సాక్షి, గుంటూరు: ఏపీలో పార్టీలు చూడకుండా రాజకీయాలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అతీతంగా అందరికీ పథకాలు అందించారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ప్రజల ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు.
గుంటూరు నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వనమా బాల వజ్ర బాబు పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఆళ్ళ అయోధ్య రామ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేనివిధంగా వైఎస్ అనేక పథకాలు అమలు చేశారు. పార్టీలు చూడకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ పథకాలు అందించారు. పోరాటాలు వైఎస్సార్‌సీపీకి కొత్తమీ కాదు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యాన్ని అందించారు.
ప్రజల ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకువచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ మనపై దుష్ప్రచారం చేయడం వల్లే మనం ఓడిపోయాం. అయినా 40 శాతం మంది వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కార్యకర్తలంతా ఐక్యంగా ఉండాలి. కార్యకర్తలంతా ఐక్యంగా, ధైర్యంగా ఉంటే మళ్ళీ మనం అధికారం సాధిస్తాం. మద్యం షాపులు తెరవక ముందే తెలుగుదేశం ఎమ్మెల్యేలు దుకాణాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు మద్యం షాపులో 20 నుంచి 30 శాతం కమీషన్ ఇవ్వాలట. ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వైఎస్సార్‌సీపీ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు. రాష్ట్రంలో మహిళలపైన దాడులు హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు?. పవన్ కళ్యాణ్ ఏమైనా నోటికి ప్లాస్టర్ చేసుకున్నాడా?. తన పాలనలో ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే వైఎస్ జగన్ సహించేవారు కాదు. కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రకటనలు పేపర్‌కే పరిమితం అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకు తింటున్నారని విమర్శలు చేశారు.
వనమా బాల వజ్ర బాబు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అంతా ధైర్యంగా ఉండండి. మన నాయకుడు వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక పథకాలు అమలు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మళ్లీ మనం వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment