![YSRCP MP YV Subba Reddy Comments Over Visakha - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/25/yvsubbareddy3.jpg.webp?itok=p-D-V8gN)
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం చాలా ప్రశాంతమైన నగరమని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా, విశాఖలో ఆదివారం ఉదయం ఫ్లోటింగ్ బ్రిడ్జిని సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్నారు.
ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు బీచ్‌ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసింది. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. విశాఖ నుంచి ప్రభుత్వం నడుస్తుంది.
ఏపీ అభివృద్ది విషయంలో పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. పర్యాటక అభివృద్ధి ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణమే ఉదాహరణ. విశాఖ బీచ్‌లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తున్నాము అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment