
మహారాష్ట్రలో బట్టల గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో అయిదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు.
పూణె : మహారాష్ట్రలో బట్టల గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనలో అయిదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. పూణె సమీపంలోని వుర్లీ దేవచి గ్రామంలో గురువారం ఉదయం బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదంలో కార్మికులు మృతి చెందడమే కాకుండా, గోదాంలోని బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.