Pendown
-
గిరిజన గురుకుల ఉపాధ్యాయుల పెన్‌డౌన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెన్‌డౌన్ చేపట్టి నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ కారణంగా తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయమై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి విన్నవించిన గురుకుల ఉపాధ్యాయులు శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు.గిరిజన ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విధులను బహిష్కరించి విజయవాడకు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన గురుకులాల్లో సుమారు 1,650 మంది దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలకు సంబంధించిన 1,143 పోస్టులు ప్రతిపాదించారు.దీంతో ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో సేవలందిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులను బహిష్కరించి విజయవాడ చేరుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరినట్టు గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి లక్ష్మీనాయక్ తెలిపారు. -
అగ్రికల్చర్ డెరైక్టర్‌పై ఉద్యోగుల పోరాటం
నేటి నుంచి 3 రోజులు పెన్‌డౌన్ సమ్మె సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారిణి, వ్యవసాయశాఖ డెరైక్టర్ ప్రియదర్శినిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులు సోమవారం నుంచి మరో దఫా ఆందోళనకు దిగనున్నారు. 26వ తేదీ వరకు పెన్‌డౌన్ సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ ఆమె బదిలీ జరగకపోతే 27వ తేదీ నుంచి సామూహిక సెలవుపై వెళ్లాలని తీర్మానించుకున్నారు. ఆమె బదిలీ జరి గేంత వరకు ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. 15 రోజు ల క్రితం ఇలాగే పెన్‌డౌన్ సమ్మె చేశాక ఆమెను వారంలో బదిలీ చేస్తామని అప్పట్లో ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. అది అమలు కానందున ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారు. విజయకుమార్‌ను చేర్పించుకోక పోవడంతో మళ్లీ వివాదం వ్యవసాయశాఖ డెరైక్టర్ ఉద్యోగులను వేధిస్తున్నారని... కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనేది ఉద్యోగుల ప్రధాన ఆరోపణ. అలాగే 15 రోజుల కిందట ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో డెరైక్టర్‌పై ఉద్యోగులు ఆందోళనను ప్రారంభించారు. ఇప్పుడు మరో వివాదం తాజా ఆందోళనలకు కారణమైంది. వ్యవసాయశాఖ అదనపు సంచాలకులుగా విజయకుమార్‌ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే ఆయనకు ఏ బాధ్యతలూ లేవంటూ మెమో జారీచేయడం... ఆయన్ను ఆ పోస్టులో నియమించడానికి నిరాకరించడం తాజా వివాదానికి కారణంగా ఉద్యోగులు చెబుతున్నారు. కక్షతోనే విజయకుమార్‌ను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారని అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు తెలిపారు. -
సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!
సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. అంతర్గంత కుమ్ములాటతో ఉద్యోగులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో సీమాంధ్ర ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి 30 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ఫిబ్రవరి 20 తేది వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు.