హైదరాబాద్: ఉద్యోగుల చేస్తున్న సమ్మెపై ఎలాంటి హామీ లభించలేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించమని కోరామన్నారు. కాగా, ఉద్యోగుల నుంచి ఎలాంటి హామీ లభించలేదన్నారు. ఇదిలా ఉండగా సమ్మెతో కంటే విభజన వల్లే వచ్చే సమస్యలు ఎక్కువని సీమాంధ్ర ఉద్యోగులు పేర్కొన్నారు. తమ అవసరాన్ని ప్రజలు గుర్తించారని వారు తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న సమ్మె నుంచి వెనక్కి తగ్గలేమని ఉద్యోగులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే.