
సాక్షి, తిరుపతి : ఓ వ్యక్తి తన భార్య, బిడ్డని హతమార్చాడు. ఈ ఘటన తిరుపతి హోటల్ విహాస్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. శ్రీనివాస్, సునీత దంపతలు. వీరికి మోక్షజ్ఞ లక్ష్మి అనే పాప ఉంది. వారిద్దరిని శ్రీనివాస్ హోటల్‌లో దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. అతను అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడ్ని విచారిస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.