వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడం పట్ల సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడం పట్ల సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జగన్ జైలు నుంచి బయటకు రావడం సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపునిస్తుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా 50 రోజులుగా ఉద్యోగాలు, జీతాలు వదిలేసి తాము సమ్మె చేస్తున్నా ఒక్క పార్టీ కూడా తమను పట్టించుకోలేదని, వైఎస్సార్‌సీపీ మాత్రమే సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడుతోందని సచివాలయ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో జగన్ బెయిల్‌పై బయటకు రావడం తమలో ఆశలను చిగురింప జేసిందని, సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో మరింత ఉత్సాహన్ని నింపిందన్నారు. జగన్‌మద్దతుతో సమైక్య ఉద్యమం ఉధృతమవుతుందని తాము ఆశిస్తున్నామని వెంకటరామిరెడ్డి చెప్పారు.