
పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం తమకు లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పబ్లిసిటీ కోసమే పవన్ మాట్లాడుతున్నారని, ఎవరో రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని దుయ్యబట్టారు.
పవన్ వ్యాఖ్యల పట్ల వలంటీర్లు మానసికంగా బాధపడ్డారని.. వలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తే ప్రభుత్వం ఊరుకోదని సుబ్బారెడ్డి హెచ్చరించారు.
‘‘సెప్టెంబర్‌లో విశాఖకు సీఎం జగన్‌కు రానున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. పదవులు వాటి అంతట అవే వస్తాయి. కోలా గురువులుకి విశాఖ జిల్లా అధ్యక్ష పదవి, డీసీసీబీ చైర్మన్ ఇవ్వడం బీసీలకు ఇచ్చిన గౌరవం. బీసీలంటే సీఎం జగన్‌కు ఎంతో అభిమానం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్