
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ప్రచారంగా భాగంగా మరోసారి గడపగడపకు విస్తృత ప్రచారం చేపట్టాలని రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి నిర్దేశించారు. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని, వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితి కూటమి నేతలకు ఏర్పడిందన్నారు.
‘‘సిద్ధం సభలు తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం టీడీపీ, జనసేన చేయలేకపోయాయి. ఢిల్లీ నుంచి మోదీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితి టీడీపీ, జనసేనకు ఏర్పడింది. పవన్ ఎన్నిసార్లు వారాహి యాత్ర చేస్తారు?. 2014-19 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయి. కూటమి మరోసారి జనం ముందుకు వస్తోంది కాబట్టి ప్రజలను అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాం. సీఎం జగన్ పాలనలో జరిగిన మంచిని, కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: ఆఖరి పయత్నాల్లో చంద్రబాబు: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment