందని దుయ్యబట్టారు. సమ్మెలో తాము పాల్గొనడం లేదని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర, కార్యదర్శి రాఘవన్ తెలిపారు. తమతో సంప్రదించకుండా ఎన్జీవోల సంఘం నాయకులు సమ్మె నిర్ణయం ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎన్జీవోలు ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, ఈనెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న మున్సిపల్ జేఏసీ సమావేశంలో ఉద్యోగులతో చర్చించి తాము నిర్ణయం తీసుకుంటామని జేఏసీ కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. -
నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొని సమైక్యతను చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన 66 రోజుల సమ్మె దినాలను క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తూ జీఓ జారీ కావడంపై రెవెన్యూ అసోషియేషన్ హర్షం వ్యక్తం చేసింది. -
నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఈనెల 5 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈమేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున మంగళవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని వేదిక అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఏపీఎన్జీవోలతోపాటు వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో కలసి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల పేరిట కాకుండా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక తరఫున సమ్మె నోటీసు ఇస్తే చెల్లుతుందా? అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... గతంలోనూ వేదిక తరఫునే సమ్మె చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వేదిక కో కన్వీనర్ ఎన్.చంద్రశేఖర్‌రెడ్డితోపాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారు ఏం చెప్పారంటే... అసెంబ్లీ తిరస్కరించిన తర్వాత కూడా కేంద్రం ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు నిరసనగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగాలని సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన విషయంలో మొండిగా ముందుకెళితే కేంద్ర వ్యవస్థలను మూసేస్తాం. రైల్రోకోలతోపాటు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తాం. ఈనెల 7, 8 తేదీల్లో అన్ని సంఘాల నేతలు సమావేశమై ఏయే రోజుల్లో ఏయే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలో నిర్ణయిస్తాం. ఈనెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు ప్రజాసంఘాలు, ప్రజలు, రాజకీయపార్టీలు కలసిరావాలి. రాష్ట్ర విభజనకు కేంద్రానికి సహకరించే ఎంపీలు, కేంద్ర మంత్రుల భరతం పడతాం. వారే పార్టీ తరఫున పోటీ చేసినా ఓడిస్తాం. రెండు వారాలుండే ప్రభుత్వం కావాలో, జీవిత కాలం ఉండే ప్రజలు కావాలో వారు తేల్చుకోవాలి. ఎన్నికల విధుల్లో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ వ్యవస్థలు సమ్మెలో పాల్గొంటున్నందున సాధారణ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. విద్యార్థులకు ఇబ్బందులు వాటిల్లకుండా ఇంటర్మీడియెట్, టెట్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీస్తున్నాం. సమ్మెకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కూడా పాల్గొంటున్నారని కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ప్రకటించారు. బదిలీ ఉత్తర్వులు తీసుకోవద్దు వీఆర్ఏ నుంచి తహశీల్దార్ల వరకు రెవెన్యూ యంత్రాంగమంతా సమైక్య సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు భూపరిపాలన ముఖ్య కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుకు సమ్మె నోటీసును అందజేశామన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారమే తహశీల్దార్ల బదిలీ ఉత్తర్వులు పంపామని, సమ్మె నోటీసు నేపథ్యంలో వాటిని తీసుకోవద్దని కోరారు. సమ్మెలో పాల్గొనం: ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుండటం, తాము సమ్మెలోకి వెళ్తే ప్రైవేటు బస్సు ఆపరేటర్లు రెచ్చిపోయి ప్రయాణికుల జేబులు గుల్ల చేసే పరిస్థితి ఉండటంతో సమైక్య సమ్మెలో పాల్గొనరాదని నిర్ణయం తీసుకున్నట్టు సీమాంధ్ర ఆర్టీసీ కార్మికుల సంఘం ప్రకటించింది. అయితే ఈ సమ్మె గతంలో మాదిరిగా సకలజనుల సమ్మెగా మారే పరిస్థితి ఉంటే... తాము మరోసారి చర్చించుకుని సమ్మెలో పాల్గొనే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ సంఘం కన్వీనర్ దామోదర్ ‘సాక్షి’తో చెప్పారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఉద్యోగుల సమ్మె
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ 66 రోజుల పాటు సమ్మె చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. జిల్లాలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది రోడ్డెక్కనున్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సోమవారం సమావేశమై మెరుపు సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె ద్వారా మరోసారి ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు, ట్రాన్స్‌కో, ఆర్టీసీ ఉద్యోగులు మినహా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిపాలన స్తంభించనుంది. సమైక్యవాదాన్ని వినిపించాలి పార్లమెంట్లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు సమైక్యవాదాన్ని వినిపించాలని జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సాయంత్రం కాకినాడ ఏపీ ఎన్జీవో హోంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన మేరకు సమ్మెలోకి వెళ్లాలని తీర్మానించారు. ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించాలని, లేనిపక్షంలో వారి ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర సంఘం పిలుపుతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, జాతీయ రహదారుల దిగ్బంధం, విద్యుత్ నిలిపివేత, రైల్‌రోకో కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు 15న వెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి పితాని త్రినాథ్‌రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవి, నాయకులు అనిల్ జాన్సన్, నాగేశ్వరరావు, జియాఉద్దీన్, పసుపులేటి శ్రీనివాసరావు, సరెళ్ల చంద్రరావు, వై. శ్రీనివాస్, విజయకుమార్, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఆఖరి పోరాటం
ఏలూరు, న్యూస్‌లైన్ :తెలంగాణ బిల్లును పార్లమెం ట్లో వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు సమైక్య రాష్ట్ర పరి రక్షణ వేదిక ప్రకటించింది. వేదిక, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎల్వీ సాగర్ తదితరులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యా య వర్గాలతోపాటు వ్యాపార, విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిరక్షణ కోసం 66 రోజులపాటు అన్నివర్గాలు ఐక్యంగా ఉద్యమించడం వల్లే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌కు తిప్పిపంపగలి గామని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు అన్నివర్గాల ప్రజలు తుది పోరాటాన్ని విజయవంతం చేయూలని కోరారు. ఎన్నికల విధులకు సహకారం అందించేది లేదని స్పష్టం చేశారు. సమ్మెనుంచి 10వ తరగతి విద్యార్థులను మినహాయిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని, వారిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని సాగర్ చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఈనెల 9న జిల్లా వ్యాప్తంగా 3కే రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి 50 వేలమంది సమైక్యవాదులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 10న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగే బహిరంగ సభకు సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివెళ్లాలని కోరారు. 17, 18 తేదీల్లో ఢిల్లీవెళ్లి అన్ని జాతీయ పార్టీలను కలుస్తామని, రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలనే విషయూన్ని వివరిస్తామని తెలిపారు. కావూరి, కనుమూరి బుద్ధిగా వ్యవహరించాలి సమైక్యాంధ్రకు ద్రోహం చేసిన ప్రజాప్రతినిధుల భరతం పడతామని సాగర్ హెచ్చరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీ, టీటీడీ చైర్మన్, కను మూరి బాపిరాజు వ్యవహరించిన తీరు ప్రజలకు అర్థమైందన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే వారి చరిత్ర బయటపడుతుందన్నారు. ప్రజ లు ఎప్పటికీ వారిని క్షమించరని శాపనార్థాలు పెట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ కోనేరు సురేష్‌బాబు, నాయకులు పి.వెంకటేశ్వరరావు, నేరేళ్ల రాజేంద్ర, ఎంబీఎస్ శర్మ, క్రిష్ట్రవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిరవధిక ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డాలని కోరారు. ఈనెల 9 నిర్వహించే సమైక్య 3కే రన్‌కు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఎంబీఎస్ శర్మ వివరించారు. సమావేశంలో ఎన్జీవో నేతలు టి.యోగానందం, ఆర్ఎస్ హరనాథ్, నరసింహమూర్తి, చోడగిరి శ్రీనివాస్, కె.రమేష్‌కుమార్, ప్రమోద్, సతీష్ పాల్గొన్నారు. -
6నుండి ఏపీఎన్జీఓల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
-
6 నుంచి సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు మళ్లీ సమ్మె భేరి మోగించబోతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తూ ఈ నెల 6 నుంచి ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో సోమవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. 7, 8, 9 తేదీల్లో కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడించాలని సమావేశంలో నిర్ణయించారు. 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ పాటించనున్నారు. ఆ తర్వాత 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. -
సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!
సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. అంతర్గంత కుమ్ములాటతో ఉద్యోగులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో సీమాంధ్ర ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి 30 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ఫిబ్రవరి 20 తేది వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సచివాలయ ఉద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. గురువారం భోజన విరామ సమయంలో సచివాలయంలోని ధర్నాచౌక్ వద్ద తమ నిరసనను తెలియజేశారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాలని, సిగ్గులేని సీమాంధ్ర మంత్రులను సంఘ బహిష్కరణ చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ విభజన బిల్లుకు సంబంధించిన సమాచారం అసెంబ్లీ వర్గాలు అందజేయకుంటే, ఇచ్చేంతవరకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఆందోళన అనంతరం ఉద్యమ కార్యాచరణ విషయంలో సీమాంధ్ర ఉద్యోగ నేతలు కేవీ కృష్ణయ్య, మురళీకృష్ణ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇతర ఉద్యోగులు జోక్యం చేసుకొని ఇరువురినీ వారించారు. -
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల అరెస్ట్.. విడుదల
శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని మిగిలిన ఉద్యోగులు సీఎం కార్యాలయం వద్ద మౌనదీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఉద్యోగులను విడుదల చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సచివాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కేవీ కృష్ణయ్య, మురళీమోహన్, సుజాత తదితరులున్నారు. -
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
రాష్ట్ర విభజనకు నిరసనగా గురువారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సోనియా.. క్విట్ ఇండియా, దిగ్విజయ్.. గో బ్యాక్, రాహుల్ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. రాష్ట్ర విభజనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. ఎల్-బ్లాక్ నుంచి ర్యాలీగా వచ్చిన ఉద్యోగులు సమతా బ్లాక్ వద్ద బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఉద్యోగ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ వెళ్లిపోయేంతవరకూ తమ నిరసనను తెలియజేస్తామన్నారు. -
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. భోజన విరామ సమయంలో ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సీ-బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా గో బ్యాక్, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, డిగ్గీ రాజా గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా నేతలు మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ, అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామన్నారు. విభజనకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్, టీడీపీలకు భవిష్యత్తుండదని హెచ్చరించారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
-
‘సమ్మె’ కాలాన్ని ఈఎల్స్‌గా లెక్కిస్తాం
హైకోర్టుకు సాధారణ పరిపాలన శాఖ అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు చేసిన 38 రోజుల సమ్మె కాలాన్ని ఆర్జిత సెలవులు (ఈఎల్స్)గా పరిగణించేందుకు అనుమతి ఇవ్వాలని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా బుధవారం మిస్సెలనీయస్ పిటిషన్ (ఎంపీ) దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఒకటీ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2011లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ‘నో వర్క్ నో పే’ అంటూ జీవో నం.177 జారీ చేసిందని సిన్హా ఈ ఎంపీలో ప్రస్తావించారు. అయితే తరువాత సమ్మె కాలానికి వేతనం ఇవ్వాలన్న తెలంగాణ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం దాన్ని సవరిస్తూ జీవో నం. 1,617ను జారీ చేసిందని తెలిపారు. దాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన గొల్ల యాదయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... జీవో 1,617ను కొట్టివేసిందని ప్రస్తావించారు. జీవో 177 అమల్లోనే ఉంటుందని ఆ సందర్భంగా కోర్టు స్పష్టం చేసిందని నివేదించారు. అయితే తెలంగాణ ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలాన్ని ఈఎల్స్‌గా పరిగణించేందుకు అనుమతి కోరగా... హైకోర్టు అనుమతించిందని వివరించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్నీ ఆవిధంగానే పరిగణించేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సిన్హా అభ్యర్థించారు. -
డిగ్రీ, పాలిటెక్నిక్ సిబ్బందికి ‘సమ్మె’ వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె చేసిన ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్లకు, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం వేర్వేరుగా ఉత్తర్వులు (జీవో 114, 904) జారీ చేశారు. డిగ్రీ కాలేజీల్లో సిబ్బంది సమ్మె చేసిన 24 రోజులకు (సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 10 వరకు) బదులు సెలవు దినాల్లో పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నందున సమ్మె కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో పని చేసే సిబ్బందికి కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుందన్నారు. సాంకేతిక విద్యా శాఖలో సమ్మె చేసిన 25 రోజులకు (సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు) కూడా వేతనాలు చెల్లించాలని ఆ శాఖ నిర్ణయించింది. -
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సమైక్య ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ బ్లాక్ నుంచి ఉద్యోగులంతా తెలుగు తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ, వైస్ చైర్మన్ బెన్సన్, కో చైర్మన్ మురళీమోహన్, కన్వీనర్ వెంకటసుబ్బయ్య, కోఆర్డినేటర్ రవీందర్రావు, సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, మహిళా ఉద్యోగుల సంఘం ప్రతినిధి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర కోసం.. జగన్ కృషి అమోఘం
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి అమోఘమని, ప్రశంసనీయమని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కొని యాడింది. హైదరాబాద్‌లో ‘సమైక్య శంఖారావం’ విజయవంతంగా నిర్వహించడంపై జగన్‌కు ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం జగన్‌ను ఇక్కడ కలిసిన ఫోరం నేతలు జననేతను గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీమాంధ్ర ఎంప్లాయీస్ వైస్ చైర్మన్ బెన్సన్, కోశాధికారి వరలక్ష్మి, సంయుక్త కార్యదర్శి బీ ప్రశాంతి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, హౌసింగ్ సొసైటీ డెరైక్టర్ సత్యసులోచన, సచివాలయ ఉద్యోగ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షులు జాన్ దేవన్‌రాజ్ పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఉద్యోగులకు 2 నెలల అడ్వాన్స్!
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 66 రోజుల పాటు సమ్మె చేసిన సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈమేరకు రూపొందించిన ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ వెళ్లనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెలో ఉండటం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెల జీతాలు ఉద్యోగులకు అందలేదు. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటంతో ఆగస్టు 12 వరకు పనిచేసిన రోజులకు కూడా జీతాలు ఇవ్వడానికి అప్పట్లో వీలు కాలేదు. సమ్మె విరమించిన నేపథ్యంలో రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎస్ ఈమేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్స్ చెల్లించాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగులకు చెల్లించే అడ్వాన్స్‌ను ఏడాది వ్యవధిలో నెలవారీ వాయిదాల్లో రికవరీ చేయనున్నారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వకూడదంటూ ‘నో వర్క్ నో పే’ విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో ప్రభుత్వం 177 జీవో జారీ చేసిన విషయం విదితమే. ఈ జీవో అమల్లో ఉండగా జీతాలు చెల్లించకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమ్మె కాలానికి సరిపడా (66 రోజులు) ఆర్జిత సెలవు(ఈఎల్)లను తీసుకొని జీతాలు చెల్లించడానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత సెలవులు లేని వారికి భవిష్యత్‌లో వచ్చే సెలవులు తీసుకుంటామనే నిబంధన(ఈఎల్స్ డ్యూ) మీద జీతాలు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. -
రెండు నెలల తర్వాత విధుల్లోకి సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనతో సుమారు 67రోజులు పాటు ఉద్యమ బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగులు.... రెండు నెలల అనంతరం శుక్రవారం విధులకు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. రాష్ర్టవిభజన వ్యతిరేకిస్తూ ఎపి ఎన్జీవో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ విధులు బహిష్కరించి సుమారు 60 రోజులకు పైగా తమ నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విద్యార్దుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ సంఘాలు తాత్కలికంగా సమ్మె విరమించి విధులకు హజరయ్యారు.తాత్కలికంగా తమ సమ్మెను వాయిదా వేసిన కేంద్రప్రభుత్వం నుండి సమైక్యాంద్రాకు మద్దతుగా ప్రకటన రాకపోతే మరలా సమ్మెలోకి దిగి ఉద్యమాని మరింత ఉద్రిక్తత చేస్తామని హెచ్చరించారు. -
సీమాంధ్రలో కదిలిన బస్సు
-
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ
ఫలించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు తన హయాంలో రాష్ట్రం విడిపోదని సీఎం హామీ ఇచ్చారు: మురళీకృష్ణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మెను విరమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమావేశానంతరం సమ్మె విరమిస్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగుతుందన్న సీఎం హామీ మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ఉద్యోగులకు, సచివాలయ ఉద్యోగులకు చాలా వ్యత్యాసం ఉందని, సమ్మె వల్ల నిధుల విడుదల జరగక పేదలకు పెన్షన్లు, పథకాలు ఆగినందున సమ్మె వెంటనే విరమించాలని సీఎం కోరారని చెప్పారు. సీఎం హామీ మేరకు సమ్మె విరమించి ఉద్యోగులంతా శుక్రవారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. తన హయాంలో రాష్ట్రం విడిపోదని సీఎం కిరణ్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజనపై ముందడుగు పడితే తిరిగి మెరుపు సమ్మె చేపట్టేందుకు వెనుకాడబోమని మురళీకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు సీమాంధ్ర ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేసేందుకు వీలుగా ఉద్యోగ బృందాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్తామని, అందులో సచివాలయ ఉద్యోగులకూ భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని మురళీకృష్ణ తెలిపారు. ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారన్నారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించనందున ఇబ్బంది పడుతున్నారని, పండుగలను దృష్టిలో పెట్టుకుని ఒక నెల వేతనాన్ని ముందుగా చెల్లించాలన్న తమ వినతికి సీఎం అంగీకరించినట్టు తెలిపారు. పీఆర్సీ అమల్లోకి రానందున ఇంటీరియం రిలీఫ్ అందజేసే అంశాన్నీ పరిశీలిస్తామని, ఉద్యోగులకు సమగ్ర ఆరోగ్య కార్డులు అందజేసేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ లభించిందని వెల్లడించారు. సమ్మె విరమణను స్వాగతిస్తున్నాం: నరేందర్‌రావు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించడాన్ని స్వాగతిస్తున్నట్టు సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం చైర్మన్ నరేందర్‌రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర రాజకీయ నేతల మాయలో పడి ఉద్యోగులు సమ్మెకు దిగారని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయవద్దని సూచించారు. పీఆర్సీ, హెల్త్‌కార్డులు, కరువుభత్యం వంటి అంశాలపై సర్కారుపై కలిసి పోరాడి సాధించుకుందామని సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు. -
జీఓఎంను కలవనున్న సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్:రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటు చేసిన జీఓఎం(కేంద్ర మంత్రుల బృందం)ను సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కలవనున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను వివరించేందుకు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ఢిల్లీకి పయనం కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా గతంలో తెలంగాణ ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలనే సీమాంధ్ర ఉద్యోగులకు కూడా వర్తింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో వీరికి మధ్యంతర భృతిని కూడా అందజేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. ఈ భేటీ అనంతరం జీఎంవో సభ్యులకు కొన్ని కీలక బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటు చేసిన జీఎంవో సభ్యులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను కేటాయించింది. వివిధ శాఖలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులను సీమాంధ్ర ఉద్యోగులు కలిసి విభజన వల్ల సమస్యలను వివరిస్తారు. -
సచివాలయ ఉద్యోగుల సమ్మె తాత్కాలిక విరమణ
-
సెక్రటేరియట్లో చర్చలు జరపనున్న సీఎం కిరణ్
-
సమ్మెలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులకు ఆంధ్రాబ్యాంకు రుణాలు
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ 70 రోజులకు పైబడి సమ్మెలో ఉండి.. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న సీమాంధ్ర ప్రాంత ప్రభుత్వోద్యోగులకు చల్లటి కబురు. వారి ఒక నెల వేతనానికి సమానమైన మొత్తాన్ని రుణంగా అందించేందుకు ఆంధ్రాబ్యాంకు ముందుకొచ్చింది. వాళ్లకు తిరిగి జీతాలు అందిన తర్వాత రెండు వాయిదాల్లో ఈ రుణమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణానికి 13.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఈ మేరకు బ్యాంకులోని అన్ని శాఖలకూ సమాచారం అందించారు. దీనికి ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందని బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారన్న సమాచారం మాత్రం ఇంకా అందాల్సి ఉంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా తరచు బ్యాంకు సేవలకు అంతరాయాలు కలుగుతుండటంతో వివరాలు రావట్లేదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ జోనల్ మేనేజర్ తెలిపారు. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో గృహరుణాలు గణనీయంగా పడిపోయాయి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ట్రెజరీ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఆగిపోయాయి. -
‘గ్రిడ్’ కూల్చేందుకు సీఎం కుట్ర : కోదండరాం
పిల్ల చేష్టలతో తెలంగాణను ఆపలేరు: కోదండరాం ఇద్దరు పిల్లలూ ముఖ్యమేనన్న చంద్రబాబుకు తెలంగాణ బిడ్డపై ప్రేమెందుకు లేదు? ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యోగులను పావుగా వినియోగించుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుగా నిలుస్తున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులతో గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రయత్నాలు చేయిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలను అంధకారంలో నెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లచేష్టలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న కాకి కుమార్ ద్వితీయ వర్ధంతి సభ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్‌లో జరిగింది. కార్యక్రమానికి కోదండరాం, టీజేఏసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పవర్గ్రిడ్లు కూల్చేయాలని ప్రయత్నం చేయడం పిల్లచేష్టలుగా భావిస్తున్నామన్నారు. ఉద్యోగ సంఘాలతో కృత్రిమ ఉద్యమం చేయిస్తూ సీమాంధ్రకు చెందిన నాయకులు బొత్స సత్యనారాయణ, హర్షకుమార్‌లపై దాడులు చేయిస్తున్నారన్నారు. సమైక్య నినాదం ఎత్తుకుని తమలో తామే ఘర్షణలు, దాడులకు దిగుతున్నారంటే వారి మధ్యనే సమైక్యత కొరవడిందనే విషయం స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కిరణ్ విద్యుత్ సంక్షోభం సృష్టించి సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో చికిత్స పొందేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ.. తెలంగాణ ప్రాంతంపై హక్కున్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు. దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతాడు..? తెలంగాణ వస్తే నక ్సలిజం సమస్య పెరుగుతుందని.. తనతో కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాడన్న మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం సమాధానం చెబుతాడని కోదండరాం ప్రశ్నించారు. దినేశ్‌రెడ్డి చెప్పినట్లు కిరణ్ సీమాంధ్రకు బలగాలను పంపకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. అనంత పురం ఎస్పీని సస్పెండ్ చేయాలని బెదిరింపులకు దిగడం.. ఏపీఎన్జీవోల సభలకు అనుమతి కోసం దినేశ్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పుట్టాను.. ఇక్కడే పెరిగాను అని చెప్పుకొచ్చే కిరణ్ తెలంగాణకు అడ్డొస్తూ ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇద్దరు పిల్లల బాబుకు ఒక్కరే ముద్దా..? తనకు తెలంగాణ, సీమాంధ్ర.. ఇద్దరు పిల్లల్లాంటి వారని.. ఇద్దరూ ముఖ్యమని కాకమ్మ కథలు చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమైక్యం కోసం ఎందుకు దీక్ష చేస్తున్నాడని కోదండరాం ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలంగాణపై నిజంగా ప్రేమే వుంటే దీక్షల నాటకమెందుకని ప్రశ్నించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను 60 రోజుల్లో ఆపాలనుకోవడం అవివేకమైన చ ర్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ ప్రజల నిధులను, నీళ్లను దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్రులు ఇప్పుడు విభజన అనేసరికి భరించలేకపోతున్నారని మండిపడ్డారు. -
సమైక్యం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలనే డిమాండ్ మినహా ముఖ్యమంత్రితో చర్చించడానికి ఏమీ లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టంచేశారు. సీఎంతో చర్చలకు ప్రత్యేకంగా ఎజెండా ఏమీ లేదన్నారు. మంగళవారమిక్కడి ఏపీఏన్జీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చర్చల్లో సీఎం స్పందించే తీరును బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించాలని ఎమ్మెల్యేలకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. విభజన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక బాధపడుతున్న యువత, ఉద్యోగులకు మానసిక స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేస్తామని పార్టీలు హామీ ఇవ్వాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. బస్సులు, విద్యాసంస్థలు, కరెంట్ లేకుండా ప్రజల అల్లాడిపోతున్నా.. ఎంపీలు పదవులు పట్టుకొని వేలాడుతున్నారని దుయ్యబట్టారు. రాజీనామాలు చేశామని చెబుతున్న మంత్రులు ఢిల్లీలో అధికార నివాసాలు ఖాళీ చేసి, అధికారిక హోదాలు, సౌకర్యాలు వదులుకొని నియోజకవర్గాలకు రావాలని సూచించారు. మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించడానికి అశోక్‌బాబు నిరాకరించారు. తమ సభకు పోలీసు శాఖ ఇచ్చిన అనుమతిని హైకోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల రిలేదీక్షలు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారం రిలేదీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత ఆందోళన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలోని పాత మెయిన్‌గేటు వద్ద టెంటు ఏర్పాటు చేసి రిలేదీక్షల్లో పాల్గొన్నారు. ఈ దీక్షలకు అశోక్‌బాబు సంఘీభావం తెలిపారు. -
రేపు సీఎంతో సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం
-
సోనియా క్విట్ ఇండియా..
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సోమవారం సచివాలయం పాత ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ‘సోనియా క్విట్ ఇండియా.. ప్యాకేజీలు వద్దు సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో సచివాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమతా బ్లాక్ ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. అంతకుముందు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చల్లో పాల్గొన్నారు. ఈనెల 9న సీఎంతో సమావేశం కానున్నామని, రాష్ట్ర విభజన నిలిపివేయడంపై స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య తెలిపారు. విద్యుత్ సౌధలో పోటాపోటీ ఆందోళనలు సీమాంధ్ర, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు సోమవారం విద్యుత్ సౌధలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. సమ్మెలో పాల్గొంటున్న అసాంఘిక శక్తులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ రఘు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యుత్‌సౌధకు వచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సాయిబాబా స్పష్టం చేశారు. -
జగన్‌కు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల మద్దతు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గత మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రోజురోజుకూ సంఘీభావం పెరుగుతోంది. సోమవారం సాయంత్రం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆయనను కలిసి దీక్షకు తమ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలను వారు స్వాగతించారు. అలాగే, సమైక్యాంధ్ర లాయర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (లాయర్ల జేఏసీ) సభ్యులు కూడా వైఎస్ జగన్మోహన రెడ్డిని కలిసి ఆయనకు తమ సంఘీభావం తెలిపారు. కాగా, మూడు రోజుల నుంచి సమైక్య దీక్ష చేస్తున్న జగన్మోహన రెడ్డికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. ఆయన కాస్త నీరసించినట్లు గుర్తించారు. జగన్ రక్తంలోని మధుమేహం స్థాయి 68కి పడిపోయింది. బీపీ 130/90 , పల్స్ రేట్ 60గా నమోదయ్యాయి. కాగా, జగన్ నడుం నొప్పితో బాధ పడుతున్నారు. ఆయన వీలైనంత త్వరగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. -
నేటి నుంచి నిరవధిక సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు
-
సచివాలయంలోకి రాకపోకలు బంద్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. శుక్రవారం నాడు వారు సచివాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తమ నిరసన తెలిపారు. సచివాలయంలోకి రాకపోకలను వారు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంత అడ్డదిడ్డంగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. -
ఫిట్స్ వచ్చి పడిపోయిన సీమాంద్ర ఉద్యోగులు
-
సచివాలయ సీమాంద్ర ఉద్యోగుల మహాధర్నా
-
ఉద్రిక్తంగా మారిన సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సమైక్య సెగ తీవ్రరూపం దాల్చుతోంది.తెలంగాణపై అధిష్టానం తీసుకున్ననిర్ణయాన్నివ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు కదం తొక్కారు.ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీలోని ఏపీభవన్ కు అతి సమీపంలోనే సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ ను 'కాపాడండి..కాపాడండి' అంటూ గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో వినూత్న శైలిలో ధర్నా చేపట్టారు. పోలీసులు వీరిని అడ్డుకోవడానికి యత్నించడంతో సీమాంధ్ర ఉద్యోగులు వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దాడులకు దిగుతున్నారని వారు తెలిపారు. సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. -
ఉద్యోగుల సమ్మెపై వాదనలు ముగిసినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో దాదాపుగా వాదనలు ముగిశాయి. గత రెండు వారాలుగా సాగిన వాదనలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని, అయితే అవి రెండు పేజీలకు మించరాదని అటు పిటిషనర్లకు, ఇటు ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఏపీ ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ తరఫున న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... సొంత ప్రయోజనాలను ఆశించి దాఖలు చేసే ఇటువంటి వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు తీర్పులు వెలువరించిందని చెప్పారు. శాంతిభ్రదతల సమస్య తలెత్తితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఇప్పటికే అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చెప్పారని, ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి, ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యం అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ‘సమ్మె విషయంలో కోర్టు సానుకూల ఉత్తర్వులు ఇస్తే దానివల్ల కేవలం పిటిషనర్ మాత్రమే లబ్ధి పొందుతారా..? ప్రజలకు ఉమశమనం కావాలి కదా? సమ్మెను ఆదిలోనే ఆపేందుకు ప్రయత్నించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు’ అని వ్యాఖ్యానించింది. రెండు వారాలుగా ఉద్యోగుల తరఫున పలువురు న్యాయవాదులు చేసిన వాదనలకు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి సమాధానం ఇస్తూ.. సమ్మెను కొనసాగించడంవల్ల ఉద్యోగులు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకోసం కాకుండా ఉద్యోగుల కోసం పనిచేస్తున్నట్లుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నామని పిటిషనర్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ ప్రకటనకు మీరు కట్టుబడి ఉన్నారా..?’ అని ప్రశ్నించగా, తాము కట్టుబడి ఉన్నామని సత్యంరెడ్డి తెలిపారు. అయితే ఆ ప్రకటన ఆధారంగానే ఈ వ్యాజ్యంలో తమ నిర్ణయం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేయగా... అలాగైతే తమ అఫిడవిట్‌లోని ఆ ప్రకటనను తొలగించాలని సత్యంరెడ్డి కోరారు. దీంతో ధర్మాసనం ఆయన అభ్యర్థనను రికార్డ్ చేసుకుంది. వాదనలు విన్న ధర్మాసనం, ఇరుపక్షాలను కూడా ఇప్పటి వరకు జరిగిన వాదనలను రాతపూర్వకంగా రెండు పేజీలకు మించకుండా కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలను పరిశీలించిన తరువాత ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసే అవకాశం ఉంది. -
జగన్ రాకతో సమైక్యాంధ్రకు ఊపు!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడం పట్ల సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ జైలు నుంచి బయటకు రావడం సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపునిస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా 50 రోజులుగా ఉద్యోగాలు, జీతాలు వదిలేసి తాము సమ్మె చేస్తున్నా ఒక్క పార్టీ కూడా తమను పట్టించుకోలేదని, వైఎస్సార్సీపీ మాత్రమే సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడుతోందని సచివాలయ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో జగన్ బెయిల్‌పై బయటకు రావడం తమలో ఆశలను చిగురింప జేసిందని, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో మరింత ఉత్సాహన్ని నింపిందన్నారు. జగన్మద్దతుతో సమైక్య ఉద్యమం ఉధృతమవుతుందని తాము ఆశిస్తున్నామని వెంకటరామిరెడ్డి చెప్పారు. -
