లక్ష మంది ఉద్యోగులు సీమాంధ్రకే | Lakh of employees go to seemandhra | Sakshi
Sakshi News home page

లక్ష మంది ఉద్యోగులు సీమాంధ్రకే

Published Tue, Mar 25 2014 1:14 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

లక్ష మంది ఉద్యోగులు సీమాంధ్రకే - Sakshi

లక్ష మంది ఉద్యోగులు సీమాంధ్రకే

టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అంతరంగం
 తెలంగాణలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపాల్సిందే. అలాగే మొత్తంగా 75వేల మంది పెన్షనర్లను సీమాంధ్రకు బదిలీ చేయాలి. తెలంగాణ సెక్రటేరియేట్‌లో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి...


 నవ తెలంగాణ
 తెలంగాణ నవనిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. గత ప్రభుత్వాల్లో ఉద్యోగానికి... రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగానికి తేడా ఉంటుది. 15 ఏళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు మమేకం అయ్యారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమాలతో వారి మధ్య విభజన రేఖ చెరిగి పోయింది. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు, ప్రజలు కలిసికట్టుగా తెలంగాణ నవనిర్మాణం కోసం కృషిచేయాలి. ప్రభుత్వం చేపట్టబోయే పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులదే. కాబట్టి ఉద్యోగులు పని సంస్కృతిని అలవర్చుకోవాలి. ఆదర్శవంతమైన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలి.
 
 పని సంస్కృతి పెరగాలి
 పని సంస్కృతిని పెంచేందుకు రాబోయే ఏడాది వరకు టీఎన్‌జీవో ప్రత్యేకంగా ప్రచారం చేయాలని యోచి స్తోంది. ఐదేళ్లపాటు ఉద్యో గులు అదనంగా పని చేసేందుకు సిద్ధంగా ఉండా లని విన్నవిస్తున్నాం. ప్ర భుత్వ పథకాలు లబ్దిదా రులకు చేర్చడంలో ఉద్యోగులు వాచ్‌డాగ్‌లా (కాపలా కుక్క లా) ఉండాలన్నదే మా ఉద్దేశం. ప్రభుత్వ కార్యాల యాలకు వచ్చే ప్రజలకు సేవలందించడంలో ఉద్యోగులు మార్గదర్శకంగా ఉండాలి. అందుకోసం ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను మార్పు చేస్తాం.
 
 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేయాలి...
 ప్రభుత్వ పాలన బయటి వ్యక్తుల చేతుల్లో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వ రహస్యాలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్‌పోర్టు తదితర ముఖ్య రంగాల్లో బయటి వ్యక్తుల ప్రమేయం తగదు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రస్తుత  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి.
 
 డీఎస్సీలను పునరుద్ధరించాలి..

 ఉద్యోగ భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. అందుకోసం జిల్లా నియామక కమిటీ (డీఎస్సీ)లను పునరుద్ధరించాలి. తెలంగాణలో ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత జనాభా ప్రకారం ఉద్యోగాల సంఖ్యను పెంచాలి. నిరుద్యోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలి. తెలంగాణలో నూతన ఆర్థిక విధానాల అమలును నిలిపివేయాలి. ప్రభుత్వ వ్యవస్థను కాపాడుకోవాలి. అప్పుడే తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరతాయి.
 
 విజన్ ఉన్న నాయకత్వం రావాలి
 తెలంగాణలో 3.30 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 84 వేల మంది హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అందులో 60 వేల మంది సీమాంధ్రకు చెందినవారే. హైదరాబాద్ కాకుండా తెలంగాణ జిల్లాల్లో మరో 50 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాల్లో పనిచేసే వారంతా డీఎస్సీల్లో 20 శాతం ఓపెన్ కోటా కింద ఉద్యోగాలు సంపాదించి నాన్‌లోకల్ కోటా కింద కన్వర్ట్ అయ్యారు. మొత్తంగా తెలంగాణలో పనిచేస్తున్న 1.10 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపాల్సిందే.  
 
 వాళ్లు వెళ్లకుంటే ఇక తెలంగాణ వచ్చి ఏం ప్రయోజనం ఉంటుంది? అలాగే 2.36 లక్షల మంది పెన్షనర్లు తెలంగాణలో ఉన్నారు. వారిలో 90 వేల మంది హైదరాబాద్‌లో ఉన్నారు. అందులో 60 వేల మంది సీమాంధ్రకు చెందినవారు. ఇక జిల్లాల్లో 15 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 75 వేల మంది పెన్షనర్లను సీమాంధ్రకు బదిలీ చేయాలి. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్ల విభజన జరగాలి. తెలంగాణ సెక్రటేరియట్‌లో నూటికి నూరు శాతం తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఇవన్నీ చేయాలంటే విజన్ నాయకత్వం ప్రభుత్వ పాలనలోకి రావాలి. అప్పుడే నవ తెలంగాణ కల సాకారం అవుతుంది.    
 tngonews@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement