
సాక్షి, కర్నూలు: ఒక జంట ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రుద్రవరం మండలం పేరూరులో ప్రేమికుల మధ్య వారధిగా ఉన్నాడనే నెపంతో ప్రవీణ్ అనే యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతిచెందాడు. ప్రస్తుతం ప్రేమికులు పరారీలో ఉన్నారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.