సమైక్యాంధ్ర కోసం.. జగన్ కృషి అమోఘం | seemandhra employees forum admire ys jagan for united state | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర కోసం.. జగన్ కృషి అమోఘం

Published Wed, Oct 30 2013 12:36 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సమైక్యాంధ్ర కోసం.. జగన్ కృషి అమోఘం - Sakshi

సమైక్యాంధ్ర కోసం.. జగన్ కృషి అమోఘం

 సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి అమోఘమని, ప్రశంసనీయమని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కొని యాడింది. హైదరాబాద్‌లో ‘సమైక్య శంఖారావం’ విజయవంతంగా నిర్వహించడంపై జగన్‌కు ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం జగన్‌ను ఇక్కడ కలిసిన ఫోరం నేతలు జననేతను గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీమాంధ్ర ఎంప్లాయీస్ వైస్ చైర్మన్ బెన్సన్, కోశాధికారి వరలక్ష్మి, సంయుక్త కార్యదర్శి బీ ప్రశాంతి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, హౌసింగ్ సొసైటీ డెరైక్టర్ సత్యసులోచన, సచివాలయ ఉద్యోగ క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షులు జాన్ దేవన్‌రాజ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement