YV Subba Reddy
-
టీడీపీ నేతలకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
-
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్
తాడేపల్లి : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ లో తాము(వైఎస్సార్సీపీ) వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిన సంగతిని వైవీ సుబ్బారెడ్డి మరోసారి గుర్తు చేశారు. వక్ఫ్ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘మేం వ్యతిరేకించామనడానికి లోక్ సభ, రాజ్యసభల్లో రికార్డయిని ఉభయసభల కార్యాకలాపాలే సాక్ష్యం. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం. బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని అని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా?, నిరూపించమని సవాల్ విసురుతున్నా. ఫేక్ న్యూస్ ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారువక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ@JaiTDP బిల్లును మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా? నిరూపించమని సవాల్ విసురుతున్నాం. ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది.— Y V Subba Reddy (@yvsubbareddymp) April 4, 2025. -
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25, 26లను ఉల్లంఘించడం ద్వారా ముస్లింల ప్రాథమిక హక్కులను హరించి వేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వడం అనేది ఆర్టికల్ 25, 26లను ఉల్లంఘించడమేనని చెప్పారు. ఈ నూతన బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరించి వేయడమే కాక, వార్షిక సహకారం 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల వక్ఫ్ బోర్డులను ఆర్థికంగా దెబ్బ తీస్తుందన్నారు. అందువల్ల వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దీనిని కేవలం వక్ఫ్ భూములకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడరాదని, ఇది ముస్లింల మనోభావాలు, వారి ధార్మిక నమ్మకాలతో పాటు పలు అంశాలను దెబ్బతీసే అంశంగా చూడాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్సీపీ సహా అనేక ముస్లిం సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వైఎస్సార్సీపీ తరఫున దానిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆలిండియా ముస్లిం లా బోర్డ్, జమైత్ ఉల్ ఉలేమా, జమైత్ ఇస్లాం ఎ హింద్ సహా అనేక మైనార్టీ సంస్థలు అనేక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేశాయన్నారు.వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో టీడీపీ విఫలంముస్లింలకు రాజ్యాంగంలో కల్పించిన ఆస్తి హక్కుతో పాటు ధార్మిక అంశాల్లో వారి స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని, మోసం చేసిందని విమర్శించారు. సంస్కరణ అనేది స్వాగతించే అంశమే అయినప్పటికీ మైనార్టీల రక్షణ అనేది చాలా ముఖ్యమని చెప్పారు. దేశంలో 4 వేల సంవత్సరాల నుంచి ఉన్న వక్ఫ్ ప్రాథమిక భావనను ఈ నూతన బిల్లు పూర్తిగా నాశనం చేస్తోందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో సైతం వైఎస్సార్సీపీ తన అభ్యంతరాలను తెలియచేయడమే కాకుండా, రాష్ట్రంలోని ముస్లింలకు అండగా నిలబడిందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డు పేరును మార్చడంతో పాటు బిల్లులోని సెక్షన్ 9, 14 ప్రకారం ముస్లిమేతరులను బోర్డులోకి చేర్చడం పూర్తిగా అసంబద్ధమని అన్నారు. ఈ బిల్లు వక్ఫ్ బోర్డు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుందని చెప్పారు.వక్ఫ్ బోర్డులో ఇతర మతాల వాళ్లా?మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్ధుల్ హఫీజ్‌ఖాన్ ఆగ్రహంకర్నూలు (టౌన్): వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లిం సమాజాన్ని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, ఇది చరిత్రలో మచ్చగా నిలిచి పోతుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం ల విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత ఈ బిల్లు విషయంలో మరోసారి బయట పడిందన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాతే ఉలేమా, జమాతే ఇస్లామిక్ హింద్, సునతుల్ జమాతే వంటి సంస్థలు ఈ బిల్లును వ్యతిరేకించాయని, దీని వల్ల మైనార్టీలు నష్టపోతారన్నారు. వక్ఫ్ భూములపై కలెక్టర్‌కు అధికారం ఇస్తే ప్రభుత్వం చెప్పినట్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. దీని వల్ల మైనార్టీకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డులో మాత్రం ఇతర మతాల వారిని పెట్టి నామినేటేడ్ పదవులను కేటాయించాలని చూస్తుండటం దారుణమని నిప్పులు చెరిగారు.మైనార్టీలకు చంద్రబాబు ద్రోహంమాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ధ్వజంకడప కార్పొరేషన్: వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని, చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయని చెప్పారు.మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రెండు పార్టీలు వాడుకున్నాయని ధ్వజమెత్తారు. బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు విన్నవించగా, అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు. తీరా ఆ బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP
-
వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
పార్లమెంట్లో చంద్రబాబు ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై గతంలో దాఖలైన ఐటీ నోటీసుల కేసు(IT Notices Case) ప్రస్తావన ఇవాళ పార్లమెంట్లో వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ఎంత దాకా వచ్చిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖను గురువారం ఆరా తీశారు. ఫైనాన్స్ బిల్లు పై చర్చ సందర్భంగా ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక పాయింట్లను ప్రస్తావించారు. చంద్రబాబు(Chandrababu) పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్టుల రాకెట్ నడిపారు. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్లు సృష్టించారు. బోగస్ ఇన్వాయిస్ల ద్వారా రూ.2,000 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం ప్రాజెక్టుల నుంచి కొల్లగొట్టిన డబ్బును చంద్రబాబుకు అందజేశారని ఐటీ సోదాలలో మనోజ్ వాస్తవ అనే వ్యక్తి అంగీకరించాడు. ఈ డబ్బును పీఎస్ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా అందించినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత అతను అమెరికాకు పారిపోయాడు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. మరి ఆ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది?. ఈ కేసుపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కేంద్రాన్ని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంటోంది. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు. వైఎస్సార్ దీనికి శంకుస్థాపన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల.. స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పునరుద్ధరణకు అవసరమైన నిధులు కేటాయించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాట్ ను పరిరక్షించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి అని వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. -
రాజ్యసభ సాక్షిగా మళ్లీ దొరికేసిన చంద్రబాబు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుది దుష్ప్రచారమని తేట తెల్లమైంది. విశాఖపట్నంలో దొరికింది డ్రగ్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నంలో సీబీఐ 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్‌ను సీజ్ చేసిందని పేర్కొంది. అయితే అందులో నార్కోటిక్స్ లాంటి మత్తు పదార్థాలు లేవని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నిర్ధారించిందని తెలిపింది. ఈ విషయాన్ని సంబంధిత కోర్టులో ఫైల్ చేశామని.. ఆ కేసు సెప్టెంబర్ 21, 2024లో క్లోజ్ అయిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా, మార్చి 16న విశాఖ పోర్టుకు ఎస్‌ఈకేయూ4375380 కంటెయినర్లో వెయ్యి బ్యాగుల సరుకు వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. మార్చి 19న గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి, 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది. -
వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివ దేహానికి వైఎస్ జగన్, విజయమ్మ నివాళులు
-
LIVE: YV సుబ్బారెడ్డి తల్లికి YS జగన్ నివాళి
-
మేదరమెట్లకు వైఎస్ జగన్.. వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థీవదేహానికి నివాళులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు వైఎస్ జగన్. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్.అనారోగ్యంతో పాటు, వయోభారంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. ఈ రోజు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. -
బాపట్ల జిల్లా పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85)సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. రేపు బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా మేదరమెట్లలో పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పిస్తారు. -
YV సుబ్బారెడ్డి ఇంట విషాదం
-
వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియల జరగనున్నాయి. పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. -
ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృ వియోగం
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో వైబీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఇంటికి బయలుదేరారు. తమ మాతృమూర్తి మృతి వార్త తెలియడంతో వైవీ సుబ్బారెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయలుదేరారు. కాగా, పార్లమెంట్ సమావేశాల కోసం సుబ్బారెడ్డి నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. నేడు ఒంగోలులోనే సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ పార్థివదేహం ఉండనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు మేదరమెట్లలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక, యర్రం పిచ్చమ్మ పార్థివదేహానికి వైఎస్ జగన్ నివాళులు అర్పించనున్నారు. -
YSRCP ద్వారా ఎదిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి: టీజేఆర్
-
పార్లమెంట్ లోని YSRCP కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు
-
బాబు దయవల్ల చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.. అందుకే YSRCP యువత పోరు..
-
‘యువత పోరు’తో చంద్రబాబు వైఖరిని ఎండగడదాం: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో పేద విద్యార్థులు, నిరుద్యోగులు తరఫున కూటమి ప్రభుత్వంపై పోరుకి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ నెల 12వ తేదీన ‘‘యువత పోరు’’(Yuvatha Poru) పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత పోరు పోస్టర్‌ను లాంఛ్ చేసిన రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) మీడియాతో మాట్లాడారు. యువతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తాం. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. 👉రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మూడు త్రైమాసికాల నుండి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు వేధిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఎక్కడికక్కడే మెమోరాండం సమర్పించబోతున్నాం. ఫీజు బకాయిలతో పాటు నిరుద్యోగ సమస్య, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలపైనా యువత పోరు ఉండనుంది.👉నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) మాట తప్పింది. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు. ఉద్యోగాల్లేక యువత అల్లలాడిపోతోంది. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు. కానీ, చంద్రబాబు ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుందాం.విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహిద్దాం. యువత పోరును పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాం’’ అని వైఎస్సార్సీశ్రేణులను ఉద్దేశించి వైవీ సుబ్బారెడ్డి పిలుపు ఇచ్చారు. -
పోలవరం ఎత్తు తగ్గింపు వద్దు: రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది. 135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్‌కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలిసూపర్సిక్స్ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..ఏపీలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్‌సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్‌లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలిరైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారుఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందిరైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందిఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదునా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండిరైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారుచంద్రబోస్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని -
ప్రజలపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదు: YV Subba Reddy
-
అలా చేయకుంటే కోర్టుకెళ్తాం.. ‘కూటమి’కి వైవీ సుబ్బారెడ్డి వార్నింగ్
సాక్షి, ప్రకాశం జిల్లా: తిరుమల తొక్కిసలాట (Tirupati stampede) దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ (YSRCP) రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున కోర్టుకెళ్తామని హెచ్చరించారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన చంద్రబాబు, పవన్ ఎందుకు సెలైంట్‌గా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.పల్లెల్లో సంక్రాంతి కళ కనిపించడం లేదు. రైతుల మొఖాల్లో ఆనందం లేదు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏడు నెలలైనా పింఛన్ తప్ప ఏం సంక్షేమ పథకం అమలు కాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. హామీలు అమలు చేసి మాపై ఆరోపణలు చేయండి’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలి: వైవీ సుబ్బారెడ్డి
అమరావతి: తిరుపతిలో తొక్కిసలాట(Tirupati Stampede Incident) జరిగి ఆరుగురి మృతి చెందడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy). ఈ ఘటన అత్యంత దారుణమన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాటలు ఆందోళన కల్గించాయన్నారు. ఈ ఘటనకు టీటీడీనే బాధ్యత వహించాలన్నారు.తిరుపతి తొక్కిసలాట ఘటనపై ‘సాక్షి’తో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. ‘లక్షలమంది భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కనీసం సమీక్షలైనా నిర్వహించారా?, వైఎస్సార్సీపీ హయాంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.. కాబట్టే ఏ ప్రమాదం జరగలేదు. నేనే స్వయంగా వెళ్లి క్యూ లైన్లనను పరిశీలించేవాడిని. సమస్యలు ఎక్కడ ఉన్నాయో స్వయంగా తెలుసుకునేవాడిని. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడలేదు. అధికారులతో టీటీడీ సరిగా పనిచేయించలేదు. మృతుల కుటుంబాలను టీటీడీ ఆదుకోవాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’ అని ఆయన కోరారు.కాగా, వైకుంఠ ద్వార దర్శన(Vaikunta Dwara Darshan) టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లుచేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.మరోవైపు.. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలించడంలో భద్రతా సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ ప్రాంతాల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదుకోని అంబులెన్స్‌లు.. ఇక గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సకాలంలో అంబులెన్స్‌లు రాలేదు. కొన్నిచోట్ల వచ్చినా.. సరైన సమయంలో స్పందించలేదని బాధితులు వాపోయారు. అలాగే, అవసరమైన మేర అంబులెన్స్‌లను రప్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.ఇక గాయపడిన వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించడం ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోవడం.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదంసర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేస్తున్నారు. కాళ్లు, చేతులు విరిగిపోయి అనేక మంది వికలాంగులయ్యారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తాం. – సీబీ రమణ, నరసాపురం, అన్నమయ్య జిల్లాప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదంటీటీడీకి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్టు క్యూలైన్లో వదలకుండా పెద్దఎత్తున జనం గుమికూడిన తర్వాత వదిలిపెట్టడం దారుణం. దీంతో ప్రమాదం జరిగింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకున్నాం. ఇలా జరగడం ఇదే ప్రథమం. టీడీపీ నైతిక బాధ్యత వహించి అందరినీ ఆదుకోవాల్సి ఉంది. – సీపీ మునివెంకయ్య, నరసాపురం, అన్నమయ్య జిల్లా -
తిరుపతి ఘటన ఘోరమైనది.. బీఆర్ నాయుడు మాటలు దుర్మార్గం.. టీటీడీనే బాధ్యత వహించాలి
-
ఈ–విధాన్ ప్రాజెక్ట్‌పై ఏపీ ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: శాసన, శాసన మండలిలో ఈ–విధాన్ ప్రాజెక్ట్ అమలుపై ఏపీతో పాటు 26 రాష్ట్రాలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురగన్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ–విధాన్ ప్రాజెక్ట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. డ్రోన్ల ఉత్పత్తి ప్రోత్సాహాకంఏపీలో డ్రోన్లు, డ్రోన్ల భాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) కింద మూడేళ్లకు రూ.120కోట్లు ప్రకటించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర మోహల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. మహారాష్ట్రలోని ఆరు జిల్లాలకు గోదావరి నీళ్లుగోదావరి బేసిన్‌లోని ప్రాణహిత ఉప బేసిన్‌లోని వైన్ గంగా నదిపై ఉన్న గోసిఖర్డ్(ఇందిరా సాగర్) ప్రాజెక్ట్ నుంచి 1,772 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించి మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని ఆరు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి తెలిపారు. వైన్‌గంగా–నల్గంగా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌పై వైఎస్సార్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 73.22లక్షల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలుదేశవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 73,22,965లక్షల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు నోటిఫై చేసినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. స్మార్ట్ సిటీ కింద 47 ప్రాజెక్ట్‌లు..విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో రూ.6,616కోట్లతో 281 స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించగా.. దాదాపు 83శాతం పూర్తి అయినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘అమరావతిలో రూ.930కోట్లతో 20 ప్రాజెక్ట్‌లను ప్రారంభించగా.. రూ.746కోట్ల వ్యయంతో 14 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.184కోట్లతో ఆరు ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోంది.కాకినాడలో రూ.1,908కోట్లతో 92 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,722.97కోట్లతో 79 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.185.12కోట్లతో 13 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి.తిరుపతిలో రూ.2,082.75కోట్లతో 104 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,610.65కోట్లతో 79 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.472.10కోట్లతో 25 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నంకు రూ.1,695.23కోట్లతో 65 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,573.58కోట్లతో 62 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.121.65కోట్లతో 3 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి’ అని కేంద్ర మంత్రి తెలిపారు.241.4వేల మంది ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నారుఏపీలో 2,41.4వేల మంది తమ ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ పరిమళ్‌నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. -
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రిని కోరాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరినట్టు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో విశాఖ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.కేంద్ర మంత్రి కుమారస్వామిని ఈరోజు వైఎస్సార్సీపీ ఎంపీలు కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరాం. తెలుగు ప్రజల త్యాగాల ఫలితం విశాఖ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్‌కు ఉన్న అప్పులను ఈక్విటీలుగా మార్చాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరాము.మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దశలవారీగా విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ తన తొలి ప్రాధాన్యతగా మంత్రి చెప్పారు. త్వరలోనే ఈ అంశంపై కేంద్ర కేబినెట్‌కు ఫైల్ వెళ్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగుతుందని హామీ ఇచ్చారని అన్నారు. -
స్టీల్ ప్లాంట్ అంశం.. మంత్రి కుమారస్వామికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పత్రం
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతిపత్రం సమర్పించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్సీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని వినతిపత్రం సమర్పించారు వైఎస్సార్సీపీ ఎంపీలు. పార్టీలు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి అయోధ్య రెడ్డి, సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ప్రతీక. 20వేల మంది ఉద్యోగులకు మించి అక్కడ పనిచేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి. అప్పులను వాటాలుగా బదిలీ చేయాలి’ అని కామెంట్స్ చేశారు. Met Hon’ble Minister for Steel Shri H.D. Kumaraswamy Garu along with @YSRCParty MPs to urge reconsideration of Visakhapatnam Steel Plant’s privatization. Minister assured that VSP will remain a PSU and ₹15,000 crore will be pumped in for revival. RINL, a Navratna & Telugu pride,… pic.twitter.com/D9lalIywBR— Vijayasai Reddy V (@VSReddy_MP) December 2, 2024 -
పోలవరం ఇక బ్యారేజ్!
అనుకున్నంతా అయ్యింది.. ఏది జరగకూడదని ఇన్నాళ్లూ అనుకున్నామో అదే జరిగింది.. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తున్నారంటే.. అబ్బే కాదు కాదని బుకాయించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోంది. నాడు–నేడు చంద్రబాబు తీరే ఈ ప్రాజెక్టుకు శాపంగా పరిణమించిందని తేటతెల్లమవుతోంది. భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్తా బ్యారేజ్‌గా మారిపోనుందన్న నిజాన్ని నీటి పారుదల రంగ నిపుణులు, రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ మేరకు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని.. ఎత్తును తగ్గించలేదని చెప్పారు. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద నీళ్లందిస్తున్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి మాత్రమే పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అక్కరకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆయకట్టుకు కూడా గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి సాధ్యమవుతుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.67 ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.06 లక్షలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ.. 540 గ్రామాల్లోని 28.50 లక్షల మందికి తాగునీళ్లు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టులో అంతర్భాగంగా నిరి్మస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి వీలుండదని.. గోదావరి సిగలో కలికితురాయిగా వెలుగులీనాల్సిన ఆ కేంద్రం ఒట్టి దిష్టి»ొమ్మగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోరు మెదపని టీడీపీ కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో కనీస నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న పీఐబీ (పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు) కేంద్రానికి ప్రతిపాదించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1.53 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించవచ్చని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడం, విశాఖకు నీటి సరఫరా చేయొచ్చని ఆ ప్రతిపాదనలో పీఐబీ స్పష్టం చేసింది. అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో పీఐబీ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. కానీ.. ఆగస్టు 28న పీఐబీ ప్రతిపాదించిన దానికి భిన్నంగా.. 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందుకు కేంద్ర ఆర్థిక శాఖ పంపింది.ఈ ప్రతిపాదనపై ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పలేదు. అంటే.. అటు కేంద్రంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి అంగీకరించాయన్నది స్పష్టమవుతోంది. నాడూ.. నేడూ పోలవరానికి ‘చంద్ర’ ద్రోహం రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం తాగునీటి విభాగం, జల విద్యుత్ విభాగానికి అయ్యే వ్యయం కాకుండా కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లు ఇస్తే చాలని చెప్పారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం సంగతి గాలికొదిలేశారు. కమీషన్లు వచ్చే మట్టి పనులనే 2016–19 మధ్య చేపట్టి, ఆ ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించారు. తద్వారా డయా ఫ్రం వాల్ దెబ్బ తినడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురవ్వడానికి వరద మళ్లింపు పనులు పూర్తి చేయక పోవడమేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. అప్పట్లో విధ్వంసం సృష్టించి.. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. పోలవరానికి ద్రోహం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశల్లో పోలవరం.. ప్రతిపాదించింది కేంద్రమే » నీటి పారుదల, తాగు నీటి విభాగాలు వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, తాగునీటి విభాగానికి అయ్యే రూ.4,068 కోట్లను ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఆ ప్రతిపాదనను కేంద్ర జల్ శక్తి శాఖకు పంపారు. ఈ అంశంపై 2021 జూలై 29న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ నాటి ఛైర్మన్ హెచ్‌కే హల్దర్ ఏకీభవించారు. » ఆ సమావేశంలో 1986 మార్చి 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది కనీస నీటి మట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత దశల వారీగా ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని హల్దర్ సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరంలో 35.44, 35.50, 41.15, 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలపాలంటూ పీపీఏ సీఈవోకు కేంద్ర జల్ శక్తి శాఖ అప్పటి సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్ కుమార్ శ్రీవాత్సవ 2021 అక్టోబర్ 27న లేఖ రాశారు. ఇదే లేఖను ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపిన పీపీఏ.. ఆ వివరాలు ఇవ్వాలని కోరింది. » 35.44, 35.50 మీటర్లలో నీటిని నిల్వ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. కనీస నీటి మట్టం 41.15 మీటర్లలో నిల్వ చేస్తే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని.. 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టును స్థిరీకరించడం, 28.50 లక్షల మందికి తాగు నీరు, విశాఖకు 23.44 టీఎంసీలు సరఫరా చేయవచ్చునని వివరించారు. » ఇదే వివరాలను కేంద్ర జల్ శక్తి కార్యదర్శికి వివరిస్తూ 2021 నవంబర్ 20న పీపీఏ అప్పటి సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్ లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగానే పోలవరాన్ని రెండు దశల్లో.. తొలి దశలో 41.15 మీటర్లలో 115.44 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా పనులు చేçపట్టడానికి నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. » పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.23,622.35 కోట్లు అవసరం. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా ఆ నిధులు మిగుల్చుకోవచ్చన్నది కేంద్రం ఆలోచన. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉంటుందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చనే కేంద్రం ఇలా చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీవనాడిగా మార్చిన వైఎస్ జగన్ » రాష్ట్రంలో 2019 మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ గాడిలో పెట్టారు. జీవచ్ఛవాన్ని జీవనాడిగా మార్చారు. రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. » చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) మార్గదర్శకాల మేరకు పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే సొరంగాలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో డయాఫ్రం వాల్ వేశారు. గ్యాప్–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. » ప్రాజెక్టుకు తాజా ధరల మేరకు నిధులు ఇచ్చి సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. తాగు నీటి విభాగం, నీటి పారుదల విభాగం వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని, అందుకయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రధాని మోదీ అంగీకరించారు. రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేద్దామని.. తొలి దశలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. -
YSRCP: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలు
తాడేపల్లి : ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆర్డినేట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.అదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు. -
కలిసికట్టుగా ఉద్యమిద్దాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఏపీలో మాఫియా రాజ్యమేలుతోంది. ఈ రాక్షస పాలనలో ప్రజలకు అండగా నిలబడదాం. కలిసికట్టుగా ఉద్యమిద్దాం. కూటమి అరాచకాలపై తిరుపతి నుంచే తిరుగుబాటు చేద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీలని చెప్పి చంద్రబాబు మోసం చేస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతోందని, మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారని విమర్శించారు.ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి మనకు తిరిగి అధికారం ఇస్తారన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే సహించనని చెప్పిన పవన్‌కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారని ప్రశి్నంచారు. ఇది ‘ఈవీఎం’ ప్రొడక్షన్స్ వారి సీబీఎన్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా భూమన కరుణాకరరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకం కాదు: విజయసాయిరాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదని అన్నారు. ప్రజలకు సేవచేస్తూ, దళిత గోవిందం, సోషలిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు భూమన అని అన్నారు. తిరుపతి నగరం గత ఐదేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందని.. భూమన కరుణాకరరెడ్డి కుమారుడు అభినయ్‌రెడ్డి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని.. 2027 ఆఖర్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించేందుకు భూమన కృషి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు సంక్షేమం దూరమైంది: వైవీ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారని గుర్తుచేశారు. నేడు ప్రజలు సంక్షేమ పథకాలు అందడంలేదని.. అభివృద్ధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత గుర్తింపు ఇస్తామని, 2027లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయన్నారు. మళ్లీ జగన్‌ను సీఎం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తొలిరోజు నుంచే అరాచకాలు: సజ్జల చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొదలైన నాటి నుంచే రాష్ట్రంలో అరాచకాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఓ మాఫియా రాజ్యం ఏలుతోందని.. అభివృద్ధి సంక్షేమం ఎక్కడా కనిపించడంలేదన్నారు. 4 నెలల్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.వైఎస్ జగన్ కట్టించిన రుషికొండ భవనాలు చూసి చంద్రబాబు సంతోషపడ్డారని.. అయితే వాటిని జగన్ విలాసం కోసం కట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో సీఎం చంద్రబాబు రూ.53వేల కోట్లు అప్పుచేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని ప్రశి్నంచారు. ఇకపోతే.. బలమైన కార్యకర్తల పారీ్టగా ఈసారి అధికారంలోకి వస్తున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కష్టాల్లోనే వైఎస్ కుటుంబానికి మరింత అండగా.. : భూమన చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భూమన మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలు చేసే సమయంలో తాను తుపాకి కాల్పుల వరకు వెళ్లి వచ్చిన వాడినని, చంద్రబాబుని ఢీకొనడం అంటే బెండుతో ఢీకొనడడం లాంటిదేనన్నారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలో ఉన్నప్పటి కంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు మరింత అండగా నిలబడతానని భూమన స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 25 ఏళ్ల యువకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఓడించడానికి 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు చంద్రగిరిలో రంగంలోకి దించారని.. లోకేశ్ 6 రోజులు పాదయాత్ర చేసి మోహిత్ ఓటమి కోసం పనిచేశారని గుర్తుచేశారు. -
తిరుమల పవిత్రతను బాబు దెబ్బతీసారు
-
పార్టీలు చూడకుండా పథకాలిచ్చిన వ్యక్తి వైఎస్ జగన్: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, గుంటూరు: ఏపీలో పార్టీలు చూడకుండా రాజకీయాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతీతంగా అందరికీ పథకాలు అందించారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ప్రజల ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు.గుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వనమా బాల వజ్ర బాబు పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఆళ్ళ అయోధ్య రామ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ అనేక పథకాలు అమలు చేశారు. పార్టీలు చూడకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలు అందించారు. పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్తమీ కాదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యాన్ని అందించారు.ప్రజల ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ మనపై దుష్ప్రచారం చేయడం వల్లే మనం ఓడిపోయాం. అయినా 40 శాతం మంది వైఎస్సార్సీపీకి అండగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలంతా ఐక్యంగా ఉండాలి. కార్యకర్తలంతా ఐక్యంగా, ధైర్యంగా ఉంటే మళ్ళీ మనం అధికారం సాధిస్తాం. మద్యం షాపులు తెరవక ముందే తెలుగుదేశం ఎమ్మెల్యేలు దుకాణాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు మద్యం షాపులో 20 నుంచి 30 శాతం కమీషన్ ఇవ్వాలట. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. రాష్ట్రంలో మహిళలపైన దాడులు హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. పవన్ కళ్యాణ్ ఏమైనా నోటికి ప్లాస్టర్ చేసుకున్నాడా?. తన పాలనలో ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే వైఎస్ జగన్ సహించేవారు కాదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రకటనలు పేపర్‌కే పరిమితం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారని విమర్శలు చేశారు. వనమా బాల వజ్ర బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండండి. మన నాయకుడు వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక పథకాలు అమలు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మళ్లీ మనం వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని చెప్పారు. -
టీడీపీ కుట్రలో షర్మిల భాగమయ్యారు: వైవీ సుబ్బారెడ్డి
-
టీడీపీ కుట్రలో షర్మిల పావు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి,తాడేపల్లి: టీడీపీ చేసే కుట్రలో షర్మిల పావుగా మారిందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు.‘జగన్ బెయిల్ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్,టీడీపీ కలిసి వైఎస్‌జగన్‌పై కేసు పెట్టాయి. హైకోర్టు స్టేటస్కో ఆదేశాలున్నా షర్మిల సరస్వతి పవర్ కంపెనీ షేర్లు బదలాయించారు. షేర్లను బదలాయించినందువల్లే జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారుఆస్తుల్లో వాటా ఉంటే షర్మిలపై ఈడీ కేసులు ఎందుకు పెట్టలేదు. చెల్లిపై ప్రేమ ఉన్నందునే వైఎస్జగన్ షర్మిలకు ఎంవోయూ చేసుకున్నారు. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా’అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైవీసుబ్బారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సరస్వతి సిమెంట్స్ ప్రాపర్టీ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి.అయినాసరే షేర్లు బదలాయించుకోవటం వెనుక కుట్ర ఉంది.2019 ఆగస్టులో వైఎస్జగన్, షర్మిల ఎంవోయూ రాసుకున్నారుప్రాపర్టీ చూసుకున్నాకనే షర్మిల సంతకాలు పెట్టారుజగన్ ప్రేమ అభిమానంతోనే షర్మిలకు ఆస్తులు రాసిచ్చారు.కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.ఇప్పుడు షర్మిల చేస్తున్న రాద్దాంతమంతా ఆస్తుల కోసమే అని అర్థం అవుతోంది.షర్మిలకు లీగల్ గా ఆస్తుల మీద హక్కు ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కొనేవారు.జగన్ ఒక్కరే జైలుకు ఎందుకు వెళ్తారు?జగన్ కు వచ్చిన డివిడెండ్ నుంచి షర్మిలకు రూ.200 కోట్లు ఇచ్చారు.జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ జగన్ పెట్టుకున్న పరిశ్రమలు.వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఈ కంపెనీలు పెట్టుకున్నారు.అందులో షర్మిలకు వాటాలు ఉంటే అప్పుడే రాసిచ్చేవారు.షర్మిల అబద్దాలాడుతున్నారువైఎస్ జగన్ ఇంట్లో చిచ్చుపెట్టి చంద్రబాబు చలిమంట కాచుకుంటున్నారు: పేర్నినానివైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారుతండ్రి ఆశయం కోసమైతే చంద్రబాబు కోసం పనిచేస్తారావైఎస్సార్ను అభిమానించేవారు ఇప్పటికీ చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు.గత మూడు నాలుగు రోజులుగా వైఎస్‌జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు.షర్మిల తాపత్రయం అంతా ఆస్తుల కోసమే..తండ్రి ఆశయాల కోసం కానేకాదువ్యక్తిగతంగా రాసుకున్న ఉత్తరం టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఎలా వచ్చింది? చంద్రబాబు అక్రమ రాజకీయాలకు ఇది నిదర్శనంకేంద్రంలో బీజేపీతో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్నారుకాంగ్రెస్కు తాము వ్యతిరేకమని చెప్పి చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తున్నారు?రాజకీయ వింత బంధాలను ఏపీలోనే చూస్తున్నాంవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంవెనుక జగన్ కష్టం,కార్యకర్తలే కారణంషర్మిలతో మాలాంటోళ్లు చాలామంది పని చేశాంమాలాంటి 30,40 మంది పదవులు వదులుకుని వచ్చారుటీడీపీ నుండి చాలామంది వైఎస్సార్సీపీలోకి వచ్చారుకానీ ప్రధానమైన కష్టం,నష్టం అంతా జగన్,కార్యకర్తలదేషర్మిలతో పాదయాత్ర వద్దని నేనే స్వయంగా జగన్‌తో చెప్పానుభవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్‌కి చెప్పానుకానీ నా కుటుంబంలో అలాంటివేమీ రావని జగన్ చెప్పారుకంపెనీల్లో షర్మిలకు వాటాలు ఉంటే ఆమెని కూడా డైరెక్టర్‌గా వైఎస్సార్ పెట్టేవారుఅలా జరగ లేదంటే షర్మిలకు సంబంధం లేదనే అర్థం కదాచంద్రబాబు అనవసరంగా జగన్ కుటుంబ సభ్యుల గొడవల్లో జోక్యం చేసుకుంటున్నారుజూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికలకు వాడుకుని ఎందుకు వదిలేశారు?చంద్రబాబు నైజంపై ఆయన తోడళ్లుడే పుస్తకం వేశారుఅసలు చంద్రబాబు తన తోడబుట్టినవారికి ఏం ఆస్తులు రాసిచ్చారు?చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారింది ఇదీ చదవండి: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు షర్మిలా..? -
లడ్డూలో కాదు.. కూటమిలోనే కల్తీ
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన తిరుపతి లడ్డూను రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారు. వందరోజుల పాలన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు విషరాజకీయాలకు తెరతీశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. రెండు రోజుల తర్వాత.. కల్తీ నెయ్యి అనీ.. మరికొద్ది రోజుల తర్వాత.. లడ్డూలో కలవలేదనీ.. కలవకుండా ఆపేశామంటూ పూటకోమాట మార్చేస్తూ.. భక్తుల మనోభావాలతో రాజకీయ చదరంగమాడారు. దీనిపై నిస్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, అండ్ కో చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాల్లేకుండా.. దేవుడిని రాజకీయాల్లోకి లాగారంటూ మండిపడింది. చేసిన తప్పుడు వ్యాఖ్యల్ని సమరి్థంచుకునేందుకు కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర పోలీసులతో సిట్ పేరుతో ఆడాలనుకున్న నాటకాలకు ధర్మాసనం స్వస్తి పలికింది. లడ్డూ వ్యవహారం సీబీఐకి అప్పగించి.. స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కుటిల స్వార్థంతో భగవంతుడిని రాజకీయాల్లోకి లాగారంటూ ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సుప్రీం నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడుతున్నారు. తప్పు జరిగితే దేవుడే చూసుకుంటాడని.. తప్పుడు ఆరోపణలు చేసినా.. ఏడుకొండల వాడు విడిచి పెట్టరంటున్నారు. మతజ్వాలలు రగిలించిన ప్రభుత్వ వ్యవహారంపై చిన్నా పెద్దా తేడాలేకుండా.. యావత్ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీ లేదని.. కూటమి ప్రభుత్వం చేసిన విషప్రచారంలోనే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుంటే బావుంటుంది ఈ మధ్య మా మిత్రులతో కలిసి భద్రాచలం వెళ్లాం. అక్కడ ప్రసాదం తినే ముందు సీఎం చంద్రబాబు దుర్బుద్ధితో చేసిన కల్తీ లడ్డూ ప్రకటన గుర్తుచేసుకొని బాధపడ్డాం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఐదుగురితో ఏర్పాటు చేసిన బృందంలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీస్ అధికారులకు బదులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే బావుంటుంది. సిట్ విచారణ చేయడానికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించాలి. – జీవీఎన్ సంజయ్, సాఫ్ట్ వేర్ ఆపరేషన్ మేనేజర్ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. తెలిసితెలిసి కలియుగ దైవం వేంకటేశ్వరస్వామితో ఆడుకుంటే వారికి మామూలుగా పాపం అంటదు. వంద రోజుల ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కల్తీ లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. చివరకు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తిరుమల రాకుండా మతం రంగు పులిమి అడ్డు తగిలారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. –దంతులూరి వెంకట శివ సూర్యనారాయణరాజు, ఎంపీపీ, భీమిలిచంద్రబాబు ప్రకటన ఆవేదనకు గురిచేసింది నేను మూడేళ్ల నుంచి తిరుమల వెంకటరమణమూర్తి గోవింద మాల వేస్తున్నాను. తిరుమల లడ్డూ ప్రసాదం జంతువుల కొవ్వుతో కల్తీ చేశారనే చంద్రబాబు ప్రకటన చాలా ఆవేదనకు గురిచేసింది. ఆధారం లేకుండా ముఖ్యమంత్రిగా ఎలా బహిరంగ ప్రకటన చేశారని చంద్రబాబును సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించిన తర్వాత కాస్త మనసు కుదుటపడింది. దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీది తప్పని తేలితే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. – మజ్జి రవికుమార్, తిరుమల గోవింద మాలధారుడుచంద్రబాబును బహిష్కరించాలి హిందూ ధర్మ పరిరక్షణే మూల సిద్ధాంతంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం బీజేపీ మెజార్టీ హిందువుల ఓట్లతో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా చంద్రబాబు తిరుపతి లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిజాయితీగా దర్యాప్తు చేయాలలి– వాసు, జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ఫైవ్మెన్ కమిటీని స్వాగతిస్తున్నా.. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నాం. విచారణకు సంబంధించి ఫైవ్‌మెన్ కమిటీతో నిజాలు బయటపడతాయన్న ఆశ ఉంది. కోట్లాది మంది హిందువులు..శ్రీవారి భక్తుల మనోభావాలను చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ దెబ్బతీశారు. సనాతన ధర్మం కోసం పవన్‌కల్యాణ్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. – వాసుపల్లి గణేష్‌కుమార్, వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్తశివుడు కూడా సహించడు తిరుపతి వెంకన్న లడ్డూ్డ అంటే అది దివ్యప్రపాదం. ఒకసారి స్వామికి నివేదించాక అది అమృతం కన్నా గొప్పది. దేవతలు మనంపెట్టే నైవేద్యాలను ఆఘ్రాణ రూపంగా ఆరగిస్తారని శా్రస్తాలు చెపుతాయి. అటువంటి గొప్ప ప్రసాదం మీద కల్తీ అనే అపవాదు వ్యాపింపజేయడం గొప్ప అపచారం. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమయోచితంగా స్పందించింది. పరమ పవిత్రమైన లడ్డూపై జరిగిన దు్రష్పచారాన్ని చంద్రచూడుడు (శివుడు) మాత్రం సహిస్తాడా?? – బులుసు వేంకటేశ్వర్లు, ప్రముఖ పద్యకవి, తగరపువలసబాబు ఆరోపణలు తగవు తిరుమల లడ్డూ విషయంలో వైఎస్సార్ సీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని ఆది నుంచి కోరింది. సుప్రీంకోర్టు కూడా ఫైవ్‌మెన్ కమిటీతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. స్వతంత్ర దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకు వస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదు. – గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ నగర మేయర్నిజం నిగ్గు తేలుతుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌పై హిందువులెవరికీ నమ్మకం లేదు. ఒక స్వతంత్ర ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ తొలి నుంచి డిమాండ్ చేస్తోంది. శ్రీవారి లడ్డూపై వచ్చిన ఆరోపణలపై నిజనిజాలు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను యావత్ హిందువులు స్వాగతిస్తున్నారు. మాపార్టీ నుంచి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సు్రíపీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ -
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా బాబు వ్యవహరించారు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. పొలిటికల్ కామెంట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము.నా హయాంలో ఏఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మేము ఉన్న సమయంలో కల్తీ జరగలేదు. లడ్డులను ఇంతవరకు టెస్ట్ చేయలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ -
స్వతంత్ర సిట్ దర్యాప్తుపై వైవీ సుబ్బారెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
సీఎం చంద్రబాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. లడ్డూ శాంపిల్‌ను ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపలేదని నిలదీసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. టీటీడీ తరఫు లాయర్‌పై ప్రశ్నల వర్షంల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా?. జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు?. ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు?. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఆధారాల్లేవ్. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించారా? అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను ప్రశ్నించింది. ‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’ లడ్డూ అంశంపై విచారణకు సిట్ వేశారు?. ఇది దర్యాప్తునకు సరిపోతుందా?.. మీ అభిప్రాయం చెప్పండి..’’ అని సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను అడిగింది ధర్మాసనం.చంద్రబాబు వైఖరిపై సుప్రీం కోర్టు సీరియస్ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రపంచంలోని భక్తులందరి మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యాఖ్యలతో వాళ్లను గాయపరిచారు అంటూ సీఎం చంద్రబాబు బాబుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై నేరుగా మీరు మీడియాకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దు. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ వ్యాఖ్యానించింది. . ధర్మాసనం ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ప్రభుత్వం తరపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. ఆ నాలుగు ట్యాంకులు వాడలేదని కోర్టుకు తెలిపారు. ఈ తరుణంలో ఇరువైపులా వాదనలను రికార్డ్ చేసిన అనంతరం.. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి(గురువారం) వాయిదా వేసింది. అంతకు ముందు.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లడ్డూ అంశంపై ఏపీ సీఎం, టీటీడీ ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారని.. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు.‘‘లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి పరీక్షకు నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. కల్తీ జరిగిన వంద శాతం నెయ్యి వాడలేదని స్వయంగా ఈవో చెప్పారు. ఇష్టారీతిన మాట్లాడడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దేవాలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, బోర్డునే నిర్వహిస్తారు. ఈవో ను ప్రస్తుత ప్రభుత్వమే నియమించింది’’ సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.కాగా, తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు.ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి వాదనలు వినిపించారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించారు. ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం -
తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదం కేసు విచారణకు బెంచ్‌ను సుప్రీంకోర్టు నిర్ణయించింది. లడ్డూ కేసు విచారణ జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్‌కు కేటాయించింది. కాజ్ లిస్టులో ఐటెం నెంబర్ 63గా తిరుమల లడ్డూ కేసు లిస్ట్ అయ్యింది. ఎల్లుండి, సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.ఈ వివాదం నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేయగా, ఈ రెండు పిటిషన్లను ఒకేసారి సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదీ చదవండి: చంద్రబాబు మరో అబద్ధం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైఎస్ జగన్ -
లడ్డూ వివాదం.. సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డు వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ముందుగా దీనిపై అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలుపగా.. తాజాగా విచారణ తేదీలో మార్పులు చేసింది. అటు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌తోపాటు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ను కలిసి ఒకేసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.కాగా లడ్డూ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రమణ్య స్వామి సైతం సుప్రీంను ఆశ్రయించారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘లడ్డూ’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు -
నెయ్యిపై నిగ్గు తేల్చండి
టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం.. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు ‘సుప్రీం’ పర్యవేక్షణలో కమిటీని నియమించండి ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్‌స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్‌గా) వాదనలు వినిపించనున్నారు. ఏ నివేదిక ఆధారంగా అయితే రాద్దాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో... ఆ నివేదిక రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? ఆ నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను కోర్టు తేల్చాల్సిన అవసరం ఉందని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. ఈ ప్రశ్నలపై కమిటీ దృష్టి సారించాలి... ‘21.06.2024న టీటీడీ ఈవో మంచి నాణ్యమైన నెయ్యితో శాంపిల్ లడ్డూలు తయారు చేయాలని దేవస్థానం కార్మీకులకు చెప్పారు. 17.7.2024న ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు ఇచ్చారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్ ఇచ్చిన నివేదికను చూస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ నెయ్యిని 100 శాతం వాడలేదని ఈవో ‘ద ప్రింట్’ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? నివేదిక విషయంలో రాజకీయ జోక్యం ఏదైనా ఉందా?’ అనే అంశాలను స్వామి తన పిటిషన్లో ప్రస్తావించారు. నాణ్యత ఉన్న నెయ్యి ట్యాంకర్లకే అనుమతి... ‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్పీవో) ప్రకారం నెయ్యి వాహన ట్యాంకర్ రాగానే అధికారులు నమూనాలను సేకరించి మౌలిక పరీక్షలు నిర్వహిస్తారు. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యతకు అనుగుణంగా ఆ నెయ్యి నమూనాలు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలితేనే ఆ నెయ్యిని శ్రీవారి లడ్డూతో సహా అన్ని ప్రసాదాల్లో వినియోగించేందుకు వాడతారు. పరీక్షల్లో విఫలమైన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు. దశాబ్దాలుగా ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అందువల్ల కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారన్నది అవాస్తవం. ‘ద ప్రింట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఈవో ఆ నెయ్యిని 100 శాతం ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా లడ్డూ విషయంలో తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు భక్తులను తీవ్రంగా ప్రభావితం చేశాయి’ అని స్వామి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు... ‘కొందరు వ్యక్తులు ఓ చిన్న కాగితంలోని కొంత సమాచారాన్ని పట్టుకుని దాని ఆధారంగా రాజకీయ ప్రకటనలు చేశారు. వాస్తవానికి దేని ఆధారంగా అయితే వారు రాజకీయ ప్రకటనలు చేశారో అది ప్రజా బాహుళ్యంలో లేదు. దీనిపై తీవ్ర రాజకీయ ప్రతిఘటన మొదలైంది. వెంకటేశ్వరస్వామిని కొలిచే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అతి సున్నితమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకు చేసి దానిపై రాద్దాంతం మొదలుపెట్టారు. ఆ సమాచారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తులు అలా చేయడానికి ముందు దాన్ని టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాస్తవాలను నిర్దారించుకోవాల్సింది. అలా చేయకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని స్వామి తన పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు.- సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్స్వతంత్ర విచారణ జరిపించండిసుప్రీంకోర్టును కోరిన ఎంపీ వైవీ సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సోమవారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి తరఫున∙సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్‌పై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరారు. ఆ నివేదికలో పేర్కొన్న నెయ్యిని ఎక్కడ నుంచి సేకరించారన్న దానిపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అభ్యర్ధించారు. లడ్డూపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడం గానీ, ప్రచురించడం గానీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో సీఎం చంద్రబాబు, పలువురు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. -
శ్రీవారి లడ్డూ వివాదంలో నిజానిజాలు తెలియాలి: న్యాయవాది పొన్నవోలు
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశివ్వాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిల్ వేశారు.ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన విషయం కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని, ఈ నాలుగు ట్యాంకులలో వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని అన్నారు. ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్తో తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు.చదవండి: లడ్డూ వివాదం.. తిరుమలలో ప్రమాణానికి భూమన సిద్ధం‘ఆ పరీక్షల్లో సఫలమైన తర్వాతే ఆ టాంకర్ల నెయ్యిని ప్రసాదాలకు ఉపయోగిస్తారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వాటిని వెనక్కి పంపిస్తారు. కల్తీ జరిగిందని నిర్ధారించే ల్యాబ్స్ లేవని ఈవో చెప్పడం దుర్మార్గం. 2014-19 వరకు పరీక్ష కేంద్రాలకు హెడ్‌గా ఉన్న శర్మిస్ట.. టీటీడీకి కల్తీ పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. మే 15న మొదటి ట్యాంక్ పంపించారు. అప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నాసిరకం నాలుగు ట్యాంకర్ల నెయ్యి వెనక్కి పంపారు. అటువంటి సమయంలో లడ్డూలలో కల్తీ ఎలా జరిగిందని చెప్పారు.భక్తుల మనోభావాలు గాయపరిస్తే మీకు ఒరిగేదేమిటి. రాజకీయ లాభం కోసం దేవుడిని కూడా ఉపయోగించడం సిగ్గుచేటు. రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లలో ఎస్ వాల్యూ తక్కువగా ఉందని ఈవో చెప్పారు. 2019 నుంచి ఆగస్టు 2023 వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నారు. వై వి సుబ్బారెడ్డి హయంలో ఈ టెండర్లను పిలవలేదు. ఏఆర్ ఫుడ్స్ అసలు బిడ్డరే కాదు. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఏఆర్ ఫు డ్స్కు ఆర్డర్ ఇవ్వలేదు. సప్లై జరగలేదు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆర్డరు, సప్లై జరిగింది. ఎస్ వాల్యూ తగ్గిందని టీటీడీ ఈఓ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. 319 రూపాయల కేజీ నెయ్యిలో 1, 450 రూపాయల యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారు? రాగి బిందెలో బంగారం కలుపుతారా ?కానీ రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. శ్రీవారి భక్తులను మోసం చేస్తున్నారు.పంది కొవ్వు కలిపారని చెప్పడం అబద్ధం -
బాబు వ్యాఖ్యలపై పిటిషన్లు
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగానూ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను అని పోస్ట్ చేశారాయన.Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas— Subramanian Swamy (@Swamy39) September 23, 2024 వైవీ సుబ్బారెడ్డి పిటిషన్మరోవైపు వైస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంలో పిల్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్లో సుప్రీంను అభ్యర్థించారు. అంతకు ముందు.. తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు. -
వైవి సుబ్బారెడ్డిపై నీచమైన ఆరోపణలు చేస్తారా?: ఉండవల్లి
-
తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు.ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయనున్నామని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారం విచారిస్తామని, ఈలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్‌కు చురకలు -
తిరుమల లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు. ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయనున్నా మని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలోవాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారమే విచారిస్తామని, ఈలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.నాపై విజిలెన్స్ విచారణను కొట్టేయండి: వైవీటీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డానంటూ తనపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తనకు అందచేయకుండానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వివరణలు కోరడాన్ని సవాలు చేస్తూ ఎంపీ, టీటీడీ పూర్వ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను కొట్టేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. టీటీడీ వ్యవహారాలపై విచారణ జరిపే పరిధి చట్ట ప్రకారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు లేదన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారణ జరపనున్నారు. -
ప్రసాదం పై చంద్రబాబు దుష్ప్రచారం ..ఏ విచారణకైనా మేం రెడీ..
-
తిరుమల లడ్డుపై బాబు అబద్ధాలకు వైవీ సుబ్బా రెడ్డి ఛాలెంజ్
-
తిరుమల లడ్డూ వివాదం: బాబూ నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, గుంటూరు: తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం.. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మాట్లాడారంటూ టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దెబ్బతీశారని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు సవాల్..‘‘భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు. తిరుమల ప్రసాదం విషయంలో భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధం. చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?. రాజకీయ లబ్ధి కోసం బాబు ఎంతటి నీచాకైనా వెనుకాడడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. స్వామివారి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడాం. స్వామివారి నైవేద్యంలో స్వచ్ఛమైన నెయ్యిని వాడాం. మేము తిరుమల పవిత్రతను కాపాడాం’’ అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.ఆధారాలుంటే నిరూపించు చంద్రబాబూ..‘‘అసలు ఆ మాట వినటానికే వొళ్లు గగుర్పాటుకు గురైంది. చంద్రబాబు ఆరోపణలు చేసినట్టు ఎలాంటి అక్రమాలు జరగలేదు. నిజమైతే చంద్రబాబు ఆధారాలు బయట పెట్టాలి. ఆ ఆరోపణలకు కట్టుబడే ఉంటే వెంటనే ప్రమాణానికి రావాలి. వంద రోజుల వైఫల్యాలను పక్కదారి పట్టించేలా మాటలు ఉన్నాయి. 2014-19 మధ్య ఏ విధానం అమల్లో ఉందో దాన్నే 2019-24 మధ్య అమలు చేశాం. స్వామి వారి నైవేద్యంలో కల్తీ జరిగిందని ఆరోపణ చేశారు. బహిరంగ మార్కెట్లో కొనే వస్తువుల్లో రసాయనిక పదార్థాలు ఉంటాయని అవి కొనలేదు. రాజస్థాన్ లోని ఒక ఫార్మ్ నుండి తెప్పిస్తాం. ఇందుకోసం రోజుకు అయ్యే రూ లక్ష ఖర్చును ఒక దాత భరిస్తున్నారు. నెయ్యి నాణ్యతను పరిశీలించటానికి ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్‌లో పరిశీలన అయ్యాకే దిగుమతి చేసుకుంటాంఇదీ చదవండి: చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట: భూమన కరుణాకరరెడ్డిసుప్రీంకోర్టుకు వెళ్తాం....ఒక్కోసారి నాణ్యత లేదని దాదాపు పదిసార్లు వెనక్కి కూడా పంపాము. ల్యాబ్‌ని ఆధునీకరించి ప్రత్యేక అధికారులను కూడా నియమించాం. ఇంత పకడ్బందీగా కార్యక్రమాలను మేము అమలు చేశాం. కానీ మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టాలి. లేకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పరువునష్టం దావా వేస్తాం. రాజకీయ లబ్దికోసం ఘోరమైన ఆరోపణలు చేయొద్దు భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు....మా హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం బోర్డులో చర్చించే తీసుకున్నాం. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడారా? తట్టుకోలేక మాట్లాడారో త్వరలోనే తెలుస్తుంది. ఆరోపణలు నిజమనుకుంటే విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఏ తప్పు జరగలేదని ఛాలెంజ్ చేస్తున్నా. తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి ఫైర్
-
దుర్మార్గం.. మహాపచారం
సాక్షి, అమరావతి: ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహా ప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరాధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీయంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇంత దారుణంగా మాట్లాడరని, రాజకీయాల కోసం దేవదేవుడినీ వదలక పోవడం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంత కాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల తేకపోగా, వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నడం.. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా, ఆ మాటంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించడం.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవ్వడం.. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు నిప్పులు చెరిగారు. పరాకాష్టకు బాబు బురద రాజకీయాలు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్క పోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. – భూమన కరణాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రబాబు పెద్ద పాపమే చేశాడుదివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా? – వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ -
తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?’’ అంటూ ఎక్స్ వేదికగా వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు?దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందలకోట్లమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు.1/2— Y V Subba Reddy (@yvsubbareddymp) September 18, 2024 -
YSRCP నేతల అరెస్ట్ వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
-
బాబూ.. మీ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఒంగోలు: ఏపీలో ఏం జరిగినా వైఎస్సార్సీపీకే అంటగడుతున్నారని మండిపడ్డారు పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసాన్ని కాపాడేందుకు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను వరద నీటిలో ముంచేశారని ఆయన చెప్పుకొచ్చారు.కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలులో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏం జరిగినా ఇతరులపై అభాండాలు వేయడం టీడీపీకి అలవాటే. రాష్ట్రంలో కక్ష సాధింపు పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ నివాసాన్ని కాపాడేందుకు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను వరద నీటిలో ముంచేశారు. విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని కామెంట్స్ చేశారు.కాగా, కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కాపాడేందుకు శనివారం అర్ధరాత్రి బుడమేరు గేట్లు తెరిచిన విషయం తెలిసిందే. దీంతో, వరద నీరు విజయవాడలోకి రావడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, వరదల కారణంగా 32 మంది చనిపోయారు. -
YSRCP నేతల అరెస్ట్.. వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు ఏం చేశారు?: వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం,సాక్షి: వెలిగొండ ప్రాజెక్టుపై తెలుగు దేశం ప్రభుత్వం దిగజారి మాట్లాడుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వై.వి సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు వెలిగొండ ప్రాజెక్టుకు ఎవరు ఎన్ని నిధులు కేటాయించిందనే విషయం, పనులు ఎవరు పూర్తి చేశారనే విషయం ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై చంద్రబాబు కూడా అనుమానం వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఈవీఎంలపై అనుమానం ఉందనే విషయాన్ని తాము చెబుతునే ఉన్నాము. అయితే కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. -
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. గోబెల్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? అన్ని ప్రశ్నించింది. బొత్స సత్యనారాయణ నామినేషన్ సందర్భంగా స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే వైవీ సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదు. నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా?’ అని ప్రశ్నించింది.నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం.స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డిగారు లోపలికి వెళ్లలేదు.నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? pic.twitter.com/m8TrwbOfh3— YSR Congress Party (@YSRCParty) August 12, 2024 -
నకిలీ నారా.. మళ్లీ ఓటుకు నోటు
-
కూటమి కుట్రలు తిప్పికొడతాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: కూటమి కుట్రలన్ని తిప్పికొడతామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది వైఎస్సార్సీపీ సింబల్‌తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ మాకున్నా.. వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే.. వాళ్ల ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్సీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది.. మా అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఆ మాట పదే చెప్తుంటారు. కచ్చితంగా స్టాండింగ్ కమిటీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదే: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయ నాయకులను, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటేనని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయానికి కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే సంఖ్యా బలం ఉంది. ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురిచేశారు. మా ప్రజా ప్రతినిధులపై మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ వైఎస్సార్సీపీకే అండగా ఉంటారు అని చెప్పారు.అంతకుముందు, అనకాపల్లిలోని చోడవరం మాడుగుల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. 600 మందికిపైగా సభ్యుల బలం వైఎస్సార్సీపీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే కూటమికి ఉంది. ప్రలోభాలతో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు మోసం ప్రజలకు తెలియాలి. దేశంలో రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. రాజకీయాల్లో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?. వైఎస్సార్సీపీ సభ్యులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా?. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఎన్నో రోజులు నమ్మరు అంటూ కామెంట్స్ చేశారు.ఇక, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం కలెక్టర్ విడుదల చేశారు.షెడ్యూల్ ఇలా.. ఈనెల 30 ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.రేపటి నుంచి అమలులోకి నోటిఫికేషన్.ఈనెల 13వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదీ.14న నామినేషన్ల స్క్రూన్నీనామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు.ఈనెల 30న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్.సెప్టెంబర్ 3న కౌంటింగ్.రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు.ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సిద్దమైన వైఎస్సార్సీపీ. -
ఉత్తరాంధ్ర నేతల అభిప్రాయం ప్రకారమే బొత్స పేరు: వైవీ సుబ్బారెడ్డి:
సాక్షి, తాడేపల్లి : విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంత నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. వారి సూచనల ప్రకారం బొత్సను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్లు 620 మంది ఉన్నారని, టీడీపీ బలం కేవలం రెండు వందలేనని తెలిపారు. అధికార టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నిస్తారని అన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి బీసీ ఎమ్మెల్సీ ఓటమికి కారణమయ్యారని ప్రస్తావించారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బొత్స గెలుపునకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. -
జగన్ రాజీనామానా!.. వైవీ సుబ్బా రెడ్డి క్లారిటీ
-
జగన్ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు.ఇసుక పాలసీపై కావాలంటే విచారణ చేసుకోవచ్చు.. కాని గత ప్రభుత్వంపై నిందలు వేయడం సమంజసం కాదని వైవీ అన్నారు. వైఎస్ జగన్ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. జగన్ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
టీడీపీ ప్రలోభాలకు లొంగిపోవొద్దు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఓటమి తరువాత ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు.. గెలుపు ఓటములు సహజం... కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాసాంధ్రులతో కూడా మాట్లాడి వైఎస్సార్ జయంతి వేడుకల కోసం సందేశం ఇచ్చాను. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీకి అండగా ఉంటారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారు. టీడీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దని సూచించాను. మా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మరోసారి పార్లమెంటులో గళమెత్తింది. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. విభజన హామీలతోపాటు కేంద్రం అమలు చేయాల్సిన పెండింగ్ పనులు, రాష్ట్రంలో అధికారపార్టీ దాడులు, యూజీసీ, నీట్ తదితర అంశాలను ప్రస్తావించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమ్మతి, సంప్రదింçపులు లేకుండా జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్ళయిందని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని ఇదే సభలో హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఎన్నిసార్లు అభ్యర్థించినా, నిరసనలు తెలిపినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ప్రత్యేక హోదా అనేది డిమాండ్ కాదని, అన్యాయంగా జరిగిన విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర ప్రజల కల నెరవేరుతుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రులను పదుల సార్లు కలిసి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాను అడగాలని చెప్పారు. విభజన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ఇవ్వాలని, దీని కోసం గత ప్రభుత్వం భూమిని కూడా గుర్తించిందని తెలిపారు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్, వైజాగ్ – చెన్నై కారిడార్, వైజాగ్ పోర్టు–భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రహదారిని త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖపట్నం వరకు మెట్రోను మంజూరు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్, గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.రైతులకు చేయూతనివ్వండిపీఎం కిసాన్ నిధి కింద రైతులకు రూ.3.20 లక్షల కోట్లు అందించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచడంపట్ల సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ పథకం ఆర్థిక సాయాన్ని రూ.10 వేలకు పెంచాలన్నారు. ఏపీలో రైతు భరోసా పథకం కింద 49 లక్షల రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.13,500 ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకానికి మొత్తం రూ.6,534 కోట్లు కేటాయించిందన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కేంద్రాన్ని కోరారు.పరీక్షల విధానాన్ని సంస్కరించండిదేశంలో పరీక్షల విధానాన్ని సంస్కరించాలని విజ్ఞప్తి చేశారు. నీట్, యూజీసీ పరీక్షల్లో 23 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, అందులో ఏపీ నుంచి 70 వేల మంది ఉన్నారని తెలిపారు. అయితే, ప్రభుత్వ కళాశాలల్లో 55,645 సీట్లు, ఎయిమ్స్‌లో 2000 సీట్లే ఉన్నాయని, ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల కొరత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం కళాశాలలు, సీట్లు పెరగలేదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను లక్షకు పెంచాలని కోరారు.వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ దాడులురాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై అధికార పార్టీ హింసాత్మక దాడులకు పాల్పడుతోందని సుబ్బారెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం జేసీబీలతో కూల్చివేస్తోందని తెలిపారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం భవనాన్ని కూల్చివేశారని, జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల కూల్చివేతకు సిద్ధమవుతున్నారని చెప్పారు. నాలుగు తెలుగు చానెళ్ల ప్రసారాలను నిలిపివేశారని, ఇది పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. మీడియా సంస్థలపై ప్రస్తుత ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. -
రాజ్యసభలో విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా డిమాండ్..
-
ఇది డిమాండ్ కాదు ఏపీ ప్రజల హక్కు
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి’’ అని ఆయన కోరారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులపైనా ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు వారాలు గడిచింది. అప్పటి నుంచి ఆ పార్టీ వైఎస్సార్సీపీ శ్రేణులుపై దారుణంగా దాడులు చేస్తోంది. ఏపీలో శాంతి స్థాపనతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 👉 పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి👉 వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తగ్గిన గనులు కేటాయించి లాభాల్లోకి తీసుకురావాలి👉 ఏపీలో ఐదేళ్లలో 16 మెడికల్ కాలేజీలను వైయస్ జగన్ స్థాపించారు. తక్కువ ఖర్చుతో డాక్టర్లను తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 👉 రైతులకు గిట్టుబాటు ధరలు అమలు చేయండి. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో రైతుల పంటలకు తగ్గిన భీమా సౌకర్యం కల్పించాలి👉 రైల్వేలలో ప్రయాణికుల భద్రతకు నిధులను పెంచాలి. రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. భద్రత చర్యలను వెంటనే అప్ గ్రెడ్ చేయాలి👉 రైల్వే జోన్ కు ఇప్పటికే ప్రభుత్వం భూములు కేటాయించింది. నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టును పూర్తి చేయాలి👉 విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలి👉 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేయాలి. విశాఖపట్నం మెట్రో రైలును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలిఇదీ చదవండి: అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా అడగరా?: ఎంపీ తనూజ -
ఆగని టీడీపీ అరాచక పర్వం.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్‌నజీర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ బృందం గవర్నర్‌ను కలిసింది.గవర్నర్ కలిసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గాలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భదత్రలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ఆఫీసుల నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. -
ఓటమిపై సమీక్షించుకుంటాం..
-
టీడీపీ దాడులకు భయపడొద్దు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ దాడులకు భయపడొద్దని వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.’’కార్పొరేషన్ స్థానిక సంస్థలలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది.. వాటికి లొంగకుండా అందరం కలిసి సమష్టి సమీక్షలు నిర్వహిస్తున్నాం. దాడులకు కూడా భయపడొద్దని, పార్టీ ఆదుకుంటుందని శ్రేణులకు భరోసా ఇస్తున్నాం. కార్యకర్తలకు అన్నీ విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుంది. ఆదుకుంటుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.ఎన్డీఏకు కూడా పూర్తి స్థాయి మెజారిటీ లేని పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు కీలకం కానున్నాయి. పార్లమెంట్లో వైఎస్సార్సీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
టీడీపీ దాడులపై హైకోర్టులో పిటిషన్
-
TDP Attacks: వైవీ సుబ్బారెడ్డి పిల్‌పై మధ్యాహ్నాం విచారణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మొదలైన హింస.. ఇప్పటికీ కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ, కూటమి పార్టీలు.. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతున్నాయి. ఈ క్రమంలో.. వారంపైగా జరుగుతున్న ఈ హింసాత్మక దాడులపై రాష్ట్ర హైకోర్టులో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఇవాళ(గురువారం) విచారణ జరపాల్సి ఉంది. అయితే కోర్టు ప్రారంభమైన కాసేపటికే విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2:15కు ఈ పిల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చదవండి: టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం: వైవీ సుబ్బారెడ్డి -
టీడీపీపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం
-
టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేసినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తల దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాడుల విషయమై రాష్ట్రపతికి, గవర్నర్‌కు, హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేశాం. ఈ దాడులపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు ఫిర్యాదు చేశాం’ అని చెప్పారు.ఇక, అంతకుముందు.. అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరపనుంది.ఇదీ చదవండి: APలో జంగిల్ రాజ్.. యథేచ్ఛగా హింసాకాండ! -
అలసత్వంతో అరాచకం
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల అనంతరం ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరపనుంది. పరిహారం బాధ్యత ప్రభుత్వానిదే.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణమే కేంద్ర పారా మిలటరీ బలగాలను రప్పించాల్సిన అవసరం ఉందని సుబ్బారెడ్డి కోర్టుకు నివేదించారు. లక్షిత దాడుల్లో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోజాలవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని గుర్తు చేశారు. మరో ప్రత్యామ్నాయం లేనందున పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించి సత్వర న్యాయం అందించేందుకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లే లక్ష్యంగా... ప్రజల ప్రాణాలు, స్వేచ్చ, ఆస్తులను కాపాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి పారిపోవడానికి వీల్లేదని సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మారుమూల గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు, హింసాకాండకు తాజాగా అధికారం చేపట్టిన పార్టీ ఆమోదం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టుకు విన్నవించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను నిరాశ్రయులను చేయడం, వారిపై రాళ్లతో దాడులు చేయడం లాంటి ఘటనలు ఆ వీడియోలో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. డీజీపీ హరీ‹Ùకుమార్ గుప్తా, అదనపు డీజీ బాగ్చీ, పల్నాడు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి టీడీపీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అధికారులు హింసను నిరోధించకుండా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. గంటల వ్యవధిలో దాడులు మొదలు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే రాష్ట్రంలో దాడులు, హింసాకాండ మొదలయ్యాయని, ఉద్దేశపూర్వకంగా కొందరిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయని సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు కొంత సమయం ఉండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని దాడులకు, హింసకు తెర తీశారని నివేదించారు. ఇళ్లు, గ్రామాలను వదిలేసి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారన్నారు. ఈ హింస, దాడులపై తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ జోక్యానికి రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి లేఖలు రాశారని తెలిపారు. నిర్దిష్ట రాజకీయ పారీ్టతో సంబంధాలున్న వారినే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పౌరుల ప్రాణాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారన్నారు. విధ్వంసకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా, మైనారిటీలపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారన్నారు. -
యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజు లుగా అరాచక శక్తులు సాగిస్తున్న హింసాకాండను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతోపాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసాలకు పాల్ప డటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇలాంటి దారుణాలు జరిగాయంటే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. టీడీపీ గూండాల దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాల్లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందచేసిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు, రఘునాధరెడ్డి, బాబూరావు, తనూజరాణి, గురుమూర్తిలతో కలిసి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మూకల దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..చంద్రబాబుది ఆటవిక పాలనటీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ గూండాల అకృత్యాలను రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో చట్టాలు, స్వేచ్ఛ, న్యాయ పాలన లేదు. అన్యాయం రాజ్యమేలుతోంది. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే రాష్ట్రాన్ని అత్యంత భయానక వాతావరణంలోకి నెట్టారు. ఇప్పటి వరకూ ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే.ముందే దాడులకు పురిగొల్పి..ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి మొదలైన దాడులు ఫలితాల తర్వాత తీవ్రరూపం దాల్చాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల ప్రాణాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే గూండాగిరీ అని రుజువు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దాడులకు పురిగొల్పి చంద్రబాబు బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేశారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. బాధితుల ఆక్రందనలు తమ కుటుంబ సభ్యులివిగానే భావించి ఈ రక్త చరిత్రను అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.మూడుసార్లూ బీజేపీతో అండతో పీఠం1999, 2014, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడుసార్లూ బీజేపీ సహకారం వల్లే పీఠం దక్కించుకున్నారు. హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భావితరాలకు హింసా సంస్కృతిని నేర్పడం ఎవరూ హర్షించరు. అధికారం అంటే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అధికారం అంటే రౌడీయిజం గూండాయిజం కాదు. బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలపై టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది. యూనివర్సిటీలు, వీసీలపై దాడులు తగవు. అమానవీయ ఘటనలకు పాల్పడడమే కాకుండా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజ్‌కుమార్‌పై లోకేష్ మనుషులు చేసిన దాడిని సోషల్ మీడియాలో అందరూ చూశారు. బంగారం లాంటి రాష్టం తగలడుతుంటే బాధగా ఉంది. ఏపీలో ఘటనలకు కేంద్రం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మీడియాపైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టీవీ 9, ఎన్టీవీ, సాక్షి తదితర చానెళ్లను ఎంఎస్‌వోల నుంచి తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్న భావన కలుగుతోంది. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని మరోసారి నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి రాష్ట్రం, దేశ ప్రయోజనాలే పరమావధిగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ అదే రీతిలో బిల్లులకు మద్దతు ఇచ్చామని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో టీడీపీకి 16 మంది ఎంపీలుండగా వైఎస్సార్ సీపీకి 15 మంది సభ్యులున్నారని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో వైఎస్సార్సీపీదే బలమెక్కువ అని తెలిపారు. ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమా? అనేది కాకుండా రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా బిల్లులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ సంఖ్యాబలం ఆధారంగా కొద్ది మెజారిటీతోనైనా లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరిగిపోతుందని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫైడ్ సివిల్ కోడ్)కి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై తమ పార్టీ అధినేత సూచనలు తీసుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపడతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్.. ఇలా దేశంలో అన్ని పార్టీలతోనూ జత కట్టిన మహానాయకుడు చంద్రబాబు మినహా మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వానిదే బాధ్యత: ఎంపీ మిథున్‌రెడ్డి రాష్ట్రంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు నూతన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజాతీర్పును గౌరవిస్తూ హామీలను నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాలి.న్యాయ పోరాటం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ, ఎన్హెచ్ఆర్సీలకు ఫిర్యాదు చేశాం. తగిన స్పందన లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ గూండాయిజం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుట్రపూరితంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఉసిగొల్పారు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం. అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్రం తక్షణమే స్పందించి శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలను పార్లమెంట్ దృష్టికి తెస్తాం. -
ఎలక్షన్ కౌంటింగ్ ఏర్పాట్లపై YV సుబ్బారెడ్డి
-
ఎగ్జిట్‌పోల్స్‌ను పట్టించుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పారు.కాగా, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఇక, ఏపీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు. మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. -
తప్పుడు పనుల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు
-
‘సడలింపులు’పై హైకోర్టుకు వెళ్తాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపుపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఈసీ వ్యవహారశైలిని హైకోర్టులో తేల్చుకోనున్నామన్నారు. దేశం అంతటా ఒక రకమైన నిబంధనలు ఉంటే ఏపీలో ఈసీ ప్రత్యేక రూల్స్ చెబుతోంది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించడం నిబంధన. కానీ ఏపీలో మాత్రం గెజిటెడ్ సంతకం లేకపోయినా అనుమతించడంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని వైవీ అన్నారు. సీఈసీ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు..
-
YSRCP దే ఘన విజయం..
-
వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
విశాఖపట్నం: ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో టీడీపీ నీచపు పనులకు పాల్పడుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ రాసినట్టుగా టీడీపీ ఒక లేఖను సృష్టించి.. దాన్ని అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బురదజల్లుతోందని తెలిపారు.ఆ లేఖలో ఉపయోగించిన భాషను చూస్తే అది ఫేక్ అన్న సంగతి అందరికీ అర్థం అవుతోందని తెలిపారు. ఓడిపోతున్నామనే ఉక్రోషంతో టీడీపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. విజయమ్మ పేరిట లేఖను సృష్టించి సర్క్యులేట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
ఉప్పొంగిన ఉత్తరాంధ్ర..
-
రాజ్యసభ ఎంపీ నిధులను విశాఖలో ఖర్చు చేస్తా
-
‘పక్కా ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సీఎం జగన్‌పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. కాగా, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు తగిలిన వెంటనే నాకు కూడా గాయమైంది. ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు కనుగుడ్డుపై ర్యాష్ అయ్యింది. ఇప్పుడు కూడా కంటి నొప్పి ఉంది. సీఎం జగన్ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు, ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలి. చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు. సీఎం జగన్‌పైన ఈరోజు ఇలా కుట్ర చేశారు. సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్‌పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు. మరోవైపు, సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రోజా నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు దాడులు చేయించారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. పవన్ కల్యాణ్ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు సరికాదు. తన గెలుపు కోసం ఎదుటి వ్యక్తిని చంపాలనుకోవడం సిగ్గుచేటు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. -
పథకం ప్రకారమే సీఎం జగన్ పై దాడి: వైవీ సుబ్బారెడ్డి
-
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంత YSRCP ముఖ్య నేతలతో సమావేశం
-
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వైవి సుబ్బారెడ్డి
-
రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. కాగా, ఈరోజు రాజ్యసభ ఎంపీగా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాడు లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని కామెంట్స్ చేశారు. -
YSRCP: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన ముగ్గురు ఎంపీలు
Live Updates.. ►వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ►వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Yerram Venkata Subba Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/iYPbG6qrHM — SansadTV (@sansad_tv) April 4, 2024 ►ఈ సందర్భంగా ఆంగ్లంలో దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Meda Raghunadha Reddy in the Parliament House.#RajyaSabha @VPIndia @harivansh1956 pic.twitter.com/cbYUwdztlC — SansadTV (@sansad_tv) April 4, 2024 ►హిందీలో దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన గొల్ల బాబురావు #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly- elected member Golla Baburao in the Parliament House.#RajyaSabha @VPIndia @BaburaoGolla @harivansh1956 pic.twitter.com/LfsieauzrE — SansadTV (@sansad_tv) April 4, 2024 ►రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ►ఇక, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైఎస్సార్సీపీదే. ఇక, ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య జీరో అయ్యింది. ►అంతకుముందు గొల్ల బాబురావు మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుల్లో దళితులకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎన్నో ఒత్తిడిలు ఉన్నా నాలాంటి పేద, దళిత వర్గాలకు రాజ్యసభ సీటు ఇచ్చారు. నా పదవీకాలంలో పేదల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను. విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాను. ఈరోజు హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేస్తాను అని కామెంట్స్ చేశారు. -
ఎల్లో మీడియాపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
-
డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే..!
-
పవన్ ఎన్నిసార్లు వారాహి యాత్ర చేస్తారు?: వైవీ సుబ్బారెడ్డి
-
పవన్ ఎన్నిసార్లు వారాహి యాత్ర చేస్తారు?: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంగా భాగంగా మరోసారి గడపగడపకు విస్తృత ప్రచారం చేపట్టాలని రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి నిర్దేశించారు. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని, వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితి కూటమి నేతలకు ఏర్పడిందన్నారు. ‘‘సిద్ధం సభలు తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం టీడీపీ, జనసేన చేయలేకపోయాయి. ఢిల్లీ నుంచి మోదీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితి టీడీపీ, జనసేనకు ఏర్పడింది. పవన్ ఎన్నిసార్లు వారాహి యాత్ర చేస్తారు?. 2014-19 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయి. కూటమి మరోసారి జనం ముందుకు వస్తోంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాం. సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని, కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: ఆఖరి పయత్నాల్లో చంద్రబాబు: సజ్జల -
అనకాపల్లి ఎంపీ టికెట్‌పై త్వరలో నిర్ణయం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని సభలో భద్రతా వైఫల్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై వైఎస్సార్సీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. కూటమి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారాయన. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్ అభ్యర్థి పెండింగ్‌లో ఉండడంపైనా ఆయన స్పష్టత ఇచ్చారు. విశాఖలో మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉంచిన అనకాపల్లి అభ్యర్థి విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా అని పేర్కొన్నారాయన. అలాగే.. ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని.. సిద్ధం సభలు జరగని ప్రతీ జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తారని సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. ‘‘అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం. టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది’’ అని పేర్కొన్నారాయన. ఇక చిలకలూరిపేట ప్రజాగళంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. ‘‘వాళ్లు కూటమిగా ఏర్పడి మొదటిసారి మీటింగ్ పెట్టకున్నారు. వాళ్లు ఎంతమందిని పిలిచారో.. ఏం చేశారో మనకు తెలియదు. దేశ ప్రధానికి ప్రోటోకాల్‌ను అనుసరించే భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం’’ అని ఆయన అన్నారు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు త్వరలోనే బస్సు యాత్ర చేస్తారు. ఎవరు ఏ పక్కన నిలబడ్డారు.. ఏ పార్టీ ఏఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయి అనేదానిని ప్రజలు ప్రతీ ఒక్కటి గమనిస్తుంటారు. త్వరలో వాళ్ల ఓటు ద్వారా తీర్పు ఇస్తారు అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
-
కాపుల పట్ల సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ: వైవీ సుబ్బారెడ్డి
విశాఖపట్నం, సాక్షి: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర అని.. కాపుల పట్ల సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలో కాపు సామాజిక భవనం భూమి పూజా కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలు పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ కాపుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కాపులకు రూ. 25 కోట్లు భూమి కేటాయించడమమే ఇందుకు నిదర్శనం. అదీ విశాఖ నడిబొడ్డున.. హైవే పక్కన 50 సెంట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాపులది కీలక పాత్ర. కాపులతో పాటు యాదవుల సామాజిక భవనం నిర్మాణం కోసం కూడా 50 సెంట్ల భూమి కేటాయించారు. రాజ్యసభ నిధుల నుంచి కాపు, యాదవ సామాజిక భవనాలకు కోటి రూపాయలు ఖర్చు చేస్తాను అని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘‘రూ. 25 కోట్లు విలువైన 50 సెంట్లు భూమిని కాపు భవనానికి సీఎం జగన్ కేటాయించారు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తాం. విశాఖ నగరంలో ఇప్పటికే అనేక కళ్యాణ మండపాల నిర్మాణం పూర్తి చేశాం. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 31మంది కాపులు పోటీ చేసేందుకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ఆ 31 మందిలో 29 విజయం సాధించారు. ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల ఆరాధ్య దైవం రంగాను చంపిన వారికి.. ముద్రగడ పద్మనాభంను అవమానించిన వారికి మద్దతు చెబుతారో.. కాపులకు మేలు చేసిన వారికి అండగా ఉంటారో మీరే(కాపులను ఉద్దేశించి..) నిర్ణయించుకోవాలని అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేశారు. కాపు నేస్తం పథకం ప్రవేశ పెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కులగణన చేపట్టారు. కాపు బిడ్డకు ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం జగన్ కల్పించారు. కాపులకు సేవ చేసేందుకు మేము ఎప్పుడు ముందు ఉంటాం అని బొత్స ఝాన్సీ అన్నారు. ఇంకా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీదర్, కొండా రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన వైవీ సుబ్బారెడ్డి
-
రాబోయే రోజుల్లో విశాఖ నుంచే పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం చాలా ప్రశాంతమైన నగరమని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా, విశాఖలో ఆదివారం ఉదయం ఫ్లోటింగ్ బ్రిడ్జిని సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు బీచ్‌ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసింది. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. విశాఖ నుంచి ప్రభుత్వం నడుస్తుంది. ఏపీ అభివృద్ది విషయంలో పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. పర్యాటక అభివృద్ధి ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణమే ఉదాహరణ. విశాఖ బీచ్‌లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తున్నాము అని కామెంట్స్ చేశారు. -
రాజ్యసభ సభ్యుడిగా ధ్రువీకరణ పత్రం తీసుకున్న వైవి సుబ్బారెడ్డి
-
ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ చేరికపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
జనమంతా జగన్‌తోనే.. టీడీపీ ఖాళీ ఖాయం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని.. వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని, మొత్తం స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని.. త్వరలో లోక్‌సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు.రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పోటీ చేయాలని భావించిందని కానీ తమ ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉండటంతో తాము ఏకగ్రీవంగా గెలవగలిగామని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగివస్తున్నారని, ప్రజా బలం ముందు ప్రలోభాలు పని చేయవని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదని విమర్శించారు. సీఎం జగన్‌తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుందన్నారు. వైఎస్ జగన్‌తోనే జనం ఉన్నారన్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు దక్కించుకోవడంతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 11కు చేరుకుంది. చదవండి: విశాఖ బయల్దేరిన సీఎం జగన్ -
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోనూ టీడీపీ ఖాళీ
సాక్షి, విశాఖపట్నం/సీతంపేట(విశాఖ, ఉత్తర) : రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా ఇదే పరిస్థితి రానుందని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఎండాడలో గల పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్రలో గల 34 నియోజకవర్గాల ఇన్చార్జులు, పరిశీలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రులు వలంటీర్లు అని, 57 నెలల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను మరోమారు ప్రజలకు గుర్తు చేసే హక్కు వారికి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు బెదిరింపులకు పాల్పడతున్న విషయాన్ని గుర్తు చేశారు. అసలు టీడీపీ, జనసేనలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు కుర్చీ మడత పెట్టడానికి వారికి కుర్చీనే లేదన్నారు. విధ్వంసం పుస్తకం రాసిన వాళ్లు, ఆవిష్కరించిన వాళ్లను చూస్తేనే దాని వెనుక ఉన్న విధ్వంసం అర్థమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. 60 అడుగుల వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ విశాఖ నగరం నడి బొడ్డున ఉత్తర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం పార్టీ శ్రేణుల మధ్య శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. నగరంలోని అక్కయ్యపాలెం హైవే కూడలి వద్ద జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 అడుగుల వైఎస్సార్సీపీ జెండాను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు, మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తారని చెప్పారు. విశాఖ అభివృద్ధికి మా పార్టీ కట్టుబడి ఉందనడానికి నిదర్శనమే ఈ రోజు విశాఖనగరం నడి బొడ్డులో రాష్ట్రంలోనే అతి పెద్ద జెండా ఆవిష్కరణ జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీ‹Ù, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ జనసేన గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారంట
-
విశాఖ పరిపాలన రాజధాని అంశంపై కట్టుబడి ఉన్నాం: సుబ్బారెడ్డి
-
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైవీ సుబ్భారెడ్డి కామెంట్
-
ఎన్నికల్లో 175 సీట్లలో గెలుపే లక్ష్యం కృషి చేస్తాం: సుబ్బారెడ్డి
-
RS Election: YSRCP అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం జగన్ బీఫాం అందజేశారు. సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికు రాజ్యసభకు అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసన సభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులం విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్ళీ వైఎస్ జగన్‌ను గెలిలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రఘునాథరెడ్డి, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ నాకు అవకాశం కల్పించారు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేస్తాం గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు పేద వర్గాల వారికి రాజ్యసభ కి పంపిస్తున్నారు కోట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడినైన నాకు ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం తథ్యం మూడు స్థానాలు కూడా మేమే గెలుస్తాం చంద్రబాబు గతంలో దళితుడైన వర్ల రామయ్య ను అవమానించారు రాజ్యసభ సభ్యుడిని చేస్తానని మోసం చేశారు తన కులానికి చెందిన కనకమేడల కోసం వర్ల రామయ్య ని అవమానించారు సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం -
YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. కాగా, రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరుగనుంది. అనంతరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి అభినందించారు. మేడా రఘనాథరెడ్డి నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లెకు చెందినవారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మేడా రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారులలో రెండవ కుమారుడు మేడా రఘునాధరెడ్డి. మొదటి కుమారుడు సిట్టింగ్ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. మేడా రఘనాథరెడ్డి అదే మండలంలోని టంగుటూరులో విద్యాభ్యాసం పూర్తిచేశారు. డిగ్రి పూర్తైన వెంటనే 20 ఏళ్ల వయస్సులోనే బెంగుళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో MRKR కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలొనే కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి -
షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..
-
మార్గదర్శి కేసులో శిక్ష తప్పదని రామోజీ భయపడుతున్నారు
-
తప్పుడు రాతలతో రామోజీ పబ్బం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీ, చంద్రబాబులు దిట్టలంటూ వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, తప్పుడు రాతలతో రామోజీ పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. మార్గదర్శి కేసు విచారణ జరిగితే శిక్ష తప్పదని రామోజీ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు. విచారిస్తే బెడ్ మీద పడుకొని యాక్టింగ్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో మార్గదర్శికి బిగ్ షాక్ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన రాజ్యసభ సీట్లు మావే
-
చంద్రబాబు కుట్రలు ఫలించవు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్‌కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే’’ అంటూ వైవీ దుయ్యబట్టారు. ‘‘అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు. మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్ -
భీమిలి సభలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశం ఇదే !
-
చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోరు..షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
-
షర్మిలకు వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
-
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు: వైవీ సుబ్బారెడ్డి
-
నిందలు వేసే ముందు షర్మిల ఆలోచించుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీ చేస్తాం. చంద్రబాబులా బీజేపీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. విశాఖ రాజధాని కాకుండగా కేసులు వేసింది కూడా చంద్రబాబే. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు. పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారు. ఇప్పుడు షర్మిలను చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టింది. మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు సమాయత్తమవ్వాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి అధిక స్థానాలు గెలిచే ప్రయత్నం చేయాలన్నారు. పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. తరగపువలస సమీపంలొ జరిగే వైఎస్సార్సీపీ సభను మనం విజయవంతం చేయాలన్నారు. రాష్ర్టవ్యాప్తంగా సంకేతం పంపే విధంగా సభ ఉండాలన్నారు. -
సీఎం జగన్ విజయాన్ని అడ్డుకోలేరు..
-
భీమిలి నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస(విశాఖ): వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. సంగివలసలో జాతీయరహదారి పక్కన ఎంపిక చేసిన సభా స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్ల గురించి భీమిలి సీఐ డి.రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేలు చొప్పున 2లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు. సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పెన్మత్స సురేష్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, రీజనల్ యూత్ కో–ఆర్డినేటర్ ముత్తంశెట్టి శివనందీష్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె.వెంకటరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, డీసీపీ శ్రీనివాస్, ఏడీసీపీ జాన్ మనోహర్, ఏసీపీ జి.శ్రీనివాసరావు, భీమిలి ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, ట్రాఫిక్ సీఐ ఎస్.కాంతారావు సభా స్థలాన్ని పరిశీలించారు. -
ఈ నెల 27న భీమిలిలో వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ
-
షర్మిల వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి రిప్లై
-
షర్మిల కాదు.. ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు. మాతో పాటు షర్మిల వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. అలాగే, వైఎస్సార్‌కు నిజమైన వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, విశాఖలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆమెకు ఏమీ తెలియదు. పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా?. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారు. వైఎస్సార్ కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్యాయంగా జైలులో పెట్టిన కాంగ్రెస్‌లో ఆమె చేరారు. వైఎస్సార్‌కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు. మొన్నటివరకు తెలంగాణ బిడ్డగా అక్కడ తిరిగారు. ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయలేదు అనేది తెలియదు. షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరు. వైఎస్సార్ కుటుంబాన్ని సోనియా గాంధీ ఇబ్బందుల్లో పెట్టారు. ఢిల్లీ కాంగ్రెస్‌లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సమీక్షించుకోవాలి. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలి. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కాంప్రమైజ్ కాలేదు. ఈనెల 27వ తేదీన భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరిస్తున్నారు. రెండు లక్షల మంది 34 నియోజకవర్గాల నుండి హాజరవుతున్నారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: షర్మిల వాడిన భాష, యాస సరికాదు: సజ్జల -
YSRCP ఫైనల్ లిస్ట్ వచ్చేది అప్పుడే!
విశాఖపట్నం, సాక్షి: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు విషయంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లారిటీతోనే ఉన్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి.. తాను పోటీ చేసే విషయంలోనూ సీఎం జగన్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. సీట్ల మార్పుల విషయంలో సీఎం జగన్ స్పష్టంగా ఉన్నారు. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్దులను సీట్లు ఉండవని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.అందుకు తగ్గట్లే మార్పులతో మూడు జాబితాలు విడుదల చేశాం. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పండుగ తర్వాత వస్తుంది. సిట్టింగ్‌లు కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. సీనియర్లు వాళ్ల వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయి అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయనని సీఎం జగన్‌కు చాలాసార్లు చెప్పానని, పోటీ చేయాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని, కంటిన్యూ అయ్యేవాడ్ని అని చెప్పుకొచ్చారాయన. ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్ రావడంతోనే పార్టీ పనులు చూస్తున్నానని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. అయితే అంతిమంగా పోటీ చేసే విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇక బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదన్న ఆయన.. దేశంలో బీసీలకు అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారని అన్నారు. మా వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే మాకు ఓటెయ్యండని సీఎం జగన్ చెబుతున్నారని.. అంత ధైర్యంగా చెప్పే సీఎం ఈ దేశంలో ఎవరూ లేరని అన్నారాయన. అలాగే.. కాంగ్రెస్‌లో షర్మిల చేరికతో వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టం లేదని, ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. -
Makar Sankranti 2024 Festival Celebration: విశాఖపట్నంలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
మళ్ళీ జగన్ సీఎం కావాలి..మాకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి
-
కాంగ్రెస్‌లోకి షర్మిల.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు షర్మిల. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారాయన. ఎవరు కలిసినా, కూటములుగా వచ్చినా మాకు భయం లేదు. మళ్లీ జగన్ సీఎం కావాలి.. మాకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారాయన. అలాగే.. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనన్నారు. ఇక.. వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం జరుగుతున్న మార్పుల గురించి స్పందిస్తూ.. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని, అన్నినియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
అనకాపల్లిలో టిడ్కో గృహాలు: సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్
సాక్షి, అనకాపల్లి: సత్యనారయణపురంలో 2,744 టిడ్కో గృహ సముదాయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. కాగా, 27 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమకు సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఈ సారి మీ సొంత ఇంట్లో చేసుకోవాలని టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలుపుకున్నారు. లబ్ధిదారులకు రిజస్ట్రేసన్లు ఉచితంగా చేయిస్తున్నారు. కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న కాలనీల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని కామెంట్స్ చేశారు. -
సత్యనారాయణపురంలో పూర్తయిన 2,744 టిడ్కో గృహాలు
-
ఇంచార్జ్ మార్పులపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
-
బాబు,పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
గుంటూరు, సాక్షి: ప్రజారంజకమైన పాలన అందిస్తున్నాం కాబట్టే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందని.. ఈసారి ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి.. తనపైనా యెల్లో మీడియాలో వస్తున్న కథనాలపైనా ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘ఎవరి కోసమూ నేను షర్మిలతో రాయబారం చేయటం లేదు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం వలన ప్రజలు మాకు నీరాజనం పలుకుతున్నారు. ఇది చూడలేక ఎల్లోమీడియా వారిష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రెండు మూడు వారాలకొకసారి నేను హైదరాబాదు వెళ్తుంటా. కుటుంబ సభ్యులను కలుస్తుంటా. విజయమ్మ అమెరికా నుండి వచ్చాక వెళ్లి కలిశాను. కానీ యెల్లో మీడియా రాతలు పరాకాష్టకు చేరాయి. కుటుంబ సభ్యులనూ కూడా బజారుకీడ్చే పని చేస్తోంది. చంద్రబాబు, పవన్ అందరూ కలిసి కుట్రలు పన్ని ఇలాంటి వార్తలు రాయిస్తున్నారు. షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు. ఈమధ్య కాంగ్రెస్‌లో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై మాకు క్లారిటీ లేదు. షర్మిళ కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. మాకు ప్రజా మద్దతు ఉంది కాబట్టి. ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలతో పేదల కుటుంబాల్లో మార్పు వచ్చింది. మాకు ప్రజలే దేవుళ్లు అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. దాడి అయినా వినలేదు ఇక.. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 175 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ‘‘సీట్ల విషయంలో అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కోచోట సీటు ఇవ్వలేకపోతే వేరేది చూస్తామని కూడా చెప్తున్నాం’’ అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీకి దాడి వీరభద్రం రాజీనామా చేసిన పరిణామంపైనా సుబ్బారెడ్డి స్పందించారు. సీట్ల విషయంలో అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయి. అనకాపల్లిలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఓపిక పట్టాలని దాడి వీరభద్రంతో మాట్లాడాం. అయినా వినకుండా ఆయన రాజీనామా చేశారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా మార్పులు ఉంటాయి అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: పిల్లలు తినే తిండిపైనా ఈనాడు విషం! -
బాబు, పవన్ ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ కు తిరుగులేదు: వైవీ సుబ్బారెడ్డి
-
‘బాబు-పవన్‌ల కుతంత్రాలు.. సీఎం జగన్‌కు తిరుగేలేదు’
విశాఖపట్నం, సాక్షి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైనాట్-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందుకే పార్టీలో మార్పులని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అసంతృప్తులు పార్టీని వీడడం షరా మామూలుగా జరిగేదేనని అన్నారాయన. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో వంశీకృష్ణా యాదవ్ పార్టీ మారిన సంగతిపైనా స్పందించారు. ఎక్కడైతే మార్పు అవసరమని భావించామో అక్కడే ఇంఛార్జిలను మారుస్తున్నాం. ముందు పని చేసిన నాయకులు కొత్తవాళ్లకు సహకరించాలని సీఎం జగన్ కూడా చెప్పారు. ఎంతమంది ఉన్నా.. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి(వంశీకృష్ణ యాదవ్‌ను ఉద్దేశించి..) ఎమ్మెల్సీ ఇప్పించాం. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా మాకు ఇబ్బందేం లేదు అని అన్నారాయన. పవన్, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌కు తిరుగు లేదని, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారు అని సుబ్బారెడ్డి చెప్పారు. అందుకే రాజధాని ఆలస్యం న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి కుండబద్ధలు కొట్టారు. -
గత ప్రభుత్వంలో శిలా పలకలు తప్ప పనులు లేవు
-
వైవీ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి భేటీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. ఏపీలో 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని తెలిపారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి మంగళవారం విశాఖలో మాట్లాడుతూ.. గాజువాకలో సమన్వయకర్తను మార్పు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశాం. మాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ముఖ్యమంత్రిగా జగన్ కావాలని నాగిరెడ్డి, దేవన్ రెడ్డి చెప్పారు. మంచి అభ్యర్థికి సీటు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీలో చాలా మార్పులు జరగనున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేదు అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు.. వైవీ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పల దేవన్‌రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో దేవన్‌రెడ్డి మాట్లాడుతూ..‘పార్టీకి రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. నా తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీకి నేనెందుకు రాజీనామా చేస్తాను?’ అని అన్నారు. -
జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదు.. పవన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
సాక్షి, అనకాపల్లి: పవన్‌లా మాది ప్యాకేజీ పార్టీ కాదంటూ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదని, పేదల పక్షాల నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్‌కు, ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్సార్సీపీకి చాలా తేడా ఉంది. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉంటారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్‌కు అభివృద్ధి గురించి తెలుస్తుంది. బీసీలకు పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా?. అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. చదవండి: సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! -
బొబ్బిలిలో బడుగుల గర్జన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార విజయ నినాదంతో గర్జించారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు నియోజకవర్గం నలు దిక్కుల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది బైక్‌లతో యువకులు ర్యాలీగా వచ్చారు. ముందుగా మెట్టవలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం–వెల్నెస్ సెంటర్ భవనాలను డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర నిర్వహించారు. బొబ్బిలి శ్రీకళాభారతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది పోటెత్తారు. జై జగన్... జై వైఎస్సార్సీపీ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. నాలుగేళ్లలో ఎంతో మేలు: శంబంగి రైతులు ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో కొత్తగా 11,500 ఎకరాలకు సాగునీరు అందించామని, మరో 4,500 ఎకరాలకు నీరందించడానికి పనులు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు చెప్పారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బలహీనవర్గాలకు పెద్ద పదవులిచ్చిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పెత్తందారులకు మాత్రమే పెద్దపీట వేసిన టీడీపీ పాలనకు భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పదవులు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికీ సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ధనవంతుల పిల్లల్లాగే పేదల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారత కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం: పుష్పశ్రీవాణి సంక్షేమ పాలన సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద దళితులకు రూ.75 వేల కోట్లు, గిరిజనులకు రూ.25 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం అందించారని చెప్పారు. బొబ్బిలి గడ్డపై జనసునామీ: మజ్జి శ్రీనివాసరావు సీఎం వైఎస్ జగన్ పిలుపుతో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు బొబ్బిలి గడ్డపై జనసునామీ పోటెత్తిందని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్‌ను సీఎం జగన్ సాకారం చేశారని చెప్పారు. చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన బొబ్బిలి రాజులు పదవుల కోసం పార్టీ మారారని, ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. -
ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
ఫిషింగ్ హార్బర్ ప్రమాదం.. బాధితులను ఆదుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బాధితులు వేటకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగుతోందని తెలిపారు. ఘటనలో కుట్రకోణం ఉంటే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. . ప్రభుత్వం, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతో హార్బర్లో ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. పోర్టు, స్టీల్ ప్లాంట్ పోలీసులు వేగంగా స్పందిచారని, లేదంటే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ముప్పు ఉండేదని తెలిపారు. సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందించారని చెప్పారు. బోటు ఖరీదు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నప్పటికీ అందులో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పరిహారం గతం మాదిరిగా ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామని చెప్పారు. ‘మునిగిపోయిన బోట్లను తొలగించాలని పోర్టు అధికారులను కోరాం. ఇతర బొట్లకు అడ్డం లేకుండా మునిగిన బోట్లను త్వరలో బయటకు తీస్తాం. మత్స్యకారుల కష్టాలను తెలుసుకోవాలని సీఎం పంపించారు. అందుకే వచ్చాను. కేవలం పరిహారం మాత్రమే కాదు, ఇతర సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రమాద కారకులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతోంది. సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదన్న విషయంపై విచారణ చేపట్టాలని సీపీకి కోరాం’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన అనుమానితుడిగా ఉన్న యుట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 10 మంది అనుమానితులని అదుపులోకి తీసుకోగా.. వారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ ఆనంద్ రెడ్డి విచారిస్తున్నారు. యుట్యూబర్ సెల్‌ఫోన్ డేటా, హార్బర్లో అతని కదలికలపై విచారణ కొనసాగుతోంది. కాగా వారం రోజులగా హార్బర్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. -
బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు: వైవీ సుబ్బారెడ్డి
-
తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 నియోజకవర్గాల్లో ఈ నెల 30 వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుందన్నారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందన్నారు. నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 70 శాతం పథకాలు బీసీ,ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు. ‘‘సామాజిక సాధికార యాత్రలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్నాం. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేనలో ఉంది. ఎన్ని పార్టీలు కలిసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు -
సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా సాగుతోంది
-
నేటి నుంచి ‘సామాజిక సాధికార యాత్ర’
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు(మైనార్టీ వ్యవహారాలు) జియావుద్దీన్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతునాయక్‌లు ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మంచిని వివరించి.. ఆయా వర్గాలను ఏకం చేయాలన్న లక్ష్యంతో సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రను వైఎస్సార్సీపీ చేపట్టిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం సామాజిక సాధికార యాత్ర బస్సుకు పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుందన్నారు. తొలి విడత యాత్ర గురువారం ప్రారంభమవుతుందని.. నవంబర్ 9న ముగుస్తుందని చెప్పారు. రోజూ మూడు ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ యాత్ర జరుగుతుందని.. సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. తొలి విడతలో మూడు ప్రాంతాల్లోని 39 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందని వివరించారు. యాత్రలో పేదలందరినీ ఏకం చేసి పెత్తందార్లపై రణభేరి మోగిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల సంగ్రామంలో.. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దన్నుగా నిలిచి, పెత్తందార్లను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. మీడియాతో ఎవరేమన్నారంటే.. పేదలు వృద్ధిలోకొస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటా! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికే సామాజిక సాధికార యాత్ర చేపట్టాం. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడితే.. పేద పిల్లలు వృద్ధిలోకి వస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పెత్తందార్లు గగ్గోలు పెట్టారు. చివరకు సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే.. అక్కడికి వారొస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పెత్తందార్లు ఏకంగా కోర్టుల్లో వాదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆలయాల్లోకి కూడా పెత్తందార్లు రానివ్వలేదు. జగనన్న సీఎం అయ్యాక పేదలకు అవే ఆలయ కమిటీల్లో పదవులిచ్చారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి, తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగనన్న. తమ పక్షాన నిలిచిన జగనన్నకు పేదలు దన్నుగా నిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్‌లో మాట్లాడగలరా? – ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చంద్రబాబు అవమానిస్తే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు... ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు దళితులను అవహేళన చేస్తే.. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులిచ్చి అక్కున చేర్చుకుని ఆత్మగౌరవం నిలిపిన నేత సీఎం వైఎస్ జగన్. దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదు. జగనన్న పాలనలో పేదల బతుకులు మారాయి. సామాజిక సాధికార యాత్ర పేరుతో మేం పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. నిజం గెలవాలనే పేరుతో జైల్లో ఉన్న వ్యక్తి కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసింది. సీఎం వైఎస్ జగన్ ఆ వర్గాలను పేదరికం నుంచి గట్టెక్కించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దీని వల్లే రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. వైఎస్సార్సీపీ పేదల పార్టీ. ఈ ప్రభుత్వం పేదలది. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అర్హతే ప్రామాణికం రాష్ట్ర వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించాలనే తపనతో సీఎం జగన్ పనిచేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా వివక్షకు తావులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చుతున్నారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ సీఎం వైఎస్ జగన్ పుణ్యమాని ఏపీలో అలాంటి పరిస్థితి రాలేదు. – కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి సామాజిక న్యాయం నినాదం కాదు.. అది ఓ విధానం.. సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం అని స్పష్టం చేసి.. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. పేదల పక్షాన సీఎం జగన్ నిలబడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. పేదలు బాగుపడాలంటే జగనే మళ్లీ సీఎం కావాలి. పేదలంతా కలిసి పెత్తందార్లను ఎదుర్కోవడానికే ఈ యాత్ర చేపట్టాం. – జియావుద్దీన్, మాజీ ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి జగనన్న పాలన జనం మెచ్చిన పాలన. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయా న్ని, ధర్మాన్ని పాటిస్తున్నారు. మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్ క్లాస్.. జగనన్న పాలనలో బీసీలను సమాజానికి బ్యాక్‌బోన్ క్లాస్‌గా మార్చారు. అలాంటి జగనన్న కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. గురు వారం æనుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం. పెత్తందార్ల కోటలను బద్ధలు కొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మంతా సంఘటితంగా ముందుకెళుతున్నాం. సీఎం జగన్ నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేద లకు–పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో చేయి చేయి కలిపి.. జగనన్నకు అండగా నిలుద్దాం. ని జం గెలవాలని యాత్ర చేపట్టిన భువనేశ్వరి నిజా లు చెప్పాలి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికా రాన్ని దక్కించుకున్నప్పటి నుంచి 2019 వరకూ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అనేక కుంభకో ణాలకు పాల్పడ్డారు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే రాజమండ్రి జైల్లో ఉన్నా రు. అందుకే భువనేశ్వరి నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర చేయాలి. – జోగి రమేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు రాష్ట్ర జనాభాలో సుమారు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలున్నారు. వారి అవసరాలను గుర్తించడం పాలకుల ప్రాథమిక కర్తవ్యం. ఆయా వర్గాలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నడూ ఆలోచించలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో వెలుగులొచ్చాయి. సంక్షేమాభివృద్ధి పథకాలతో వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. సామాజిక ఆవశ్యకతను నొక్కిచెప్పేందుకే ఈ యాత్రను చేపట్టాం. – హనుమంతు నాయక్, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇది.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చేసేది సామాజిక సాధికార యాత్ర అని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పేదలందరూ కలిసి పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇది.. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని, సాధికార న్యాయాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నట్లు వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక సాధికార యాత్ర ద్వారా వెనుకబడిన(వెన్నెముక) వర్గాల సాధికారత కోసం జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేలు, చేయబోతున్న మేలు గురించి తెలియజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి మూడు దశల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మొదటి దశ ఈ నెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో 39 నియోజకవర్గాలను కవర్ చేయటమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని తెలిపారు. బస్సు యాత్ర రాష్ట్రంలోని ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా), సింగనమల (అనంతపురం జిల్లా), తెనాలి(గుంటూరు జిల్లా)లో ప్రారంభమవుతుందని వివరించారు. ఆయా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారితో మమేకమవుతూ యాత్ర సాగుతుందని చెప్పారు. సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో కేబినెట్ కూర్పు దగ్గర నుంచి 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కలి్పంచారని తెలిపారు. స్పీకర్ స్థానం నుంచి మండలి చైర్మన్ దాకా ఇలా ఒకటి రెండు కాదు.. జనరల్ స్థానాలను సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చి గౌరవించిన జగనన్నకు జేజేలు పలుకుతూ సామాజిక సాధికార యాత్రను కొనసాగించనున్నామని చెప్పారు. నిజం గెలవబట్టే చంద్రబాబు జైల్లో.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని కోరుకుంటే బాబు జీవితంలో జైలు నుంచి బయ టకురాలేరని వైవీ అన్నారు. భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకెళ్లారు.. ఆ చెడ్డ పేరు కప్పిపుచ్చుకునేందుకు తెలివిగా నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కూడా తెలివైన వారేనన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మటం లేదన్నారు. బాబు అవినీతి చేశారు.. అందుకే జైలు కెళ్లారు అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. -
సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంబిస్తున్నాం
-
‘డౌనూరు’లో కాఫీ క్యూరింగ్ కేంద్రం
కొయ్యూరు: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. కొయ్యూరు మండలంలోని డౌనూరులో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తోన్న కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, ప్యాకింగ్ యూనిట్‌కు శుక్రవారం వైఎఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి రాజన్నదొర శంకుస్థాపనచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..నాణ్యమైన సేంద్రియ ఎరువులతో కాఫీని పండించడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో అతిథులకు ప్రధాని మోదీ అరకు కాఫీని బహూకరించారని గుర్తు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లో ప్రస్తుతమున్న 2.5 లక్షల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు. గిరిజనుల నుంచి పసుపును కూడా కొనుగోలు చేయాలని జీసీసీ ఎండీ సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. గిట్టుబాటు ధర విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కాఫీ రైతులకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ఐటీడీఏ పీవో అభిషేక్ పాల్గొన్నారు. -
ఈ నెలలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి