సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని సచివాలయం తెలంగాణ అధ్యక్షుడు నరేంద్‌రావు హెచ్చరించారు.
హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకునేది లేదని సచివాలయం తెలంగాణ అధ్యక్షుడు నరేంద్‌రావు హెచ్చరించారు. బుధవారం నుంచి సచివాలయంలో తాము కూడా ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఎవరైనా రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
యూపీఏ సమన్వయ కమిటీ ప్రకటించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం రేపు ఢిల్లీకి వెళుతున్నట్లు నరేందర్ రావు తెలిపారు.