సీమాంధ్ర ఉద్యోగులు సరదా కోసం సమ్మె చేయడం లేదని, రాష్ట్రాన్ని విభజిస్తే, తమతో పాటు తమ బిడ్డలూ రోడ్డున పడాల్సి ఉంటుందని, అందరి భవితవ్యం అగమ్య గోచరమవుతుందనే సమ్మె చేస్తున్నారని ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ హైకోర్టుకు నివేదించింది.
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులు సరదా కోసం సమ్మె చేయడం లేదని, రాష్ట్రాన్ని విభజిస్తే, తమతో పాటు తమ బిడ్డలూ రోడ్డున పడాల్సి ఉంటుందని, అందరి భవితవ్యం అగమ్య గోచరమవుతుందనే సమ్మె చేస్తున్నారని ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ హైకోర్టుకు నివేదించింది. సమ్మె చేస్తున్న ఆరు లక్షల మందిని 13 జిల్లాల్లోని ఆరు కోట్ల జనం నడిపిస్తున్నారని, ఇది మహోద్యమమని అసోసియేషన్ తరఫు న్యాయవాది సి. రామచంద్ర రాజు కోర్టుకు తెలిపారు. సమ్మెచేసే ఉద్యోగులపై చర్యలకు ఆదేశాలిస్తే శాంతిభద్రతల సమస్య మొదలవుతుందని అన్నారు.
రాజకీయ అంశమైన రాష్ట్రవిభజనపై, సమ్మెచేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు లేదని హైదరాబాద్ న్యాయవాది రవికుమార్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ అధ్యక్షుడు టి. దానయ్య వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ తరఫున రావుచంద్ర రాజు సోవువారం తన వాదనలు కొనసాగించారు. చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ చంద్రబానులతో కూడిన ధర్మాసనం సవుక్షంలో ఆయున వాదనలు వినిపించారు. ప్రజాస్వావ్యుంలో ప్రజలే ప్రభువులని, మిగిలిన వ్యవస్థల్లో పదవుల్లో పనిచేసే వారంతా సేవకులని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తే వారు పదవులు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.., ‘మీరే ప్రభువులని, మిగిలిన వారంతా సేవకులని చెబుతున్నారు. సేవకులు చెబితేనే చేయాలని అంటున్నారు.
మరి ఈ కేసును విచారించేందుకు అనుమతినిస్తారా..?’ అంటూ వ్యాఖ్యానించడంతో కోర్టులో నవ్వులు విరిశాయి. సమ్మెతో 13 జిల్లాల ప్రజలకు లేని ఇబ్బంది పిటిషనర్‌కు ఎందుకని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఉద్యోగులు నష్టం కలిగించడం లేదని ఉద్యోగుల తరఫు న్యాయువాది అన్నారు. విభజనపై నిర్ణయం తీసుకోబోమని కేంద్రం చెబితే, ఉద్యోగులు వెంటనే సమ్మె విరమిస్తారన్నారు. ట్రెజరీ ఉద్యోగుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, వ్యక్తిగత ప్రయోజనాలతోనే పిటిషనర్ వ్యాజ్యం వేసినందున, ఇది వ్యక్తిగత వ్యాజ్యమే అవుతుందని, ఇలాంటి వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని చెప్పారు. అనంతరం కోర్టు ఈ కేసుపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.