
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు తెలిపారు. పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు.
ఇక, తాజాగా వైఎవీ సుబ్బారెడ్డి.. పవన్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు. శనివారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను దేశం మొత్తం ప్రశంసిస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో వాలంటీర్లను అభినందించారు. వాలంటరీ వ్యవస్థను ప్రధాని మోదీ సైతం కొనియాడారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వాలంటీర్లు పనిచేస్తున్నారు.
జన్మభూమి కమిట్లీలా వాలంటీర్ల వ్యవస్థ దోపిడీలకు పాల్పడలేదు. కరోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై మా పార్టీ బహిరంగ చర్చకు సిద్ధం. వాలంటీర్లపై అవగాహన లేకుండా పవన్, చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: కేంద్ర హోంశాఖ నివేదిక పవన్‌కు చెంపపెట్టు.. మహిళల రక్షణలో ఏపీనే బెస్ట్..