కిడ్నీ బాధితులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ మొదటి విడతలో ప్రకాశం జిల్లాను చేర్చి గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించాలని ఈ సందర్భంగా కోరారు. అన్ని అనుకూలతలు ఉన్న రామయపట్నంలో పోర్టును ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.