సమ్మె మాకు సరదా కాదు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులు సరదా కోసం సమ్మె చేయడం లేదని, రాష్ట్రాన్ని విభజిస్తే, తమతో పాటు తమ బిడ్డలూ రోడ్డున పడాల్సి ఉంటుందని, అందరి భవితవ్యం అగమ్య గోచరమవుతుందనే సమ్మె చేస్తున్నారని ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ హైకోర్టుకు నివేదించింది. సమ్మె చేస్తున్న ఆరు లక్షల మందిని 13 జిల్లాల్లోని ఆరు కోట్ల జనం నడిపిస్తున్నారని, ఇది మహోద్యమమని అసోసియేషన్ తరఫు న్యాయవాది సి. రామచంద్ర రాజు కోర్టుకు తెలిపారు. సమ్మెచేసే ఉద్యోగులపై చర్యలకు ఆదేశాలిస్తే శాంతిభద్రతల సమస్య మొదలవుతుందని అన్నారు. రాజకీయ అంశమైన రాష్ట్రవిభజనపై, సమ్మెచేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని హైదరాబాద్ న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి. దానయ్య వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ తరఫున రావుచంద్ర రాజు సోవువారం తన వాదనలు కొనసాగించారు. చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ చంద్రబానులతో కూడిన ధర్మాసనం సవుక్షంలో ఆయున వాదనలు వినిపించారు. ప్రజాస్వావ్యుంలో ప్రజలే ప్రభువులని, మిగిలిన వ్యవస్థల్లో పదవుల్లో పనిచేసే వారంతా సేవకులని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తే వారు పదవులు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.., ‘మీరే ప్రభువులని, మిగిలిన వారంతా సేవకులని చెబుతున్నారు. సేవకులు చెబితేనే చేయాలని అంటున్నారు. మరి ఈ కేసును విచారించేందుకు అనుమతినిస్తారా..?’ అంటూ వ్యాఖ్యానించడంతో కోర్టులో నవ్వులు విరిశాయి. సమ్మెతో 13 జిల్లాల ప్రజలకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఉద్యోగులు నష్టం కలిగించడం లేదని ఉద్యోగుల తరఫు న్యాయువాది అన్నారు. విభజనపై నిర్ణయం తీసుకోబోమని కేంద్రం చెబితే, ఉద్యోగులు వెంటనే సమ్మె విరమిస్తారన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, వ్యక్తిగత ప్రయోజనాలతోనే పిటిషనర్ వ్యాజ్యం వేసినందున, ఇది వ్యక్తిగత వ్యాజ్యమే అవుతుందని, ఇలాంటి వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని చెప్పారు. అనంతరం కోర్టు ఈ కేసుపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
సమ్మె విరమించం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘం మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. ఆదివారం సచివాలయంలో జరిగిన చర్చలకు ఉపసంఘం సభ్యులైన మంత్రులు రామనారాయణరెడ్డి, కొండ్రు మురళి హాజరయ్యారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేత దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) నాయకుడు ప్రసాద్, మున్సిపల్ ఉద్యోగులజేఏసీ నేత కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ వీఆర్వోల సమాఖ్య చైర్మన్ భక్తవత్సలనాయుడు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, నాయకులు మురళీమోహన్, కృష్ణయ్య, ప్రభుత్వ గురుకులాల సమైక్య పోరాట సమితి కన్వీనర్ సుధాకర్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు బాబూరావు, సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి కన్వీనర్ కమలాకరరావు, ట్రెజరీ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు మణికుమార్, సహకార ఉద్యోగుల సంఘం నేత ఫణికుమార్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. రేషన్ సరుకుల పంపిణీ, ఆరోగ్య సేవలు, ప్రజా రవాణా స్తంభించాయని, విద్యా సంస్థలు మూతపడ్డాయని, పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సమ్మె విరమించి పాలనలో భాగస్వాములు కావాలని ఉద్యోగులకు మంత్రివర్గ ఉపసంఘం విజ్ఞప్తి చేసింది. అన్ని ఉద్యోగ సంఘాల ఏకైక డిమాండ్.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమేనని, విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. పలు శాఖల్లో ఎస్మా ప్రయోగించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘ఎస్మా పెట్టడం పాలనలో సాధారణమైన అంశం. దానికి ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్మా జీవోలు ఇచ్చినంత మాత్రాన అమలు చేసినట్లు కాదు. అమలు నిర్ణయం ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సింది. ఉద్యోగులపై కక్షసాధింపునకు ఎస్మాను వాడుకొనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఆందోళన వద్దు’’ అని మంత్రులు వివరించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను సంఘాల వారీగా ఉపసంఘం ముందుంచారు. జోనల్ వ్యవస్థ కనుమరుగైతే ఉద్యోగుల సీనియారిటీ దెబ్బతింటుందని, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వెళ్లిపోవాల్సి ఉంటుందని, పెన్షన్ చెల్లింపుల్లో సమస్యలు తలెత్తుతాయని, లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు స్థాన చలనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఏపీఎన్జీవోలు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లలో ఉద్యోగులకు రాష్ట ప్రభుత్వం నుంచి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలనే డిమాండ్‌ను మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ ప్రస్తావించింది. సమైక్య రాష్ట్రంలోనే రూ.50- 60 కోట్ల మేర జీతాలు చెల్లించడానికే ప్రభుత్వం వెనకాముందూ ఆలోచిస్తుంటే, విభజన తర్వాత పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర సేవలు కొనసాగిస్తున్నందున ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఆర్టీసీని మూసివేయాల్సిందేనని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈయూ, ఎన్ఎంయూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీసం చేసి ప్రజా రవాణాను ఒక విభాగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలలు, సచివాలయ, రెవెన్యూ, ట్రెజరీ, సహకార ఉద్యోగులు, డిప్యూటీ కలెక్టర్లు కూడా తమ సమస్యలను ఉపసంఘం ముందుంచారు. శాఖల వారీగా ‘విభజన’ సమస్యలను ఆయా శాఖాధిపతులకు నివేదిక రూపంలో సమర్పించాలని, ఒక కాపీని ఉపసంఘానికి ఇవ్వాలని మంత్రులు సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో చర్చలకు విఘాతం: ఆనం సీమాంధ్రలో పాలన స్తంభించిపోయిందని, పేదలకు నిత్యావసరాలు మొదలు పథకాల ప్రయోజనాలేమీ అందక ఇబ్బంది పడుతున్నందున సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసినట్లు చర్చల అనంతరం మంత్రి ఆనం వెల్లడించారు. అర్థవంతమైన ముగింపు వచ్చే వరకు చర్చలు కొనసాగుతాయని ప్రకటించారు. సీమాంధ్రలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వల్ల చర్చలకు విఘాతం కలుగుతుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. విభజన సమస్యలపై ఉద్యోగ సంఘాలు సమర్పించే నివేదికలను తాము అధ్యయనం చేయడంతో పాటు కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మినహా.. అదనపు జేసీల నుంచి అటెండర్ల వరకు ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. -
చర్చించుకుందాం రండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు ఒక్క చోట కూర్చొని సమస్యలపై చర్చించడానికి ఈ నెల 24 లేదా 25న ‘సోదర సద్భావన సదస్సు’ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు. సమైక్యంగా ఉంటే ఎదురయ్యే సమస్యలు, విభజన వల్ల వచ్చే సమస్యలపై చర్చించడం మొదలు పెడితే ఇరు ప్రాంతాల ఉద్యోగులు, ప్రజల్లో విద్వేషాలు తగ్గే అవకాశాలుంటాయని శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే, శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందన్న కారణంతో ఈ సదస్సుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆడిటోరియాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్జీవో కార్యాలయంలోనైనా సదస్సు నిర్వహిస్తామని, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఇక్కడికి వస్తారో, లేదో వారితో మాట్లాడిన తర్వాతే తెలుస్తుందని అన్నారు. నేడు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు ఆదివారం చర్చలకు రావాలని ప్రభుత్వం కోరిందని అశోక్‌బాబు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలోనే చర్చలు ఉంటాయని తెలిపిందని, ఏఏ అంశాలపై చర్చిస్తారో వెల్లడించలేదని చెప్పారు. విభజనపై చర్చించే పరిధి ఉపసంఘానికి ఉంటుందని తాము భావించడంలేదన్నారు. చర్చలకు ఆర్టీసీ కార్మికులనూ తీసుకెళ్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరతామన్నారు. సోమవారం నుంచి ఈనెల 30 వరకు అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మూసేయాల్సిందేనని స్పష్టం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థ లు తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాయని చెప్పారు. విద్యార్థులను ఇళ్లకు పంపించడానికి అవకాశం లేని చోట హాస్టళ్లు నడపవచ్చన్నారు. -
సమ్మెపై విరమణ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా తాము చేస్తున్న సమ్మెను విరమించేది లేదని సీమాంధ్ర ఉద్యోగులు శనివారం హైకోర్టుకు నివేదించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తమలో గూడుకట్టుకున్న భయాందోళనలు, సందేహాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ముందుకు రాలేదని, వాటిని నివృత్తి చేసేంతవరకు సమ్మె నుంచి వెనక్కెళ్లేది లేదని తెలిపారు. ఉద్యోగ సంఘాల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, ఎ.సత్యప్రసాద్ల వాదనలను రికార్డు చేసుకున్న ధర్మాసనం... తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, రాజకీయ అంశమైన విభజనపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రవికుమార్, ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి.దానయ్య వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం వీటిని శనివారం మరోసారి విచారించింది. శనివారం విచారణ ప్రారంభం కాగానే న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. గత 45 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఉద్యోగుల భయాందోళనలు, సందేహాలను నివృత్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. అందువల్లే సమ్మెను కొనసాగించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేంతవరకు సమ్మెపై వెనక్కి వెళ్లేది లేదని ఉద్యోగులు చెబుతున్నారని విన్నవించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీ క్లయింట్ (ఏపీఎన్జీవోలు) ఏమంటారు?’’ అని న్యాయవాది మోహన్‌రెడ్డిని ప్రశ్నించింది. వారు తమ కార్యనిర్వాహక కమిటీ భేటీలో చర్చించిన తరువాత ఏ విషయం చెబుతారని, ఇందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని మోహన్‌రెడ్డి విన్నవించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరిస్తూ... ‘‘మీ క్లయింట్ ఇక్కడే ఉన్నట్లున్నారు. వారితో మాట్లాడి ఏ విషయమూ మాకు ఇప్పుడే చెప్పండి’’ అని స్పష్టం చేసింది. దీంతో మోహన్‌రెడ్డి కోర్టు హాలులో ఉన్న ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్‌బాబుతో మాట్లాడారు. అనంతరం మోహన్‌రెడ్డి.. సమ్మెను విరమించేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధంగా లేరని నివేదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ...‘‘సంతోషం... ఏదో ఒకటి, మాకు స్పష్టతనిచ్చారు. ఈ మొత్తం వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకుంటారని ఆశించాం. మీరు (ఉద్యోగులు) చాలా కాలం గా సమ్మె చేస్తున్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెపై పునరాలోచిస్తారని భావించాం. సమ్మె కొందరి ఇగోకు ప్రయోజనకారిగా మారింది. అలాగని మేము ఎవరినీ తప్పుపట్టడం లేదు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నది రాజకీయ నిర్ణయంపై కాబట్టి, ఆ నిర్ణయంలో మేము జోక్యం చేసుకోలేం. ఉద్యోగ సమస్యలపై సమ్మె చేస్తుంటే తగిన న్యాయం చేసేవాళ్లం. చట్టాలు ఎక్కడా సమ్మె చేయాలని చెప్పడం లేదు. ఇటీవల జూనియర్ డాక్టర్లు మేం చెప్పిన వెంటనే సమ్మె విరమించారు. వారి సమస్యలకో పరిష్కారం చూపాం’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. -
మంత్రులకు సమైక్య సెగ
సచివాలయుంలో అడ్డుకున్న ఉద్యోగులు రాష్ట్ర సమైక్యతను కాపాడాలని వేడుకోలు సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ సమావేశం కోసం వెళ్లిన సీమాంధ్ర మంత్రులకు శుక్రవారం సచివాలయంలో సమైక్య సెగ తగిలింది. రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా సమ్మె చేస్తూ సచివాలయంలో తవు నిరసనను ప్రదర్శిస్తూ వస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు మంత్రులను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి నమస్కరిస్తూ అర్థించారు. విభజనతో సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు, యువజనలు తీవ్రంగా నష్టపోతారని, ఈ గండం నుంచి గట్టెక్కించాలని, దాదాపు రెండు నెలలుగా జీతాలు తీసుకోకుండా సమ్మె చేస్తున్నామని, తమ మొర ఆలకించాలని కోరారు. వుంత్రివర్గ సమావేశం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వుుందుగా బయటకు రాగా, నిరసనలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు వెంటనే సమతా బ్లాకు వద్దకు చేరుకున్నారు. మంత్రి వాహనం ఎక్కకుండా అడ్డుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు మీరేమి చేస్తారో చెప్పాలంటూ వుంత్రిని ప్రశ్నించారు. మంత్రులంతా రాష్ట్రం విడిపోకుండా చూడాలంటూ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని అభ్యర్థించారు. వుంత్రి బొత్స ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై తవుకు సానుభూతి ఉందని వుంత్రి అన్నపుడు, తమకు సానుభూతి అక్కర్లేదు, న్యాయం కావాలన్నారు. ఉద్యోగుల సమస్యలను వినేందుకు సిద్ధంగా ఉన్నామని, చర్చలకు రావాలని బొత్స ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళి, బాలరాజులను కూడా ఉద్యోగులు అడ్డుకున్నారు. రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేయాలన్నారు. ఉద్యోగుల మనోభీష్టం మేరకే తావుూ పోరాడుతున్నామని, ఉద్యోగుల సమస్యలను పార్టీ హైకమాండ్‌కు వివరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. -
జై తెలంగాణ అంటేనే కొడుతుండ్రు.. అట్లయితేసీఎంను ఎన్నిసార్లు కొట్టాలె?
కిరణ్ జై సమైక్యాంధ్ర అంటున్నాడుగా.. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టాలి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలి ‘చలో నకిరేకల్’ సభలో కోదండరాం నల్లగొండ/నకిరేకల్, న్యూస్‌లైన్: ‘జై తెలంగాణ అన్నందుకే తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దూదిమెట్ల బాలరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్‌లను సీమాంధ్ర ఉద్యోగులు కొడుతుండ్రు.. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ జై సమైక్యాంధ్ర.. అంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని మనం ఎన్నిసార్లు కొట్టాలె?’ అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. ఏపీఎన్జీఓల సభ సందర్భంగా దూదిమెట్ల బాలరాజుపై సీమాంధ్ర గూండాలు, ఉద్యోగులు దాడి చేయడాన్ని ఖండిస్తూ టీవీఎన్‌ఎస్, టీఎస్‌జేఏసీ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో శుక్రవారం ‘చలో నకిరేకల్’ నిరసన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం ప్రసంగిస్తూ.. తెలంగాణ పేరెత్తితేనే దాడులకు దిగుతున్న సీమాంధ్రులు.. సమైక్యంగా ఉండాలని కోరుకోవడం సిగ్గుచేటన్నారు. బాలరాజుపై దాడి యావత్ తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మాభిమానంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ‘ తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేస్తున్న కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపైనే ఉంది’ అన్నారు. కాగా, అంతకుముందు కోదండరాం నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదని, యూటీ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలంతా మళ్లీ ఉవ్వెత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. బలవంతంగా కలిసి ఉండాలని ఉద్యమించడం నాగరికతకు విరుద్ధమన్నారు. ఈనెల 29న సకల జనభేరి సభను జయప్రదం చేయాలన్నారు. ‘భేరి’కి అనుమతి వస్తుందన్న ధీమా ఉంది ‘సకల జనభేరి’ సభకు పోలీసుల నుంచి అనుమతి వస్తుందన్న విశ్వాసం ఉందని టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం పెన్షనర్స్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సకల జనభేరి నిర్వహణకు అనుమతి ఇస్తామని పోలీసులు గతంలోనూ చెప్పారు. తప్పనిసరిగా దీన్ని విశ్వసిస్తున్నాం. ఎటువంటి అవరోధాలు సృష్టించబోరని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యం ప్రజల మధ్య విద్వేషాలు ఉద్భవించి గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. ఇవన్నీ అంతం కావాలంటే శాంతియుత విభజన జరగాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ జిల్లాను ఆదర్శంగా తీసుకుని ఈనెల 22నుంచి అన్ని జిల్లాల్లో జేఏసీ ఆధ్వర్యంలో రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు తక్షణమే లక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని కోదండరాం తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తెలంగాణలో విద్యార్థి, నిరుద్యోగుల పరిస్థితి’ అనే అంశంపై సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని కొందరు అసమర్ధ నేతల వల్లే మనకు దక్కాల్సిన ఉద్యోగాల్ని సీమాంధ్రులు కొల్లగొట్టారని అన్నారు. -
సమ్మె విరమించేది లేదు: సీమాంధ్ర ఉద్యోగులు
రాష్ట్ర విభజన ప్రక్రియను ఉపసంహరించుకునేంత వరకు సమ్మె విరమించబోమని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమింపజేసేందుకు మంత్రి వర్గ ఉపసంఘం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సచివాలయ ఉద్యోగులతో మంత్రి వర్గ ఉపసంఘం శుక్రవారం సాయంత్రం భేటి అయ్యింది. ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని సమ్మెను విరమించాల్సిందిగా వారిని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. అయితే దీనిపై ఉద్యోగులు ఎలాంటి హామీ ఇవ్వలేదని మంత్రి చెప్పారు. సమ్మెతో కంటే విభజన వల్ల వచ్చే సమస్యలే ఎక్కువని సీమాంధ్ర ఉద్యోగులు చెప్పారు. సమ్మె చేయాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. -
సమ్మె నుంచి వెనక్కి తగ్గలేం: సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్: ఉద్యోగుల చేస్తున్న సమ్మెపై ఎలాంటి హామీ లభించలేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించమని కోరామన్నారు. కాగా, ఉద్యోగుల నుంచి ఎలాంటి హామీ లభించలేదన్నారు. ఇదిలా ఉండగా సమ్మెతో కంటే విభజన వల్లే వచ్చే సమస్యలు ఎక్కువని సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు. తమ అవసరాన్ని ప్రజలు గుర్తించారని వారు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న సమ్మె నుంచి వెనక్కి తగ్గలేమని ఉద్యోగులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే. -
సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో మంత్రవర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది. విధులకు హాజరుకాకుండా సమ్మెను తీవ్రరూపంలోకి తీసుకువెళ్లిన ఉద్యోగులు సమ్మె విరమించాలని మంత్రి వర్గ ఉపసంఘం కోరనుంది. ఏపీఎన్జీవోలు ఎవరితోనైనా తాము చర్చలకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశమైంది. కాగా, సమావేశానికి ఏపీఎన్జీవోలు, రెవిన్యూ ఉద్యోగుల సంఘం గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీ తదితరులు పాల్గొని ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని శుక్రవారం కూడా విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఏపీఎన్జీవోలు తమ వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం వల్ల ఎవరికా లాభం కలుగుతోందని హైకోర్టు ఉద్యోగులను ప్రశ్నించింది. సమ్మె విరమించుకుంటారా లేదా స్పష్టంగా రేపటిలోగా చెప్పాలని ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. సమ్మె పిటిషన్‌పై రేపు కూడా వాదనలు కొనసాగే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే. -
విజయమ్మతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల భేటీ
-
సమ్మె విరమణకు ససేమిరా
సాక్షి; హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు 50 రోజులు పూర్తిచేసుకున్నాయి. గురువారం 50వ రోజు నిరసనలను ఉద్యోగులు వినూత్న రీతిలో నిర్వహించారు. సమైక్య గణేశుని పూజించి ర్యాలీగా సాగి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ‘గణేశా.. గణేశా.. రాష్ట్రాన్ని రక్షించు..’ అంటూ నినాదాలతో ర్యాలీ తీశారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కూడా గురువారానికి 17వ రోజుకు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపడుతున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరారు. అయితే సీఎస్ అభ్యర్థనను సచివాలయ ఉద్యోగులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు సీఎస్‌కు స్పష్టం చేశారు. సమ్మె కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేయక పేదలకు నిత్యావసర సరుకులు అందడం లేదని ఉద్యోగులకు సీఎస్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లకు ఆటంకం కలుగుతోందని, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. సమస్యలను మంత్రివర్గ ఉపసంఘానికి వివరించి పరిష్కారం పొందవచ్చని సూచించారు. అయితే రాష్ట్ర విభజనతో ఉద్యోగులే కాకుండా సీమాంధ్ర విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, సామాజిక బాధ్యతతో తాము సమ్మె చేపడుతున్నామని ఉద్యోగులు సీఎస్‌తో చెప్పారు. ఇలా ఎన్ని రోజులు సమ్మె కొనసాగిస్తారని సీఎస్ ప్రశ్నించగా రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిపి వేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకూ కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సమ్మె రోజులకుగాను తాము జీతం కూడా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో ఎన్ని రోజులు సమ్మె కొనసాగినా వేతనాలు కోరబోమన్నారు. 25న ఢిల్లీకి సీమాంధ్ర ఉద్యోగులు.. సమైక్య ఆందోళనలను దేశ రాజధానికి విస్తరించాలని నిర్ణయించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అందులో భాగంగా 25న ఢిల్లీ పయనమవుతున్నారు. వరుసగా 3 రోజులపాటు రాజధానిలో వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించినట్టు సచి వాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య చెప్పారు. గురువారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నిరసనల ప్రణాళికను వెల్లడించారు. ఏపీఎన్జీవోల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో నిర్వహించనున్న సమావేశానికి తమను ఆహ్వానిస్తే వెళ్లి సమస్యలను చెప్పుకుంటామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులందరం పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. 27న జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ధర్నాకు బీజేపీ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామన్నారు. చర్చలకు రండి మంత్రివర్గ ఉపసంఘం ఆహ్వానం సభ ఉన్నందున రాలేమన్న సంఘాలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఆహ్వానించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో చర్చలు జరుగుతాయని తెలిపింది. అయితే శుక్రవారం విజయవాడలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరుగుతున్నందున చర్చలకు రాలేమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఆదివారం అయితే చర్చలకు వస్తామని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. -
ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాల్సిందేనని ఆ ప్రాంత ఉద్యోగులు పునరుద్ఘాటించారు. ‘రాజీనామాలు చేయాలంటూ ప్రజలు మమ్మల్ని ఒత్తిడి చేయలేదు’ అంటూ వారు చేసిన ప్రకటనను సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ ఖండించింది. ఎంపీల రాజీనామా డిమాండ్‌తోనే ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించారని, అదే డిమాండ్‌తో సమ్మెకు దిగారని గుర్తు చేసింది. జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అధ్యక్షతన అన్ని ఉద్యోగ, కార్మిక, పౌర సంఘాలు సోమవారం సమావేశమయ్యాయి. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీనామాలు చేయాలంటూ ప్రజల నుంచి ఒత్తిడి లేదని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ధైర్యముంటే ఇదే విషయాన్ని వారి వారి నియోజకవర్గాల్లో సభలు పెట్టి చెప్పాలని సవాలు విసిరారు. తర్వాత ప్రజలే వారి సంగతి చూస్తారన్నారు. రాజీనామాలు చేయకుండా, ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధ’మంటూ మాటలు చెబితే ప్రజలు నమ్మరన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. విభజన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడానికి వారంతా అసెంబ్లీలో ఉండాలన్నారు. తీర్మానం వీగిపోయాక రాజీనామాలు చేసినా, సభను రద్దు చేసినా అభ్యంతరం లేదన్నారు. పార్టీలు విప్ జారీ చేసినా విభజన తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని ఎమ్మెల్యేలను కోరారు. సమైక్య రాష్ట్రాన్ని కోరే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తీర్మానాన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామన్నారు. విద్యార్థులు, చిన్న పిల్లలను ఉద్యమంలోకి తీసుకురావద్దనే అభిప్రాయముందని, దీనిపై జేఏసీ చర్చిస్తోందని చెప్పారు. జేఏసీ నాయకత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తిని విలేకరులు ప్రస్తావించగా ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమన్నారు. ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తుండటం నిజమేనన్నారు. అందుకే వాటిని రెండు రోజులు నిలిపేస్తున్నామని, తర్వాత వారు కూడా ఉద్యమంలోకి వచ్చి సాధారణ చార్జీలు వసూలు చేసే అవకాశముందని తెలిపారు. మరోసారి ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలిసే యోచన ఉందన్నారు. ఉద్యమంలో చేపట్టే రోజువారీ కార్యక్రమాల పర్యవేక్షణకు కోర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు పౌర సంఘాలకూ కమిటీలో చోటు కల్పిస్తామన్నారు. కమిటీ కార్యవర్గాన్ని ఈ నెల 20న విజయవాడ సభలో ప్రకటిస్తామన్నారు. 23న హిందూపురంలో, 29న కర్నూలులో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల జేఏసీ యథాతథంగా కొనసాగుతుందన్నారు. -
జోరు పెరిగిన సమైక్య ఉద్యమం
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం జోరు పెరిగింది. సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, ర్యాలీలు, వినూత్న నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగాయి. మరోవైపు.. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులకు ఉద్యమ సెగ త గిలింది. టెక్కలిలో ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటిని జేఏసీ నేతలు, సభ్యులు ముట్టడించి నినాదాలు చేశారు. అక్కడ జరుగుతున్న గృహ నిర్మాణ శాఖాధికారుల సమీక్షను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ నాయకుడు చింతాడ గణపతి చొక్కా చిరిగిపోయింది. దీంతో ఉద్యమకారులు ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. మందస బస్టాండ్‌లో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పీసీసీ ఉపాధ్యక్షురాలు మజ్జి శారదను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తాను సమైక్యవాదినేనని ఆమె స్పష్టం చేయటంతో గొడవ సద్దుమణిగింది. శ్రీకాకుళంలో బీజేపీ సమావేశాన్ని ఉద్యమకారులు అడ్డుకుని నేతలను నిలదీశారు. శ్రీకాకుళంలో ఖజానా శాఖ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి మావనహారం చేపట్టారు. రిమ్స్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. సుందర సత్సంగం సభ్యులు వైఎస్ఆర్ కూడలిలో రుద్రాభిషేకం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలో కంచిలి మండల రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల కూర్చున్నారు. గృహనిర్మాణశాఖ ఉద్యోగుల రిలే దీక్షల్లో గార, కోటబొమ్మాళి మండలాల అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జెడ్పీ ఉద్యోగులు కుటుంబాలతో సహా గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఆందజేశారు. వైద్యులు, న్యాయవాదులు, నీటి పారుదల శాఖ ఉద్యోగులు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వైఎస్ఆర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. పురపాలక సంఘం, పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాలిటెక్నిక్ అధ్యాపకుల రిలే దీక్షలు కొనసాగాయి. పాలకొండలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వద్ద అల్లూరి, టంగుటూరు ప్రకాశం పంతులు, షిర్డీసాయి వేషధారణలతో సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు రిలే దీక్షలో పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిం చారు. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్ద తంపటాపల్లి, టీకేరాజపురం, అట్టలి, తుమరాడ, బుక్కూరు, బెజ్జి, పనుకువలస పాఠశాలల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. సంగీత విభావరి నిర్వహించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు సంకెళ్లు వేసి సోనియాగాంధీ తన చుట్టూ తిప్పుకుంటున్నట్టు ప్రదర్శించారు. భామినిలో ప్రైవేటు పాఠశాలలను మూయిం చారు. సీతంపేట ఐటీడీఏలో ఏపీఓ నాగోరావు గిరిజన దర్బార్ నిర్వహిస్తుండగా సమైక్యవాదులు అడ్డుకున్నారు. వీరఘట్టం మండలం తెట్టంగి, నవగాంలో ఉపాధ్యాయులు జనచైతన్య యాత్రలు నిర్వహించారు. టెక్కలిలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు విన్యాసాలను ప్రదర్శించారు. లింగాలవలస ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఆమదాలవలసలో జేఏసీ, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. మున్సిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. చింతాడలో గ్రామస్తులు, రొట్టవలసలో విద్యార్థులు రోడ్డును దిగ్బంధించారు. పొందూరు, బూర్జ తదితర మండలాల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. నరసన్నపేటలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలాకి మండలం డోల జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు మానవహారం చేపట్టి రిలేదీక్షలో పాల్గొన్నారు, జలుమూరు, సారవకోటల్లో రిలే దీక్షలు కొనసాగాయి. పలాసలో టీడీపీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రెస్‌క్లబ్‌లు వేర్వేరుగా చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. మరదరాజపురంలో సమైక్యవాదులు జలదీక్ష చేపట్టారు. టెక్కలిపట్నం, వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటులో ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. తప్పెటగుళ్ల ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి మండలాల్లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. పాతపట్నంలో ఉద్యోగులు మొక్కజొన్న పొత్తులు విక్రయించి నిరసన తెలిపారు. ఎచ్చెర్లలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూని వర్సిటీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని దుకాణాలను మూయించారు. -
విభజనపై అపోహలు తొలగించండి: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తూ వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. ఇందుకోసం పీఆర్టీయూ ముందుండి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగులకు భద్రత ఉండదని, చిక్కులు వస్తాయంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, సీమాంధ్ర ఉద్యోగులు కావాలనే ఆందోళనలు చేస్తున్నారేమోనని అన్నారు. వాటిని తిప్పికొట్టేవిధంగా ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్లో యూనియన్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం’- అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జానారెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలు వస్తాయా? ప్రభుత్వం చేయాల్సిందేమిటి? అనే అంశాలపై సీమాంధ్ర ఉద్యోగులకు తెలియజేసేలా, అందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టేలా ఆచరణాత్మక నివేదికను రూపొందించాలని జానారెడ్డి పేర్కొన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతోపాటు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఉద్యోగులకు సంబంధించి పదో పీఆర్సీ నివేదిక త్వరగా వచ్చేలా కృషిచేస్తామని, ఒకవేళ ఆలస్యమైతే మధ్యంతర భృతి త్వరగా ఇచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సమస్యగా ఉన్న ఆర్టికల్ 371-డిని తొలగించాల్సిన అవసరం లేదని, సవరణకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సమైక్య ఉద్యమం మీడియా వల్లే వచ్చిందని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో వందల ఎకరాలు ఉన్న వారు, పెట్టుబడిదారులు కొంతమంది ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యోగులది గంటన్నర, రెండు గంటల ఉద్యమమని అన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగులకు భద్రత లేదన్న వాదన సరికాదని సమాచార శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. విభజన సమయంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తారని, అందులో పంపకాలు, సర్వీసు రూల్స్ అన్నీ చర్చించి నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ ప్రక్రియకు కృషి చేయండి: ఎమ్మెల్సీలు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేలా 371-డి సవరణకు, తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేసేందుకు ఇక్కడి మంత్రులు, ఎంపీలు కృషి చేయాలని ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. 371-డిలో ప్రభుత్వ టీచర్లు అనేది ఉందని, పంచాయతీరాజ్ అనేది లేనందున లక్షల మంది టీచర్లు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త సర్వీసు రూల్స్ తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. -
సమ్మెపై పునరాలోచించండి: జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీలు
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్ కో సీఎండీలు అభిప్రాయపడ్డారు. సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచించుకోవాలని వారు సూచించారు. విద్యుత్ ఉత్పత్తి తగ్గితే ప్రధాన రంగాలైన రైల్వే,ఆసుపత్రులు, సాగునీటికి విద్యుత్ అందజేయవలసి ఉంటుందని తెలిపారు. అయితే సీమాంధ్రులు చేపట్టిన సమ్మెకు ప్రత్యామ్నాయ ప్రణాళిక అవసరం లేదని భావిస్తున్నట్లు వారు వివరించారు. జులై 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. దాంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం రోజురోజూకు ఉధృతం అవుతోంది. ఇప్పటికే ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ తదితర సంస్థలు నిరవధిక సమ్మెకు దిగాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు నేటి అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ట్రాన్స్‌కో , జెన్కో సీఎండీలకు ఆయా ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. అంతేకాకుండా ఉద్యోగులకు గతంలో అందజేసిన సిమ్ కార్డులను ఆయా విద్యుత్ సంస్థలకు తిరిగి అందజేశారు. -
తెలంగాణలో ఆగని బలిదానాలు: ముగ్గురి మృతి.. ఒకరి ఆత్మహత్యాయత్నం
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ఆత్మబలిదానాలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన సభ తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెంది మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, మరొకరు గుండెపోటుతో మరణించారు. రంగారెడ్డి జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి(18) శనివారం ఏపీఎన్జీవోల సభకు సంబంధించిన దృశ్యాలను టీవీలో చూస్తూ కలత చెంది, మధ్యాహ్నం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే, బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కొంకటి పర్శరాములు(45) శనివారం ఏపీఎన్జీవోల సభకు సంబంధించిన దృశ్యాలను టీవీలో చూస్తూ ఉద్వేగానికి లోనై కుర్చీలోనే కుప్పకూలిపోయి మరణించాడు. మెదక్ జిల్లా బాచేపల్లి పంచాయతీ బల్కంచెల్క తండాకు చెందిన మూడ్ సంగ్రాం (23) కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ వార్తలను టీవీలో చూస్తూ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచాడు. మరో ఘటనలో... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన కట్టె మిషన్ రాజు (25) కూడా సమైక్య సభ విశేషాలను టీవీలో చూస్తూ తీవ్ర మనస్తాపానికి గురై, పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
తిరిగి వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడులు
ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు అనంతరం సీమాంధ్రకు తిరిగి వెళ్తున్న ఐదు బస్సులపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పలుచోట్ల రాళ్ల దాడులకు పాల్పడ్డారు. విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిలోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మధ్య ఈ దాడులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్‌లోని సన్రైస్ ఆసుపత్రి సమీపంలో ఒక బస్సు, రేడియో స్టేషన్ సమీపంలో ఒక బస్సు, లక్ష్మారెడ్డిపాలెంలో రెండు బస్సులు, అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఒక బస్సుపై రాళ్లు విసిరారు. దీంతో ఆ బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కమర్షియల్ టాక్స్ ఉద్యోగి కట్టా సత్యనారాయణ, డ్రైవర్ విఘ్నేష్ గాయపడ్డారు. సత్యనారాయణను చికిత్స నిమిత్తం సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి అనంతరం బస్సులో వెళ్తున్న వారంతా లక్ష్మారెడ్డిపాలెం వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో మాకు రక్షణ లేదని, పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు అరగంట సేపు ఆందోళన నిర్వహించగా కిలో మీటరు మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, వనస్థలిపురం ఏసీపీ ఆనంద్భాస్కర్లు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అనంతరం బస్సులను పోలీసు ఎస్కార్ట్ సహాయంతో పంపించారు. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన దాడి ఘటనలో.. బస్సులోంచి దిగిన ఉద్యోగులు రామోజీ ఫిలింసిటీ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. తెలంగాణవాదులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దీంతో అక్కడికి చేరుకున్న హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్ వారిని శాంతింపజేసి బస్సును ఎస్కార్ట్ సాయంతో ముందుకు పంపారు. -
తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు సభలో పాల్గొని తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో సన్‌రైజ్ ఆస్పత్రి సమీపంలో బస్సుపై కొంతమంది యువకులు రాళ్లతో దాడి చేశారు. కొంత దూరం నుంచి తమ బస్సు వెనకాలే బైకుపై వస్తున్న ముగ్గురు యువకులు దాదాపు మూడు కిలోల రాయి తీసుకుని డ్రైవర్ వెనకాలే ఉన్న అద్దాన్ని పగలగొట్టారని ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న వంశీ అనే ఉద్యోగి తెలిపారు. ఎస్కార్టు వాహనం వెనకాల ఉన్న మొదటి బస్సు తమదేనని, అయినా కూడా బస్సుపై దాడి చేశారని ఆయన చెప్పారు. దీంతో అద్దాలు పగిలి కొంతమందికి కంట్లో అద్దం పెంకులు గుచ్చుకున్నాయి. కమర్షియల్ టాక్స్ ఉద్యోగి కట్టా సత్యనారాయణ (50)కు ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు వెనక ఉన్న బస్సులను పటిష్ఠ బందోబస్తుతో తీసుకెళ్లారు. క్షతగాత్రులకు హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో సత్యవాణి ప్రసంగం
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 6
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 5
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 4
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 3
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో మిత్రా ప్రసంగం
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 2
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 1
-
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకోసం తరలివస్తున్న APNGOS Part - 2
-
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకోసం తరలివస్తున్న APNGOS
-
లోపల జనహోరు.... బయట జనం బార్లు
హైదరాబాద్ : స్టేడియం లోపల జనహోరు.... స్టేడియం బయట జనం బార్లు.... 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పరిస్తితి ఇది. సభకు వచ్చిన వారితో స్టేడియం మొత్తం నిండిపోయింది. స్టేడియంలోని స్టాండ్లన్నీ నిండిపోయాయి. గ్రౌండ్ లోపల వేసిన కుర్చీలు కూడా నిండుతున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద ఇంకా వందలమంది సంఖ్యలో ఉద్యోగులు వేచి ఉన్నారు. దూరాభారాన్ని లెక్కచేయకుండా సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి వస్తున్నారు. సాంస్కృతిక వేదికగా నామకరణం చేసిన 'గురజాడ అప్పారావు' వేదికపై నుంచి కళాకారులు ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభపై బంధ్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా దూరప్రాంతాల నుంచి ఉద్యోగులు సభకు వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభం కానుంది. స్టేడియంకు దారితీసే మార్గాలన్నీ సమైక్యాంద్ర ఉద్యోగులతో కిక్కిరిపోయాయి. పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన ద్వారం నుంచి ఉద్యోగులంతా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. గుర్తింపు కార్డులను పరిశీలించి పోలీసులు ఉద్యోగులను లోనికి పంపిస్తున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా స్టేడియంకు వస్తున్నారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి. -
సభకు అడ్డంకులు కల్పించొద్దు : ఉద్యోగులు
-
నేడే ‘సమైక్య’ సభ
-
సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఎన్ని రోజులైనా ఉద్యమిస్తాం
సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగుల సమర నినాదం..దాదాపు 6 లక్షల మందికి అందని జీతాలు అయినా వెనుకడుగు వేసేది లేదంటున్న ఉద్యోగులు జీతం రాకుంటే అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటామంటున్న చిరుద్యోగులు తాము జీతాలు తీసుకోకుండా ఉద్యమిస్తున్నా.. నేతలు పదవులు వదులుకోవడం లేదని మండిపాటు ...ఒకరిద్దరు కాదు.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సుమారు 6 లక్షల మంది ఉద్యోగులందరిదీ ఇదే మాట! అందరిదీ సమైక్య నినాదమే!! జీతాలు రాకపోయినా ఫర్వాలేదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్య పెట్టం.. రాష్ట్రాన్ని మాత్రం సమైక్యంగా ఉంచాల్సిందేనని వారు నినదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పట్నుంచీ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నెలరోజులకు పైగా గడచిపోయాయి. సమ్మె కాలానికి ఎవరికీ జీతాలు అందలేదు. ఇందులో నెల జీతం వస్తే తప్ప కుటుంబం గడవని అటెండర్లు, స్వీపర్లు, వాచ్మన్ల వంటి చిరుద్యోగులు సైతం ఉన్నారు. స్వీపర్ నుంచి గెజిటెడ్ స్థాయి ఉద్యోగుల వరకు ఉద్యమంలోకి దూకడంతో 13 జిల్లాల్లో పాలన పూర్తిగా స్తంభించింది. ఉద్యోగులకు జీతాలే కాదు.. అనేక కార్యాలయాలకు తాళాలు పడడంతో ప్రభుత్వం కూడా వేల కోట్లలో ఆదాయాన్ని కోల్పోతోంది. నెలసరి వేతనాలు అందని నేపథ్యంలో 13 జిల్లాల్లోని పలువురు ఉద్యోగులను ‘సాక్షి’ పలకరించింది. ఎవరిని కదిపినా వారు చెబుతోంది ఒక్కటే.. సమైక్యాంధ్రప్రదేశ్ కావాలని, అందుకోసం ఎందాకైనా పోరాడతామని!! తాము జీతాలు కూడా ముట్టకుండా ఉద్యమంలో పాల్గొంటుంటే రాజకీయ నాయకులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదని మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పాలక, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకుండా పదవులను పట్టుకొని వేలాడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం ఠంచనుగా నెల జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడుతుండగా.. అసలు జీతాలే తీసుకోకుండా ఉద్యోగులు ఉద్యమ పథంలో నడుస్తుండటం గమనార్హం. అప్పులు చేస్తాం.. కానీ ఉద్యమాన్ని వీడం ఒక్క అనంతపురం జిల్లాలోనే 62,130 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నారు. వీరంతా ఆగస్టు నెల జీతాలు తీసుకోలేదు. ఈ ఉద్యోగులకు రూ.147 కోట్లకుపైగా జీతాలు రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో 27 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందలేదు. బిల్లుల తయారు చేసే డీడీవోలు, ట్రెజరీ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన పనులన్నీ స్తంభించిపోయాయి. విధులకు హాజరవుతున్న కొందరు పోలీసు, న్యాయశాఖలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం జీతాలు అందజేసింది. కృష్ణా జిల్లాలో 135 శాఖలకు చెందిన ఉద్యోగులకు సుమారు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు మంజూరు కాలేదు. మిగతా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. జీతాలు రాకుంటే అప్పులైనా చేసి కుటుంబాన్ని పోషించుకుంటాం తప్ప ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ‘మాకు ఈనెల జీతం రాకపోవడంతో అప్పు చేసి బాడుగ, పాలు, గ్యాస్ సిలిండర్ తదితర కుటుంబ అవసరాలు తీర్చుకున్నాం. జీతాలు రాలేదని భయపడితే ఉద్యమంలో పాల్గొనలేం. అప్పులతోనైనా ఏదో విధంగా కుటుంబాన్ని నెట్టుకొస్తాం తప్ప ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు’ అని కడపకు చెందిన వారాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు చెప్పారు. ‘జీతం రాకుంటే ఎలాగో అలా సర్దుకుంటాం. మాకు సమైక్యాంధ్ర ఉద్యమమే ప్రధానం. వేతనాలు ఇవ్వకపోయినా ఉద్యమాన్ని వీడబోం’ అని గుంటూరుకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి ఎస్కే బాజిత్ చెప్పారు. ‘జీతం రాకపోవడంతో పిల్లల ఫీజులు కట్టలేకపోయాం. ఇంట్లో చిల్లర ఖర్చు, తల్లిదండ్రుల మందుల ఖర్చు, చిట్‌ఫండ్‌కు చెల్లించాల్సిన వాయిదాలు, రుణాల చెల్లింపులన్నింటికీ జీతంపైనే ఆధారపడ్డాం. అయినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మె చేయాల్సిందే. ఉద్యోగులు తమ జీతాలను పణంగా పెట్టి పోరాటం చేస్తుంటే రాజకీయ నాయకులు కనీసం మద్దతుగా ఉండకపోవడం దారుణం’ అని ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన పెద సుబ్బారావు మండిపడ్డారు. -సాక్షి నెట్వర్క్ ‘‘నెల జీతం అందితేనే మా ఇల్లు గడుస్తుంది. ఇంటి అద్దె, సరుకులు, పాలు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులన్నీ ఆ జీతంతోనే తీరాలి. నెల జీతం అందకపోయినా ఉన్న డబ్బుతో గడుపుతాం. ఇప్పుడు మేం చేస్తున్న సమ్మె మా కోసం కాదు.. ప్రజలందరి కోసం. జీతం కన్నా జీవితాలే ముఖ్యం. ఎన్ని నెలలు జీతాలు ఇవ్వకపోయినా సమైక్యాంధ్ర కోసం పోరాడతాం..’’ - పీవీ రావు, ఆర్టీసీ కండక్టర్, శ్రీకాకుళం జిల్లా ‘‘సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేదాకా ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కోవడానికైనా మేం సిద్ధం. వేతనాలు ఇవ్వకపోయినా, ఉద్యోగాలు కోల్పోయినా లెక్కచేయం. అప్పులు చేసైనా సమైక్యాంధ్ర కోసం కుటుంబాన్ని పోషించుకుంటూనే ఉద్యమంలో పాల్గొంటాం. మేం జీతాలు తీసుకోకుండా సమ్మె చేస్తున్నా రాజకీయ నాయకులు మాత్రం ఉద్యమంలోకి రాకపోవడం సిగ్గుచేటు’’ - సీహెచ్ రమాదేవి, జెడ్పీ స్కూల్ టీచర్, పశ్చిమగోదావరి జిల్లా ‘‘కుటుంబం నడవాలంటే నెల జీతం రావాలి. ఇప్పటికే అప్పు చేశాను. మరికొంత చేబదులు తీసుకోవాలనుకుంటున్నా. ఈ కష్టం తాత్కాలికమే.. భరిస్తాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అందుకే సమ్మెలో పాల్గొంటున్నా’’ - ఉజ్జినప్ప, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అటెండర్, అనంతపురం జిల్లా ఇప్పుడు వెనుకడుగు వేస్తే అంతే.. ‘‘సమైక్యాంధ్ర కోసం ఈ కష్టం తప్పదు. ఎన్ని బాధలైనా భరిస్తాం. కుటుంబ పోషణకు అప్పు చేస్తాను. ఇప్పుడు వెనుకడుగు వేస్తే భవిష్యత్తులో భరించలేని కష్టాలు ఎదురవుతాయి. పిల్లల విద్య, ఉద్యోగాల గురించి తలచుకుంటే భయం వేస్తోంది. - ఎన్.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎ సెక్షన్ ఆఫీస్ సబార్డినేటర్, విశాఖపట్నం రాష్ట్రం చీలిపోతుందన్న బాధే ఎక్కువుంది.. ‘‘నాకు రూ. 3,500 జీతం వస్తుంది. నా జీతంపైనే ఆరుగురు కుటుంబ సభ్యులు ఆధారపడ్డారు. పదేళ్లుగా పనిచేస్తున్నాను. రేషన్‌కార్డుపై వచ్చే బియ్యం చాలవు. పూరింట్లో ఉంటున్నాం. జీతంతోనే ఇంట్లో పాలు, సరుకులు ఇతర అవసరాలు తీర్చాలి. అప్పులు తీర్చాలి. నాతోటి వాళ్లందరిదీ ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా రాష్ట్రం చీలిపోతుందనే బాధే ఎక్కువగా ఉంది. రాష్ట్రం కోసం ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ - మండ సూరయ్య, గ్రామ సేవకుడు, సింగన్నవలస, పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా సమైక్యాంధ్ర కోసం తప్పడం లేదు.. ‘‘నా పేరు రాజు. నేను సాలూరు ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్నా. నెల జీతం రూ.6500. కుటుంబమంతా నా జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఈ నెల జీతం రాక ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. అమ్మకు మందులు కొనుగోలు చేయడానికి అప్పు చేయూల్సి వచ్చింది. సరుకులు కూడా కొనుగోలు చేయలేదు. సమ్మె వల్ల ఇబ్బందే అరుునా సమైక్యాంధ్ర కోసం తప్పడం లేదు’’ -ఎంవీఎస్ఆర్సీహెచ్ రాజు, ఆర్టీసీ మెకానిక్, విజయనగరం ఉద్యమాన్ని ఆపేది లేదు.. ‘‘కాంగ్రెస్ అధిష్టానం దుశ్చర్య కారణంగా ఉద్యమించాల్సిన పరి స్థితి వచ్చింది. మా జీతభత్యాలు ప్రభుత్వం ఆపినా, ఎస్మాలు, గిస్మా లు ప్రయోగించినా ఉద్యమాన్ని ఆపేదిలేదు. చివరకు మా కుటుంబాలు నీరు తాగైనా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. సమైక్యాంధ్ర సాధించే వరకూ వెనుకడుగు వేయం’’ - జీవీ గణేష్‌బాబు, రెవెన్యూ ఉద్యోగి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా -
నేడే ‘సమైక్య’ సభ
సమైక్యవాదం వినిపించటానికి సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు.. ఉద్రిక్త వాతావరణం మధ్య భారీ భద్రతతో సహా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సభను సాయంత్రం ఐదు గంటల కల్లా ముగించాలని పోలీసులు గడువు విధించారు. గడువులోగా సభను ముగించటానికి ప్రయత్నించాలని.. సాధ్యం కాకుంటే గడువు పొడిగించేందుకు అప్పటికప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేయాలని ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమన్వయ కమిటీ నిర్ణయించింది. సభను కేవలం ఉద్యోగులకే పరిమితం చేశారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక కార్డు చూపించిన తర్వాతే పోలీసులు సభా ప్రాంగణంలోనికి అనుమతిస్తారు. సభా ప్రాంగణంలోకి వెళ్లటానికి రెండు గేట్లు ఉన్నాయి. సగం జిల్లాలను ఒక గేట్ నుంచి, మిగతా జిల్లాలను మరో గేట్ నుంచి ఉద్యోగులు ప్రవేశించాలని జేఏసీ నేతలు ఆయా జిల్లాల నేతలకు సూచించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కూడా సభకు అనుమతించరు. సమన్వయ కమిటీలో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో పాటు.. ‘విభజన’ వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు కొంతమంది వివిధ రంగాల నిపుణులకు కూడా సభలో ప్రసంగించే అవకాశం ఇస్తారు. లక్ష మంది ఉద్యోగులు సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు కాని వారు స్టేడియం వెలువల నిలబడి సంఘీభావం తెలిపే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచే ఉద్యోగులను స్టేడియం లోనికి అనుమతిస్తారు. బ్యాగులు, నీళ్ల సీసాలు లోనికి తీసుకెళ్లడానికి వీలుండదు. స్టేడియంలోనే భోజనం, మంచినీరు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి పొట్టిశ్రీరాములు, సభా వేదికకు బూర్గుల రామకృష్ణారావు, స్టేడియం ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీకృష్ణదేవరాయ, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు, సాంస్కృతిక వేదికకు గురజాడ అప్పారావు పేర్లు పెట్టారు. పారామిలటరీ పహారాలో స్టేడియం: ఏపీఎన్జీవోల సభకు పోలీసులు పటిష్ట భద్రతాచర్యలు చేపట్టారు. ఎల్బీ స్టేడియం లోపలికి ఉద్యోగులు మినహా ఇతరులెవరూ అడుగుపెట్టకుండా పూర్తిగా పారా మిలటరీ పహారా ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియానికి వెళ్లే నాలుగు మార్గాలనూ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధి నుంచే ఇనుప కంచెలు, బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. సభకు వచ్చే ఉద్యోగులు ర్యాలీలుగా రాకూడదని, రోడ్ల వెంట నినాదాలు చేయకూడదని పోలీసుశాఖ ఇప్పటికే సూచించింది. ఏపీఎన్జీవో సభకు ఆటంకం కలిగించేందుకు తెలంగాణవాదులెవరూ స్టేడియం వరకూ చేరుకోకుండా పోలీసులు అంచెలవారీగా భద్రత ఏర్పాటుచేశారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసి తరలించేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. మొబైల్ కెమెరాలను కూడా ఏర్పాటుచేసి నిరంతర నిఘా పెడుతున్నారు. కొందరు పోలీసులు సాధారణ దుస్తుల్లో కూడా స్టేడియం లోపల ఉండే ఏర్పాట్లుచేశారు. అవగాహనాసదస్సు మాత్రమే: అశోక్‌బాబు ఒక ఉద్యమం వల్ల మరో ఉద్యమం పలచబడే అవకాశమే లేదని, సమైక్యవాదం వల్ల తెలంగాణ ఉద్యమం బలహీనపడుతుందని అనుకోవటం పొరపాటని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సమన్వయ కమిటీ చైర్మన్ అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరినో కించపరచటానికో, రెచ్చగొట్టటానికో ఈ సభ నిర్వహించటంలేదని స్పష్టం చేశారు. తమది కేవలం అవగాహనా సదస్సు మాత్రమేనని, తమ వాదనను వినిపించటానికే పరిమితమని చెప్పారు. సభను అడ్డుకుంటామంటూ వివిధ సంఘాలు, పార్టీలు చేసిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చే ఉద్యోగులను కొన్ని శక్తులు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి స్పందించకుండా సంయమనం పాటించాలని అశోక్‌బాబు సూచించారు. సభ సజావుగా సాగటానికి సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సభ అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు 15 వేల మంది హాజరవుతారని అంచనా వేశామని, ఇప్పుడు లక్ష మంది వచ్చే అవకాశం ఉందంటే స్పందన ఎంతగా ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. సీమాం ధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇదీ నాలుగంచెల భద్రత... సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల వాహనాలు, రైళ్లను తెలంగాణవాదులు అడ్డుకోకుండా మొబైల్ పోలీసులతో పెట్రోలింగ్. హైవేల్లో, రైల్వేస్టేషన్ల వద్ద నిరంతర పెట్రోలింగ్. తెలంగాణ ప్రాంత జిల్లాల నుంచి నగరంలోకి భారీగా తరలిరాకుండా తనిఖీలు. ఎల్బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ బలగాలు. ఆందోళనకారులను గుర్తించేందుకు మొబైల్ వాహనాల్లో నిఘా కెమెరాలు. స్టేడియం చుట్టూ లోపలికి వెళ్లే మార్గాల్లో తనిఖీలకు ఏపీఎస్పీ, ఏఆర్ సాయుధ పోలీసులు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారాల వద్ద క్షుణ్ణంగా సాయుధ పోలీసులతో తనిఖీ. -
సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు ఖమ్మం జిల్లా పెనుమల్లి పీఎస్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం మండలపాడు వద్ద జరిగింది. రాళ్లదాడిలో చింతలపూడి ఈవోకు స్వల్పగాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటనపై పెనుమల్లి పీఎస్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, నల్గొండ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగేసభకు తెలంగాణవాదులు అడ్డుతగలకుండా చర్యలు తీసుకున్నారు. జాతీయరహదారులపై 10-15 కి.మి చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఐజీ నవీన్‌చంద్ తెలిపారు. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ హైకోర్టు అనుమతి
-
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. మరో వైపు ' సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చూడాలన్న తెలంగాణ న్యాయవాదుల విజ్ఞప్తిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. మరోవైపు ఎల్బీ స్టేడియంలోని ఏర్పాట్లను ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ సభకు ఎంతమంది వస్తారన్న దానిపై అంచనా లేదన్నారు. అయితే ఎవరూ గుంపులు, గుంపులుగా రావద్దని ఆయన సూచించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు. సభను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని అశోక్ అన్నారు. -
ఏపీ ఎన్జీవోల సభను అడ్డుకుని తీరుతాం
హైదరాబాద్ : ఈనెల 7వ తేదీన జరగనున్న ఏపీఏన్జీవోల సభను అడ్డుకుని తీరుతామని ఓయూ జేఏసీ స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో జేఏసీ నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శనివారం రంగారెడ్డి, హైదరాబాద్ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. అదే రోజు జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీవోలు 7న సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 7న ఎల్బీ స్టేడియలో జరిగే.. ఎపీ ఎన్జీవోస్ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో సహా తరలివెళ్తామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. సభను సీమాంధ్ర ఉద్యోగులకు మరింత అవగాహన కలిగించడానికి ఉద్దేశించి జరుతున్నట్లు వారు తెలిపారు. గురువారం కూడా సచివాలయంలో ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ నినాదాలు చేశారు. సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఏ ప్రాంతంవారికి వ్యతిరేకంగా ఈ బహిరంగ సభను నిర్వహించడంలేదని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. -
రెండో రోజూ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు రెండో రోజూ సమ్మె కొనసాగించారు. అన్ని శాఖల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. 92శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం తెలిపింది. అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు వంటి ఉన్నతాధికారులు సైతం నిరసనల్లో పాలుపంచుకున్నారని ఫోరం కార్యదర్శి కేవీ కృష్ణయ్య చెప్పారు. మరోవైపు సచివాలయంలో ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు బుధవారం సచివాలయంలోని వేరు, వేరు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలిపారు. ర్యాలీలు చేయరాదన్న సీఎస్ ఆదేశాల మేరకు నిర్దిష్ట ప్రాంతంలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కె బ్లాకు వద్ద తెలంగాణ ఉద్యోగులు, ఓల్డ్ మెయిన్ గేట్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు వెనక్కి నడిచారు. హైదరాబాద్ రాష్ట్రం తెలుగువారందరిదని నినదించారు. 7 తేదీ హైదరాబాద్‌లో జరగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణవాదుల సభలు, సాగరహారం కార్యక్రమానికి ప్రభుత్వంతో మాట్లాడి మరీ అనుమతి ఇప్పించిన మంత్రి జానారెడ్డి సమైక్యవాదుల సభకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళన విరమణ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కొన్ని రోజులుగా సచివాలయంలో నిరసనలు తెలుపుతున్న తెలంగాణ ఉద్యోగులు తమ ఆందోళనలు విరమిస్తున్నట్టు ప్రకటించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులందరూ అధిక గంటలు పనిచేసి ప్రభుత్వ పథకాలు, కార్యకలాపాలు సజావుగా సాగేలా చేస్తామని సచివాలయ తెలంగాణ సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు తెలిపారు. సీమాంధ్ర ఉన్నతోద్యోగులు ఉద్యోగుల రిజిస్టర్లను తమ వద్ద ఉంచుకుని విధుల్లో పాల్గొనే వారిని బలవంతంగా సమ్మెలోకి దించుతున్నారని ఆరోపించారు. -
పదో తేదీ వరకు ర్యాలీలు, సభలపై నిషేధం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఈనెల పదో తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఈనెల ఏడో తేదీన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఏపీ ఎన్జీవోలు బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టడం, అలా నిర్వహిస్తే తాము దాన్ని అడ్డుకుని తీరుతామని తెలంగాణ ఉద్యోగులు, ఓయూ జేఏసీ నాయకులు ప్రకటించడం లాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, డీజీపీ దినేశ్ రెడ్డి, సీపీ అనురాగ్ శర్మ తదితర ఉన్నతాధికారులు శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు. అలాగే, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకంగా సీఎస్ మహంతితో చర్చలు జరిపారు. ఉద్యోగులతో సమావేశం అనంతరం మహంతి మీడియాతో మాట్లాడారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఉద్యోగులను కోరినట్లు ఆయన తెలిపారు. సచివాలయం జే బ్లాక్ వద్ద టి.ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టడానికి మాత్రమే అవకాశం ఇచ్చామన్నారు. అలాగే సీమాంధ్ర ఉద్యోగులు అమ్మవారి ఆలయం దగ్గర నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో విధులకు 67 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారన్నారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10వ తేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. -
రెచ్చగొట్టడం సీమాంధ్రులకు తగదు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ఉద్యోగులు కావాలనే తెలంగాణవాదులను రెచ్చగొడుతున్నారని.. ఇది సరైం ది కాదని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు ఎన్.ప్రతాప్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సౌ దాలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులకు జరి గిన ఘర్షణలో భాగంగా నిజనిర్ధారణ కమిటీగా వెళ్లిన తెలంగాణ న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్‌లో న్యాయవాదులు విధులు బహిష్కరిం చారు. బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదు ట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షు డు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటనను సీ మాంధ్ర ఉద్యోగులు అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు సో దరభావంతో మెలుగుతారని, సీమాంధ్రుల హ క్కులకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చే శారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి దాసిరి గంగారం, ఉపాధ్యక్షుడు దేవేందర్‌సింగ్, సంయుక్త కార్యదర్శి సుధీర్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు అబ్దుల్ కలీం, హన్మంత్‌రావు, మోహన్‌సింగ్, నరేష్కుమార్ జోషి, అశోక్‌రెడ్డి, శ్రీరాం, ప్రమోద్, మహేంధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సంయుక్త ఉద్యమ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ఉంటుందని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ‘‘రాజీనామాలతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే పార్టీకి, ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటే సీమాంధ్రుల మనోభావాలను కేంద్రానికి వెల్లడించడం కష్టమవుతుందన్నారు. కాబట్టి మరికొంత సమయం వేచిచూద్దామన్నారు’’ అని వెల్లడించారు. ఉద్యమంలో రాజకీయ నేతలు, ఉద్యమ శక్తులు కలిసి పని చేసేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు ప్రతిపాదించగా అంగీకారం తెలిపామన్నారు. త్వరలోనే ఇరు పక్షాలతో కమిటీ వేసి భావి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. తమ ఉద్యమంలో మంత్రులు కలిసి వస్తామని చెప్పడం శుభపరిణామమని, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంటు హాల్లో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఏపీ ఎన్జీవోలు సమావేశమయ్యారు. పలు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు. ఆ వెంటనే వారంతా మరోమారు ఏపీభవన్లోనూ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేవీపీ రామచంద్రరావు పాల్గొన్న ఈ భేటీలోనూ మంత్రులు, ఎంపీల రాజీనామాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని మేమంతా గట్టిగా డిమాండ్ చేశాం. రాజీనామాలు చేయనంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని మంత్రలు, ఎంపీలు అన్నారు. ఆరు నెలల్లో పోయే పదవుల కోసం పాకులాడబోమని, ఉద్యమాన్ని ఉద్యోగులు ముందుకు తీసుకెళ్తామంటే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం అవుతుందంటే ఇప్పుడే రాజీనామాలు ఇస్తామన్నారు. కానీ అలా చేస్తే సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితిని, వాస్తవాలను కేంద్రానికి చెప్పే వీలుండదని చెప్పారు. ఉద్యమ స్వరూపాన్ని వివరించి, విభజన నిర్ణయాన్ని రద్దు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు’’ అని ఆయన వివరించారు. ‘రాజకీయ నాయకులు, ఉద్యమ శక్తులు కలిసి నడుద్దాం. ప్రజాప్రతినిధుల తరఫున ఇద్దరు, ఉద్యోగుల నుంచి కొందరితో కమిటీ వేసుకుని ముందుకెళ్దాం’ అని సూచించారన్నారు. ఆ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఇరుపక్షాల నేతలతో కలిసి కమిటీ వేసి కార్యాచరణపై చర్చించుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాలు ఆంటోనీ కమిటీ ముందుకు వెళ్లడంపై చర్చ జరిగిందని, కానీ అందుకు తాము అంగీకరించలేదని అన్నారు. హైదరాబాద్ సభకు మంత్రుల మద్దతు సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మంత్రులు, ఎంపీలు మద్దతిస్తామన్నారని అశోక్‌బాబు తెలిపారు. వీలును బట్టి అందులో పాల్గొనేందుకు కూడా సిద్ధమని వారు చెప్పారని, తమ హాజరుపై రాజకీయ దుమారం రేగుతుందనుకుంటే తమ ప్రతినిధులను పంపుతామన్నారని చెప్పారు. ‘సభ నిర్వహణలో ఏర్పడుతున్న అడ్డం కులను వారి దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి ఇప్పిస్తామని వారు చెప్పారు’ అన్నారు. వెనక్కు రాకున్నా ముందుకు పోదు ప్రస్తుత ఢిల్లీ పరిస్థితులు, పార్టీల అభిప్రాయాలను చూస్తుంటే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు వెళ్లలేకున్నా ప్రక్రియను మాత్రం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని స్పష్టమైందని అశోక్‌బాబు అన్నారు. ‘‘విభజనతో సీమాంధ్రలో తలెత్తే పలు అంశాలను కేంద్రం విస్మరించిందని, వాటికి పరిష్కారం చూపకపోవడం సరికాదని బీజేపీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, జేడీ(యూ) అభిప్రాయపడ్డాయి’’ అన్నా రు. విభజన సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తెలంగాణ ప్రక్రియపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదన్న నమ్మకం తమకు కలిగిందన్నారు. -
సమైక్య సభకు సీమాంధ్ర లాయర్ల మద్దతు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే నెల 7న హైదరాబాద్‌లో జరిగే సీమాంధ్ర ఉద్యోగుల సమైక్య సభకు హైకోర్టు, రంగారెడ్డి, సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, ఏపీఏటీల సీమాంధ్ర న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించాలని తీర్మానించారు. గత వారం సీమాంధ్ర న్యాయవాదులు నిర్వహించిన సమావేశాన్ని తెలంగాణ న్యాయవాదులు అడ్డుకొని, దాడులకు పాల్పడటాన్ని ఖండించారు. గురువారం ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులు గురువారం సమావేశమయ్యారు. సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, ఎం.ఎస్.ప్రసాద్, కనకమేడల రవీంద్రకుమార్, కాసా జగన్మోహన్రెడ్డి, వై.నాగిరెడ్డి, ఎం.మనోహర్‌రెడ్డి తదితరులతో పాటు సుమారు 250 మంది లాయర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించారు. భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా సి.వి.మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. కమిటీలో ఎవరెవరు ఉండాలో రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. హైదరాబాద్ అందరిదీ అని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరే హక్కు ఎవ్వరికీ లేదని సి.వి.మోహన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అత్యంత హేయమైనదని కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. -
దిగ్విజయ్‌సింగ్‌కి విభజన సెగ!
ఇంటి ముందు సీమాంధ్ర ఉద్యోగుల నిరసన విభజనపై వెనక్కు వెళ్లేది లేదన్న దిగ్విజయ్ రాష్ట్రపతిని కలసిన రఘువీరా, ఆనం, అనంత విభజనపై ముందుకు పోలేరు: అశోక్‌బాబు అద్వానీ, సుష్మాలతో భేటీ.. సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు విభజన సెగ తగిలింది. రాష్ట్ర విభజన అంశంలో వెనక్కి వెళ్లలేమని దిగ్విజయ్ వ్యాఖ్యానించడంతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ఆయన నివాసం ముందు ఆందోళనకు దిగారు. సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగ నేతలు కృష్ణయ్య, మురళి నేతత్వంలో బుధవారం సాయంత్రం వారు దిగ్విజయ్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ విజ్ఞాపన పత్రం అందజేశారు. కానీ తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, దానిపై వెనక్కు వెళ్లలేమని దిగ్విజయ్ స్పష్టం చేయడంతో వారంతా బయటికొచ్చి ఆయన నివాసం ముందు ఆందోళన కు దిగారు. బయటికి వెళ్తున్న దిగ్విజయ్ వాహనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. మరోవైపు సీమాంధ్రకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, వట్టి వసంత్‌కుమార్, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. విభ జన నిర్ణయానికి తిరుగులేదని, దానిపై వెనక్కు వెళ్లే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అక్కడి నేతలే చొరవ చూపాలని చెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు. రాష్ట్ర విభజన యత్నాలకు అడ్డుకట్ట వేయాలని ఆయనను కోరినట్టు సమాచారం. నవ ంబర్ 1న అనంతపురంలో దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంత్యుత్సవాల ముగింపు సభకు ప్రణబ్‌ను వారు ఆహ్వానించారు. ఆంటోనీ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతోనూ రఘువీరా, అనంత భేటీ అయ్యారు. అంతకుముందు దిగ్విజయ్ ఇంటి ముందు అనంత, రఘువీరాలను ఉద్యోగులు అడ్డుకున్నారు. స్వాతంత్య్రోద్యమమే స్ఫూర్తి: అశోక్‌బాబు రాష్ట్ర విభజన నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు వెళ్లలేకున్నా ప్రక్రియను ముందుకు మాత్రం తీసుకెళ్లే పరిస్థితి లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. విభజనతో తలెత్తే సమస్యలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లామని, వారంతా సీమాంధ్రకు అన్యాయం జరిగిందన్న వాదనతో ఏకీభవించారని తెలిపారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలు ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్‌లను కలిశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న సభ జరిపి తీరుతామని స్పష్టం చేశారు. స్వాంతత్య్రోద్యమమే స్ఫూర్తిగా పోరాడి గెలుస్తామన్నారు. అంతకుముందు సుష్మాను కలిసిన ఎన్జీవో నేతలు... సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు వివరించారు. విభజన నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకించాలని కోరారు. చిన్న రాష్ట్రాలకు తాము అనుకూలమే అయినా ఏ ప్రాంతానికీ అన్యాయం జరగడాన్ని ఒప్పుకోబోమని సుష్మా అన్నారు -
దిగ్విజయ్ నివాసాన్ని ముట్టడించిన సీమాంధ్ర ఉద్యోగులు
ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు మండిపడ్డారు.తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇక ఎటువంటి మార్పులు ఉండవని దిగ్విజయ్ ప్రకటించడంతో సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం దిగ్విజయ్ సింగ్ నివాసం వద్దే ధర్నాకు దిగారు. జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఎటువంటి మార్పులేవన్న ఆయన వ్యాఖ్యలను సీమాంధ్ర ఉద్యోగులు ఖండించారు. ఇప్పటికే తెలంగాణపై నిర్ణయం జరిగిపోయినందున ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవన్న ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర ఉద్యగోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యుత్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఆంటోనీ కమిటీతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. గత రెండేళ్లుగా సాగించిన విస్తృతస్థాయి సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల అంగీకారం తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుందని పునరుద్ఘాటించారు. అయితే, తొలుత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మాటపై నిలబడకుండా వెనక్కు తగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా, హడావుడిగా నిర్ణయం తీసుకొన్నదని బీజేపీ సీనియర్ నేత అద్వానీ వ్యాఖ్యానించినట్లు మీడియాలో చూశానన్న దిగ్విజయ్... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ రాసిన లేఖను అద్వానీ ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ప్రశ్నించారు. -
సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకోం
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని సచివాలయం తెలంగాణ అధ్యక్షుడు నరేంద్రావు హెచ్చరించారు. బుధవారం నుంచి సచివాలయంలో తాము కూడా ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఎవరైనా రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. యూపీఏ సమన్వయ కమిటీ ప్రకటించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం రేపు ఢిల్లీకి వెళుతున్నట్లు నరేందర్ రావు తెలిపారు. -
మంత్రుల బృందంతో కమిటి ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు
-
కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
హైదరాబాద్ : సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాయలం ముందు సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. మరోవైపు సీఎం కార్యాలయం ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను భారీగా పెంచిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ మంత్రులు సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను కలిసినవారిలో జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, సారయ్య తదితరులు ఉన్నారు. అంతకు ముందు మంత్రి జానారెడ్డి ఛాంబర్లో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీకీ పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, సుదర్శన్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. జిల్లాల వారీగా తెలంగాణ సాధన సభలపై చర్చ జరిపినట్లు సమాచారం. -
హైదరాబాద్‌పై అందరికీ హక్కుంది!
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఉద్యమబాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం కూడా తమ నిరసనలు కొనసాగించారు. హైదరాబాద్‌పై తెలుగువారందరికీ సమాన హక్కు ఉందని నినదించారు. రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రకటనకు నిరసనగా సామూహికంగా తపస్సు చేశారు. ఉద్యోగులందరమూ ఏపీపీఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా నియమితులైనవారమేనని, ఇందులో ఎవరూ అక్రమంగా ఉద్యోగం పొందినవారు లేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో ఉండే హక్కు ప్రతి ఉద్యోగికీ ఉందని, ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదంటూ నుదుట తెల్లబ్యాడ్జీలు కట్టుకుని.. సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కార్యాలయం ఉండే సమతా బ్లాక్ ఎదుట బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం కో కన్వీనర్ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రుల ఉద్యమాన్ని అర్థం చేసుకుని కేంద్రం తన ప్రకటనను వెనక్కు తీసుకోవడంద్వారా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ నిర్వహించి అన్ని ప్రాంతాల శాసనసభ్యులు తమ అభిప్రాయాలు వినిపించేందుకు అవకాశం కల్పించాలన్నారు. సీమాంధ్ర ఉద్యమంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు నెలల తరబడి విధులు వదిలి ఆందోళన చేపట్టినప్పుడు.. తాము పూర్తిగా సహకరించామని, అదేరీతిలో ఇప్పుడు హక్కులకోసం పోరాడుతున్న తమపై నిందలు వేయడం సహేతుకం కాదని హితవు పలికారు. తమ ఆందోళన తమ హక్కులకోసమే తప్ప ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా కాదని వివరించారు. ఇరుప్రాంతాల ఉద్యోగులమధ్య సుహృద్భావ వాతావరణం చెడగొట్టేందుకు కొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వాటికి తాము ప్రతిస్పందించబోమని చెప్పారు. ఓటు హక్కున్న ప్రతిఒక్కరూ రాజకీయ అంశాలపై పోరాడవచ్చని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఫోరం కార్యదర్శి కె.వి.కృష్ణయ్య పేర్కొన్నారు. విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే భావప్రకటన స్వేచ్ఛను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమమని, లక్షలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మద్దతుగా ఉద్యోగులు కూడా ఆందోళన చేపట్టవచ్చన్నారు. డిమాండ్లు సాధించేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
నిరసన ర్యాలీలు విరమించుకోండి: మంత్రులు
హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగులు నిరసన ర్యాలీలు విరమించుకోవాలని తెలంగాణ ప్రాంత మంత్రులు కోరారు. ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం చర్చలకు ఆహ్వానించింది. అంతకు ముందు మంత్రి జానారెడ్డితో సచివాలయంలో మంత్రులు గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సమావేశం అయ్యారు. మరోవైపు భారీ భద్రత మధ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. మరోవైపు హైదరాబాద్ బ్రదర్స్ మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌లు సీఎంతో సమావేశం అయ్యారు. కాగా సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీలు, ఆందోళనల నేపథ్యంలో పోలీసులు సచివాలయానికి భారీగా భద్రత పెంచారు. -
‘రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచించాలి’
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 2వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు. ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలని సచివాలయ ఉద్యోగులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బుధవారం కలిసి సమ్మె నోటీసును అందజేశారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారమూ తమ ఆందోళన కొనసాగించారు. ఉద్యోగులందరూ నలుపురంగు దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సచివాలయంలో రక్తదాని శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీలపై నమ్మకం లేదని వారు తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే తమ పిల్లల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలు, ఉద్రిక్తత
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీఎన్జీవో, టీఎన్జీవోల నినాదాలతో రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు మారుమోగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, ధర్నాలను అక్కడక్కడా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరుప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు తెలుపుతుండడంతో కార్యాలయాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోతోంది. ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేం దుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘అన్నదమ్ముల్లా ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకు వచ్చావా’ అంటూ ఆయన్నుఘెరావ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు వారిని తోసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి తులసిరెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవో నేతల అరెస్టు సమైక్యాంధ్రను కోరుతూ విద్యుత్‌సౌధలో మంగళవారం భోజన విరామ సమయంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఇరిగేషన్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు బి.మల్లికార్జున్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీమా భవన్లో ధర్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మంగళవారం అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో ఏపీ ఎన్జీవోలు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, వైద్యవిధానపరిషత్, ఏపీసాక్, డీహెచ్ తదితర శాఖల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి మౌనప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో టీఎన్జీఓలు ఒక్కసారిగా కార్యాల యాల నుంచి బయటకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సెప్టెంబర్ 3 నుంచి సచివాలయ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వచ్చే నెల 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రకటించారు. ఈమేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసులు అందజేస్తామని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని పునసమీక్షించుకునేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. ఉద్యోగులందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సచివాలయ ప్రధాన ద్వారం, ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట బైటాయించారు. హైదరాబాద్ అందరిదని, రాజధానిని వదిలిపోమని నినదించారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం నేతలు మీడియాతో మాట్లాడారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనందున నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు ఫోరం చైర్మన్ యు. మురళీకృష్ణ చెప్పారు. వచ్చే నెల 2తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు ప్రకటించారు. -
నల్లదుస్తులతో సీమాంధ్ర ఉద్యోగుల నిరసనలు
హైదరాబాద్ : సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత విధులు బహిష్కరించిన ఉద్యోగులు రోజుకో రీతిన తమ నిరసనలు తెలుపుతున్నారు. మంగళవారం భోజన విరామ సమయంలో నల్ల దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. సీ, డీ బ్లాక్‌ల ముందు ఆందోళనకు దిగారు. విభజన ప్రక్రియ తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాజీనామాల ప్రకటనలు మాని సీమాంధ్ర ప్రాంత మంత్రులు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీతభత్యాలు కోల్పోతూ, ఎస్మా చట్టాలను సైతం ఎదురించి ఉద్యోగులు ఉద్యమంలోకి దిగితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులను పట్టుకుని వేళ్లాడకుండా వెంటనే రాజీనామాలు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలకు మండలి బుద్ధ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. -
విద్యుత్‌సౌధలో వద్ద మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్ : విద్యుత్ సౌథ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం పోటా పోటీగా సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒకరి నిరసనను మరొకరు అడ్డుకునే యత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ ఉద్యోగుల నిరసన సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొనగా, సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ వచ్చారు. ఈ సమయంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా, పరకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సమైక్యవాదుల దీక్షలో పాల్గొన్న పరకాల ప్రభాకర్ విభజన కుట్రను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. -
వీహెచ్‌పై తిరుమలలో కేసు
సాక్షి నెట్వర్క్: హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తిరుమలలో చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆదివారం తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు, భావోద్వేగాలు రగిల్చే విధంగా ఉన్నాయని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ తిరుపతిలో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హనుమంతరావుపై చట్ట పరిధిలో సెక్షన్ 153 ప్రకారం రెచ్చగొట్టడం, 153 ఏ ప్రకారం ప్రాంతాల మధ్య, జనం మధ్య విద్వేషాలు ఉసిగొల్పడమనే సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ మల్లికార్జున్ తెలిపారు. కాగా, వీహెచ్‌పై కేసు నమోదు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవి నాయుడు, ప్రధాన కార్యదర్శి తోట వాసు కూడా ఆదివారం తిరుమల టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విశాఖలోనూ ఫిర్యాదు.. : సీమాంధ్రుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన వీహెచ్ 24 గంటల్లో అరెస్టు చేయాలంటూ సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసి సభ్యులు ఆదివారం విశాఖ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఏయూ మెయిన్‌గేట్ వద్ద వీహెచ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలతో మందగించిన పనులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా సర్వీసు విషయాలు, వేతనాల పెంపు వంటి అంశాలపై గళమెత్తే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇటు తెలంగాణ ఉద్యోగులు, అటు సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు కేవలం రాష్ట్ర విభజన అంశంపైనే మాట్లాడుతున్నారు. వేతనాల పెంపునకు సంబంధించి పదో వేతన సవరణ సంఘం గురించి ఉద్యోగులు అస్సలే పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సమైక్య రాష్ట్రంలో ఉద్యోగుల పీఆర్సీ అమల్లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాంత ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుపైనే ఆ ప్రాంత ఉద్యోగులు దృష్టి సారించారు తప్ప పదో వేతన సవరణ సంఘం, మధ్యంతర భృతి గురించి పట్టించుకోవడం లేదు. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఆందోళనలు, సమ్మెలు చేస్తున్నారు. తొమ్మిదో వేతన సవరణ సంఘం కాలపరిమితి జూన్ నెలాఖరుతో ముగియడంతో జూలై 1 నుంచి పదో వేతన సవరణ సంఘం అమల్లోకి రావాల్సి ఉంది. ఈ మేరకు పదో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు ఈ సంఘానికి అగర్వాల్‌ను చైర్మన్‌గా కూడా నియమించింది. తొలుత ఉద్యోగ సంఘాలు తమకు మధ్యంతర భృతి వద్దని వీలైనంత త్వరగా పీఆర్సీనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ కల్లా పీఆర్సీ నివేదికను సమర్పించాలని అగర్వాల్‌కు సూచించింది. అయితే ఇప్పుడు విభజన సెగ పీఆర్సీ పనితీరుపైనా పడింది. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు సెలవు రోజుల్లో కూడా అగర్వాల్‌తో సహా ఇతర సిబ్బంది కూడా పనిచేసేవారు. ప్రకటన వెలువడిన తర్వాత ఉద్యోగుల హాజరు అంతంత మాత్రంగా ఉండటంతో పని మందగించింది. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కూడా త్వరలో సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నందున పీఆర్సీ పని పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సమైక్య రాష్ట్రంలో పదో పీఆర్సీ ఏర్పాటు చేసినప్పటికీ విభజన తర్వాతే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందే: వి.హనుమంతరావు
సాక్షి, తిరుమల, తిరుపతి, హైదరాబాద్: కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం చేసుకొనేందుకు తిరుమల వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఉండడానికి వీల్లేదని, ఒకవేళ ఉండాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేయాలని తిరుమలలో మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు నిరసన తెలిపేందుకు తిరుగుప్రయాణమైన వీహెచ్ వాహనాన్ని అలిపిరి వద్ద అడ్డుకున్నారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి నిరసనకారులు ప్రయత్నిస్తుండగానే.. పోలీసులు లాఠీచార్జికి దిగారు. దాంతో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి, వీహెచ్ వాహనాన్ని అక్కడినుంచి పంపేశారు. వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యల వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు చెప్పారు. మరోవైపు వీహెచ్ కారుపై దాడికి ఓ ప్రైవేటు న్యూస్ చానల్ సిబ్బంది ఉసిగొల్పారని పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుమలలో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణ, సీమాంధ్ర అన్నదమ్ములుగా విడిపోదాం. ఒక్క ఉద్యోగులు మినహా హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు. ఆ ఉద్యోగులు కూడా ఉద్యోగాలకు రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉండవచ్చు. రేషియో ప్రకారం ఉద్యోగులు పోయేటోళ్లు పోతారు. మిగతావారు ఉండొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్లను వెళ్లగొట్టరు. అది ఒక అపోహ మాత్రమే. వీ విల్ గివ్ ఫుల్ సపోర్ట్ దెమ్’’ అని పేర్కొన్నారు. ఎన్జీవోల ఉద్యమాన్ని రాజకీయ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. వీహెచ్ వ్యాఖ్యలను తెలుసుకున్న కొందరు సమైక్యవాదులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి నిరసన తెలపడానికి అలిపిరి టోల్‌గేటు వద్ద కాపుకాశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వీహెచ్ కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దాంతో సమైక్యవాదులు కారుకు అడ్డంగా పడుకుని వీహెచ్‌ను కిందికి దిగాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయన దిగకపోవడంతో, పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించేయత్నం చేశారు. అయినా.. వారు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జి ప్రారంభించారు. అదేసమయంలో ఆందోళనకారుల్లో ఒకరు వీహెచ్ వాహనంపైకి చెప్పు విసిరారు. చివరికి పోలీసులు వీహెచ్ కారును పంపించివేశారు. ఈ ఘటనలో పది మంది ఉద్యమకారులకు, ఒక పోలీసు కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వీహెచ్ వాహనాన్ని తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద, విమానాశ్రయం వద్ద కూడా అడ్డుకునేందుకు సమైక్యవాదులు యత్నించారు. వివాదాస్పద వ్యాఖ్యల వల్లే ఉద్రిక్తత: ఎస్పీ వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లే తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు చెప్పారు. వీహెచ్ కారును అడ్డగించిన 20 మందిపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నేడు రాయలసీమ బంద్‌కు పిలుపు లాఠీచార్జికి నిరసనగా ఆదివారం రాయలసీమ బంద్‌కు సమైక్యవాదులు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ శాంతియుతంగా పుష్పగుచ్ఛాలు ఇవ్వడానికి వచ్చామని, తమపై పోలీసులు అమానుషంగా దాడి చేశారని చెప్పారు. నాపై దాడి దారుణం: వీహెచ్ సమైక్యవాదులు తనపై దాడికి యత్నించడం దారుణమని ఎంపీ వీహెచ్ హైదరాబాద్‌లో పేర్కొన్నారు. కొందరు తనకు పూలు ఇచ్చి నిరసన తెలుపుతున్న సమయంలోనే వెనుక నుంచి కొందరు చెప్పులు విసిరారన్నారు. తెలంగాణపై వైఎస్సార్ జమానాలో నోరెత్తని నాయకులు ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దాడికి ప్రయత్నించింది ఎవరో తనకు తెలుసని వీహెచ్ పేర్కొన్నారు. -
సమ్మెకు వెళ్లే యోచనలో సీమాంధ్ర ఉద్యోగులు
-
సమ్మెకు వెళ్లే యోచనలో సీమాంధ్ర ఉద్యోగులు
హైదరాబాద్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులు నిరసనలో భాగంగా నేడు సామూహిక సెలవులు పెట్టారు. దాదాపు 2 వేల మంది ఉద్యోగులు సెలవు పెట్టి విధులు గైర్హాజయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అటెండర్ మొదలు అడిషనల్ సెక్రటరీ వరకూ నేడు సెలవు పెట్టారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు సెలవులో ఉండటంతో సచివాలయం బోసిపోయింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు వెళ్లే యోచనలో ఉన్నారు. శనివారం లేదా సోమవారం వారు సమ్మె నోటీసు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నారు. కాగా విభజనపై జరుగుతున్న సీమాంధ్ర ఉద్యోగుల నిరసన నిన్న ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. అబిడ్స్‌లో బీమాభవన్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరికొకరు తోపులాటలు జరగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించండి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓల జేఏసీ సూచించింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ కె.రాజేందర్‌రెడ్డి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మణ్, ఎల్.రామ్మోహన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, వారి భద్రతకు ఇక్కడి ఉద్యోగులదే బాధ్యత అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందామని, తెలంగాణ ప్రక్రియను అడ్డుకునే వారికి ఇక్కడి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ధర్నాలో ఉద్యోగ జేఏసీ నాయకులు మల్లారెడ్డి, కైలాసం, వెంకటేశ్వర్లు, విక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంటోనీ కమిటీతో భేటీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆంటోనీ కమిటీని కలవడానికి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. కమిటీని కలవడానికి ఆసక్తి ఉన్న సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనకు అవి అంగీకరించాయి. బుధవారమిక్కడ జరిగిన ఉపసంఘం భేటీకి ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఏపీఎన్జీవో సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడారు. రాజనర్సింహ దాదాపు మౌనంగానే ఉన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఉపసంఘం మాత్రం దాని మీద కాకుండా ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యలపైనే ఆసక్తి కనపరిచింది. సమ్మె విరమించాలని, స్వాతంత్య్రవేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించారు. ఆంటోనీ కమిటీతో భేటీకి ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందాలను ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళుతుందా లేక అపాయింట్మెంట్ ఇప్పించడానికే పరిమితమవుతుందా అనే విషయంలో మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. ఢిల్లీ ఎవరు వెళ్లేది రేపు గుంటూరులోప్రకటన మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ రాజకీయ కమిటీనే అయినా అధికార పార్టీకి సంబంధించినది కాబట్టి కలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈనెల 16న గుంటూరులో జరిగే అన్ని సంఘాల సమావేశంలో ఢిల్లీ యాత్రకు ఏఏ సంఘాల ప్రతినిధులు వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏం మాట్లాడారంటే.. ఏపీఎన్జీవోలు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లలేదు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగాం. ఉద్యోగులంతా ఒక్కతాటి మీద నిలబడి సమ్మె చేసిన సందర్భం ఇప్పటివరకు చరిత్రలోనే లేదు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్: మంత్రుల భార్యలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తేనే ఖబడ్దార్ అంటున్న పరిస్థితి ఉంది. సమైక్య నిర్ణయం వచ్చే వరకు ఉద్యమం ఆగదు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం: ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం: కమిటీ ముందు హాజరు కావటంపై చర్చించి నిర్ణయిస్తాం. -
ఏపీ భవన్లో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అందులోభాగంగా ఏపీ భవన్లో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు ఆ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ భవన్లో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ పాల్గొన్నారు. వారికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. -
డి బ్లాక్ ముందు సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన
-
హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ: ఏపీ ఎన్జీవో సంఘం
సమైక్యాంధ్ర కోసం ఆందోళనను తీవ్రతరం చేస్తామని ఏపీ ఎన్జీవోలు బుధవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెలలో హైదరాబాద్‌లో భారీ సమైక్య బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలోని ముఖ్యనేతలతో సమావేశం కానున్నట్లు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెను విరమించేందుకు ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. అటు ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం రాజనర్సింహ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలతోపాటు ఇటు ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవోలు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు పోరం ప్రతినిధులు ఆ భేటీకి హాజరయ్యారు. అయితే సచివాలయంలో భేటీ జరుగుతున్న సమావేశం హాలు ముందు సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు ఈ సందర్భంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
టీ.ఉద్యోగులను సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొడుతున్నారు
తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా సీమాంధ్ర ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన వెంటనే విరమించుకోవాలిని ఆయన డిమాండ్ చేశారు. మా సంయమనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని ఆయన సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని ఈ ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుందన్నారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసనలు ఆపకుంటే ఈ నెల 17న తమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందని నరేందర్‌రావు స్ఫష్టం చేశారు. -
ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించిన మేకపాటి
-
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ వ్యతిరేకం: కోదండరాం
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ వ్యతిరేకమని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. వారి చర్యలు అధర్మమని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16 నుంచి తెలంగాణ ప్రాంతంలో జేఏసీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. అలాగే ఈ నెలాఖరులో రాజధాని హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతం వెనకబాటుకు సీమాంధ్ర మంత్రులే కారణమని కోదండరాం ఈ సందర్భంగా ఆరోపించారు. ఆ విషయంలో సీమాంధ్ర మంత్రులను వారి భార్యలే నిలదీయాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు గవర్నర్ నరసింహన్ ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
సీమాంధ్రలో స్తంభించనున్న పాలన
-
సీమాంధ్రలో స్తంభించిన పాలన
సమ్మె విరమించాలన్న మంత్రివర్గ ఉపసంఘం తిరస్కరించిన ఏపీఎన్జీవో, ఉద్యోగ సంఘాలు 13 జిల్లాల్లో 123 డిపోల్లో నిలిచిపోయిన బస్సులు నిలిచిపోనున్న ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు అత్యవసర సేవలకు సమ్మె మినహాయింపు సమ్మెపై ఉపాధ్యాయుల నిర్ణయం నేడు వెల్లడి! తిరుమల బస్సులకూ బ్రేక్.. నాలుగు దశాబ్దాల తర్వాత నిలిచిన సర్వీసులు సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేస్తేనే విభజన నిర్ణయం ఆగుతుంది: ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్న వారు.. నాలుగో తరగతి ఉద్యోగులు డ్రైవర్లు, ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, వీఆర్వోలు, గ్రామసహాయకులు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్, టీటీడీ ఉద్యోగులు మొత్తం 3.5 లక్షల మంది. ‘ట్రెజరీ’ సమ్మెతో 150 కోట్ల రాబడికి అంతరాయం (రోజుకు) సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల సీమాంధ్ర 13 జిల్లాల్లోని 123 డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ప్రభావం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఏపీఎన్జీవోలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని నాలుగో తరగతి ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, డ్రైవర్లు సమ్మెలో ఉన్నారు. దీంతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటంతో.. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. సీమాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వానికి రోజూ రూ. 147 నుంచి రూ. 150 కోట్లు రాబడి వస్తుంది. ట్రెజరీ ఉద్యోగుల సమ్మె వల్ల ప్రభుత్వ రాబడి నిలిచిపోనుంది. ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే విషయంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం నిర్ణయాన్ని వెలువరించే అవకాశముంది. అయితే.. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ సమ్మెలో పాల్గొననున్నట్లు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి సోమవారం ప్రకటించారు. సమ్మె యథాతథం: ఏపీఎన్జీవో నిరవధిక సమ్మెను ఆఖరి అస్త్రంగానే ఉపయోగించాలని, సమ్మె వల్ల పౌరసేవలకు విఘాతం కలుగుతుందని, అందువల్ల సమ్మె నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సోమవారం చేసిన విజ్ఞప్తికి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించలేదు. సమ్మె నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని, యథాతథంగా సమ్మె ఉంటుందని స్పష్టం చేశాయి. భేటీ అనంతరం.. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షడు రాయుడు అప్పారావు, ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు యోగీశ్వర్‌రెడ్డి, ఖజానా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్, సహకార ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఫణి పేర్రాజు.. తదితరులతో కలిసి ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. పౌర సేవలకు విఘాతం కలుగుతుందని, సమ్మె యోచన విరమించుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. సమ్మె విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, వీఆర్వోలు, గ్రామసహాయకులు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్, టీటీడీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. ‘‘హింసకు తావు లేకుండా సమ్మె చేస్తామన్నారు. ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని గుర్తించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. ‘సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాలనే డిమాండ్‌తోనే సమ్మెకు వెళుతున్నట్లు గతంలో ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో అసలు రాజీనామాల గురించే ప్రస్తావించలేదు..?’ అని విలేకరులు అడిగినప్పుడు.. ‘‘మంత్రివర్గ ఉపసంఘానికి ఉన్న పరిధి, బాధ్యతలు ఏమిటి? ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి ఏర్పాటయిన కమిటీ అది. సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటయింది కాదు. రాజీనామాల గురించి కమిటీకి చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే కమిటీ పిలిచి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది’’ అని వారు బదులిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమకు అత్యధిక ప్రాధాన్యత ఉన్న అంశం కాదని, తమకున్న టాప్ టెన్ అంశాల్లో అదొకటని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంపీల రాజీనామాలతోనే విభజన ఆగుతుంది... ఎంపీలు రాజీనామాలు చేస్తేనే పార్లమెంటులో రాజకీయ శూన్యత వస్తుందని, అందువల్ల విభజన ఆగిపోతుందని, అందుకే తాము ఎంపీల రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశామని ఉద్యోగ సంఘాల నేతలు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే పార్లమెంట్, అసెంబ్లీలో సీమాంధ్ర వాణిని వినిపించటం సాధ్యం కాదని మంత్రులు అంటున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘శ్రీకృష్ణ కమిటీ కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేశారు. కమిటీ రాష్ట్రమంతా తిరిగి అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించి సమగ్రంగా నివేదిక సమర్పించింది. విభజన వల్ల రాష్ట్రంలో అశాంతి ఏర్పడుతుందని, రాష్ట్రం నష్టపోతుందని కమిటీ చెప్పింది. ఆఖరు ప్రత్యామ్నాయంగానే విభజనకు మొగ్గు చూపాలని సూచించింది. కమిటీ నివేదిక మీద ఇప్పటికీ చర్చ జరగలేదు. శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిన తర్వాత.. ఇప్పుడు కొత్తగా చర్చించేది, సీమాంధ్ర వాణి వినిపించేది ఏమి ఉంటుంది? రాజీనామాలే ఇప్పుడు విభజనను అడ్డుకోగలవు’’ అని వారు పేర్కొన్నారు. టీ-ఉద్యోగులు అడ్డుకోకుండా సహకరించాలి.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత ఉద్యోగులు గతంలో చేసిన సమ్మె, వంటా వార్పు, ఇతర నిరసన కార్యక్రమాలను తాము అడ్డుకోలేదని, ఇప్పుడు తమ నిరసనలను అడ్డుకోకుండా సహకరించాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయులు కూడా కలిసొస్తే.. మొత్తం 4.5 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. 2009 డిసెంబర్ 9న చేసిన తెలంగాణ అనుకూల, 23న చేసిన ఉపసంహరణ ప్రకటనలు, జూలై 30న ప్రకటించిన నిర్ణయం అన్నీ పొరపాట్లేనన్నారు. ప్రజల సహకారంతో సమ్మెకు వెళుతున్నామని, ఎవరి ప్రోద్బలం, సహకారం లేవని మరో పశ్నకు సమాధానంగా చెప్పారు. సమ్మె నుంచి అత్యవసర సేవలు మినహాయించామన్నారు. స్వాంతంత్ర వేడుకల మీద సమ్మె ప్రభావం ఉండదని, ఉద్యోగులంతా జెండా వందనం చేస్తారని చెప్పారు. సీఎస్‌కు సమ్మె నోటీసులు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, వాణిజ్య పన్నుల ఎన్జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం.. సోమవారం వేర్వేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నాయి. మరోవైపు విజయవాడలో పౌర సరఫరాల ఉద్యోగులు తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు. 13 సీమాంధ్ర జిల్లాల ట్రాన్స్‌కో ఉద్యోగ ప్రతినిధులు సమావేశమై సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. బెంగళూరు టు విజయవాడ రూ. 3 వేలు! సాక్షి, బెంగళూరు: రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు క్యాష్ చేసుకుంటున్నారు. బస్సు టికెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తూ ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు ప్రైవేటు బస్సు టికెట్ ధర సుమారు రూ. 1000గా ఉండగా.. గత శుక్రవారం నుంచి దీనిని రూ. 3000గా వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఈ ధరలను చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. సమ్మెలో పౌరసరఫరాల ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు సమాచారం ఇచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగిన నేపథ్యంలో వాటికి సంఘీభావంగా ఈ 13 జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు కూడా సమ్మె చేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకూ తాళాలు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు కూడా రాష్ట్ర విభజన సెగ తాకింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని సీమాంధ్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఫోరం నిర్ణయించింది. ఫలితంగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో స్థిరాస్తి క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లతోపాటు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని లావాదేవీలు ఆగిపోనున్నాయి. ‘‘రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు సంబంధించి సీమాంధ్ర 13 జిల్లాల్లో అటెండర్ స్థాయి నుంచి గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి వరకూ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయాలని నిర్ణయించాం’’ అని సీమాంధ్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఫోరం ప్రతినిధులు బాలస్వామి, భాస్కర్‌రావు, బాలాజీ తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల మద్దతు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు రాష్ట్ర పంచాయతీరాజ్ ఉద్యోగుల సంక్షేమ సం ఘం మద్దతిస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర తెలిపారు. ఆయా జిల్లాల కార్యవర్గాల ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు ప్రాంతాల్లోని ఉద్యోగులు తమ ఆకాంక్షల కు అనుగుణంగా ఉద్యమాల్లో పాల్గొనవచ్చని, సమ్మె చేయవచ్చని పేర్కొన్నారు. -
చంద్రబాబుతో భేటి అయిన సీమాంద్ర ఉద్యోగులు
-
డీఎంహెచ్ఎస్లో విభజన సెగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు, ఏపీఎన్జీవోలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఇరు ప్రాంతాల ఉద్యోగుల పోటా పోటీ నినాదాలు, కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బుధవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ధర్నాకు ఇతర శాఖల ఏపీఎన్జీవోలు తరలిరావడంపై టీఎన్జీవోలు అభ్యంతరం తెలిపారు. దీంతో సీమాంధ్ర ఉద్యోగులు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేయగా.. తెలంగాణ ఉద్యోగులు ‘జై తెలంగాణ’ నినాదాలు ప్రారంభించారు. డీఎంహెచ్ఎస్లో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులు తప్ప ఇతరులు అక్కడ నిరసన వ్యక్తం చేయవద్దంటూ టీఎన్జీవోలు గేట్లు మూసి వేశారు. దాంతో ఆగ్రహించిన ఇతర శాఖల ఏపీఎన్జీవోలు ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా.. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏపీఎన్జీవోలను పోలీసులతో అరెస్టు చేయించారని, తెలంగాణ వస్తే సీమాంధ్రులకు హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోతుందని ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. మరోవైపు... అమరుల బలిదానాలతో వ స్తున్న తెలంగాణను అడ్డుకుంటే సహించేది లేదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేత జూపల్లి రాజేందర్, టీఎన్జీవో నాయకులు హెచ్చరించారు. ఏపీఎన్జీవోలు తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విద్యుత్‌సౌధలో నిరసన: విద్యుత్ సౌధలో బుధవారం సీమాంధ్ర ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలైనా చేసేందుకు సిద్ధమంటూ ఒక వ్యంగ్య నాటికను ప్రదర్శించారు. అంతకుముందు హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీని ఏర్పాటుచేసుకొని దానికి చైర్మన్‌గా నర్సింహులు అనే ఉద్యోగిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి ఉద్యోగులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ లేదన్నారు. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీఎన్జీవోలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని.. జరగబోయే సమ్మెకు తమ పూర్తి సంఘీభావం ఉంటుందని తెలిపారు. -
12 అర్ధరాత్రి నుంచి సమ్మె : ఏపీ ఎన్జీవోల ప్రకటన
సీఎస్‌కు సమ్మె నోటీసు: సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు సమరశంఖం పూరించారు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. సమ్మెలో దాదాపు 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, విద్యుత్ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు పాల్గొననున్నారు. ఈ మేరకు వివిధ శాఖలు, విభాగాలకు చెందిన దాదాపు 70 సంఘాల పక్షాన ఏపీఎన్జీవోలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి సమ్మె నోటీసు ఇచ్చారు. అనంతరం ఏపీఎన్జీవో నేతలు సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించటం స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని.. కేవలం 10 - 11 ఎంపీ స్థానాల కోసం రాష్ట్రాన్ని విభజించటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ఉద్యోగుల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సీఎస్‌ను కోరామన్నారు. విభజనను జీర్ణించుకోలేకపోతున్నారు... రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించి ఉద్యమించటానికి సిద్ధమని ప్రకటించారు. తమచేత ఉద్యోగాలు చేయిస్తారో, ఉద్యమాలు చేయిస్తారో.. కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నేతలు చంద్రశేఖరరెడ్డి, వీరేంద్రబాబు, వెంకటేశ్వరరెడ్డి, గంగిరెడ్డి, లూక్, సత్యనారాయణ, శోభ, రత్నకుమారి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ విభజనను సీమాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎక్కడో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిక్షా కార్మికుడు సైతం హైదరాబాద్ తమది కాదన్న మాటకు బాధపడుతూ స్వచ్ఛందంగా ఆందోళనకు దిగుతున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర ఎంపీలంతా రాజీనామా చేయాలి... సీమాంధ్ర ఎంపీలు అందరూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలకు, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తే.. పార్లమెంటులో రాజకీయ శూన్యత ఏర్పడి విభజన ఆగిపోతుందని విశ్వసిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. ఎంపీలను వారి పార్టీలకు రాజీనామాలు చేయమని తాము అడగటం లేదని, పదవులను మాత్రమే త్యజించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం చిన్న ఉద్యమం చేయటానికి కూడా పార్టీలు, నాయకులు ముందుకురాకపోవటం సీమాంధ్ర ప్రజల దురదృష్టమని విచారం వ్యక్తంచేశారు. ఈ నెల 12వ తేదీలోగా సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాలకు, మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలంతా పదవులు త్యజిస్తే.. సమ్మె విషయంలో పునరాలోచన ఉంటుందని సంఘాల నాయకులు చెప్పారు. భావి తరాల భవిత కోసమే... తమ ఉద్యోగాలు పోతాయనే భయంతో తాము ఉద్యమం చేయటం లేదని.. రాష్ట్ర విభజనను అడ్డుకోవటానికి ఏమీ చేయలేకపోయారని భవిష్యత్ తరం తమను నిందించకూడదనే ఈ ఆందోళనకు దిగుతున్నామని పేర్కొన్నారు. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లలో ఆస్తులను అమ్ముకుని హైదరాబాద్‌లో చిన్న గూడు కొనుక్కున్న ఉద్యోగులను హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మని అంటే ఎక్కడికి వెళతారని వారు ప్రశ్నించారు. రాజధాని అంటే.. ఆస్తులు, పెట్టబడులు, లక్షలాది ఉద్యోగాలతో పాటు బంధాలు, ప్రేమలు, అభిమానాలు, అనుబంధాల సమ్మిళితమని పేర్కొన్నారు. సమ్మె వల్ల తమకు ఒక నెల జీతమే పోతుందని, విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని చెప్పారు. విభజన నష్టంతో పోలిస్తే.. ఉద్యోగులకు జరిగే నష్టం ఎక్కువేమీ కాదన్నారు. సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటుందని, విభజన వల్ల జరిగే కష్టం, నష్టంతో పోలిస్తే సమ్మె వల్ల కలిగే ఇబ్బంది పెద్దదేమీ కాదని చెప్పారు. జాతీయ పార్టీల నేతలనూ కలుస్తాం...: రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలను కలవటంతో పాటు 12వ తేదీ తర్వాత ఢిల్లీ వెళ్లి జాతీయ పార్టీల నేతలనూ కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఏకాభిప్రాయం ఉన్న చోట్ల చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అభ్యంతరం లేదని.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వ పెద్దలనూ నిలదీస్తామన్నారు. రాజకీయ అంశాలపైన ఉద్యోగులు సమ్మె చేయవచ్చా? అని విలేకరులు అడిగినప్పుడు.. ‘‘సాధారణ పరిస్థితుల్లో అయితే చేయకూడదు. విభజన అంశం.. రాజకీయ, సామాజిక కోణాల్లో చూడాలి. సమాజం మీద, ఉద్యోగుల మీద నేరుగా ప్రభావించే సమయాల్లో నిరసన వ్యక్తం చేయటానికి సమ్మె చేయచ్చు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటానికి, సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనల్లో భాగం పంచుకోవటానికి ఉద్యోగులుగా మా వంతు బాధ్యతను నిర్వర్తించటం మా కర్తవ్యంగా భావిస్తున్నాం’’ అని వారు వివరించారు. విభజనను ఆపి అభిప్రాయాలు సేకరించాలి ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని, వారి సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు చేశామని కాంగ్రెస్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సీడబ్ల్యూసీలో నిర్ణయాన్ని నిలిపివేసి ఇరు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగుల నుంచి హైలెవల్ కమిటీ అభిప్రాయాలు సేకరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో 3.5 లక్షల మంది ఉద్యోగులు... ఈ నెల 12వ తేదీ (సోమవారం) అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారని సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, విద్యుత్ శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉంటారని చెప్పారు. ఈమేరకు ఆయా సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 4న విజయవాడలో జరిగిన సమావేశంలో దాదాపు 70 సంఘాలు సమ్మెలో పాల్గొంటామని తెలిపాయని, అన్ని సంఘాల తరఫున తామే (ఏపీఎన్జీవో) సమ్మె నోటీసు ఇచ్చామని చెప్పారు. -
సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం
సాక్షి; హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల ప్రయోజనాలకు ఏ చిన్న నష్టం వాటిల్లినా సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల రక్షణ, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయంలో ఆందోళన కొనసాగిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను మంగళవారం పార్టీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి ఉద్యమానికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఏ ఒక్క వర్గంతోనూ చర్చించకుండా ఏకపక్షంగా తెలంగాణ నిర్ణయం ప్రకటించారని మేకపాటి వ్యాఖ్యానించారు. ‘ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ మాయావతి నేతృత్వంలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు నెగ్గి దాన్ని కేంద్రానికి ప్రతిపాదించినా ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఎవరూ కోరని ఆంధ్రప్రదేశ్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేయదలచారు. ఇది కాంగ్రెస్ రాజకీయ కుట్ర. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యల వంటి వాటిపై కనీస స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్ర రాజధానిని తెలంగాణకు ఇస్తే సీమాంధ్రలో సచివాలయం చెట్టు కింద, అసెంబ్లీని గుడిసెలో ఏర్పాటు చేసుకోవాలా? రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయదలచడం దారుణం’ అని అన్నారు. రాష్ట్రాలను విడదీస్తూ పోతే దేశానికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా సహించబోమని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల మేలు కోరి అందరికంటే ముందుగా పదవులకు రాజీనామాలు చేసింది తామేనని గుర్తుచేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఒకప్పటి ఉద్యోగిగా వారి ఆందోళన తనకు తెలుసని, ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు పెట్టాలి: సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ వదిలిపోవాలని కొందరు పేర్కొనడం చాలా బాధ కలిగించిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ‘ఒకరు రాయల తెలంగాణ అంటున్నారు. మరొకరు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమంటున్నారు. ఇంకొకాయన ఆంధ్ర రాజధానికి లక్షల కోట్లిమ్మంటున్నాడు. ఇవన్నీ వృథా. సమైక్యాంధ్రప్రదేశే మా ధ్యేయం’ అని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం సుమోటో కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబరును అందజేశారు. రాష్ట్రం అడుగుతోంది తెలంగాణ వారైతే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు కొత్త రాష్ట్రమిస్తోందని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. అడిగినవారికి ఇవ్వకుండా అడగని వారికి అన్నీ ఇచ్చి వెళ్లిపోమంటున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ‘1956 తరవాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంచుకుని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. నగర నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చెమట బిందువులున్నాయి. గతంలో మద్రాసు, కర్నూలును వదులుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు’ అని అన్నారు. విదేశీ శక్తుల వల్ల దేశానికి ముప్పుందని చెప్పిన ఇందిరాగాంధీ.. ఇంట్లోని విదేశీయురాలు సోనియాగాంధీని పసిగట్టలేక పోయిందని ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బైఠాయించిన ఉద్యోగులు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళనను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించి రోడ్లపై బైఠాయించారు. సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యోగ భద్రత, రక్షణపై కేంద్రం భరోసా కల్పించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు. -
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : సమైక్య సెగ ఇప్పుడు రాష్ట్ర రాజధానికి కూడా తాకింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు.. తెలంగాణ ఉద్యోగులు మధ్య మంగళవారం తోపులాట జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భోజన విరామ సమయంలో ఏపీ ఎన్జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు. సమైక్య నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో టీ ఎన్జీవో ఉద్యోగులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఇటు సీమాంధ్ర ఉద్యోగులు.. అటు తెలంగాణ ఉద్యోగులు హోరా హోరిగా నినాదాలు చేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు నిరసన ప్రారంభించగా టీఎన్జీవోలు వారితో ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే అన్నట్లు గట్టిగా పట్టుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట మొదలైంది. ఈ విషయం తెలిసిన ఇతర విభాగాల ఉద్యోగులు భారీ ఎత్తున జలసౌధకు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల ఆందోళనలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్ చెందదని... ఉన్నపళంగా హైదరాబాద్ వదలివెళ్లాలనడనం దుర్మార్గమని రాజమోహన్ రెడ్డి అన్నారు. -
విభజనపై వెనక్కి తగ్గాల్సిందే: సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం
సాక్షి; హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన సోమవారం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వరసగా రెండోరోజూ వందలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సచివాలయం లోపల, బయట ద్వారాల వద్ద బైఠాయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. యూపీఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు. మురళీకృష్ణ స్పష్టం చేశారు. సీమాంధ్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన ఉద్యోగులకు తమ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర విభజనవల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రభుత్వోద్యోగులేనని, అలాంటిది తమకు మాట మాత్రమైనా చెప్పకుండా యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రకటించడం గర్హనీయమని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడక ముందే సీమాంధ్ర ఉద్యోగులందరూ వెళ్లిపోవాలని కేసీఆర్ హెచ్చరిస్తుంటే ఇక తమకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పిన రెండు రోజులకే మాట మార్చారని, ఇక తమ భద్రతకు భరోసా ఎలా కల్పిస్తారని నిలదీశారు. సీమాంధ్ర నాయకులను నమ్మి మోసపోయామని లేకుంటే తెలంగాణ ప్రకటనకు ముందే ఉద్యమబాట పట్టేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన మాట పూర్తిగా అవాస్తవమని, అబద్ధపు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలపై తెలంగాణలో వ్యతిరేకభావనను పెంచుతున్నారని ఆ ప్రాంత రాజకీయ నేతలను తప్పుపట్టారు. 1970లో సర్వీస్ కమిషన్ ఏర్పడిన తరవాత 14ఎఫ్, 610 జీవోను అనుసరించే రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాలు జరిగాయని, ఇక అన్యాయానికి ఆస్కారమెక్కడుందని ప్రశ్నించారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో 20శాతం మంది నల్గొండ జిల్లా నుంచే ఎంపికయ్యారని, మెరిట్ సాధించిన వారికే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు వరకూ పదోన్నతులు ఆపాలని కొందరు కోరుతున్నారని ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదన్నారు. ఈలోగా పదవీ విరమణ చేసే వారికి దీనివల్ల నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అసంబద్ధమైన డిమాండ్ వల్ల ఇరు ప్రాంతాల ఉద్యోగులు నష్టపోయే ప్రమాదముందన్నారు. తెలంగాణ ప్రకటనను చేసిన దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్ర పరిస్థితులపై కనీస అవగాహన కూడా లేదని ఫోరం నేతలు విమర్శించారు. ప్రణాళికాబద్ధంగా ఉద్యమం కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకూ వెనక్కి తగ్గబోమని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కె.వి కృష్ణయ్య చెప్పారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఉద్యమాన్ని ఆపుతారా..?
హన్మకొండ, న్యూస్‌లైన్: సీమాంధ్ర ఉద్యోగులపై కేసీఆర్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే సమైక్యవాద ఉద్యమాన్ని నిలిపివేస్తారా... అని టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. హన్మకొండలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే ఉంటే తెలంగాణ ఉద్యమానికి అర్థమే లేదన్నారు. అక్రమ మార్గాల్లో డెప్యూటేషన్లు, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా వచ్చిన ఉద్యోగులు వెళ్లాల్సి ఉంటుందని మాత్రమే కేసీఆర్ అన్నారని వివరించారు. 610 జీవో కూడా అదే చెబుతోందన్నారు. పీఆర్సీ అమలు చేయాల్సిందేనని, అరవై శాతం ఫిట్మెంట్తో వేతనాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కిరణ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్రకు అనుకూలంగా ఫైళ్లపై 80 సంతకాలు చేసినట్లు తెలుస్తోందన్నారు. దాదాపు 120ఉల్లంఘనలతో తెలంగాణ ప్రాంతానికి చెందాల్సిన లక్ష ఉద్యోగాలు కొల్లగొట్టారని గిర్గ్లాని కమిటీయే చెప్పిందని గుర్తు చేశా రు. ఇంకా ఆ ప్రాంత ఉద్యోగులు ఇక్కడే పట్టుకునే వేలాడితే ఎలా అని.. ప్రశ్నించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టే వరకు పోరాట స్వరూపం మారినా ఉద్యమం కొనసాగుతుందన్నారు.