సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోరుతూ ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో శుక్రవారం సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దాంతో సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. గత 38 రోజులుగా వీరు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మళ్లీ ఉద్యమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. చర్చలు సఫలం కావటంతో సీమాంధ్ర ఉద్యోగులు విధులుకు హాజరు అవుతున్నారు.