సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!
సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!
Published Fri, Jan 24 2014 7:36 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. అంతర్గంత కుమ్ములాటతో ఉద్యోగులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో సీమాంధ్ర ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి 30 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ఫిబ్రవరి 20 తేది వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement