సాక్షి, మహబూబాబాద్ : కేవలం సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం దన్నసరి గ్రామశివారులోని సబ్‌స్టేషన్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన బానోతు మోహన్(16) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
సెల్‌ఫోన్ కొనివ్వమని గత కొద్దిరోజుల నుంచి తన తల్లిదండ్రులను అడుగుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వలేకపోవడంతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి వరకు కళ్ల ముందు తిరిగిన కొడుకు బావిలో శవమై కన్పించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్నాడు
Published Wed, Feb 7 2018 3:51 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement