ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్ పీఎఫ్ జవాన్లు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి.
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్ పీఎఫ్ జవాన్లు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. మావోయిస్టులు జరిపిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన జవాన్ సతీష్ గౌడ్ అమరుడయ్యాడు. జవాన్ సతీష్ గౌడ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి. కాగా జవాన్ సతీష్ వయసు కేవలం 23 ఏళ్లు. జవాన్ మృతదేహాన్ని ఛత్తీస్ గఢ్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి రోడ్డు మార్గంలో అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.