secretariat Seemandhra employees
-
సీమాంధ్ర ఉద్యోగుల సమావేశం రసాభాస!
సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. అంతర్గంత కుమ్ములాటతో ఉద్యోగులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. సర్వసభ్య సమావేశంలో సీమాంధ్ర ఉద్యోగులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి 30 వరకు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. ఫిబ్రవరి 20 తేది వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
ఉద్యోగుల తోపులాట.. సచివాలయంలో ఉద్రిక్తత
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసనకు దిగారు. దిగ్విజయ్ సింగ్ ను గోబ్యాక్ అంటూ నినాదాలు చేయసాగారు. బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులు దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడంపై తెలంగాణ ఉద్యోగులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ నినాదాలు చేయసాగారు. ఎంతగా అదుపుచేసినా ఉద్యోగుల మధ్య ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు. -
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం వారు విధులు బహిష్కరించి సెక్రటేరియట్లో ర్యాలీ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా సీమాంధ్ర కేంద్రమంత్రులు నిమ్మకు నీరెత్తినట్లున్నారని మండిపడ్డారు. ఇకపై తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నారని వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో శుక్రవారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. గత 38 రోజులుగా వీరు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మళ్లీ ఉద్యమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. చర్చలు సఫలం కావటంతో సీమాంధ్ర ఉద్యోగులు విధులుకు హాజరు అవుతున్నారు. -
జగన్ బిజీ.. బిజీ
* రోజంతా తీరిక లేకుండా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత * కార్యకర్తలు, అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు * పార్టీ వేర్వేరు విభాగాల నేతలతో భేటీలు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం నుంచే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. రోజంతా క్షణం తీరికలేకుండా గడిపారు. మంగళవారం బెయిల్‌పై విడుదలై ఆ రోజు రాత్రి 9.30 సమయంలో ఇంటికి చేరుకున్న జగన్.. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ముఖ్య నేతలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడుతూ గడిపారు. బుధవారం ఉదయం రాష్ట్రం నలుమూలల నుంచి జగన్‌ను కలిసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఒకవైపు వారిని పలకరిస్తూనే మరోవైపు పార్టీకి చెందిన వేర్వేరు విభాగాల నేతలతో రాత్రి పొద్దుపోయే వరకు భేటీలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలపై ఆరా తీయడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు జగన్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంట సేపు జరిగిన చర్చల్లో సమైక్య ఉద్యమానికి అండగా ఉంటానని జగన్ వారికి హామీ ఇచ్చారు. 11.45 ప్రాంతంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకుపైగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకుని తక్షణ కర్తవ్యాన్ని వివరించారు. మధ్యాహ్నం 12.30 సమయంలో తన నివాసానికి తరలి వచ్చిన అభిమానులను చెరగని చిరునవ్వుతో పలకరించారు. దాదాపు మూడు గంటల సేపు ఓపికగా వారితో గడిపిన జగన్ చాలా ఆలస్యంగా మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. మళ్లీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలతో సమావేశాలు కొనసాగాయి. జగన్‌లో ఏమాత్రం మార్పు కనిపించలేదని, గతంలో ఎంత… సునిశితంగా ఆయా అంశాలను పరిశీలించి వివరించే వారో ఇప్పుడూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. హోరెత్తిన అభిమానం దాదాపు 16 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలైన తమ నేతను కలుసుకోవడానికి రాష్టవ్య్రాప్తంగా పలు ప్రాంతాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బుధవారం జగన్ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే అభిమానులు లోటస్‌పాండ్‌కు చేరుకోవడం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకల్లా పరిసర ప్రాంతమంతా జగన్ అభిమానులతో కిక్కిరిసి పోయింది. వృద్ధులు, మహిళలు, యువకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ‘జై జగన్..’ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. సుదీర్ఘకాలం తర్వాత తమ ప్రియతమ నేతను స్వయంగా కలుసుకున్న ఆనందంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభిమానాన్ని చాటుకున్నారు. జగన్‌తో కరచాలనం కోసం యువకులు పోటీపడ్డారు. తన కోసం వచ్చిన వారందరినీ ఆయన పలకరిస్తూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అభిమానుల కోసం ప్రతిరోజూ.. జననేతను చూసేందుకు రాష్టవ్య్రాప్తంగా కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా తరలివస్తున్న నేపథ్యంలో వారెవర్నీ నిరాశపరచకూడదని జగన్ భావిస్తున్నారు. గురువారం నుంచి ప్రతిరోజూ ఉ. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆయన కలవనున్నారు. -
సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మేము సైతం అంటూ ర్యాలీగా కదిలారు. సచివాలయం నుంచి బయల్దేరిన ఈ ర్యాలీలో సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు. ర్యాలీకి మహిళా ఉద్యోగులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మరోవైపు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఏపీ ఎన్జీవోల ఉద్యోగులు భారీగా తరలి వస్తున్నారు. వారందరినీ పోలీసులు తనిఖీలు చేసి గేట్ వన్ నుంచి లోనికి పంపిస్తున్నారు. స్టేడియంలోని స్టాండ్స్ నిండిపోవటంతో మైదానంలోనే ఉద్యోగులు కూర్చుంటున్నారు. సీమాంద్ర ఉద్యోగులతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కిటకిటలాడుతోంది. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.