విజయవాడలో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది.
ఏలూరు: విజయవాడలో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి జిల్లాలో వివిధ ప్రధాన శాఖల ప్రగతితీరుపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులతో సోమవారం చర్చించారు.
గతేడాది సాధించిన ప్రగతి తీరు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సి లక్ష్యాలు, ప్రణాళికల అమలుతీరుపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. దేశంలోనే ప్రప్రథమంగా జిల్లాలో రైతులందరికీ భూసార హెల్త్‌కార్డులను అందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన తీరు, అమలుపై వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యానశాఖ, పశుసంవర్థక శాఖతో పాటు పది ప్రధాన ప్రాధాన్యతా రంగాల ప్రగతిపై సమీక్షించారు. జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్, డీఆర్వో కె.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.